సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఆరంభంలో తడబడినా ఆ తరువాత మరింత పుంజుకుని సరికొత్త ఆల్ టైం రికార్డును తాకింది నిఫ్టీ. నిఫ్టీ 50 ఇండెక్స్ 15,778 రికార్డు స్థాయిని తాకింది. సెన్సెక్స్ 114 పాయింట్లు ఎగిసి 52390 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 15778 వద్ద కొనసాగుతోంది. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాభాలు ఈక్విటీ బెంచ్‌మార్క్‌లను ప్రభావితం చేస్తున్నాయి. ఆటో మినహా, మొత్తం 11 సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభంతో ఉంది. మీడియా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, రియాల్టీ సూచీలు కూడా ఒక్కొక్కటి 0.5-1 శాతం మధ్య పెరిగాయి.
లాభాల్లో సిప్లా అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఓఎన్‌జీసీ. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్, భారత్ పెట్రోలియం, దివిస్ ల్యాబ్స్, యుపీఎల్ లాభపడుతుండగా, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, గ్రాసిం, ఐషర్ మోటార్స్ , రిలయన్స్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment