ఐటీ కంపెనీల షేర్లు విలవిల | TCS shares slump over 8% on disappointing earnings | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీల షేర్లు విలవిల

Published Fri, Oct 17 2014 3:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

ఐటీ కంపెనీల షేర్లు విలవిల

ఐటీ కంపెనీల షేర్లు విలవిల

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ అంచనాలను అధిగమించలేకపోయిన  త్రైమాసిక ఫలితాల కారణంగా టీసీఎస్ నష్టాలకు లోనైంది. అలాగే టీసీఎస్ తో వీలిన వార్తలతో సీఎంసీ కంపెనీ షేరు భారీగా పతనమైంది. టీసీఎస్ 9 శాతానికి పైగా నష్టంతో 236 రూపాయల నష్టంతో 2441 వద్ద, సీఎంసీ 16 శాతం క్షీణించి 1832 రూపాయల వద్ద ముగిసాయి.  
 
టీసీఎస్ లో సీఎంసీ విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 1 : 1.26 నిష్పత్తి లేదా 100 సీఎంసీ షేర్లకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వడానికి ఇరు కంపెనీలు అంగీకరించారు.  ఐటీ రంగ కంపెనీల షేర్లలో హెచ్ సీఎల్ టెక్ సుమారు 9 శాతంతో 150 రూపాయలు కోల్పోయింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement