సెన్సెక్స్ భారీ పతనం
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గ చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి.
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గ చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 414 పాయింట్లు పతనమై 25480 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 7602 పాయింట్ల వద్ద ముగిసాయి. 1119 కంపెనీల షేర్లు మార్కెట్ మద్దతు నిలువగా, 1762 కంపెనీల షేర్లు నష్టాల వైపుకు లాగాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,862 గరిష్ట స్థాయిని, 25,459 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,716 గరిష్టాన్ని 7,593 కనిష్టాన్ని తాకాయి.
హిండాల్కో, సిప్లా, రిలయన్స్, కొటాక్ మహీంద్ర, ఎన్ టీపీసీ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, డీఎల్ఎఫ్ కంపెనీలు లాభాలతో ముగిసాయి.