![Minister Srinivas Goud Shares His Fitness Dips Video - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/26/srinivas-goud.jpg.webp?itok=PkI9LUnY)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. తాను నాన్‌స్టాప్‌గా డిప్స్ కొడుతున్న వీడియోను మంత్రి ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫ్రీడం హైదరాబాద్ పేరిట ఆదివారం రోజున నగరంలోని నెక్లెస్ రోడ్‌లో గల పీపుల్స్ ప్లాజా వద్ద 10కే రన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా.. వేదికపై ఆగకుండా 50కి పైగా డిప్స్ కొట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన శ్రీనివాస్‌గౌడ్.. ఫిట్‌నెస్‌ను ఇష్టమైన అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment