Q3 Profit
-
టాటా గ్రూప్ కంపెనీకి కళ్లు చెదిరే లాభాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ట్రెంట్ డిసెంబర్ క్వార్టర్‌కు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.155 కోట్ల నుంచి రూ.371 కోట్లకు దూసుకుపోయింది. 140 శాతం వృద్ధి చెందింది. వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్ పేరుతో రిటైల్ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆదాయం 50 శాతం వృద్ధితో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,303 కోట్ల నుంచి రూ.3,467 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 42 శాతం పెరిగి రూ.3,101 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన వృద్ధిని కొనసాగించాం. నిర్వహణ క్రమశిక్షణ, వేగవంతమైన నిర్వహణ మా విస్తరణ అజెండాకు మద్దతుగా నిలిచాయి’’అని సంస్థ తెలిపింది. వెస్ట్‌సైడ్, జుడియో స్థూల మార్జిన్ గతంలో మాదిరే స్థిరంగా కొనసాగింది. ఆపరేటింగ్ ఎబిట్ మార్జిన్ 13 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 శాతంగానే ఉంది. బలమైన వృద్ధి విస్తరణ దిశగా తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. వెస్ట్‌సైడ్ డాట్ కామ్, ఇతర టాటా గ్రూప్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాల్లో 5 శాతం వాటా ఆదాయం లభించినట్టు తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా 5 వెస్ట్‌సైడ్ స్టోర్లు, 50 జుడియో స్టోర్లను ప్రారంభించింది. దీంతో నిర్వహణలోని వెస్ట్‌సైడ్ స్టోర్ల సంఖ్య 227కు, జుడియో స్టోర్లు 460కు చేరాయి. స్టార్ పేరుతో (గ్రోసరీ) నిర్వహించే స్టోర్ల సంఖ్య 67కు పెరిగింది. భవిష్యత్తులోనూ స్టోర్ల విస్తరణ ద్వారా మరింత మందికి చేరువ అవుతామని సంస్థ చైర్మన్ నోయల్ టాటా ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ట్రెంట్ షేరు 19 శాతం లాభపడి 3,609 వద్ద క్లోజ్ అయింది. -
బీహెచ్ఈఎల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56 శాతంపైగా జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,220 కోట్ల నుంచి రూ. 5,354 కోట్లకు స్వల్పంగా బలపడింది. పన్నుకుముందు లాభం 60 శాతం ఎగసి రూ. 53 కోట్లకు చేరింది. విద్యుత్ విభాగం నుంచి ఆదాయం 7 శాతం బలపడి రూ. 3,992 కోట్లను దాటింది. ఇండస్ట్రీ విభాగం టర్నోవర్ 21 శాతం క్షీణించి రూ. 947 కోట్లకు పరిమితమైంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 75 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ లాభం 45% అప్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో 45% పెరిగింది. గత క్యూ3లో రూ.243 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.352కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ తెలిపింది. ఆదాయం రూ.533 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.592 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు రూ.3.35 లక్షల కోట్ల నుంచి 14% వృద్ధితో రూ.3.83 లక్షల కోట్లకు పెరిగాయి. జీ ఎంటర్టైన్మెంట్ లాభం 38% డౌన్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన లాభం రూ.563 కోట్లతో పోలిస్తే 38% క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ.1,427 కోట్ల నుంచి రూ.1,231 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.2,253 కోట్ల నుంచి రూ.2,120 కోట్లకు తగ్గిందన్నారు. -
ధర అదిరే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. గతేడాది జూలై –సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9% వృద్ధి చెందాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించగా..హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరల వృద్ధి 24%గా ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9%, 14.9% ధరల వృద్ధి ఉంది. ఇండియాలో ఏకైక నగరం హైదరాబాదే టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే. జూలై – సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ధరలు వృద్ధిలో ఉంటే..మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు క్షీణించాయి. ధరల వృద్ధిలో హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడ 3.2 % ధరల వృద్ధి ఉంది. 2% రేట్ల అప్రిసియేషన్‌తో బెంగళూరు 94వ స్థానంలో, 1.1% వృద్ధితో అహ్మదాబాద్ 108వ స్థానంలో నిలిచింది. 2% క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3% క్షీణతతో 135వ స్థానంలో ముంబై, 3% క్షీణతతో 136వ స్థానంలో చెన్నై, 3.5% క్షీణతతో 138వ స్థానంలో పుణే నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌లోనే వృద్ధి ఎందుకంటే? ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2% ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. ఇండియాలోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్ ద్రవ్యోల్బణం కన్నా దిగువలోనే ఉంది. ఈ అంతరం 2016 హెచ్1 నుంచి పెరుగుతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం స్థాయిని మించి గృహాల ధరల వృద్ధి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. పైగా ఇక్కడ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధం గా ఉన్న ఇళ్లను, ఇన్వెంటరీ గృహాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇదే డెవలపర్లకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. -
విప్రో లాభం 35% జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం 35% ఎగిసింది. రూ. 2,553 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం రూ.1,889 కోట్లు. మరోవైపు, సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.15,203 కోట్ల నుంచి రూ.15,875 కోట్లకు పెరిగింది. మూడో క్వార్టర్లో 2,106 మిలియన్ డాలర్ల అంచనా.. సీక్వెన్షియల్ ప్రాతిపదికన డిసెంబర్ త్రైమాసికానికి ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి 0.8–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో గైడెన్స్ ప్రకటించింది. ఈ విభాగం నుంచి 2,065–2,106 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలదని భావిస్తున్నట్లు వివరించింది. రెండో త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయం 2,049 మిలియన్ డాలర్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఇది 2.5 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ పేర్కొంది. ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్ 18.1 శాతం పెరిగింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32.31 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను పూర్తి చేసినట్లు విప్రో తెలిపింది. ఇందుకోసం రూ. 10,500 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. మరోవైపు, 5జీ టెలికం సేవలు అందించడానికి సంబంధించి ఆపరేటర్లు, ఇతరత్రా కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు విప్రోతో చేతులు కలిపినట్లు టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. ఆపరేటర్లు తమ పెట్టుబడులపై గరిష్ట ప్రయోజనాలు పొందేలా తోడ్పడేందుకు 5జీ వినియోగాలపై తమ బెంగళూరు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ‘వృద్ధి సాధనకు ప్రాధాన్యమివ్వడం కొనసాగుతుంది. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు కొనసాగుతాయి. షేర్ల బైబ్యాక్ సెప్టెంబర్‌లో పూర్తయ్యింది. ఇన్వెస్టర్ల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది‘ అని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. ►సీక్వెన్షియల్‌గా చూస్తే డిజిటల్ విభాగం ఆదాయం ఏడు శాతం, వార్షికంగా 29 శాతం మేర వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39.6 శాతంగా ఉంది. ►క్యూ2లో కొత్తగా 57 సంస్థలు క్లయింట్లుగా జతయ్యాయి. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,027కి చేరింది. ►ఐటీ సేవల విభాగంలో సీక్వెన్షియల్‌గా 6,603 మంది టెకీలు చేరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 1,81,453కి చేరింది. విప్రో షేరు మంగళవారం బీఎస్ఈలో స్వల్పంగా పెరిగి రూ. 243.70 వద్ద క్లోజయ్యింది. ఆదాయాలు, మార్జిన్లపరంగా రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన మొత్తం 7 విభాగాల్లో 6 విభాగాలు వృద్ధి నమోదు చేయగలిగాయి. కొన్ని రంగాల్లో అనిశ్చితి ప్రభావాలు కొనసాగుతున్నప్పటికీ ఐటీ సేవలకు డిమాండ్‌లో పెద్దగా మార్పు లేదు. కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలతో పాటు కీలకమైన అమెరికా, బ్రిటన్ మార్కెట్లలో కూడా డీల్స్ దక్కించుకోగలుగుతున్నాం. అంతర్జాతీయంగా అందిస్తున్న సేవలు భారతీయ కస్టమర్లకు అందించే వ్యూహాల్లో భాగంగా భారత్‌లో ఒక క్లయింఊట్తో భారీ డీల్ కుదుర్చుకున్నాం. క్యూ1 తో పోలిస్తే క్యూ2లో ఆర్డర్ బుక్ మరింత మెరుగుపడింది. భారత్, మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఐసీఐసీఐ వంటి కొన్ని డీల్స్ ఇలాంటి వ్యూహాల్లో భాగమే. – అబిదాలి నీముచ్వాలా, విప్రో సీఈఓ -
ఇండస్ఇండ్ బ్యాంక్‌ను... వీడని ఐఎల్ఎఫ్ఎస్ కష్టాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్‌ను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ కష్టాలు ఇంకా వీడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో బ్యాంక్ రూ.985 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.936 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. సాధారణంగా ఈ బ్యాంక్ ప్రతి క్వార్టర్లోనూ 20–25 శాతం వృద్ధిని సాధించేది. గత రెండు క్వార్టర్లలో నికర లాభం వృద్ధి తగ్గుతూ వస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఈ బ్యాంక్ రూ.3,000 కోట్ల మేర రుణాలివ్వడమే దీనికి ప్రధాన కారణం. అది మినహాయిస్తే, మామూలుగానే.... గత క్యూ3లో రూ.5,474 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 32 శాతం వృద్ధితో రూ.7,232 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ కష్టాలను మినహాయిస్తే, తమ వ్యాపారం మామూలుగానే ఉందని వివరించారు. ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగిందని రమేశ్ సోబ్తి చెప్పారు. కార్పొరేట్, వాహన రుణాల జోరుతో రుణ వృద్ధి 35 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. మిశ్రమంగా మొండి బకాయిలు.. స్థూల మొండిబకాయిలు 1.16% నుంచి 1.13%కి తగ్గాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 0.46% నుంచి 0.59% కి పెరిగాయన్నారు. అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే స్థూల మొండి బకాయిలు 10% ఎగసి రూ.1,968 కోట్లకు చేరాయని, నికర మొండి బకాయిలు 31 శాతం పెరిగి రూ.1,029 కోట్లకు చేరాయని వివరించారు. కేటాయింపులు 157 శాతం పెరిగి రూ.607 కోట్లకు పెరిగాయని, సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ వృద్ధి 3% అని వివరించారు. తగ్గిన నికర వడ్డీ మార్జిన్... నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గిందని రమేశ్ సోబ్తి తెలిపారు. గత క్యూ3లో 3.99 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 3.83 శాతంగా ఉందని, ఈ క్యూ2లో 3.84 శాతమని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల కోసం ఈ క్యూ3లో రూ.255 కోట్లు కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. క్యూ2లో రూ.275 కోట్లు కేటాయింపులతో కలుపుకొని మొత్తం మీద ఈ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలోఇండస్ఇండ్ »కê్యంక్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.1,601 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ నికర లాభాలు జూమ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ3 లోఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. దేశంలోనే అదిపెద్ద సంస్థ ఎస్బీఐ క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో మార్కెట్ అంచనాలను మించి రెట్టింపు నికర లాభాలను సాధించింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో 134శాతం పెరిగిన నికర లాభాలు రూ. 2610 కోట్లను తాకింది. గతేడాది(2015-16) క్యూ3లో రూ.1110 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.53,588 కోట్లును సాధించింది. గత ఏడాది ఇది రూ. 46,731 కోట్లుగా ఉంది. అలాగే నికర వడ్డీ ఆదాయం కూడా దాదాపు 8 శాతం పెరిగి రూ. 14,752 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 7959 కోట్ల నుంచి రూ. 8943 కోట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన తాజా బకాయిలు(ఫ్రెష్ స్లిప్పేజెస్) ఫ్రెష్ స్లిప్పేజెస్ రూ. 10,185 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 10,341 కోట్లుగా నమోదుకాగా.. ఇతర ఆదాయం రూ. 6087 కోట్ల నుంచి రూ. 9662 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.14 శాతం నుంచి 7.23 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా 4.19 శాతం నుంచి 4.24 శాతానికి స్వల్పంగా పెరిగాయి. గ్రాస్ ఎన్పీఏ రూ. 61,430కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో రూ. 60,013కోట్లుగా ఉంది. బాసెల్-3 నిబంధనల ప్రకారం కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.73 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ3తో పోలిస్తే రికవరీలు రూ. 1344 కోట్ల నుంచి రూ. 1003 కోట్లకు తగ్గాయి -
ఫలితాల్లో సిప్లా సూపర్
ముంబై : దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేసి మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 43.7 శాతం పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.375 కోట్లగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.261 కోట్లు మాత్రమే. కంపెనీ కేవలం రూ.370 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా కంపెనీ నికర అమ్మకాలు కూడా రూ.3550.02 కోట్లకు పెరిగినట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3069.89 కోట్లగా ఉన్నాయి. కంపెనీ ఆర్జించిన ఇతర ఆదాయాలతో లాభాలు పెరిగాయి. దేశంలో ఐదవ అతిపెద్ద డ్రగ్ మేకర్‌గా ఉన్న సిప్లాకు ఎక్కువ రెవెన్యూలు భారత్ నుంచే వచ్చాయి. ఈ కంపెనీ అమెరికా, యూకేలో కూడా తన ఉనికిని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
డాక్టర్ రెడ్డీస్.. మళ్లీ తుస్!
న్యూఢిల్లీ : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరోసారి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లోనూ కంపెనీ కన్సాలిడేట్ నికరలాభాలు 17 శాతం మేర క్షీణించాయి. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.483.40 కోట్లగా నమోదయ్యాయి. 2015 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ డ్రగ్ మేకర్ లాభాలు రూ.579.30 కోట్లగా ఉన్నాయి. ఇతర సమగ్ర ఆదాయలు రూ.119.40 కోట్లగా నమోదయ్యాయి. కంపెనీ నికర విక్రయాలు కూడా మందగించినట్టు కంపెనీ నేడు నమోదుచేసిన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 7 శాతం డౌన్ అయి రూ.3,653.40 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. నిర్వహణ లాభాలు(ఈబీఐటీడీఏలు) కూడా ఏడాది ఏడాదికి 13.06 శాతం క్షీణించి, రూ.879.3 కోట్లగా రికార్డు అయ్యాయి. అయితే మూడో త్రైమాసికంలో కంపెనీకి గ్రాస్ ప్రాపిట్ మార్జిన్లు మంచిగా 59.10 శాతం పెరిగాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఈ క్వార్టర్లో రూ.500 కోట్లను ఖర్చుచేసినట్టు పేర్కొంది. -
జియో ఎఫెక్ట్: భారీగా కుదేలైన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో నుంచి వస్తున్న ఉచిత ఆఫర్ల పోటీని తట్టుకోలేక టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కుదేలైంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54 శాతానికి పైగా దిగజారి రూ.503.7 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,108.1 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 3 శాతం క్షీణించి రూ.23,363.9 కోట్లగా నమోదైనట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్, ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తుందని, దీంతో కంపెనీ ఇరకాటంలో పడినట్టు భారతీ ఎయిర్టెల్ భారత, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల యేటికేటికి ఆర్జించే రెవెన్యూలను ఊహించని విధంగా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. ఇది టెలికాం రంగంలో ఫైనాన్సియల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మిట్టల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జియో గతేడాది సెప్టెంబర్ నుంచి ఉచిత 4జీ సర్వీసులను అందిస్తూ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తన ఉచిత సర్వీసులను మరోసారి 2017 మార్చి 31 వరకు పొడిగించింది. జియో దెబ్బకు కంపెనీలు సతమవుతున్నాయి. ఏకీకృత మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఎయిర్‌టెల్‌కు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. ఈ రెవెన్యూలు రూ.4,049 కోట్లగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ మార్కెట్ షేరు 33 శాతం గరిష్టానికి చేరుకుందట. నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్ కూడా ఆఫ్రికాలో కంపెనీపై ప్రభావం చూపినట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
నిరాశపర్చిన అంబుజా సిమెంట్స్
సిమెంట్ రంగ దిగ్గజం అంబుజా సిమెంట్ ఫలితాలు ఎనలిస్టులను నిరాశపర్చాయి. నికర లాభాలు పెరిగినా అమ్మకాలు క్షీణించాయి. ఈ ఆర్థికసంవత్సరం మూడవ త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభాలు నికర లాభం 79 శాతం వృద్ది చెంది రూ. 277 కోట్లను సాధించింది. జూలై-సెప్టెంబర్ క్యూ3 లో అమ్మకాలు 4 శాతం క్షీణించడంతో ఆదాయం రూ. 2031 కోట్లగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 2,112 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 2 శాతం తగ్గి రూ. 303 కోట్లకు పరిమితంకాగా, ఇబిటా మార్జిన్లు 14.7 శాతం నుంచి 14.9 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇతర ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 223 కోట్లకు ఎగసింది. సిమెంట్ ఇబిటా టన్నుకి రూ. 616 నుంచి రూ. 620కు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. సిమెంట్ అమ్మకాల పరిమాణం 6.6 శాతం క్షీణతతో 4.5 మిలియన్ టన్నులకు పరిమితమైనట్లు వివరించింది. దీంతో అంబుజా సిమెంట్ షేరు 1.75 శాతం ఎగిసినా చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. కాగా 2.8 శాతం వాల్యూమ్స్ పెరిగినా భారీ వర్షాలకారణంగా సిమెంటు అమ్మకాలు 6.6 శాతం తగ్గి 4.5 మిలియన్ టన్నులుగా నమోదైనట్టు అంబుజా సిమెంట్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది.మంచి వర్షపాతం కారణంగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంపై ప్రభుత్వం దృష్టి తమకుసానుకూలంగా మారుతుందని చెప్పింది. -
శాంసంగ్ లాభాలు ఎంత తగ్గాయంటే..
సియోల్: ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం సంస్థను భారీగానే దెబ్బతీసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. సంస్థ సవరించిన గైడెన్స్ అంచనాకనుగుణంగానే సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. ఆపరేటింగ్ లాభాలు 30 శాతం క్షీణించి 5.2 ట్రిలియన్లుగా నమోదు చేసింది. రూ.3056 కోట్ల (4.57 బిలియన్ డాలర్లు) ఆర్జించినట్టు శాంసంగ్ వెల్లడించింది. దీంతో ఆపరేటింగ్ లాభం రెండు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. జూలై-సెప్టెంబర్ కాలానికి శామ్సంగ్ నికర ఆదాయం 17 శాతం క్షీణించి 4.4 ట్రిలియన్ (3.9 బిలియన్ డాలర్లు) సాధించింది. మొబైల్ విభాగంలో 100 బిలియన్ల నిర్వహణా లాభాన్ని సాధించింది. గత ఏడాది 2.4 ట్రిలియన్ల ఆదాయంతో పోలిస్తే ఇది భారీ పతనం. గెలాక్సీ నోట్ 7 వివాదంతో సంస్థకు వెన్నుదన్నుగా నిలిచే మొబైల్ లాభం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 2008 నాలుగో త్రైమాసికం తరువాత ఇదే అత్యల్పం. ఇదంతా గెలాక్సీ నోట్7 పేలుళ్లు, రీకాల్ ప్రభావమేనని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ వ్యాఖ్యానించింది. కాగా మొబైల్ అమ్మకాల్లో రారాజు గా వెలుగొందిన శాంసంగ్ మొదట్లో 7.8 ట్రిలియన్ల లాభాన్ని అంచనావేసినా తరువాత రెండు దఫాలుగా ఆపరేటింగ్ లాభాల అంచనాలను సవరించింది. ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ 7 రీకాల్ మూలంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.35438 కోట్లు) నష్టపోతున్నట్టు అంచనావేసిన సంగతి తెలిసిందే. -
సీఎంసీ లాభం 16 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రై మాసికంలో ఐటీ సేవల సంస్థ సీఎంసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) 16 శాతం పెరిగి రూ. 70.54 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 61.06 కోట్లు. తాజాగా అమ్మకాలు 14 శాతం వృద్ధి చెంది రూ. 492.68 కోట్ల నుంచి రూ. 560.92 కోట్లకు పెరిగినట్లు సోమవారం కంపెనీ ప్రకటించింది. సాధారణంగానే అంతర్జాతీయ మార్కెట్లలో మూడో త్రైమాసికం ఒక మోస్తరుగానే ఉంటుందని, క్యూ3లో తమ ఆదాయాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సీఎంసీ సీఈవో ఆర్ రమణన్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా మరో 14 క్లయింట్లను సాధించామని ఆయన వివరించారు. తొమ్మిది నెలల కాలంలో నికర అమ్మకాలు 15 శాతం పెరిగి రూ. 1,607.7 కోట్లకు పెరగ్గా.. కొత్తగా 50 క్లయింట్లను సాధించగలిగామని రమణన్ పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా 72 పెరిగి 10,890కి చేరిందన్నారు. జనవరి-మార్చ్ త్రైమాసికంలో 250-300 దాకా క్యాంపస్ నియామకాలు జరపనున్నట్లు వివరించారు.