న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు మేలో రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021 మేలో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లు. సమీక్షా నెల్లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 20.55% పెరిగి (2021 మేనెల గణాంకాలతో పోల్చి) 38.94 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇక వస్తు దిగుమతుల విలువ 62.83% ఎగసి 63.22 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
ఎగుమతుల రీతి..
► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.65 శాతం పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
► పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో ఎగుమతులు 60.87 శాతం ఎగసి 8.54 బిలియన్ డాలర్లకు చేరాయి.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021 మేలో 2.96 బిలియన్ డాలర్లుంటే, తాజా సమీక్షా నెల్లో 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి.
► రసాయనాల ఎగుమతులు 17.35% పెరిగి 2.5 బి. డాలర్లకు చేరాయి.
► ఫార్మా ఎగుమతులు 10.28 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి
► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 28% పెరిగి 1.41 బి. డాలర్లకు చేరాయి.
► ముడి ఇనుము, జీడిపప్పు, హస్తకళలు, ప్లాస్టిక్స్, కార్పెట్, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.
దిగుమతుల పరిస్థితి..
► మే నెల్లో పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 102.72 శాతం ఎగసి 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి.
► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరింది.
► పసిడి దిగుమతుల విలువ 2021 మేలో 677 మిలియన్ డాలర్లుంటే, 2022 మేలో 6 బిలియన్ డాలర్లకు చేరింది.
రెండు నెలల్లో..: ఏప్రిల్–మే నెలల్లో ఎగుమతులు 25 శాతం పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇదే కాలంలో దిగుమతులు 45.42 శాతం ఎగసి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి ఆర్థిక సంవత్సరం (2022–23) రెండు నెలల్లో వాణిజ్యలోటు 44.69 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండు నెలల్లో వాణిజ్యలోటు 21.82 బిలియన్ డాలర్లు.
సేవల దిగుమతుల తీరిది...
ఇక వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో సేవల దిగుమతుల విలువ 45.01 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సేవల దిగుమతులు 45.52 శాతం పెరిగి 28.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఎకానమీకి ‘వాణిజ్య’ పోటు
Published Thu, Jun 16 2022 6:40 AM | Last Updated on Thu, Jun 16 2022 6:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment