సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి రెండవ దశలో విస్తరిస్తున్న వేళ బంగారం ధర మరోసారి రికార్డు దిశగా పరుగు తీస్తోంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో సోమవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర 48500 రూపాయల స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పుంజుకున్న ధరలు, దేశీయస్టాక్ మార్కెట్లలో అమ్మకాలు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనం నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. గత వారం, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములు 48,589 రూపాయల వద్ద రికార్డు స్థాయిని తాకింది. అటు వెండి ధరలు కూడా స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ఫ్యూచర్స్ 0.28 శాతం పెరిగి కిలోకు రూ .49,375 వద్ద కొనసాగుతోంది. గత సెషన్ ముగింపు 49,237 రూపాయల తో పోలిస్తే వెండి ధర 49,445 వద్ద ప్రారంభమైంది.
అంతర్జాతీయంగా 0.5 శాతం పెరిగిన ఔన్స్ పసిడి ధర 1788.40 డాలర్లకు చేరుకుంది. 1779 డాలర్ల వద్ద గత వారం ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకాయి. గ్లోబల్ గా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరుపై ఆందోళన, ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంపై అనుమానాలతో బంగారం వైపు ట్రేడర్ల పెట్టుబడులు మళ్లుతున్నాయని రాయిటర్స్ నివేదించింది. ఎంసీఎక్స్ లో 48,850 వద్ద గట్టి ప్రతిఘటన, అలాగే 48,000 రూపాయల వద్ద గట్టి మద్దతు వుందని కేడియా కమోడిటీస్ డైరెక్టర్ అజయ్ కేడియా తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు సంఖ్య కోటి దాటిగా, మృతుల సంఖ్య 5 లక్షలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment