record high
-
బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బుధవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరష్టాలకు పెరిగాయి.బుధవారం మధ్యాహ్నం 2:17 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.9% పెరిగి ఔన్సుకు 2,592.39 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన అర శాతం రేట్ల కోతతో ద్రవ్య విధాన సడలింపు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ రేటు ఈ సంవత్సరం చివరి నాటికి మరో అర శాతం, 2025లో పూర్తిగా ఒక శాతం తగ్గుతుందని భావిస్తున్నారు.వడ్డీ రేట్ల తగ్గింపుతో అందరి దృష్టి బంగారంపై పడింది. పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్‌పై భారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా ఉండనుంది.ఫెడ్ రేట్ కట్ తరువాత డాలర్ 0.5% పతనమైంది. 2023 జూలై నుండి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది.ఇన్వెస్టర్లు ఇప్పుడు పాలసీ మార్గంపై ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నుంచి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా స్పాట్ వెండి సోమవారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఔన్స్‌కు 0.6% పెరిగి 30.93 డాలర్ల వద్దకు చేరింది. -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
మళ్లీ మెరిసిన పసిడి, వెండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల భయాలతో పసిడి, వెండి పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ధోరణులకు తగ్గట్లు దేశీయంగా వెండి, బంగారం ధరలు మంగళవారం మరో రికార్డు స్థాయిని తాకాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం దేశ రాజధానిలో ఉదయం పసిడి 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి అయిన రూ. 73,750ని తాకింది. అదే విధంగా వెండి ధర కూడా కేజీకి రూ. 800 పెరిగి రూ. 86,500 స్థాయిని తాకింది. ఎంసీఎక్స్‌లో జూన్ కాంట్రాక్టు ధర ఇంట్రా–డేలో రూ. 72,927 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్‌లో ఔన్సు (31.1 గ్రాముల) పసిడి ధర 15 డాలర్లు పెరిగి 2,370 వద్ద ట్రేడయ్యింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం బులిష్‌గానే ఉండనున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. -
ఒక్క కఠిన నిర్ణయం.. నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్ లాభాలు!
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరగనున్నాయి. ‘వన్ డే’ పాపులర్ షో విడుదల, పాస్వర్డ్ షేరింగ్ కట్టడి చర్యల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. 2020 కోవిడ్ లాక్డౌన్ల తర్వాత సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్వర్డ్ షేరింగ్‌ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్ (Refinitiv) డేటా ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్‌కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఎగుమతులు రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్ డాలర్లు. ► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. -
ర్యాలీతో రికార్డుల మోత
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ దిగ్గజాలలో కొనుగోళ్ల మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో మరోసారి మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 22,197 వద్ద ముగిసింది. దీంతోపాటు ఇంట్రాడేలో 22,216కు చేరడం ద్వారా మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మరోపక్క సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్‌చేసి 73,057 వద్ద నిలిచింది. తద్వారా 73,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించడంతోపాటు.. చరిత్రాత్మక గరిష్టం 73,328ను అధిగమించే బాటలో సాగుతోంది. సోమవారం సైతం నిఫ్టీ 22,122 వద్ద రికార్డ్ సృష్టించిన విషయం విదితమే. అయితే మార్కెట్లు తొలుత వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 22,046 దిగువన, సెన్సెక్స్ 72,510 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తిరిగి మిడ్ సెషన్ నుంచీ జోరందుకున్నాయి. దీంతో ఆరు రోజుల్లో నిఫ్టీ 580 పాయింట్లు, సెన్సెక్స్ 1,984 పాయింట్లు జమ చేసుకున్నాయి. ప్రయివేట్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్(1%) జోరు చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎన్టీపీసీ, కొటక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్‌యూఎల్ 4.4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరోమోటో, బజాజ్ ఆటో, ఐషర్, కోల్ ఇండియా, టీసీఎస్, సిప్లా, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ 4–1% మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు వీక్ అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు చిన్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,967 నీరసించగా.. 1,876 బలపడ్డాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 1,491 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్.. ► ఇష్యూ ధర రూ. 151తో పోలిస్తే వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ 179% లాభంతో రూ. 421 వద్ద లిస్టయ్యింది. 193% (రూ.291) బలపడి రూ. 442 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 838 కోట్లను దాటింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 23.3 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీవో భారీ స్థాయిలో 300 రెట్లు సబ్‌్రస్కయిబ్ అయ్యింది. ► ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల్లో రూ. 656 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించడంతో పవర్‌గ్రిడ్ షేరు 4.2% ఎగసి రూ. 288 వద్ద క్లోజైంది. వరుసగా ఆరో రోజూ ర్యాలీతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డును సాధించగా.. సెన్సెక్స్ 73,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. త ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకునే బాట లో సాగుతోంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 391.5 లక్షల కోట్ల(4.72 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. వర్ల్‌పూల్ వాటా విక్రయం.. రూ. 4,090 కోట్ల సమీకరణ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్ సంస్థ వర్ల్‌పూల్ మారిషస్ బ్లాక్‌డీల్స్ ద్వారా దేశీ అనుబంధ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించింది. యూఎస్ హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం వర్ల్‌పూల్ కార్పొరేషన్ మారిషస్ సంస్థ ద్వారా 75 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 4,090 కోట్ల విలువైన 3.13 కోట్ల షేర్లు విక్రయించినట్లు బీఎస్ఈకి వర్ల్‌పూల్ ఇండియా వెల్లడించింది. రుణ చెల్లింపుల కోసం వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించనున్నట్లు గతేడాది వర్ల్‌పూల్ కార్ప్ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వర్ల్‌పూల్ ఇండియా షేరు 3.25 శాతం క్షీణించి రూ. 1,288 వద్ద ముగిసింది. -
అంతా ఐఫోన్ల చలవే! టిమ్‌కుక్ ఫుల్ హ్యాపీ
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్.. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్లు భారీగా అమ్ముడుపోవడంతో అత్యధిక లాభాలు వచ్చాయి. యాపిల్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 119.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 2 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఫోన్లు 6 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయంలో ఐఫోన్ల ద్వారా వచ్చిన ఆదాయం 69.7 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.7 లక్షల కోట్లు). యాపిల్ యాక్టివ్ డివైజ్ బేస్ ఆల్‌టైమ్ హైని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను వాడుతున్నవారి సంఖ్య 220 కోట్లను దాటింది. భారత్‌లో ఆదాయ పరంగా వృద్ధిని సాధించామని, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన రెండంకెల వృద్ధిని, ఆదాయ రికార్డును తాకినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారత్‌తో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. 2023లో ఆదాయ పరంగా యాపిల్ భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉందని, ఎగుమతులలో కోటి యూనిట్లను అధిగమించిందని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది. -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరల రికార్డు పరుగు ప్రభావం భారత్ బులియన్ మార్కెట్లో కనబడింది. దేశ రాజధానిలో పసిడి 10 గ్రాముల ధర సోమవారం అంతక్రితం ముగింపుతో పోలి్చతే రూ.450 పెరిగి రూ.64,300 రికార్డు స్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక ముంబైలో ధర సోమవారం క్రితం (శుక్రవారం ముగింపు)తో పోలి్చతే 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.553 పెరిగి రూ.63,281కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.551 ఎగసి రూ.63,028ని చూసింది. ఇక వెండి విషయానికి వస్తే, రెండు నగరాల్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి కేజీ ధర రూ.80,200 పలికితే, ముంబైలో ఈ విలువ రూ.76,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో తీరిది... గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా, తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ ప్రభావం... అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరికి సంబంధించి క్రియాశీలంగా ట్రేడ్ అవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) ధర తాజాగా రికార్డు స్థాయిలో 2,151 డాలర్లను తాకింది. అయితే లాభాల స్వీకరణ నేపథ్యంలో ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి 2.3 శాతం క్షీణించి 2,040 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియన్ ట్రేడింగ్‌లో కూడా ఇంట్రాడేలో ధర ఆల్‌టైమ్ కొత్త రికార్డు స్థాయి 2,135 డాలర్లను చూసింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనత, పశి్చమాసియా సంక్షోభ పరిస్థితులు పసిడి పరుగుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఇటీవలి సర్వే విడుదలచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 24 శాతం సెంట్రల్ బ్యాంక్‌లు రాబోయే 12 నెలల్లో తమ బంగారం నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నాయని వెల్లడించింది. రిజర్వ్ అసెట్‌గా డాలర్ కంటే బంగారమే సరైనదన్న అభిప్రాయం దీనికి కారణమని పేర్కొంది. ఈ అంశం కూడా తాజా బంగారం ధర జోరుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ హై రికార్డ్.. హైదరాబాద్‌లో అత్యధికం
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేశాయి. స్థిరమైన తనఖా రేటు మధ్య బలమైన డిమాండ్‌తో జూలై-సెప్టెంబర్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు గతేడాది కంటే 36 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,20,280 యూనిట్లకు చేరుకున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ (Anarock) నివేదిక పేర్కొంది. (ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!) హైదరాబాద్‌లో అత్యధికం అనరాక్ నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత ఏడాది కాలంలో గృహాల విక్రయాలు 88,230 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో ఏడు నగరాల్లో సగటు గృహాల ధరలు ఏటా 11 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో ఏటా జులై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల ధరల సగటు పెరుగుదల అత్యధికంగా 18 శాతం ఉంది. (అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?) ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక విక్రయాలు ఆల్‌టైమ్ హైని తాకినట్లు అనరాక్ హైలైట్ చేసింది. అయితే ఈ నివేదికలో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఫ్లోర్ల విక్రయాలను చేర్చారు. ప్లాట్లు(ఖాళీ స్థలాలు)ను మాత్రం ఇందులో చేర్చలేదు. ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఇలా.. ఢిల్లీ-ఎన్సీఆర్లో గృహాల విక్రయాలు 2023 జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 14,970 యూనిట్ల నుంచి 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఈ కాలంలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా 46 శాతం పెరిగి 26,400 యూనిట్ల నుంచి 38,500 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 12,690 యూనిట్ల నుంచి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరుకున్నాయి. పుణెలో ఇళ్ల అమ్మకాలు గరిష్టంగా 63 శాతం పెరిగి 14,080 యూనిట్ల నుంచి 22,885 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 41 శాతం పెరిగి 11,650 యూనిట్ల నుంచి 16,375 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో ఇళ్ల విక్రయాలు 42 శాతం పెరిగి 3,490 యూనిట్ల నుంచి 4,940 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో గృహాల అమ్మకాలు జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో 4,950 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 5,320 యూనిట్లకు చేరుకున్నాయి. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్‌లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న ర్యాలీని నిలబెట్టుకున్నాయి. మిడ్ అండ్ స్మాల్-క్యాప్ సెగ్మెంట్లు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించాయి, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ కన్జ్యూమర్ స్టాక్‌లు సెక్టోరియల్ ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఆటో, ఐటీ నష్టపోయాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు ఎగిసి 65,785 వద్ద, నిఫ్టీ 99పాయింట్లు లాభంతో 19497 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా మరో ఆల్ టైం రికార్డ్ హైని నమోదు చేశాయి. ఎం అండ్ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ భారీ లాభాలతో ముగియగా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!
సాక్షి, ముంబై: దేశీయంగా పసిడి పైపైకి చేరుతూ కొనుగోలుదారులకు షాకిస్తోంది. దేశంలో పలు నగరాల్లో బంగారం ధర రూ.61 వేలను దాటేసింది. అటు వెండి కూడా ఇదే బాటలో ఉంది. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పై రూ. 10 పెరిగి.. రూ. 55,310కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.19 పెరిగి రూ.61,340కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.55,300గాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏక ంగా వెయ్యి రూపాయలు ఎగిసి రూ.60,330గా ఉంది. కాగా ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 360 గా ఉంది. అటు ఢిల్లీలో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61, 510 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో మరో విలువైన లోహం వెండి ధరలను పరిశీలిస్తే కేజీ వెండి ఏకంగా రూ. 2900పుంజుకుంది. కిలో ధర రూ.77800గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. బలహీనమైన అమెరికా ఆర్థిక డేటాతో ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీ రేటు వడ్డన ఆందోళనతో గోల్డ్ ఔన్సు 2వేల డాలర్లు అధిగమించింది. తద్వారా ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎంసీక్స్ గోల్డ్ బుధవారం రూ. 61,130 వద్ద ఉంది. కిలో వెండి 3.7 శాతం ఎగిసి రూ. 74,700 కి స్థాయిని తాకింది. -
March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!
సాక్షి,ముంబై: పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుని వినియోగదారులకు షాకిస్తోంది. బులియన్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది. దేశీయంగా గతం వారం రోజుల వ్యవధిలో ధర రూ.3,520కు పైగా పెరిగింది. బంగారం ధర ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అమెరికా బ్యాంక్ సంక్షోభం పసిడి ధరలకు ఊతమిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320 రూపాయలను దాటేసింది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఏకంగా 10 గ్రాములకు రూ. 1500 పెరిగింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగార ధర 10 గ్రాములు రూ. 60,320 వద్ద ఉంది. సుమారు రూ. 1,630 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1300 పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది. గ్లోబల్‌గా కూడా అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే శనివారం రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 1,988 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వారం ముగింపుతో పోలిస్తే ఔన్స్‌కు 6.48 శాతం పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ధర 2వేల డాలర్లను కూడా దాటేసి 2,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వెండి కూడా బంగారంతోసమానంగా వారానికి దాదాపు 9.22 శాతం భారీ లాభాలను ఆర్జించింది. ఇదే రేంజ్లో దేశీయంగా కూడా ధరలు ప్రభావితం కానున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. మార్చి 21న జరిగే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ముఖ్యంగా అమెరికా బ్యాంకింక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే పసిడి ధరలు మరింత పెరుగుతాయనేది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రాష్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనంతో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనకు దారి తీసింది. అటు క్రెడిట్ సూయిస్ షేర్లలో పతనం ప్రపంచ మార్కెట్ గందరగోళానికి దారితీసింది. దీంతో అంతర్జాతీయంగా శుక్రవారం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్‌తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
పసిడి పరుగు, మూడు నెలల్లోపే అంత పెరిగిందా..!
సాక్షి,ముంబై: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. పసిడి ధర శుక్రవారం మరో రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు రూజ56,850కి చేరుకున్నాయి. డాలర్ క్షీణత , ట్రెజరీ ఈల్డ్‌ల కారణంగా బంగారం 3 నెలల గరిష్టానికి చేరింది. నవంబర్ నుంచి ప్రారంభమైన బులియన్ ర్యాలీ మధ్య గ్యాప్ ఇచ్చినా మూడు నెలలోపే 6 వేల రూపాయలు ఎగియడం గమనార్హం. గ్లోబల్ సంకేతాలతో భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం ధరలు ఈరోజు మరో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ఫ్యూచర్లు 0.3శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 56,850కి చేరగా, వెండి కిలోకు రూ. 68,743కి పలికింది. అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 1న దాని రెండు రోజుల సమావేశం ముగింపులో ఫెడరల్ రిజర్వ్ ద్వారా స్ట్రీట్ ఒక చిన్న 25-బేసిస్-పాయింట్ వడ్డీ రేటు మాత్రమే పెంపు ఉంటుందన్న అంచనాలతో బంగారం లాభపడుతుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 58,710 వద్ద, వెండి కిలో ధర స్వల్పంగా తగ్గి రూ. 73500 వద్ద ఉంది. -
కొనసాగిన బుల్ రన్: చివర్లో లాభాల స్వీకరణ
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల్లో ముగిసాయి. వరుసగా రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చూశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ గరిష్టస్థాయిలను తాకింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో భారీ లాభాలను కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగిసి 63284 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 18815వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, టెక్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ లాంటి షేర్లు భారీగా లాభాలనార్జించాయి. మరోవైపు నవంబరు సేల్స్ నిరాశ పర్చడంతో ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. ఐసపీఐసీఐ బ్యాంకు, సిప్లా, యూపీఎల్, ఐషర్ మెటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పైసలు లాభపడి 81.21 వద్ద ముగిసింది. -
గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు,ఈ ఏడాదిలో హైయస్ట్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ నోట్స్) పెట్టుబడులు అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఇవి గరిష్ట స్థాయి పెట్టుబడులు కావడం గమనించాలి. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్స్‌ను జారీ చేస్తుంటారు. ఈ నోట్స్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. (డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే!) సెబీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. సెప్టెంబర్ చివరికి పీనోట్స్ పెట్టుబడులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో కలిపి రూ.88,813 కోట్లుగా ఉంటే, అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. సాధారణంగా ఎఫ్‌పీఐ పెట్టుబడుల ధోరణిని పీ నోట్ల పెట్టుబడులు అనుసరిస్తుంటాయి. అక్టోబర్ నాటికి వచ్చిన పీనోట్ల మొత్తం పెట్టుబడుల్లో రూ.88,490 కోట్లు ఈక్విటీల్లో, రూ.9,105 కోట్లు డెట్‌లో, రూ.190 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి వచ్చాయి. ‘‘ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో అంతటా ఏకాభిప్రాయం ఉంది. (శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూపాయి స్థిరంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
రికార్డుల వరద, రికార్డు క్లోజింగ్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సందేశాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల లాభాలతో రికార్డుల వెల్లువ కురింది. సెన్సెక్స్ 62252 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 52 వారావల హైని నమోదు చేసింది. అలాగే బ్యాంకింగ్ షేర్లు లాభాలతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైకి చేరింది. ఆఖరి నిమిషాల్లో రిలయన్స్, టీసీఎస్ ఐటీసీలో కొనుగోళ్లు మార్కెట్లకు మరింత ఊతమిచ్చాయి. చివరకు సెన్సెక్స్ 762 పాయింట్లు ఎగిసి 62272 వద్ద, నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో18514 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్ల లాభాలతో సెన్సెక్స్ 62 వేల పాయింట్లు సునాయాసంగా అధిగమించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. బిస్లరీ కొనుగోలు వార్తలతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాదాపు 4 శాతం షేరు ధర ఆల్ట టైం హైకిచేరింది. సిప్లా, కోల్ ఇండియా, కోటక్ మహీంద్ర, టాదటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాల్లోనే ముగిసింది. 26 పైసలు ఎగిసిన రూపాయి 81.63 వద్ద స్థిరపడింది. -
వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో ఘనతను సొంతం చేసుకుంది. రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లోఎస్బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని తాకింది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్బీఐ షేరు 26 శాతం ఎగిసింది. ఈ లిస్ట్‌లో ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత మూడునెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది. ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి -
ఎకానమీకి ‘వాణిజ్య’ పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు మేలో రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021 మేలో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లు. సమీక్షా నెల్లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 20.55% పెరిగి (2021 మేనెల గణాంకాలతో పోల్చి) 38.94 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇక వస్తు దిగుమతుల విలువ 62.83% ఎగసి 63.22 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ఎగుమతుల రీతి.. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.65 శాతం పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో ఎగుమతులు 60.87 శాతం ఎగసి 8.54 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021 మేలో 2.96 బిలియన్ డాలర్లుంటే, తాజా సమీక్షా నెల్లో 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 17.35% పెరిగి 2.5 బి. డాలర్లకు చేరాయి. ► ఫార్మా ఎగుమతులు 10.28 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 28% పెరిగి 1.41 బి. డాలర్లకు చేరాయి. ► ముడి ఇనుము, జీడిపప్పు, హస్తకళలు, ప్లాస్టిక్స్, కార్పెట్, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. దిగుమతుల పరిస్థితి.. ► మే నెల్లో పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 102.72 శాతం ఎగసి 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి దిగుమతుల విలువ 2021 మేలో 677 మిలియన్ డాలర్లుంటే, 2022 మేలో 6 బిలియన్ డాలర్లకు చేరింది. రెండు నెలల్లో..: ఏప్రిల్–మే నెలల్లో ఎగుమతులు 25 శాతం పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇదే కాలంలో దిగుమతులు 45.42 శాతం ఎగసి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి ఆర్థిక సంవత్సరం (2022–23) రెండు నెలల్లో వాణిజ్యలోటు 44.69 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండు నెలల్లో వాణిజ్యలోటు 21.82 బిలియన్ డాలర్లు. సేవల దిగుమతుల తీరిది... ఇక వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో సేవల దిగుమతుల విలువ 45.01 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సేవల దిగుమతులు 45.52 శాతం పెరిగి 28.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
Stockmarket: రూమర్లకు చెక్,రికార్డుల జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభ మైనాయి. సెన్సెక్స్ 281 పాయింట్లుఎగిసి 52833 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభంతో 15887 వద్ద పటిష్టంగా కొన సాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్టానికి చేరాయి. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ షేర్లు, ముఖ్యంగా ఎన్ఎస్డీఎల్ అదానీ ఖాతాల ఫ్రీజ్ వార్తలతో భారీ నష్టాలను చవిచూసిన అదానీ గ్రూపు షేర్ల రికవరీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయంట్స్ ,టాటా కన్స్యూమర్, బ్రిటానియా, ఒఎన్‌జిసి, ఇండస్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ,ఎస్బీఏ లాభపడుతున్నాయి. మరోవైపు జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నష్టాలకు దారితీశాయి. చదవండి: కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం? -
రికార్డు స్థాయికి డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకుధరల సూచీ మే నెలలో రికార్డు స్థాయికి చేరింది. మండుతున్న ధరల నేపథ్యంలో మే నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 12.49 శాతం పెరిగి ఆల్‌టైం హై నమోదు చేసింది. వరుసగా ఐదో నెలలో కూడా పైకి ఎగబాకింది. ఏప్రిల్ లో ఈ సూచీ 10.49 శాతం పెరిగింది. ఇక గత ఏడాది మేలో డబ్ల్యూపీఐ మైనస్ 3.37 శాతంగా నమోదైంది. ఇంధన, విద్యుత్ బుట్టలో ద్రవ్యోల్బణం మే నెలలో 37.61 శాతానికి పెరిగింది, ఏప్రిల్‌లో ఇది 20.94 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల, ద్రవ్యోల్బణం మే నెలలో 10.83 శాతంగా ఉంది, అంతకుముందు నెలలో ఇది 9.01 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పటికీ, మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.31 శాతానికి తగ్గింది. మే నెలలో ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 23.24 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో (-) 19.72 శాతంగా ఉంది. ముడిచమురు ధరలు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫర్నేస్ వంటి మినరల్ ఆయిల్స్ తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో మే నెలలో డబ్ల్యూపీఐ రికార్డుస్థాయికి చేరిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
బ్యాంకింగ్ షైన్ : దలాల్ స్ట్రీట్‌లో లాభాల జోరు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో లాభ నష్టాల మధ్య ఊగిసలాడినా వెంటనే పుంజుకుంది. మిడ్ సెషన తరువాత మరింత ఎగిసిన సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లు జంప్ చేసింది. చివరికి సెన్సెక్స్ 359 పాయింట్లు ఎగిసి 52300 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15737వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పార్మా జోరు మార్కెట్‌కు ఊతమిచ్చింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్స్ రికార్డ్ స్థాయిలకు చేరాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, శ్రీ సిమెంట్, పవర్ గ్రిడ్, కార్పొరేషన్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిం , సిప్లా అరబిందో, లుపిన్; దివీస్, గ్లెన్‌మార్క్, బయెకాన్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు ఐటీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిసాయి. -
బ్యాంకుల జోరు, నిఫ్టీ ఆల్‌టైం హై
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఆరంభంలో తడబడినా ఆ తరువాత మరింత పుంజుకుని సరికొత్త ఆల్ టైం రికార్డును తాకింది నిఫ్టీ. నిఫ్టీ 50 ఇండెక్స్ 15,778 రికార్డు స్థాయిని తాకింది. సెన్సెక్స్ 114 పాయింట్లు ఎగిసి 52390 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 15778 వద్ద కొనసాగుతోంది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాభాలు ఈక్విటీ బెంచ్‌మార్క్‌లను ప్రభావితం చేస్తున్నాయి. ఆటో మినహా, మొత్తం 11 సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభంతో ఉంది. మీడియా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, రియాల్టీ సూచీలు కూడా ఒక్కొక్కటి 0.5-1 శాతం మధ్య పెరిగాయి. లాభాల్లో సిప్లా అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఓఎన్జీసీ. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, భారత్ పెట్రోలియం, దివిస్ ల్యాబ్స్, యుపీఎల్ లాభపడుతుండగా, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, గ్రాసిం, ఐషర్ మోటార్స్ , రిలయన్స్ నష్టపోతున్నాయి. చదవండి: Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర