ముంబై : నూతన సంవత్సరం ఆరంభంలో స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాల దిశగా దూసుకుపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్‌తో పాటు కొనుగోళ్ల జోరుతో గురువారం దేశీ సూచీలు భారీగా లాభపడ్డాయి. మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం సానుకూల చర్యలు చేపడుతుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. నిఫ్టీ రికార్డు హై క్లోజింగ్‌తో మదుపుదారుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తంమీద 320 పాయింట్లు పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 41,626 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 99 పాయింట్లు లాభపడిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,282 పాయింట్ల వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment