సెన్సెక్స్ కు 44 పాయింట్ల నష్టం! | Sensex ends 44 points down; ONGC, RIL shares lead fall | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 44 పాయింట్ల నష్టం!

Published Thu, Jun 19 2014 5:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

సెన్సెక్స్ కు 44 పాయింట్ల నష్టం!

సెన్సెక్స్ కు 44 పాయింట్ల నష్టం!

ఇరాక్ లో అనిశ్చితి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలుగవచ్చనే భయాందోళనల మధ్య భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఊగిసలాటకు లోనయ్యాయి.

ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలుగవచ్చనే భయాందోళనల మధ్య భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఊగిసలాటకు లోనయ్యాయి.
 
ఓదశలో 180 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్  115 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 25425 పాయింట్ల గరిష్టస్థాయిని, 25069 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 25201, నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 7606 పాయింట్ల వద్ద ముగిసాయి. 
 
అత్యధికంగా యునైటెడ్ స్పిరిట్ 7.18 శాతం, ఓఎన్ జీసీ 4.96, కోటాక్ మహీంద్ర 3.81, బీపీసీఎల్ 4.61, రిలయన్స్ 2.31 శాతం నష్టాల్ని, ఇండస్ ఇండియా బ్యాంక్, ఇన్పోసిస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement