సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల్లో ముగిసాయి. వరుసగా రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చూశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ గరిష్టస్థాయిలను తాకింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో భారీ లాభాలను కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగిసి 63284 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 18815వద్ద స్థిరపడ్డాయి.
టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, టెక్ ఎం, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పీఎన్‌బీ, బీవోబీ, ఎస్‌బీఐ లాంటి షేర్లు భారీగా లాభాలనార్జించాయి. మరోవైపు నవంబరు సేల్స్ నిరాశ పర్చడంతో ఆటో షేర్లు భారీగా నష్టపోయాయి. ఐసపీఐసీఐ బ్యాంకు, సిప్లా, యూపీఎల్, ఐషర్ మెటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 26 పైసలు లాభపడి 81.21 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment