న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు డిసెంబర్‌లో 15% పెరుగుదలతో రూ.1,49,507 కోట్లకు చేరాయి. 2021 ఇదే నెలతో (రూ.1.30 లక్షల కోట్లు) పోల్చితే ఈ పెరుగుదల 15 శాతంగా నమోదయ్యింది.
తయారీ, వినియోగ రంగాల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లను అధిగమించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది వరుసగా 9వ నెల.
Comments
Please login to add a commentAdd a comment