సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు 2020 డిసెంబరు మాసంలో దుమ్మురేపాయి. కరోనా, లాక్‌డౌన్ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్న అంచనాల మధ్య జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించడం గమనార్హం. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లతో జీఎస్‌టీ ఆదాయం ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. జీఎస్‌టీ వసూళ్ళు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది మూడోసారి. గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారని ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది.
ఆర్థికమంత్రిత్వ శాఖ అందించినసమాచారం ప్రకారం డిసెంబరులో జీఎస్‌టీ ఆదాయం రూ. 15 1,15,174 కోట్లుగా నమోదైంది. ఇందులో సీజీఎస్‌టి 21,365 కోట్ల రూపాయలు, ఎస్‌జీఎస్‌టీరూ. 27,804 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 57,426 కోట్లు (దిగుమతిపై వసూలు చేసిన, 27,050 కోట్లు) సెస్, 8,579 కోట్లు (వస్తువుల దిగుమతులపై సేకరించిన 1 971 కోట్లతో సహా). నవంబరునెలకు సంబంధించి 2020 డిసెంబర్ 31 వరకు దాఖలు చేసిన జిఎస్‌టిఆర్-3 బీ రిటర్నులు మొత్తం 87 లక్షలుగా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. దేశీయ లావాదేవీలపై వచ్చిన ఆదాయాల కంటే వస్తువుల దిగుమతి వల్ల వచ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువగా ఉంది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా కోలుకోవడం, జీఎస్టీ ఎగవేతదారులపై కఠిన చర్యల వల్ల ఈ భారీ వసూళ్లు సాధ్యమైనట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment