సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభ మైనాయి. సెన్సెక్స్ 281 పాయింట్లుఎగిసి 52833 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభంతో 15887 వద్ద పటిష్టంగా కొన సాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్టానికి చేరాయి. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ షేర్లు, ముఖ్యంగా ఎన్‌ఎస్‌డీఎల్ అదానీ ఖాతాల ఫ్రీజ్ వార్తలతో భారీ నష్టాలను చవిచూసిన అదానీ గ్రూపు షేర్ల రికవరీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయంట్స్ ,టాటా కన్స్యూమర్, బ్రిటానియా, ఒఎన్‌జిసి, ఇండస్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ,ఎస్‌బీఏ లాభపడుతున్నాయి. మరోవైపు జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ నష్టాలకు దారితీశాయి.
Comments
Please login to add a commentAdd a comment