హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రై మాసికంలో ఐటీ సేవల సంస్థ సీఎంసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) 16 శాతం పెరిగి రూ. 70.54 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 61.06 కోట్లు. తాజాగా అమ్మకాలు 14 శాతం వృద్ధి చెంది రూ. 492.68 కోట్ల నుంచి రూ. 560.92 కోట్లకు పెరిగినట్లు సోమవారం కంపెనీ ప్రకటించింది. సాధారణంగానే అంతర్జాతీయ మార్కెట్లలో మూడో త్రైమాసికం ఒక మోస్తరుగానే ఉంటుందని, క్యూ3లో తమ ఆదాయాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సీఎంసీ సీఈవో ఆర్ రమణన్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా మరో 14 క్లయింట్లను సాధించామని ఆయన వివరించారు.
తొమ్మిది నెలల కాలంలో నికర అమ్మకాలు 15 శాతం పెరిగి రూ. 1,607.7 కోట్లకు పెరగ్గా.. కొత్తగా 50 క్లయింట్లను సాధించగలిగామని రమణన్ పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా 72 పెరిగి 10,890కి చేరిందన్నారు. జనవరి-మార్చ్ త్రైమాసికంలో 250-300 దాకా క్యాంపస్ నియామకాలు జరపనున్నట్లు వివరించారు.
సీఎంసీ లాభం 16 శాతం అప్
Published Tue, Jan 14 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement