
సాక్షి, ముంబై: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టీ) వసూళ్లు రికార్డు క్రియేట్ చేశాయి. ఏప్రిల్ నెలలో జిఎస్‌టీ వసూళ్లు అత్యధికంగా 1.13 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంతకుముందు (మార్చి) నెలలో 1.06 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను బుధవారం విడుదల చేసింది.
2019 ఏప్రిల్లో మొత్తం స్థూల జీడీపీ ఆదాయం రూ .1,13,865 కోట్లు. ఇందులో సీజీఎస్‌టీ రూ 21,163 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 28,801 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టీ రూ .54,733 కోట్లు, సెస్ 9,168 కోట్లు. ఏప్రిల్ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఏప్రిల్ 30 వ తేదీ వరకు మార్చి నెలలో గరిష్ఠంగా 72.13 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.