ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ3 లోఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. దేశంలోనే అదిపెద్ద సంస్థ ఎస్‌బీఐ క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో మార్కెట్ అంచనాలను మించి రెట్టింపు నికర లాభాలను సాధించింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో 134శాతం పెరిగిన నికర లాభాలు రూ. 2610 కోట్లను తాకింది. గతేడాది(2015-16) క్యూ3లో రూ.1110 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.53,588 కోట్లును సాధించింది. గత ఏడాది ఇది రూ. 46,731 కోట్లుగా ఉంది. అలాగే నికర వడ్డీ ఆదాయం కూడా దాదాపు 8 శాతం పెరిగి రూ. 14,752 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 7959 కోట్ల నుంచి రూ. 8943 కోట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన తాజా బకాయిలు(ఫ్రెష్ స్లిప్పేజెస్) ఫ్రెష్ స్లిప్పేజెస్ రూ. 10,185 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. క్యూ2లో ఇవి రూ. 10,341 కోట్లుగా నమోదుకాగా.. ఇతర ఆదాయం రూ. 6087 కోట్ల నుంచి రూ. 9662 కోట్లకు పెరిగింది.
త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.14 శాతం నుంచి 7.23 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు కూడా 4.19 శాతం నుంచి 4.24 శాతానికి స్వల్పంగా పెరిగాయి. గ్రాస్ ఎన్‌పీఏ రూ. 61,430కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో రూ. 60,013కోట్లుగా ఉంది. బాసెల్-3 నిబంధనల ప్రకారం కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.73 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ3తో పోలిస్తే రికవరీలు రూ. 1344 కోట్ల నుంచి రూ. 1003 కోట్లకు తగ్గాయి