నూతన గరిష్ట స్థాయికి సెన్సెక్స్!
హైదరాబాద్: ఆసియా మార్కెట్లలో సానుకూలత, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్, ఆయిల్,గ్యాస్, హెల్త్ రంగాల కంపెనీల షేర్లు లాభాల పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నూతన జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 26696 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల వృద్ధి 7954 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో భెల్, టీసీఎస్, కొటాక్ మహీంద్ర, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జిందాల్ స్టీల్, హిండాల్కో, కెయిర్న్ ఇండియా, సెసా స్టెరిలైట్, అల్ట్రా టెక్ సిమెంట్స్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.