నష్టాల్లోకి సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ప్రారంభమై.. సరికొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 26188 పాయింట్ల వద్ద ఆరంభమైంది ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26190, నిప్టీ 7802 గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి.
ఆతర్వాత వెంటనే గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెన్సెక్స్ , నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతోతో 26089 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 7777 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్ సీఎల్ టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విప్రో, టాటా స్టీల్, బీపీసీఎల్ కంపెనీలు లాభాల్లో, కెయిర్న్, టాటా మోటార్స్, గెయిల్, లార్సెన్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.