న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్‌లో 45% పెరిగింది. గత క్యూ3లో రూ.243 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.352కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ తెలిపింది. ఆదాయం రూ.533 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.592 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు రూ.3.35 లక్షల కోట్ల నుంచి 14% వృద్ధితో రూ.3.83 లక్షల కోట్లకు పెరిగాయి.
జీ ఎంటర్‌టైన్మెంట్ లాభం 38% డౌన్
జీ ఎంటర్‌టైన్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో రూ.349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన లాభం రూ.563 కోట్లతో పోలిస్తే 38% క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ.1,427 కోట్ల నుంచి రూ.1,231 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.2,253 కోట్ల నుంచి రూ.2,120 కోట్లకు తగ్గిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment