సాక్షి,ముంబై: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. పసిడి ధర శుక్రవారం మరో రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు రూజ56,850కి చేరుకున్నాయి. డాలర్ క్షీణత , ట్రెజరీ ఈల్డ్‌ల కారణంగా బంగారం 3 నెలల గరిష్టానికి చేరింది. నవంబర్ నుంచి ప్రారంభమైన బులియన్ ర్యాలీ మధ్య గ్యాప్ ఇచ్చినా మూడు నెలలోపే 6 వేల రూపాయలు ఎగియడం గమనార్హం.
గ్లోబల్ సంకేతాలతో భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం ధరలు ఈరోజు మరో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ఫ్యూచర్లు 0.3శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 56,850కి చేరగా, వెండి కిలోకు రూ. 68,743కి పలికింది. అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 1న దాని రెండు రోజుల సమావేశం ముగింపులో ఫెడరల్ రిజర్వ్ ద్వారా స్ట్రీట్ ఒక చిన్న 25-బేసిస్-పాయింట్ వడ్డీ రేటు మాత్రమే పెంపు ఉంటుందన్న అంచనాలతో బంగారం లాభపడుతుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 58,710 వద్ద, వెండి కిలో ధర స్వల్పంగా తగ్గి రూ. 73500 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment