నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం! | Gst Revenue Collected In June 2023 Was Rs.1,61,497 Crore | Sakshi
Sakshi News home page

జూన్‌లోనూ భారీగా జీఎస్టీ వసూళ్లు..నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!

Published Sat, Jul 1 2023 7:17 PM | Last Updated on Sat, Jul 1 2023 7:39 PM

Gst Revenue Collected In June 2023 Was Rs.1,61,497 Crore - Sakshi

దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. 

ఏప్రిల్‌ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్‌లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్‌ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్‌ చేసింది. 

జూన్‌ నెలలో గ్రాస్‌ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి.

ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement