రికార్డు గరిష్టస్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలనుంచి లాభాల్లోకి చేరుకుని రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆరంభంలో రికార్డు స్థాయి నుంచి క్షీణించి లాభాలను నమోదు చేసుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి చేరుకున్నాయి.
మధ్యాహ్నం మూడుగంటల సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 26244 పాయింట్లు వద్ద, 24 పాయింట్ల వృద్ధితో 7819 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్, హిండాల్కో, ఏషియన్ పెయింట్స్ లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
ఫలితాలు నిరాశపరచడంతో కెయిర్న్ ఇండియా 6.66 శాతం నష్టపోయింది. గెయిల్,డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, సిప్లాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.