ఆల్ టైమ్ హైకి చేరువగా సెన్సెక్స్!
రికార్డు స్థాయిలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ వద్ద ముగిసింది. బుధవారం సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 20133 పాయింట్ల వద్ద క్లోజైంది. గతంలో 2010 నవంబర్ 5న ముగిసిన 21004 స్థాయిని అధిగమించింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 52 వారాల గరిష్టస్థాయిని నమోదు చేసింది.
భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 5.51 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, రాన్ బాక్సీ లాబ్స్, బీపీసీఎల్, హిండాల్కో కంపెనీల షేర్లు లాభపడ్డాయి. యాక్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విప్రో, సెసా స్టెర్ లైట్, ఎస్ బీఐ లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.