న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని సెప్టెంబర్ నెల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సూచిస్తున్నాయి. సమీక్షా నెలలో వసూళ్ల పరిమాణం 4 శాతం వృద్ధితో (2019 ఇదే నెలతో పోల్చి) రూ.95,480 కోట్లకు ఎగసింది. 2019 సెప్టెంబర్‌లో ఈ వసూళ్లు రూ.91,916 కోట్లు. ఇక ఆగస్టులో వసూలయిన జీఎస్‌టీ వసూళ్లకన్నా సెప్టె ంబర్ వసూళ్లు 10% అధికంకావడం మరో విశేషం.
వివిధ విభాగాలను చూస్తే...
► సెప్టెంబర్ 2020 జీఎస్‌టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.17,741 కోట్లు.
► స్టేట్ జీఎస్‌టీ రూ.23,131 కోట్లు.
► ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ. 47,484 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.22,442 కోట్లుసహా).
► సెస్ రూ.7,124 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.788 కోట్లుసహా).
నెలల వారీగా చూస్తే
నెల వసూళ్లు
(రూ. కోట్లలో)
ఏప్రిల్ రూ.32,172
మే రూ.62,151
జూన్ రూ.90,917
జూలై రూ.87,422
ఆగస్టు రూ.86,449
ఆర్థిక వ్యవస్థకు ‘జీఎస్‌టీ’ ఆశా కిరణం
Published Fri, Oct 2 2020 5:14 AM | Last Updated on Fri, Oct 2 2020 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment