సాక్షి, న్యూఢిల్లీ: టోకుధరల సూచీ మే నెలలో రికార్డు స్థాయికి చేరింది. మండుతున్న ధరల నేపథ్యంలో మే నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 12.49 శాతం పెరిగి ఆల్టైం హై నమోదు చేసింది. వరుసగా ఐదో నెలలో కూడా పైకి ఎగబాకింది. ఏప్రిల్ లో ఈ సూచీ 10.49 శాతం పెరిగింది. ఇక గత ఏడాది మేలో డబ్ల్యూపీఐ మైనస్ 3.37 శాతంగా నమోదైంది. ఇంధన, విద్యుత్ బుట్టలో ద్రవ్యోల్బణం మే నెలలో 37.61 శాతానికి పెరిగింది, ఏప్రిల్‌లో ఇది 20.94 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల, ద్రవ్యోల్బణం మే నెలలో 10.83 శాతంగా ఉంది, అంతకుముందు నెలలో ఇది 9.01 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పటికీ, మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.31 శాతానికి తగ్గింది. మే నెలలో ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 23.24 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో (-) 19.72 శాతంగా ఉంది. ముడిచమురు ధరలు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫర్నేస్ వంటి మినరల్ ఆయిల్స్ తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో మే నెలలో డబ్ల్యూపీఐ రికార్డుస్థాయికి చేరిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment