cmc
-
బాబోయ్.. ఇదేం ర్యాగింగ్!
చెన్నై: తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు ర్యాగింగ్ పేరిట జూనియర్లను శారీరకంగా వేధించారు. ఇందుకు సంబంధించిందిగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగ పడ్డారు. జూనియర్ స్టూడెంట్స్‌ను కేవలం అండర్ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్ తీయించడం, వాటర్ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు. మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేసు నమోదు అయ్యింది. సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై వేటు పడినట్లు తెలుస్తోంది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. Christian Medical College in Vellore has suspended seven senior medical students for ragging after videos of first-year MBBS students being beaten up, stripped & tortured went viral on social media.#TamilNadu #Vellore #CMC #CMCVellore #CMCRagging #MBBS #Ragging #ViralVideo pic.twitter.com/m5jkjMyUNf — Hate Detector 🔍 (@HateDetectors) November 9, 2022 ఇదీ చదవండి: కరగాట్టంలో ఇక అశ్లీలత ఉండకూడదు! -
‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’
యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందా? ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు ప్రపంచాన్ని కుదేలు చేస్తాయా? పాకిస్తాన్‌కు సహకరిస్తున్న చైనా.. ఏవరితో యుద్ధం చేయాలనుకుంటోంది? భారత్‌పై సమరానికి చైనా రెడీ అవుతోందా? అసలేం జరుగుతోంది? బీజింగ్ : ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆర్మీకి తేల్చి చెప్పారు. సెంటల్ర్ మిలటరీ కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిన్‌పింగ్.. సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో సైనికాధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎంసీ సమావేశం జరిగినట్లుగా చైనా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలోనే జిన్‌పింగ్ ప్రసంగిస్తూ.. సాయుధ బలగాలు.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను కొత్త శకంలోకి నడిపించేందుకు కొత్తమిషన్‌ను ప్రారంభించాలని జిన్‌పింగ్ సైన్యానికి స్పష్టం చేశారు. సీఎంసీ ఛైర్మన్ చైనా సైన్యానికి సర్వాధికారి. చైనా సైన్యం సీఎంసీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తుంది. జిన్‌పింగ్ రెండోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. వరుసగా రెండోసారి సీఎంసీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. రెండు సమవేశాల్లోనూ ఆయన సమరానికి సైన్యం సిద్ధంగా ఉండాలని పేర్కొనడం విశేషం. సీఎంసీ సమావేశంలో అధ్యక్షుడు, సీఎంసీ ఛైర్మన్ జిన్‌పింగ్‌తో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. -
తాను చనిపోతూ....మరికొందరి జీవితాల్లో వెలుగులు
– బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన ప్రవీణ్ – అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు – మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు చిగరపల్లె(ఐరాల) : ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడా స్పృహలోకి రాలేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతి చెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు. -
ఆర్టికల్ 370పై యథాతథస్థితి
- పత్యేక అధికారాల చట్టంపైనా అదే వైఖరి - కనీస ఉమ్మడి ప్రణాళికలో వెల్లడి జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)పై యథాతథస్థితి కొనసాగించాలని పీడీపీ-బీజేపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో పేర్కొంది. ‘370’ని రద్దు చేయాలని బీజేపీ, ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని పీడీపీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం పీడీపీ-బీజేపీ సర్కారు కొలువుదీరాక సీఎం సయీద్, డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్.. 16 పేజీలతో కూడిన సీఎంపీని విడుదల చేశారు. ఇందులో కీలకాంశాలపై రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వివరించారు. సీఎంపీలోని ముఖ్యాంశాలివీ.. - కశ్మీర్‌కు ప్రత్యేక హోదాపై యథాతథస్థితి కొనసాగింపు. రాజ్యాంగంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఎప్పట్లాగే ఉంటాయి. ప్రస్తుతానికి ఏఎఫ్ఎస్పీఏ యథాతథంగా కొనసాగుతుంది. అయితే ‘సంక్షుభిత ప్రాంతాలను’ ఈ చట్టం నుంచి మినహాయించాలన్న డిమాండ్‌ను భవిష్యత్తులో రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. - నియంత్రణ రేఖకు ఇరువైపులా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు కృషి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో రవాణా, వాణిజ్య సంబంధాల కోసం కొత్తగా మూడు మార్గాలను తెరుస్తాం. - రాష్ట్రసమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు, గ్రూపులతో చర్చలు. - భారత్-పాక్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తోడ్పాటు - క శ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. - భద్రతా బలగాలకు లీజు, భూసేకర చట్టం కింద ఇచ్చిన భూములు మినహా అన్ని భూములపై హక్కులు వాటి పూర్వ యజమానులకు దక్కేలా చూస్తాం. -
ఐటీ కంపెనీల షేర్లు విలవిల
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ అంచనాలను అధిగమించలేకపోయిన త్రైమాసిక ఫలితాల కారణంగా టీసీఎస్ నష్టాలకు లోనైంది. అలాగే టీసీఎస్ తో వీలిన వార్తలతో సీఎంసీ కంపెనీ షేరు భారీగా పతనమైంది. టీసీఎస్ 9 శాతానికి పైగా నష్టంతో 236 రూపాయల నష్టంతో 2441 వద్ద, సీఎంసీ 16 శాతం క్షీణించి 1832 రూపాయల వద్ద ముగిసాయి. టీసీఎస్ లో సీఎంసీ విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 1 : 1.26 నిష్పత్తి లేదా 100 సీఎంసీ షేర్లకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వడానికి ఇరు కంపెనీలు అంగీకరించారు. ఐటీ రంగ కంపెనీల షేర్లలో హెచ్ సీఎల్ టెక్ సుమారు 9 శాతంతో 150 రూపాయలు కోల్పోయింది. -
టీసీఎస్ లాభం రూ.5,244 కోట్లు
క్యూ2లో 13.2 వృద్ధి... ఆదాయం 23,816 కోట్లు.. 13.5% అప్ షేరుకి రూ.5 మధ్యంతర డివిడెండ్ కంపెనీలో సీఎంసీ విలీనానికి ఓకే ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ మిశ్రమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,244 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,633 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 13.2% ఎగసింది. ఆదాయం రూ. 20,977 కోట్ల నుంచి రూ.23,816 కోట్లకు పెరిగింది. 13.5% వృద్ధి నమోదైంది. మార్కెట్ వర్గాలు క్యూ2లో టీసీఎస్ రూ.5,312 కోట్ల నికర లాభాన్ని, రూ.24,046 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశాయి. సీక్వెన్షియల్‌గా తగ్గింది... ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం రూ.5,567 కోట్లతో పోలిస్తే.. క్యూ2లో లాభం సీక్వెన్షియల్‌గా 5.8 శాతం దిగజారింది. ఆదాయం రూ.22,111 కోట్ల నుంచి 7.7 శాతం పెరిగింది. కాగా, మార్జిన్ విషయానికొస్తే.. 3.16 శాతం దిగజారి 22 శాతానికి పరిమితమైంది. ఇక వార్షికంగా చూస్తే.. స్వల్పంగా 0.07 శాతం తగ్గింది. క్యూ2లో 5 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు 4 కంపెనీలకి లభించాయి. 2 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు 9 దక్కాయి. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గురువారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు ధర స్వల్పంగా 0.77% నష్టంతో రూ.2,679 వద్ద ముగి సింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. లక్ష దాటిన మహిళా ఉద్యోగులు... సెప్టెంబర్ క్వార్టర్లో టీసీఎస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా లక్ష మైలురాయిని అధిగమించిందని హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ పేర్కొన్నారు. క్యూ2లో కంపెనీ స్థూలంగా 20,350 మంది సిబ్బందిని నియమించుకుంది. అయితే, 12,024 మంది కంపెనీని వీడటంతో నికరంగా 8,826 మంది జతయ్యారు. సెప్టెంబర్ చివరికి అనుబంధ సంస్థలతో కలిపి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,13,717కు చేరింది. కాగా, 2014-15లో 55,000 మందిని నియమించుకోవాలనేది తమ లక్ష్యంకాగా, ఇప్పటికే 36 వేల మందిని నియమించుకున్నట్లు టీసీఎస్ ఎండీ, సీఈఓ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. పటిష్టమైన ఆదాయం, వనరుల వినియోగం కారణంగా క్యూ2లో స్థిరమైన పనితీరును కొనసాగించగలిగామన్నారు. టీసీఎస్‌లో సీఎంసీ విలీనం... అనుబంధ ఐటీ సంస్థ సీఎంసీ లిమిటెడ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టీసీఎస్ గురువారం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. 1:1.26 నిష్పత్తిలో షేర్ల కేటాయింపు ఉంటుందని.. అంటే ప్రతి 100 సీఎంసీ షేర్లకుగాను వాటాదారులకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వనున్నట్లు వివరించింది. కాగా, ఈ ఏడాది రెండో క్వార్టర్లో సీఎంసీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.76 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.67.31 కోట్లతో పోలిస్తే 13.5% పెరిగింది. ఇక మొత్తం ఆదాయం 6.19% వృద్ధితో రూ.581 కోట్ల నుంచి రూ.617 కోట్లకు చేరింది. 1975లో ప్రభుత్వ రంగంలో సీఎంసీ ఏర్పాటైంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా 1990వ దశకంలో దీన్ని టీసీఎస్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీలో 11,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీఎంసీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 1.92% లాభపడి రూ.2,188 వద్ద స్థిరపడింది. -
సీఎంసీ నికర లాభం రూ. 58.42 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సర్వీసుల కంపెనీ సీఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఆర్జించిన రూ. 53 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇండియాసహా విదేశీ మార్కెట్లలో అందించిన మెరుగైన సేవలు ఫలితాలలో వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఇదే కాలానికి ఆదాయం మరింత అధికంగా 22% పుంజుకుని రూ. 593 కోట్లకు చేరింది. గతంలో రూ. 486 కోట్ల ఆదాయం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం(2013-14) క్యూ1లో రూ. 94.5 కోట్ల నికర లాభాన్ని సాధించింది. తరుగుదల లెక్కింపు విధానాన్ని మార్చడం, ఫారెక్స్ నష్టాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్.రామన్ చెప్పారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటంతో రూ. 10 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు వాటిల్లినట్లు వివరించారు. 12 మంది కొత్త క్లయింట్లు ప్రస్తుత సమీక్షా కాలంలో కొత్తగా 12 మంది క్లయింట్లు లభించగా, నికరంగా 283 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు రామన్ తెలిపారు. సీఎంసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్ చివరికి 11,932కు చేరింది. ఈ ఏడాది మరో 300 మందిని నియమించుకోనున్నట్లు రామన్ చెప్పారు. క్యూ1లో 12 డీల్స్ కుదర్చుకోగా, 9 దేశీయంగానూ, మూడు అంతర్జాతీయంగానూ లభించాయని తెలిపారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్ దేశాలపై దృష్టిసారిస్తున్నట్లు రామన్ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సీఎంసీ షేరు 3% పెరిగి రూ. 1,979 వద్ద ముగిసింది. -
సీఎంసీ నికర లాభం 46% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన ఐటీ సేవల కంపెనీ సీఎంసీ మార్చితో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 45.8% వృద్ధిని నమోదు చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.61 కోట్లుగా ఉన్న నికరలాభం 2013-14లో రూ.89.43 కోట్లకు పెరిగింది. న్యాయపరంగా ఒక కేసులో విజయం సాధించడం నికరలాభం భారీగా పెరగడానికి కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ కేసుతో రూ.19 కోట్ల అదనపు ఆదాయం రూ.25 కోట్ల నికరలాభం వచ్చినట్లు సీఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.రమణన్ తెలిపారు. సమీక్షా కాలంలో ఆదాయం 19 శాతం వృద్ధి చెంది రూ. 523 కోట్ల నుంచి రూ.623 కోట్లకు పెరిగింది. గడిచిన మూడు నెలల కాలంలో కొత్తగా 15 క్లయింట్లు చేరగా అందులో 12 స్వదేశానికి చెందినవారేనన్నారు. ఏడాది మొత్తంమీద 64 క్లయింట్లు చేరారు. రవాణా, యుటిలిటీస్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వంటి రంగాల నుంచి డిమాండ్ ఉందని రమణన్ తెలిపారు. షేరుకు రూ. 22.50 డివిడెండ్‌ను సిఫార్సు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎంసీలో 11,109 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది కొత్తగా 500 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు. -
సీఎంసీ లాభం 16 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రై మాసికంలో ఐటీ సేవల సంస్థ సీఎంసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) 16 శాతం పెరిగి రూ. 70.54 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 61.06 కోట్లు. తాజాగా అమ్మకాలు 14 శాతం వృద్ధి చెంది రూ. 492.68 కోట్ల నుంచి రూ. 560.92 కోట్లకు పెరిగినట్లు సోమవారం కంపెనీ ప్రకటించింది. సాధారణంగానే అంతర్జాతీయ మార్కెట్లలో మూడో త్రైమాసికం ఒక మోస్తరుగానే ఉంటుందని, క్యూ3లో తమ ఆదాయాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సీఎంసీ సీఈవో ఆర్ రమణన్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా మరో 14 క్లయింట్లను సాధించామని ఆయన వివరించారు. తొమ్మిది నెలల కాలంలో నికర అమ్మకాలు 15 శాతం పెరిగి రూ. 1,607.7 కోట్లకు పెరగ్గా.. కొత్తగా 50 క్లయింట్లను సాధించగలిగామని రమణన్ పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా 72 పెరిగి 10,890కి చేరిందన్నారు. జనవరి-మార్చ్ త్రైమాసికంలో 250-300 దాకా క్యాంపస్ నియామకాలు జరపనున్నట్లు వివరించారు.