జియో ఎఫెక్ట్: భారీగా కుదేలైన ఎయిర్టెల్
జియో ఎఫెక్ట్: భారీగా కుదేలైన ఎయిర్టెల్
Published Tue, Jan 24 2017 7:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో నుంచి వస్తున్న ఉచిత ఆఫర్ల పోటీని తట్టుకోలేక టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కుదేలైంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54 శాతానికి పైగా దిగజారి రూ.503.7 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,108.1 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 3 శాతం క్షీణించి రూ.23,363.9 కోట్లగా నమోదైనట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్, ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తుందని, దీంతో కంపెనీ ఇరకాటంలో పడినట్టు భారతీ ఎయిర్టెల్ భారత, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు.
దీనివల్ల యేటికేటికి ఆర్జించే రెవెన్యూలను ఊహించని విధంగా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. ఇది టెలికాం రంగంలో ఫైనాన్సియల్ హెల్త్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మిట్టల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జియో గతేడాది సెప్టెంబర్ నుంచి ఉచిత 4జీ సర్వీసులను అందిస్తూ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తన ఉచిత సర్వీసులను మరోసారి 2017 మార్చి 31 వరకు పొడిగించింది. జియో దెబ్బకు కంపెనీలు సతమవుతున్నాయి. ఏకీకృత మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఎయిర్టెల్కు ఫ్లాట్గా నమోదయ్యాయి. ఈ రెవెన్యూలు రూ.4,049 కోట్లగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ మార్కెట్ షేరు 33 శాతం గరిష్టానికి చేరుకుందట. నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్ కూడా ఆఫ్రికాలో కంపెనీపై ప్రభావం చూపినట్టు ఎయిర్టెల్ తెలిపింది.
Advertisement