Indian Stock Market
-
‘ఫెడ్’ పంజా!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 964 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 23,952 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు.అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు గురువారం ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,153 పాయింట్లు పతనమై 79,029 వద్ద, నిఫ్టీ 322 పాయింట్లు పతనమై 23,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. రోజంతా భారీ నష్టాలతో ట్రేడయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్ల ఆధారిత బ్యాంకులు, రియల్టీ షేర్లతో పాటు ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.30%, 0.28 శాతం బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్లపై ఫెడ్ ఎఫెక్ట్...ఆశించినట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ.. వచ్చే ఏడాది నుంచి రేట్ల తగ్గింపులో దూకుడు ఉండదంటూ సంకేతాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో యూరప్ మార్కెట్లు ఒక శాతం పతనమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్రకటన రోజు (బుధవారం రాత్రి) 3% నష్టపోయిన అమెరికా మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో రికవరీ బాటపట్టాయి. యూఎస్ స్టాక్ సూచీలు నాస్డాక్ 1%, డోజోన్స్ అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో సన్‌ఫార్మా(1%), హెచ్‌యూఎల్ (0.11%), పవర్‌గ్రిడ్(0.09%) మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.50% – 2% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 1.20% అత్యధికంగా పడింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.25%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1% నష్టపోయాయి. రిలయన్స్ (–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2%), ఇన్ఫీ(1.50%), ఎల్అండ్టీ (1%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి.నాలుగు రోజుల్లో రూ.9.65 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915 పాయింట్ల (3.54%) పతనంతో రూ.9.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449.76 లక్షల కోట్ల (5.29 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
ఇజ్రాయిల్, ఇరాన్ టెన్షన్.. కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
-
రూ.8,430 కోట్లకు ఓయో ఐపీవో
న్యూఢిల్లీ: హోటల్ బుకింగుల స్టార్టప్ దిగ్గజం ఓయో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో సాఫ్ట్‌బ్యాంక్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హాలిడేస్(హెచ్‌కే) తదితరాలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. 2013లో ఏర్పాటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 71 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! నష్టాలలోనే...: కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతీ ఏడాది నష్టాలనే నమోదు చేస్తున్నట్లు ఒరావెల్ స్టేస్ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి సవాళ్లు విసరడంతో బిజినెస్ మరింత డీలాపడినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఓయోకు రూ. 3,944 కోట్ల నష్టాలు వాటిల్లగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో రూ. 13,123 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2018–19లో దాదాపు రూ. 2,365 కోట్ల నష్టం ప్రకటించింది. జూలైకల్లా కంపెనీ రుణ భారం రూ. 4,891 కోట్లకు చేరింది. ఐపీవో నిధుల్లో కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి దాఖలు చేసిన దరఖాస్తులో ఓయో తెలియజేసింది. ఓయోలో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వ్యక్తిగత హోదాలో 8.21 శాతం, హోల్డింగ్ కంపెనీ ఆర్ఏ హాస్పిటాలిటీ ద్వారా మరో 24.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ మరింత అధికంగా 46.62 శాతం వాటాను పొందింది. నిధుల వినియోగం ఇలా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు రూ. 2,441 కోట్లను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఓయో వెల్లడించింది. మరో రూ. 2,900 కోట్లను కంపెనీ విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన పెట్టుబడులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కాగా.. ఇటీవల కొద్ది రోజులుగా యూనికార్న్ హోదా(బిలియన్ డాలర్ల విలువ) పొందిన పలు స్టార్టప్‌లు స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో లాభాలతో లిస్ట్‌కాగా.. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్, బ్యూటీ ప్రొడక్టుల ఆన్లైన్ రిటైలర్ నైకా, ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ సైతం పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. వివిధ చర్యల ద్వారా స్థూల లాభ మార్జిన్లను 2020లో నమోదైన 9.7 శాతం నుంచి 2021 మార్చికల్లా 33.2 శాతానికి మెరుగుపరచుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
క్రాష్ మార్కెట్!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ‘బేర్’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ వరుస పతనంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 49 వేల దిగువకు సెన్సెక్స్... మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్ వ్యాప్తి భయాలు మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి మార్కెట్ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ సంస్థ ద్వారా ఇన్వెస్టర్లకు టోపీ
గుట్టువిప్పిన సెబీ ముంబై: పాకిస్తాన్లో రిజిష్టర్ అయిన ఒక సంస్థ ఇచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్లతో భారత్ స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు దెబ్బతిన్న ఉదంతమిది. ఇది బట్టబయిలుకావడంతో మార్కెట్ నియంత్రణా సంస్థ ఇక్కడ లిస్టయిన ధాన్యా ఫిన్‌స్టాక్ కంపెనీతో పాటు మరో 75 మందిని మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. బీఎస్ఈని తలపింపచేలా ‘బీఎస్ఈబుల్.ఇన్’ అనే పేరుపెట్టుకున్న పాక్ సంస్థ ధాన్యా ఫిన్స్టాక్ను కొనమంటూ ఇక్కడి ఇన్వెస్టర్లకు సిఫార్సు ఎస్ఎంఎస్లు ఇచ్చింది. స్వయంగా బీఎస్ఈ నుంచే ఈ మెసేజ్‌లు వచ్చాయన్న విశ్వాసంతో గతేడాది జూలై 27న పలువురు ఇన్వెస్టర్లు ధాన్యా ఫిన్స్టాక్ను కొనుగోలుచేశారు. అంతకుముందే ఆ కంపెనీ నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా పొందిన షేర్లను ఆ కంపెనీ యాజమాన్యానికి చెందినవారు విక్రయించేశారు. దాదాపు రూ. 5 కోట్ల పెట్టుబడితో పొందిన షేర్లను రూ. 107 కోట్లకు విక్రయించారు. ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లు మరునాడు ఆ షేర్లను తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే దాని ధర పతనమైపోయింది. -
విదేశీ పెట్టుబడులే కీలకం...
పెరుగుతున్న ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు * రూపాయి, ముడి చమురు ధరల కదలికలూ ముఖ్యమే * ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: ఆర్బీఐ కీలక రేట్ల తగ్గింపు అవకాశాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రధానంగా ప్రభా వం చూపనున్నాయి. వీటితో పాటు డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల గమనం, శుక్రవారం వెలువడే జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు,.. ఈ అంశాలన్నీ తగిన ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు (సోమవారం) సెలవు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అందరి కళ్లూ ఆర్బీఐ పైనే... ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలు మార్కెట్లో ఒకింత ఒడిదుడుకులకు కారణమవుతాయని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించడం వల్ల ఆర్బీఐ కీలక రేట్లలో కోత కోయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. దేశీయంగా మరే ప్రధాన సంఘటన ఏదీ లేనందున అందరి కళ్లు ఆర్బీఐ మీదనే ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరిలో వచ్చిన నష్టాలన్నీ భర్తీ అయ్యేలా బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరపడం కూడా కలసివస్తోందన్నారు. క్యూ4 ఫలితాల ప్రభావం... ఇక బడ్జెట్ ముగిసినందున కంపెనీలు వెల్లడించే జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలపైననే అందరూ దృష్టి సారిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. జీఎస్టీ వంటి కీలక బిల్లుల కారణంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కూడా ఇన్వెస్టర్లు గమనంలోకి తీసుకుంటారని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ తక్షణం ఆర్బీఐ నుంచి రేట్ల కోతను ఆశిస్తోందని వివరించారు. దీని తర్వాత కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, వర్షాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, సంస్కరణల అమలు... ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఏడేళ్లలో అత్యుత్తమ లాభాల వారం.. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,492 పాయింట్లు(6.4 శాతం) లాభపడి 24,646 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ పాయింట్లు(6.5 శాతం) లాభపడి 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. పాయింట్ల పరంగా చూస్తే స్టాక్ సూచీలకు ఇవి ఏడేళ్లలో అత్యుత్తమ లాభాలు కాగా, పర్సంటేజ్ పరంగా చూస్తే ఇవి నాలుగేళ్లలో అత్యుత్తమ లాభాలు. విదేశీ కొనుగోళ్ల జోరు.. ఈ నెల తొలి 4 ట్రేడింగ్ సెషన్లలోనే భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 4,100 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. కాగా ఈ 4 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ.746 కోట్లు నికరంగా ఉపసంహరించుకున్నారు. ఇతర వర్ధ మాన దేశాలతో పోల్చితే మన దేశం పటిష్టంగా ఉందని, అందుకే విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఫండమెంటల్ రీసెర్చ్ వినోద నాయర్ చెప్పారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పెరుగుతుండడం, బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉండడం కూడా కలసివచ్చిందని వివరించారు. కాగా ముడిచమురు ధరల పతనం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి ఈ ఏడాది జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్లు వెరసి ఈ రెండు నెలల్లో రూ.16,648 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు. -
గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ
చమురు ధరల గమనంతో లాభాల్లో ఒడిదుడుకులు ♦ చివర్లో లాభాల స్వీకరణతో తగ్గిన లాభాలు ♦ ప్లస్ 215 పాయింట్ల నుంచి ప్లస్ ♦ 50 పాయింట్లకు పరిమితమైన లాభాలు యూరప్ ప్యాకేజీకి తోడు జపాన్ కేంద్ర బ్యాంక్ కూడా ప్యాకేజీ ఇస్తుందన్న ఆశలతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిసింది. అయితే రోజులో గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో స్వల్పలాభాలతోనే సూచీలు సరిపెట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 24,486 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,436 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, కన్సూమర్ గూడ్స్, ఫార్మా, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. తగ్గిన లాభాలు... యూరప్, జపాన్ల ప్యాకేజీ ఆశలతో ఆసియా మార్కెట్లు ఎగిశాయి. అమెరికాలో తీవ్రమైన మంచు తుఫాన్ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ మంచి లాభాలనే కళ్లజూసింది. సోమవారం వెలువడిన కొన్ని కంపెనీల క్యూ3 ఫలితాలు ఒకింత బావుండడం, షార్ట్ పొజిషన్ల కవరింగ్ కూడా సానుకూల ప్రభావం చూపించాయి. అమెరికా తూర్పు తీరంలో మంచు తుఫాన్ చెలరేగడంతో ఆయిల్ ఫ్యూచర్స్ పెరిగాయని, దీంతో మన మార్కెట్ లాభపడిందని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) శ్రేయాష్ దేవాల్కర్ చెప్పారు. అయితే యూరోప్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగడం, సోమవారం యూరప్ ట్రేడింగ్‌లో చమురు ధరల్లో కరెక్షన్ కారణంగా ఇక్కడి స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు మరో మూడు రోజుల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడం, కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, వాహన, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం.. ఈ అంశాలన్నీ లాభాలను హరించివేశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు లాభాల్లో ముగిశాయి. నేడు మార్కెట్లకు సెలవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు నేడు(మంగళవారం) సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు పనిచేయవు. వీటితో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్, బులియన్, మెటల్స్, ఇతర టోకు ధరల కమోడిటీ మార్కెట్లన్నింటికి కూడా సెలవు. -
రెండో రోజూ నష్టాలే...
* 43 పాయింట్ల నష్టంతో 25,580కు సెన్సెక్స్ * 7 పాయింట్ల నష్టపోయి 7,785కు నిఫ్టీ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా రేగిన ఆందోళనలు కొనసాగడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 పాయింట్ల వద్ద. నిఫ్టీ చివరకు 7 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల కనిష్ట స్థాయి. లోహ, ఆయిల్, గ్యాస్, రియల్టీ, యుటిలిటీస్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఇటీవల పతనం కారణంగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న రియల్టీ, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్ షేర్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 25,745 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,767-25,514 పాయింట్లు, గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ 68 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఏడాది చివరకు నిఫ్టీ @ 8,200: యూబీఎస్ అంచనా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది చివరకు 8,200 పాయింట్లకు చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. జీడీపీ అంచనా 7.6%. 2016-17లో 7.8% అంచనా. -
మూడో రోజూ లాభాల్లోనే...
► ఫెడ్ ఎఫెక్ట్ లేదంటున్న నిపుణులు ► 174 పాయింట్ల లాభంతో 25,494కు సెన్సెక్స్ ► 50 పాయింట్ల లాభంతో 7,751కు నిఫ్టీ అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్ల మాదిరే భారత స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని ఇన్వెస్టర్లు భావించారని దీంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే సాగాయని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఇంధన షేర్లు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 25,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,751 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు రోజం తా లాభాల్లోనే ట్రేడయ్యాయి. వడ్డీరేట్లపై నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం అర్థరాత్రి వెల్లడించనున్నది. ఆయిల్ షేర్లకు లాభాలు: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయి నుంచి రికవరీ కావడంతో ఆయిల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4% వరకూ పెరిగాయి. 2,000 సీసీ అంతకంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న డీజిల్ వాహన రిజిస్ట్రేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకూ సుప్రీం కోర్ట్ నిషేధం(ఢిల్లీలో) విధించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా 5.4 శాతం నష్టపోయింది. కాగా ఎన్ఎస్ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్‌లను బుధవారం ప్రారంభించింది. ఆయా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్‌లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని ఐఐఎస్ఎల్ పేర్కొంది. -
గ్లోబల్ ట్రెండ్-మార్కెట్ ర్యాలీ
359 పాయింట్ల లాభంతో 25,842కు సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 7,843కు నిఫ్టీ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో భారత్ స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. వడ్డీరేట్లను క్రమక్రమంగా పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తోందని ఫెడ్ మినట్స్ వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 359 పాయింట్లు (1.41 శాతం)లాభపడి 25,842 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు(1.43 శాతం) లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడువారాల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత లాభపడడం ఇదే మొదటిసారి. ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, ఐటీ, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, ఎఫ్ఎంసీసీ, వాహన షేర్లు ర్యాలీ జరిపాయి. దశలవారీగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడం వల్ల విదేశీ నిధులు ఒక్కసారిగా బయటకు తరలివెళ్లబోవనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు రూపాయి బలపడడం, ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ స్కీమ్‌ను కేంద్రం బుధవారం ప్రకటించడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. స్వల్ప కాలిక ఊరటే.. అయితే ఇది షార్ట్‌కవరింగ్ ర్యాలీ అని, ఇది స్వల్పకాలమే ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగిసిన తర్వాత కరెక్షన్ తప్పదని వారంటున్నారు. ఏడవ వేతన సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తున్న నేపథ్యంలో వాహన, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటోలు 3 శాతం వరకూ పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 1-3% రేంజ్లో పెరిగాయి. మరిన్ని ముఖ్యాంశాలు... రైలు రవాణాకు సంబంధించి 3 రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైల్వే స్టాక్ట్స్ లాభపడ్డాయి. మౌలిక రంగానికి ఉత్తేజాన్నిచ్చే చర్యలు తీసుకోవడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గాయత్రి ప్రాజెక్ట్స్ వంటి నిర్మాణ, ఇంజినీరింగ్ షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి. అమెరికా చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్‌కు నష్టాలు కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో షేర్ ఇంట్రాడేలో 7 శాతం పతనమై చివరకు 2.6 శాతం నష్టంతో రూ.3,287 వద్ద ముగిసింది. మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 2,554 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 15,316 ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్) 2,82,254 నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో) ఎఫ్ఐఐ -343 డీఐఐ 234 -
మూడో రోజూ నష్టాలే..
ఫెడ్ ఫలితంపైనే అందరి దృష్టి * 214పాయింట్లు నష్టంతో 27,040కు సెన్సెక్స్ * 62 పాయింట్ల నష్టంతో 8,171కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్ల వేచి చూసే ధోరణి కారణంగా స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 27,040 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,171 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగియగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,000 పాయింట్ల దిగువకు పతనమైంది. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్‌ల కాంట్రాక్టులు నేటితో ముగియడం, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, బీహార్ ఎన్నికలు, రూపాయి పతనం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ప్రతికూల ప్రభావం చూపాయి. బ్యాంక్, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు పెరగడంతో నష్టాలు పరిమితమయ్యాయని నిపుణులంటున్నారు. విద్యుత్ రంగ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,820 కోట్ల రుణాలను 65 శాతం నష్టంతో ఆసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీలు (ఏఆర్సీ)కు యాక్సిస్ బ్యాంక్ అమ్మేసింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ 7.3 శాతం పతనమై రూ. 483 వద్ద ముగిసింది. ఇండిగో ఐపీఓకు ఓవర్ సబ్ స్క్రిప్షన్ విమానయాన కంపెనీ ఇండిగో ఐపీఓ 1.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,018 కోట్లు సమీకరించాలని ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ మొదలై రెండో రోజైన బుధవారంనాడు రూ.4,000 కోట్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 5.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని కంపెనీ పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 19 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్ల కేటగిరి వాటా 4 శాతం చొప్పున సబ్‌స్క్రైబ్ అయ్యాయని వివరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.832 కోట్ల నిధులు సమీకరించామని పేర్కొంది. మూడేళ్ల తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్ అనంతరం ఇదే అతిపెద్ద ఐపీఓ. 2012 డిసెంబర్లో భారతీ ఇన్ఫ్రా టెల్ రూ.4,000 కోట్ల సమీకరణకు గాను ఐపీఓకు వచ్చింది. -
లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు
42 పాయింట్ల నష్టంతో 27,646కు సెన్సెక్స్ ⇒ 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ ⇒ 8 పాయింట్ల నష్టంతో 8,366కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. రెండు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 42పాయింట్లు పతనమై 27,646 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింటు నష్టపోయి 8,366 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్రమైన ఊగిసలాటకు గురైంది. మరింత కన్సాలిడేషన్! ప్రధానమైన సానుకూలమైన సంఘటనలేమీ లేకపోవడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులంటున్నారు. అయితే ఎంపిక చేసిన సెన్సెక్స్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్‌కు స్వల్పనష్టాలే వచ్చాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం మరింత కన్సాలిడేషన్‌కు సూచిక అని జియోజిత్ బీఎన్పీ పారిబస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. 17 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.హెచ్డీఎఫ్సీ 2% క్షీణించింది. ఇదే బాటలో టాటా మోటార్స్ 1.95 శాతం, ఓఎన్జీసీ 1.6%, బజాజ్ ఆటో 1%, హిందూస్తాన్ యూనిలివర్ 0.8% చొప్పున పడిపోయాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 2 శాతం, విప్రో 1.6 శాతం, వేదాంత 1.4% చొప్పున పెరిగాయి. 1,453 షేర్లు లాభాల్లో, 1,289 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో 3,444 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,809 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,79,809 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్ఠర్లు రూ.48 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.451 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
షాక్ మార్కెట్
⇒ సెన్సెక్స్...27,000 దిగువకు...723 పాయింట్లు క్రాష్ ⇒ 228 పాయింట్లు పడిన నిఫ్టీ... 8,100 కిందికి ⇒ ఈ ఏడాది కనిష్ట స్థాయిలకు సూచీలు భారత స్టాక్ మార్కెట్ బుధవారం ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. జీఎస్టీ ఇతర ఆర్థిక సంస్కరణలు ఆశించినంతే వేగంగా లేవని ఆందోళన చెందిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 723 పాయింట్లు క్షీణించి, 26,717 పాయింట్లకు పడిపోయింది. ఇక నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలకు ఈ ఏడాది ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. నాలుగు నెలల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో అధికంగా నష్టపోయింది కూడా ఇదే. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో అతి పెద్ద పతనం. లోక్‌సభలో జీఎస్టీ బిల్లు గట్టెక్కినప్పటికీ, రాజకీయ వ్యతిరేకత బాగా ఉండటంతో సంస్కరణల ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఆందోళనతో ఎఫ్ఐఐల అమ్మకాలు వరదలా వెల్లువెత్తాయి. సేవల, తయారీ రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం, ఎఫ్ఐఐల పన్ను ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ఉండడం ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న రెండు వారాల్లో దాదాపు రెండు డజన్ల చైనా కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఈ ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారని నిపుణులంటున్నారు. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐల రూ.9,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా సావరిన్ బాండ్ల విక్రయాలు పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్ పతన కారణాల్లో ఒకటి. అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై ట్రేడర్లు పిచ్చెత్తినట్లుగా అమ్మకాలు జరపడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి ఒక కారణమని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌదురి వ్యాఖ్యానించారు. నిఫ్టీకి కీలకమైన మద్దతుగా భావించిన 200 రోజుల సగటు కంటే నిఫ్టీ దిగువకు పడిపోవడంతో అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు వెల్లువెత్తాయని వివరించారు. ఐదు నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్ కీలక బిల్లులపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బుధవారం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో (27,473 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. ఆతర్వాత 27,501 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో 27,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 26,678 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 723 పాయింట్ల (2.63 శాతం) భారీ నష్టంతో 26,717 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, సిప్లా, ఐటీసీ తదితర బ్లూ చిప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఎదురీదిన ఎయిర్టెల్... ఎంఎస్సీఐ గ్లోబల్ స్టాండర్ట్ ఇండెక్సెస్ సంస్థ ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్‌లో భారతీ ఎయిర్టెల్ వెయిటేజీని 1.3 శాతం నుంచి 2.6 శాతానికి పెంచిందన్న వార్తల కారణంగా 0.8 శాతం లాభంతో భారతీ ఎయిర్టెల్ 390కు పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఏకైక షేర్ ఇదే. ఇక మొత్తం 12 రంగాల బీఎస్ఈ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, విద్యుత్, బ్యాంక్, లోహ, రిఫైనరీ, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు బాగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 3-6% రేంజ్లో పడిపోయాయి. ఓఎన్జీసీ 3%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5% చొప్పున పడ్డాయి. భెల్ 6.21% నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పతనమైన షేర్ ఇదే. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ 4.9%, ఎల్ అండ్ టీ 4.6%, మారుతీ సుజుకీ 4.2%, ఎన్టీపీసీ 4 శాతం, సిప్లా 3.9 శాతం, ఓఎన్జీసీ 3.9%, యాక్సిస్ బ్యాంక్ 3.8%, టాటా పవర్ 3.7% చొప్పున పడిపోయాయి. 2,147 షేర్లు నష్టపోగా, 590 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,565 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.20,654 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్‌లో రూ. 2,94,267 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,700 కోట్లు నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,455 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. రూ.2.89 లక్షల కోట్లు ఆవిరి... సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.99.11 లక్షల కోట్లకు చేరింది. 3 వారాల్లో 2,400 పాయింట్లు డౌన్ సంస్కరణలు జోరు పెరుగుతుందనే అంచనాలతో గత 9 నెలలుగా స్టాక్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్ల(జీవిత కాల గరిష్ట స్థాయి)కు కూడా చేరింది. అయితే ఎఫ్ఐఐల పన్ను ఆందోళనలు, సంస్కరణల జోష్ తగ్గడంతో గరిష్ట స్థాయి నుంచి 3,300 పాయింట్లు నష్టపోయింది. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వత లాభపడిన పాయింట్లలో సగం హరించుకుపోయింది. గత మూడు వారాల్లోనే దాదాపు 2,400 పాయింట్లు(8%)పతనమైంది. ఎఫ్ఐఐల కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) ఆందోళనలు, నిరాశకు గురిచేస్తున్న కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సగటు కన్నా తక్కువగానే ఈ ఏడాది వర్షాలు ఉంటాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణాలని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. సల్మాన్‌కు శిక్షతో తగ్గిన ఈరోస్, మంధన.. ప్రముఖ హిందీ సినిమా నటుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు శిక్ష పడిన నేపథ్యంలో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, మంధన ఇండస్రీస్ షేర్లు క్షీణించాయి. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన 2002 నాటి కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయనతో సంబంధమున్న ఈ రెండు కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్ఎస్ఈలో ఈరోస్ ఇంటర్నేషనల్ షేర్ 6 శాతం క్షీణించి రూ.380కు, మంధన ఇండస్ట్రీస్ 3.5 శాతం తగ్గి రూ.265కు పడిపోయాయి. ఈరోస్ మార్కెట్ క్యాప్ రూ.213 కోట్లు క్షీణించి రూ.3,523 కోట్లకు, మంధన ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.38 కోట్లు క్షీణించి రూ.876 కోట్లకు తగ్గింది. సల్మాన్ ఖాన్ స్వచ్ఛంద సేవా సంస్థ బీయింగ్ హ్యుమన్ దుస్తుల డిజైనింగ్, మార్కెటింగ్, పంపిణీలకు మంధన ఇండస్ట్రీస్‌కు ఎక్స్‌క్లూజివ్ లెసైన్స్ ఒప్పందం ఉంది. ఇక ఈరోస్... సల్మాన్ ఖాన్‌తో రెండు సినిమాలు.. భజరంజి భాయ్‌జాన్, హీరో సినిమాలను నిర్మిస్తామని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. -
కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..
ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు సూచీలు * 8,900 మార్క్‌ను దాటిన నిఫ్టీ, 75 పాయింట్లు ప్లస్ * 292 పాయింట్ల లాభంతో 29,571కు సెన్సెక్స్ ముంబై: భారత స్టాక్మార్కెట్లో ఇటీవల ప్రతిరోజూ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగుస్తున్నాయి. సోమవారం రిపబ్లిక్‌డే సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన మార్కెట్ రికార్డుల ర్యాలీని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి 29,619, నిఫ్టీ 8,925 పాయింట్లను తాకాయి. చివరకు సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 29,571 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 8,911 వద్ద ముగిశాయి. ఇవి రెండూ రికార్డ్ స్థాయి ముగింపులు. ఈ సూచీలు రికార్డ్ స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా ఐదో రోజు. తాజా ర్యాలీలో నిఫ్టీ తొలిసారిగా 8,900 మార్క్‌ను దాటేసింది. ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్ స్థిరీకరణ సూచనలు కనిపించాయి. కానీ చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,224 పాయింట్లు(8%), నిఫ్టీ 600 పాయింట్ల చొప్పన లాభపడ్డాయి. జోష్‌నిచ్చిన ఒబామా పర్యటన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు మరింత పటిష్టం కానుండడం స్టాక్ మార్కెట్లలో జోష్‌ను పెంచింది. గ్రీస్ ఎన్నికల్లో సంస్కరణలను వ్యతిరేకించే సిరిజా పార్టీ విజయం సాధించడంతో ఆసియా మార్కెట్లు ఊగిసలాటకు గురైనా, భారత మార్కెట్లు దూసుకెళ్లాయి. ఒబామా పర్యటన సందర్భంగా భారత్‌లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం అమెరికా 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు, రుణాల రూపంలో అందించనుండడం మార్కెట్లకు జోష్‌నిచ్చిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు బంధం బలపడుతున్న కారణంగా క్యాపిటల్ గూడ్స్, రక్షణ రంగ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. భెల్, ఎల్ అండ్ టీ, పిపవావ్ డిఫెన్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 1-7 శాతం రేంజ్లో పెరిగాయి. సిప్లా 4.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.5%, ఐటీసీ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.9%, టాటా మోటార్స్ 2.9 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.1 శాతం చొప్పున పెరిగాయి. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్ల రూ.953 కోట్ల నికర కొనుగోళ్లు జరపారు. దేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ.783 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ వరకూ బ్యాంక్ షేర్ల జోరు గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,224 పాయింట్లు లాభపడింది. దీంట్లో సగం వాటా (1,200 పాయింట్ల మేర) ఐదు ఆర్థిక రంగ షేర్లదే. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్ల పెరుగుదలతో సెన్సెక్స్ దూసుకుపోతుందని, వచ్చేవారంలో జరిగే పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతున్నాయని విశ్లేషకులంటున్నారు. కాగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో గరిష్ట స్థాయిలను తాకాయి. మంచి పనితీరు, ఇటీవలి రేట్ల కోత, కొన్ని బ్యాంకులకు అనుబంధ బీమా, బ్రోకరేజ్ కంపెనీలు ఉండడం(బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి) వంటి కారణాల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్ వరకూ బ్యాంకింగ్ షేర్ల హవా కొనసాగుతుందని, బడ్జెట్ తర్వాత కరెక్షన్ ఉంటుందనేది వారి అభిప్రాయం. కాగా యాక్సిస్ బ్యాంక్ షేర్ రికార్డ్ స్థాయిని(రూ.598) తాకి 4.7% లాభంతో రూ.592 వద్ద ముగిసింది. ఈ షేర్ రూ.840కు చేరుతుందనేది మోర్గాన్ స్టాన్లీ అంచనా. -
28 వేల మార్కు సమీపంలో సెన్సెక్స్!
ముంబయి: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 28వేల మార్కుకు సమీపంలో ఉంది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. -
మోదీ టైమ్ బావుంది..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ రిపీట్ అయ్యింది. సోమవారం మరోసారి భారత స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదుచేసింది. రోజుకో కొత్త రికార్డును నెలకొల్పడం సూచీలకు పరిపాటి అయిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనువేగంతో ప్రవేశపెట్టిన సంస్కరణలో, మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా టర్న్ ఎరౌండ్ అయిపోవడమో ఇందుకు కారణం కాదు. పలు ప్రపంచదేశాల బ్యాంకుల ‘ఈజీ మనీ పాలసీ’ ఫలితంగా అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ మార్కెట్ సూచీలన్నీ ఎగసిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పొందిన చౌక డాలరు రుణాల్ని ఇన్వెస్టర్లు పలు దేశాల మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 40 బిలియన్ డాలర్లు కుమ్మరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ‘శుభదినాలు(మోదీ భాషలో అచ్ఛాదిన్)’ ఇంకా రాకపోయినా, బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడానికి కారణమిదే. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నదన్న సంకేతాలేవీ ఇప్పటికీ కన్పించలేదు. దేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 5.7 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో ఎగుమతుల వృద్ధి 5 శాతానికి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వపు పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరపు లక్ష్యంలో 37 శాతమే జరిగాయి. అందుకే వసూళ్లను పెంచుకునేందుకు డీజిల్, పెట్రోల్‌పై అదనపు ఎక్సయిజ్ సుంకం వడ్డించింది. మే నెలలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం , గత యూపీఏ ప్రభుత్వం అర్థాంతరంగా వదిలిపెట్టిన, ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో పడిన కొన్ని అంశాలపై (బీమా రంగంలో ఎఫ్‌డీఐని పెంచడం, సహజవాయువు ధరను పెంచడం వంటివి) నిర్ణయాలను ప్రకటించింది తప్ప, ఇప్పటివరకూ కొత్తగా తీసుకున్న విధాన చర్యలేవీ లేవు. రైల్వే బడ్జెట్లోగానీ, సాధారణ బడ్జెట్లో గానీ ప్రతిపాదించిన సంస్కరణలేవీ లేవు. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ఇన్ఫ్రా, పవర్ రంగాలు మెరుగుపడకపోగా, మరింత కుదేలైపోయాయి. ఆర్థిక రంగం వృద్ధిబాట పడుతున్నదన్నడానికి స్పష్టమైన సంకేతంగా భావించే బ్యాంకుల రుణ వితరణ పెరగలేదు. పైగా మూలధనం అవసరమైన రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పడిపోయింది కూడా. ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటే కరెన్సీ కూడా బలపడేది. డాలరు బలాన్ని ఎదిరించలేక రూపాయి విలువ 8 నెలల కనిష్టస్థాయికి క్షీణించింది. అయినా మోదీ టైమ్ మాత్రం బావుంది. అంతర్జాతీయ స్టాక్, కమోడిటీ మార్కెట్ల అనుకూల ప్రభావం భారత్‌పై బాగా ప్రసరించింది. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే చమురు, బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో గత కొద్ది నెలల్లో 30, 20 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీల ధరల క్షీణతతో దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు, చెల్లించే డాలర్ల మధ్య వ్యత్యాసం) ఆశ్చర్యకరంగా 1.7 శాతానికి పడిపోయింది. చెల్లింపుల సమతౌల్యస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రిజర్వుబ్యాంక్ వద్ద 8 నెలలకు సరిపడా అవసరమైన డాలరు నిల్వలున్నాయి. ప్రపంచ కమోడిటీ మార్కెట్ల పుణ్యమా అని డీజిల్ ధరను భారీగా తగ్గించడంతో పాటు ఆ ఇంధనంపై నియంత్రణలు ఎత్తివేసిన ఘనతను మోదీ ప్రభుత్వం పొందగలిగింది. మనం అధికంగా దిగుమతి చేసుకునే వంటనూనెల ధరలు సైతం ప్రపంచ మార్కెట్లో తగ్గడంతో ఇక్కడ కూడా తగ్గు ముఖం పట్టాయి. చక్కెర, గోధుమలు, జొన్న వంటి వ్యవసాయోత్పత్తులు, వెండి, రాగి తదితర లోహాల ధరలు కూడా అంతర్జాతీయంగా పడిపోవడంతో దేశీయ ద్రవ్యోల్బణం గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంత కనిష్టస్థాయికి పడిపోయింది. అక్టోబర్‌లో వినియోగ ద్రవ్యోల్బణం రేటు 5.5 శాతానికి తగ్గిపోయింది. టోకు ద్రవ్యోల్బణం రేటు 1.77 శాతానికి క్షీణించింది. ధరలు తగ్గిన ఫలితమంతా నరేంద్ర మోదీ ఖాతాలోకి వచ్చిచేరింది. ఆరేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ప్రపంచ కమోడిటీ మార్కెట్లు మోది పగ్గాలు చేపట్టిన తర్వాత నాటకీయంగా చల్లబడ్డాయి. కానీ కేవలం కమోడిటీ ధరలు తగ్గినంత మాత్రాన దేశానికి మోదీ చెపుతున్న శుభదినాలు వస్తాయో రావో చెప్పలేం గానీ, ప్రస్తుతం ప్రధాని టైమ్ బావుందని చెప్పొచ్చు. -
పార్లమెంట్ సమావేశాలపై మార్కెట్ దృష్టి!
క్యూ2 జీడీపీ గణాంకాలపై కూడా: నిపుణుల అంచనా న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డుల్ని సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్, వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరిన్ని సంస్కరణలుంటాయన్న అంచనాలతో కొత్త గరిష్టస్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారంలో వెల్లడికానున్న జీడీపీ గణాంకాలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపిస్తాయని, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. గతవారం 288 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయి 28,335 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,477 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇన్వెస్టర్లు ఆశించే సంస్కరణలు వుండవచ్చన్న అంచనాలతో మార్కెట్ తక్షణం సరికొత్త గరిష్టస్థాయికి పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన బిల్లులు, బొగ్గు రంగ సంస్కరణల్ని ఈ సమావేశాల్లో ఆవిష్కరిస్తారన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బీమా బిల్లు వంటివాటి ఆమోదం విషయంలో విపక్షాలు కఠినవైఖరిని అవలంబిస్తున్నా, తాము ఈ సమావేశాల్లో ముందుకు వెళతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు 27వ తేదీన ముగియనున్నందున మార్కెట్ ఈ వారం హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాలిక్ తెలిపారు. జీడీపీ డేటా 28న వెల్లడికానున్న సందర్భంగా కూడా సూచీల ఊగిసలాట వుండవొచ్చని ఆయన అన్నారు. అయితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మార్కెట్ ఆశావహ దృక్పథం ఈ వారం సూచీల్ని గరిష్టస్థాయిలో స్థిరపడవచ్చని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 8,100-8,500 మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చనేది బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా. వచ్చేనెల తొలివారంలో జరగనున్న ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో అనుకూల ప్రకటన వెలువడవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు డిసెంబర్ 2నాటి సమీక్షలో వెలువడితే మార్కెట్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 20,000 కోట్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లో నవంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దాదాపు రూ. 20,000 కోట్లు పెట్టుబడి చేశారు. ఇందులో ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ. 10,778 కోట్లు, రుణ పత్రాల మార్కెట్లో రూ. 8,870 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెబీ తాజా గణాంకాల్లో వెల్లడైంది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 28,046.66 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 8,389.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. -
స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించి 27940, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8357 వద్ద ముగిసాయి. హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లుపిన్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. బీపీసీఎల్, కెయిర్న్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీ, సెసాగోవా స్టెరిలైట్, టాటా పవర్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా యూరప్ మార్కెట్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం ట్రేడింగ్ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 27975 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8362 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక గణాంకాల్లో సానుకూల ప్రభావం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, విద్యుత్, కాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు లాభపడటంతో.. ఆరంభంలో సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 28098 పాయింట్లను తాకింది. సిప్లా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, లార్సెన్ లాభపడగా, బీపీసీఎల్, ఎన్ ఎమ్ డీసీ, కెయిర్న్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐడీఎఫ్ సీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 27837, నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 8327 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో .. నిఫ్టీ ఆరంభం 8337, గరిష్టం 8383, కనిష్టం 8304 పాయింట్లను, సెన్సెక్స్ 27919 ప్రారంభమై 28027 గరిష్టం, కనిష్టం 27764 పాయింట్లను తాకింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐటీసీ, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్ కంపెనీలు స్వల్ప లాభాల్లో, ఓఎన్ జీసీ, జిందాల్ స్టీల్, లార్సెన్, టాటా మోటార్స్, హిండాల్కో కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
బుల్ జోరు, సెన్సెక్స్ న్యూ హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కోనసాగుతోంది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 28027 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 8383 పాయింట్లను నమోదు చేసుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హ్యాంగ్ సెంగ్ 389 పాయింట్లు, తైవాన్ 133 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి. సన్ ఫార్మా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్, జిందాల్ స్టీల్, సిప్లా, హిండాల్కో, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.