WPI inflation
-
శాంతించిన కూరగాయలు, ఆహార ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి నెలలో స్వల్పంగా క్షీణించింది. 2024 డిసెంబర్ నెలలో 3.7 శాతంగా ఉండగా, అక్కడి నుంచి 2.31 శాతానికి దిగొచ్చింది. ఆహారోత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు శాంతించడం సానుకూలించింది. 2024 జనవరి నెలకు ఇది 0.33 శాతంగా ఉండడం గమనార్హం.విభాగాల వారీగా.. గత డిసెంబర్లో ఆహార వస్తువల ద్రవ్యోల్బణం 8.47 శాతం స్థాయిలో ఉంటే, జనవరిలో 5.88 శాతానికి శాతించింది. కూరగాయల ద్రవ్యోల్బణం 28.65 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. ఈ విభాగంలో టమాటాల ధరలు 18.9 శాతం తగ్గాయి.ఆలుగడ్డల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో 74.28 శాతంగా ఉంది. ఉల్లిగడ్డల ఆధారిత ద్రవ్యోల్బణం 28.33 శాతానికి పెరిగింది.గుడ్లు, మాంసం, చేపల విభాగంలోనూ 5.43 శాతం నుంచి 3.56 శాతానికి దిగొచ్చింది.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 3.79 శాతం నుంచి 2.78 శాతానికి చల్లబడింది.తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2.14 శాతం నుంచి 2.51 శాతానికి పెరిగింది. పెరిగే రిస్క్.. ‘‘టోకు ద్రవ్యోల్బణం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సగటున 2.4 శాతంగా ఉండొచ్చు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఇది 3 శాతానికి పెరగొచ్చు’’అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
టోకు ధరలు కూల్.. కూల్!
న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంకెల దిగువ బాటలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నడిచాయి. డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.95 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 22 నెలల కాలంలో (2021 ఫిబ్రవరిలో 4.83 శాతం) ఇంత తక్కువ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి కూరగాయలు, ఆయిల్‌సీడ్స్ ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణం గణాంకల తగ్గుదలకు కారణం. 2022 సెప్టెంబర్ వరకు వరుసగా 18 నెలలు టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైన కొనసాగింది. అక్టోబర్ నుంచి గడచిన మూడు నెలల్లో రెండంకెల దిగువకు చేరింది. డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ ధర తగ్గడం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదుకాగా, డిసెంబర్లో మరింత తగ్గి 5.72%కి (2021 డిసెంబర్‌తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి దిగి రాగా, టోకు ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయి అయిన 8.39 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలోనూ తగ్గినట్టయింది. ముఖ్యంగా ఏడాదిన్నర విరామం తర్వాత ఒక అంకెకు దిగొచ్చింది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడాన్ని గమనించాలి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి సమీక్షలో రేట్ల పెంపు ఖాయమే అని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలకు 7 శాతంలోపునకు దిగొస్తుందన్న ఆశాభావాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గత శనివారం వ్యక్తం చేయడం గమనార్హం. ముఖ్యంగా గరిష్ట పరిమితి 6 శాతంపైన 9 నెలలపాటు చలిస్తుండడంతో, ఆర్బీఐ తన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. రిటైల్ ధరలు ఇలా... ► సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉండడం గమనార్హం. ► ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికి పైన రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా పదో నెలలోనూ (ఈ ఏడాది జనవరి నుంచి) జరిగింది. ► ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 7.01గా నమోదైంది. ► కూరగాయలకు సంబంధించి 7.7 శాతానికి దిగొచ్చింది. ► ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది. ► డిసెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆర్బీఐ అంచనాగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం – 8.39 శాతం ► ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది. ► కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్‌కు 17.61 శాతానికి తగ్గింది. ► వరి, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి. ► నూనె గింజలకు సంబంధించి ద్రవ్యోల్బణం మైనస్ 5.36 శాతంగా, మినరల్స్‌కు సంబంధించి 3.86 శాతంగా ఉంది. ► ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి పరిమితం కాగా, తయారీ ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 4.42 శాతంగా ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి. గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ♦ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి. ♦ టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది. ♦ ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం. ♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది. ♦ ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది. -
టోకు ధరలు.. రికార్డ్
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధరలు 15.88 శాతం పెరిగాయన్న మాట. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, సరఫరాలపై వేసవి సంబంధ సమస్యలు, కూరగాయలు, పండ్ల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. సూచీ పెరుగుదల రెండంకెలపైన కొనసాగడం ఇది వరుసగా 14వ నెల కావడం గమనార్హం. ఇక నాలుగు నెలల నుంచి అసలు దిగువముఖం లేకుండా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే వస్తోంది. ధరల తీవ్రత నేపథ్యంలో మరోదఫా రేట్ల పెంపు ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మే తొలి వారం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కీలక విభాగాలు చూస్తే... ♦నాలుగు నెలల తర్వాత ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటింది. ఏప్రిల్‌లో 8.35 శాతం ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ సూచీ మేలో 12.34 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 10.40 శాతం చూసిన ఈ విభాగం అటు తర్వాత తగ్గుతూ వచ్చింది. కూరగాయలు (56.36 శాతం) ఆలూ (24.83%), గోధుమలు (10.55 శాతం), ప్రొటీన్ రిచ్.. గుడ్లు, మాంసం, చేపల (7.78%) ధరలు పెరిగాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం పెరక్కపోగా 20.40% తగ్గాయి. ఆయిల్ సీడ్స్ ధర 7.08 శాతం ఎగసింది. ♦ఇంధనం, పవర్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏకంగా 40.62%గా నమోదయ్యింది. క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ధర 79.50% ఎగసింది. ♦తయారీ ఉత్పత్తుల ధరలు 10.11% ఎగశాయి. రేటు పెంపు.. మెజారిటీ అంచనా కాగా, తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు పెంపు ధోరణిని కొనసాగిస్తుందని మెజారిటీ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండు ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ 60 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంచుతుందన్న అభిప్రాయాన్ని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అతితీ నాయర్ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి రెపో రేటు 100 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఇదే జరిగితే ఈ రేటు 5.9 శాతానికి చేరుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది. సమీప భవిష్యత్తులో టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిపైనే కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2022–23లో 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెరుగుతుందన్న అంచనాలనూ వెలువరించింది. -
సామాన్యుడికి మళ్లీ షాక్ !.. కారణాలు ఇవే
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం ఆర్బీఐ బోర్డును ఉద్దేశించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ లక్ష్యాలను వివరించారు. వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ బోరŠుడ్డను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి నెలకు సంబంధించి సోమవారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్) నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదుకావడం గమనార్హం. మా అంచనాలు బలమైనవే.. కానీ: శక్తికాంతదాస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం దిగువముఖంగా పయనిస్తోందని అన్నారు. తమ అంచనాలు ‘‘బలమైనవే’’, కానీ ప్రపంచ ముడిచమురు ధరల కదలికతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సంబంధిత సమస్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రాతిపదికన, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ ఒక నిర్దిష్ట శ్రేణిని ఇప్పటి వరకూ పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్ తెలిపారు. ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్ బ్యాంక్‌కు పూర్తిగా తెలుసునని దాస్ ఉద్ఘాటించారు. లోబేస్ ఎఫెక్ట్ ‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్ ఎఫెక్ట్ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్ ఎఫెక్ట్ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్ వివరించారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. కాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. వచ్చే నెలలో గ్రీన్ బాండ్లు సావరిన్ గ్రీన్ బాండ్స్ జారీపై వచ్చే నెల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రూ.11.6 లక్షల కోట్లు మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా కేంద్రం మొట్టమొదటిసారి 2022–23 వార్షిక బడ్జెట్లో ‘సావరిన్ గ్రీన్ బాండ్ల’ జారీ ప్రతిపాదన చేసింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ సానుకూల ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వినియోగించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంమని బడ్జెట్ పేర్కొంది. ఏడు నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. ధరల స్పీడ్ ఇలా... - తాజా సమీక్షా నెల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ చూస్తే ద్రవ్యోల్బణం 5.43 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.05 శాతం. - కూరగాయల ధరలు 2021 డిసెంబర్లో అసలు పెరక్కపోగా 2.99 శాతం క్షీణించాయి. అయితే 2022 జనవరిలో ఏకంగా 5.19 శాతం పెరిగాయి. - ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరల పెరుగుదల తీవ్రంగా 18.7 శాతంగా ఉంది. - తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరల పెరుగుదల డిసెంబర్లో 2.62 శాతం ఉంటే, జనవరిలో 3.39 శాతానికి ఎగశాయి. - మాంసం చేపలు ధరలు ఇదే కాలంలో 4.58 శాతం నుంచి 5.47 శాతానికి చేరాయి. - ఇంధనం–లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 10.95 శాతం ఉంటే, జనవరిలో 9.32 శాతానికి తగ్గింది. - దుస్తులు, పాదరక్షలు, రవాణా, కమ్యూనికేషన్లసహా వివిధ ఇతర విభాగాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతంపైన నమోదయ్యింది. - కాగా, డిసెంబర్ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది. టోకు ధరలు.. రెండంకెలపైనే.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశంకాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని కీలక విభాగాలు చూస్తే.. - ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ధరలు 2021 డిసెంబర్లో 9.56 శాతం పెరిగితే, 2022 జనవరిలో (సమీక్షా నెల) 10.33 శాతానికి ఎగశాయి. ఇందులో ఒక్క కూరగాయలను ధరల స్పీడ్ భారగా 31.56 శాతం నుంచి 38.45 శాతానికి చేరింది. - ఫుడ్ ఆర్టికల్స్‌లో పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, ధాన్యం నెలవారీగా పెరిగాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 9.85 శాతం ఎగశాయి. ఆలూ, ఉల్లి ధరలు మాత్రం 14.45 శాతం, 15.98 శాతం చొప్పున క్షీణించాయి. - మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ధరలు పెరిగాయి. - మొత్తం టోకు ధరల సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగానికి సంబంధించి ధరల స్పీడ్ 10.62 శాతం (2021 డిసెంబర్) నుంచి 9.42 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల స్పీడ్ డిసెంబర్లో 32.30 శాతం ఉంటే, సమీక్షా నెల జనవరిలో 32.27 శాతానికి స్వల్పంగా తగ్గింది. -
వంట నూనె ధరలు తగ్గుతున్నాయి.. ఐనా హోల్‌సేల్ ధరలు భయం వీడలేదు !
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. నిజానికి నాలుగు నెలల ఎగువముఖ ధోరణి నుంచి వెనుకడుగువేసినా, 13.56 శాతం స్థాయి కూడా తీవ్రమైనదే కావడం గమనార్హం. కాగా నవంబర్‌లో 14.23%గా నమోదయింది. 2021 ఏప్రిల్ నుంచి తొమ్మిది నెలల పాటు టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగువనే కొనసాగడం గమనార్హం. సమీక్ష నెల్లో సామాన్యునికి సంబంధించి ఆహార ధరలు తీవ్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొత్తం సూచీలో దాదాపు 20 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 9.56 శాతంగా ఉంది. నవంబర్‌లో ఇది 4.88 శాతమే. కూరగాయల ధరలు ఏకంగా 31.56 శాతం ఎగశాయి. నవంబర్‌లో ఈ రేటు 3.91 శాతంగా ఉంది. ఈ విభాగంలో పప్పులు, గోధుమలు, తృణ ధాన్యాలు, ధాన్యం ధరలు పెరగ్గా, ఆలూ, ఉల్లి, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. మరోవైపుప వంట నూనె ధరలు కూడా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే టోకు ధరల పెరుగుదల సూచీ ఇంకా రెండు అంకెల స్థాయిలో కొనసాగుతుండటం ధరల అదుపుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. -
6 నెలల కనిష్టం.. అయినా భారం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.66 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర 10.66 శాతం పెరిగిందన్నమాట. టోకు ధరల స్పీడ్ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారే అయినా... ఈ స్థాయి కూడా తీవ్రమే కావడం గమనార్హం. 2021 మార్చిలో 7.89 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ వరుసగా ఆరు నెలల్లోనూ రెండెంకల పైనే కొనసాగుతుండడం గమనార్హం. ‘‘2020 సెప్టెంబర్‌తో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో మినరల్స్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు...ఇలా కీలక ఉత్పత్తుల ధరలు అన్నీ భారీగా పెరిగాయి’’ అని తాజా ప్రకటనలో వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. 2020 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ 1.32% అయి తే, 2021 ఆగస్టులో ఈ రేటు 11.39 శాతంగా ఉంది. కొన్ని కీలక విభాగాలు ఇలా... - ఫుడ్ ఆర్టికల్స్ ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో 1.29 శాతం తగ్గితే, సెప్టెంబర్‌లో ఈ తగ్గుదల 4.69 శాతంగా ఉంది (2020 సెప్టెంబర్ నెలతో పోల్చి). కూరగాయల ధరలు తగ్గడం దీనికి కారణం. అయితే పప్పులు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 9.42 శాతం పెరిగితే, గుడ్లు, మాంసం, చేపల ధరలు 5.18 శాతం ఎగశాయి. కూరగాయల ధరలు 32.45 శాతం, ఉల్లిపాయల ధరలు 1.91%, ఆలూ ధరలు 48.95% తగ్గాయి. - విద్యుత్, ఇంధనం ధరల బాస్కెట్ సెప్టెంబర్‌లో ఏకంగా 24.91 శాతం ఎగసింది. ఆగస్టులో ఈ పెరుగుదల 26.09 శాతం. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువుల ధరలు 43.92% ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగదల రేటు 40.03 శాతం. - ఇక సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్పీడ్ 11.41%గా ఉంది. ఏప్రిల్ నుంచీ తీరిది... టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం), జూలై (11.16 శాతం), ఆగస్టు (11.39 శాతం) నెలల్లో రెండంకెల మీదే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ద్రవ్యోల్బణ పరిస్థితిపై లో బేస్ ఎఫెక్ట్ ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో రెండంకెలపైనే – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఒక్క నిత్యావసరాల విభాగంమినహా, మిగిలిన ఇంధనం, తయారీ రంగాల్లో తీవ్ర స్థాయిలోనే ద్రవ్యోల్బణం ఉంది. డిసెంబర్ వరకూ టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా పలు కీలక కమోడిటీ ధరల పెరుగుదల ఇక్కడ గమనార్హం. బేస్ వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం– జనవరి–మార్చి మధ్య టోకు ద్రవ్యోల్బణం కొంత శాంతించవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, సగటున 10% ఎగువనే టోకు ద్రవ్యోల్బణం నమోదవుతుంది. చదవండి : ఆర్బీఐ ప్రయోగం సక్సెస్.. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ డిజిటల్ చెల్లింపులు -
పెట్రో పిడుగు.. పెరిగిన హోల్‌సేల్ ధరల సూచి
పెట్రోల్ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) పెరిగింది. జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతం ఉండగా ఆగస్టుకి వచ్చే సరికి 11.39 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరమంతా డబ్ల్యూపీఐ రెండంకెలకు పైగానే నమోదు అవుతూ వస్తోంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో నెగిటివ్‌గా ద్రవ్యోల్బణం నమోదైంది, 2020 మేలో డబ్ల్యూపీఐ - 3.4 శాతంగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఆగస్టున డబ్ల్యూపీఐ నెటటీవ్ను దాటి 0.4 శాతంగా నమోదు అవగా ఏడాది తిరిగే సరికి అది 11.39 శాతానికి చేరుకుంది. ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, పెట్రో కెమికల్స్ తదితర వస్తువుల ధరల్లో హెచ్చుల వల్ల తయారీ రంగంలో ధరలు పెరుతుండగా మరోవైపు కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్‌కి సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూపీఐ, సీపీఐల మధ్య ఈ తేడా ఎప్పుడూ ఉంటుందని ఇండియా రేటింగ్ , రీసెర్చ్ చీఫ్, ప్రముఖ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. చదవండి : పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
జోరు తగ్గని స్టాక్ మార్కెట్... లాభాల్లో సూచీలు
ముంబై : ఈ వారం లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల దిశగా ప్రయాణించిన మార్కెట్ ఆ తర్వాత పుంజుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు మార్కెట్‌పై నమ్మకం చూపించడంతో పాటు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టిందంటూ వార్తలు వెలువడంతో మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణ ప్రమాదం లేదని తేలడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 55,479 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లను కోల్పోయింది. ఓ దశలో ఏకంగా 55,281 పాయింట్లకు పడిపోయింది. ఇక ఇన్వెస్టర్లకు నష్టాలు తప్పవనుకునే క్రమంలో మళ్లీ పుంజుకుంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 145 పాయింట్లు లాభపడి 55,582 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 34 పాయింట్లు లాభపడి 16,563 పాయింట్ల వద్ద ముగిసింది. టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్ సర్వీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభపడ్డాయి. మారుతి సుజూకి, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, అల్ర్టాటెక్ సిమెంట్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి -
ధరాఘాతం నుంచి ఊరట.. అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు మరో శుభవార్త ! వరుసగా రెండో నెల కూడా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) తగ్గింది. ద్రవ్యల్బణానికి ముఖ్యమైన సూచీల్లో ఒకటిగా చెప్పుకునే డబ్ల్యూపీఐ తగ్గనుండటంతో క్రమంగా ధరలు దిగివస్తాయనే ఆశలు కలుగుతున్నాయి. 2021 జులైకి సంబంధించి డబ్ల్యూపీఐ 11.12 శాతంగా నమోదు అయ్యింది. గతేడాది ఇదే నెలకు సంబంధఙంచి డబ్ల్యూపీఐ 12.07 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్రం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే ఒక శాతం పెరగాల్సి ఉండగా తగ్గింది. ఇక ఆహర ధాన్యాలకు సంబంధించి గతేడాది 6.66 శాతం ఉండగా ఈసారి అది 4.46 శాతానికి పడిపోయింది. ఫ్యూయల్, పవర్ సెక్డార్లో 32.85 శాతం నుంచి 2602 శాతానికి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. -
రికార్డు స్థాయికి డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకుధరల సూచీ మే నెలలో రికార్డు స్థాయికి చేరింది. మండుతున్న ధరల నేపథ్యంలో మే నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 12.49 శాతం పెరిగి ఆల్‌టైం హై నమోదు చేసింది. వరుసగా ఐదో నెలలో కూడా పైకి ఎగబాకింది. ఏప్రిల్ లో ఈ సూచీ 10.49 శాతం పెరిగింది. ఇక గత ఏడాది మేలో డబ్ల్యూపీఐ మైనస్ 3.37 శాతంగా నమోదైంది. ఇంధన, విద్యుత్ బుట్టలో ద్రవ్యోల్బణం మే నెలలో 37.61 శాతానికి పెరిగింది, ఏప్రిల్‌లో ఇది 20.94 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల, ద్రవ్యోల్బణం మే నెలలో 10.83 శాతంగా ఉంది, అంతకుముందు నెలలో ఇది 9.01 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పటికీ, మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.31 శాతానికి తగ్గింది. మే నెలలో ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 23.24 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో (-) 19.72 శాతంగా ఉంది. ముడిచమురు ధరలు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫర్నేస్ వంటి మినరల్ ఆయిల్స్ తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో మే నెలలో డబ్ల్యూపీఐ రికార్డుస్థాయికి చేరిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
టోకు ధరలు మైనస్‌లోకి....
హోల్‌సేల్ ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ)గణాంకాలు మేలో మైనస్‌లో నమోదయ్యాయి. అందుబాటులో ఉన్న గణాంకాలు సమీక్షించిన తర్వాత మేలో డబ్ల్యూపీఐ గణాంకాలు -3.21శాతం నమోదైనట్లు డీపీఐఐటీ తెలిపింది. ఏప్రిల్‌లో అందుబాటులో ఉన్న పరిమితి సమాచారం కారణంగా, మే గణాంకాలను మార్చి గణాంకాలతో పోల్చినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా ప్రేరేపిత్ లాక్డౌన్ నేపథ్యంలో కిందటి నెలలో ఏప్రిల్‌కు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను ప్రకటించలేదు. లాక్డౌన్ సమయంలో కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ధరల డేటాను సేకరించాలని కేంద్ర గణాంకాల శాఖ క్షేత్ర కార్యాలయాలకు సూచించింది. ఎన్నుకున్న పద్ధతుల నుండి స్వీకరించిన సమాచారం ఆధారంగా 2020 ఏప్రిల్ నెల తుది సూచిక వచ్చే నెలలో విడుదల అవుతుంది.’’ అని డీపీఐఐటీ తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణ 2.55శాతం నుంచి 1.13శాతానికి దిగివచ్చింది. ఇంధన, తయారీ ధరల ద్రవ్యోల్బణం రెండు మైనస్‌ల్లోకి వెళ్లిపోయాయి. సమాచారం లేకపోవడంతో శుక్రవారం విడుదల కావాల్సిన మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం విడుదల చేయలేకపోయింది. -
మరింత దిగజారిన టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం నవంబరు మాసానికి 0.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఆహార ధరలు కొండెక్కడంతో అక్టోబర్‌లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత దిగజారింది. కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది. ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా నష్టాల్లోకి మారింది. -
రెండేళ్ల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం మరోసారి దిగి వచ్చింది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో2.45 శాతం నుంచి 2.02 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఇది 23 నెలల కనిష్టానికి చేరింది. జూన్ 2018 లో ఇది 5.68 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.01 శాతం నుంచి 5.04 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.99 శాతం 6.98 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో 7.37శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బంణం మే నెలలోని 24.76తో పోలిస్తే..33.16 శాతానికి ఎగగిసింది. ఆహార పదార్థాలు, కూగాయల ధరలు, ఇంధన, విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం చల్లబడింది. -
22 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం 22నెలల కనిష్టానికి దిగి వచ్చింది. మే నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధనం, విద్యుత్ వస్తువుల ధరలు పడిపోవడంతో ద్రవ్యోల్బణం మే నెలలో 2.45 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ నెలలో 3.07 శాతంగా నమోదైంది. గత ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 6.99 శాతంగా ఉంది, ఏప్రిల్‌లో ఇది 7.37 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 15.89 శాతంగా నమోదైంది. కూరగాయల ద్రవ్యోల్బణం మే నెలలో 33.15 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 40.65 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.84 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం మే నెలలో 1.28 శాతంగా నమోదైంది. గత నెలలో 1.72 శాతం నమోదైంది. మరోవైపు మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.05శాతం వద్ద 7 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. -
ఆహార ధరల మంట!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.18 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలో వస్తువుల బాస్కెట్ ధర 2018 మార్చితో పోల్చిచూస్తే, 2019 మార్చి నెలలో టోకున 3.18 శాతం పెరిగిందన్నమాట. ఆహారం, ఇంధన ఉత్పత్తుల ధరల పెరుగుదలే దీనికి కారణం. సోమవారంనాడు కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.75 శాతం అయితే, ఫిబ్రవరిలో 2.93 శాతం. గత ఏడాది మార్చిలో ఈ రేటు 2.74 శాతంగా ఉంది. ►సూచీలో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూస్తే, మార్చిలో ఈ రేటు 5.68 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.28 శాతం. కూరగాయల ధరలు భారీగా 28.13 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు కేవలం 6.82 శాతం కావడం గమనార్హం. ఆలూ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. మార్చిలో ఈ పెరుగుదల శాతం కేవలం 1.3 శాతం మాత్రమే (2018 మార్చితో పోల్చి). అయితే ఫిబ్రవరిలో ఈ పెరుగుదల రేటు భారీగా 23.40 శాతం. పప్పు దినుసుల ధరల స్పీడ్ 10.63 శాతంగా నమోదయ్యింది. గోధుమకు సంబంధించి ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 5.86 శాతంగా ఉంది. ఉల్లి ధరల్లో మాత్రం అసలు పెరుగుదల లేదు. పైగా ధరలు 31.34 శాతం తగ్గాయి. పండ్లకు సంబంధించి కూడా ధరలు 7.62 శాతం తగ్గాయి. ► ఇంధనం, విద్యుత్ విభాగానికి వస్తే, టోకు ద్రవ్యోల్బణం 5.41 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.23 శాతం. డీజిల్ ధరల పెరుగుదల రేటు ఫిబ్రవరిలో 3.72 శాతం ఉంటే, మార్చిలో ఈ రేటు ఏకంగా 7.33 శాతానికి పెరిగింది. పెట్రోల్ ధరలు 1.78 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ధరలు అసలు పెరక్కపోగా 2.93 శాతం తగ్గాయి. -
3.19 శాతానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను సోమవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రామాణిక వస్తువుల ద్రవ్యోల్బణం 2. 83గా ఉంది. ఆహారేతర ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3.89గా ఉంది. అలాగే కూరగాయల నెలవారీ ప్రాతిపదికన 11శాతం పెరిగింది. మార్చి నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 28.13 శాతంగా నమోదైంది. కాగా అంతకు ముందు నెలలో ఇది 6.82 శాతంగా ఉంది. -
టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయాల్’ సెగ
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పైకి ఎగబాకిగింది. కూరగాయలు, ఇంధన ధరలు బాగా పెరగడంతో ఫిబ్రవరి నెలలోని డబ్ల్యూపీఐ ఇన్ప్లేషన 2.93 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. గత జనవరిలో 2.76 శాతంతో 10 ఏళ్ల కనిష్టానికి చేరినా ఫిబ్రవరిలో అంతే వేగంగా ఎగిసింది. జనవరిలో 1.84 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ప్రస్తుతం 3.29( వార్షిక ప్రాతిపదికన)శాతానికి చేరింది. -
పదినెలల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టానికి దిగి వచ్చింది. జనవరి నెలలో 2.76 శాతానికి పడిపోయింది. తయారీ వస్తువులు, ఇంధన ఉత్పత్తుల ధరలు ప్రభావంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. టోకుధరల ధరలు జనవరి నెలలో గత నెలతో పోలిస్తే 0.07 శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపదికన 1.84 శాతం పెరిగాయి. -
మూడు నెలల కనిస్టానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. నవంబరు నెలలో 4.64 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్ లో ఇది 5.28గా ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు దిగి రావడంతో టోకు ధరలుకూడా శాంతించాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చక్కెర, పొగాకు, రసాయన ఉత్పత్తులు, సిమెంట్, టెక్స్టైల్స్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో ఇది 4.49 శాతంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టులకు డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 64.2 శాతం వెయిటేజీ ఉంది. డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో ప్రధానమైన విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం 18.44 శాతం నుంచి 16.28 శాతానికి తగ్గింది. ఇక ఆహార ఉత్పత్తుల విభాగంలో (డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 15.3 శాతం వెయిటేజీ) ధరలు సాధారణ స్థాయి కన్నా దిగువున ఉన్నాయి. కాగా అక్టోబర్‌లో డబ్యూపీఐ ద్రవ్యోల్బణం 5.28 శాతం వద్ద నాలుగు నెలల గరిష్ట స్థాయిని నమోదయ్యింది. గతేడాది అక్టోబర్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.6, నవంబరులో 4.02 శాతంగాను ఉంది. -
దిగివచ్చిన టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టు మాసంలో కొద్దిగా శాంతించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) జూలైలో ఇది 5.09 శాతంతో పోలిస్తే ఆగస్టు నెలలో 4.53 శాతానికి తగ్గింది. జూలై నాటి నాలుగేళ్ల గరిష్టంనుంచి నాలుగు నెలల కనిష్టానికి చేరింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో 3.24శాతంగా ఉంది. శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టు 2018 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 4.04 శాతంగా నమోదైంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం గత నెలలో 1.73 శాతం నుంచి ఆగస్టు మాసంలో 0.1 శాతానికి తగ్గింది. ఇంధన, విద్యుత్ రంగాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 17.73శాతంగా నమోదైంది. 64 శాతం మెజారిటీ వాటా ఉండే ఆహార పదార్థాలు, పొగాకు, కెమికల్స్, ఔషధ ఉత్పత్తులు, టోకు ధరల సూచీ 0.3 శాతంగా నమోదైందని గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కూరగాయల ధరలు క్షీణించడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందిని తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ రేటు 1.18 శాతంగా నమోదు కాగా ఈ ఏడాది ఇదే కాలంలో ఈ ద్రవ్యోల్బణం రేటు 3.18 శాతంగా ఉంది. -
స్వల్పంగా తగ్గిన డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్‌లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి. -
నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్టానికి ఎగిసింది. కొన్ని ఆహారోత్పత్తులు, ఆయిల్ ధరలు పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో 5.77 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. మే నెలలో డబ్ల్యూపీఐ 4.43 శాతంగానే ఉండేది. 2017 జూన్‌లో అయితే కేవలం 0.90 శాతం మాత్రమే. మొత్తం టోకు ధరల సూచీల్లో ఐదో వంతు కంటే ఎక్కువ కలిగి ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ జూన్ నెలలో 5.3 శాతం పెరిగాయి. మే నెలలో ఇవి 3.16 శాతంగా మాత్రమే ఉన్నాయి. కూరగాయల ధరలు కూడా జూన్ నెలలో 8.12 శాతానికి పెరుగగా.. బంగాళదుంప ధరలు జూన్‌లో 99.02 శాతానికి ఎగిశాయి. పప్పు ధాన్యాలు ధరలు మాత్రం రివర్స్ ట్రెండ్‌లో తగ్గుతూ వస్తున్నాయి. మే నెలలో -21.13 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ధరలు, జూన్ నెలలో -20.23 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ డబ్ల్యూపీఐలో 13.15 శాతం వెయిటేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం మాత్రం మే నెలలో 11.22 శాతంగా ఉంటే, జూన్ నెలలో ఏకంగా 16.18 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు 13.90 శాతం నుంచి 17.45 శాతానికి, డీజిల్ ధరలు 17.34 శాతం నుంచి 21.63 శాతానికి ఎగిశాయి. గత వారం విడుదలైన జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5 శాతం ఎగిసింది. ఇది నాలుగు నెలల గరిష్టం. -
మరో క్రూడ్ ఆయిల్ షాక్
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణానికి క్రూడ్ ఆయిల్ షాక్ తగిలింది. హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి ఎగిసింది. మే నెలలో డబ్ల్యూపీఏ ద్రవ్యోల్బణం 4.43 శాతంగా నమోదైనట్టు తెలిసింది. ఈ ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమేనని ప్రభుత్వ డేటాలో తెలిసింది. ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.18 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.26 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 1.60 శాతంగా నమోదైందని ప్రభుత్వ డేటా పేర్కొంది. అంతకముందు నెలలో ఈ ద్రవ్యోల్బణం 0.87 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు కూడా మే నెలలో 2.51 శాతానికి పెరిగాయి. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం నెగిటివ్‌లో -0.89 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్ బాస్కట్‌లో ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 7.85 శాతంగా ఉంటే, మే నెలలో 11.22 శాతానికి పెరిగింది. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశీయంగా కూడా ఈ ధరలు పైపైకి ఎగిశాయి. దీంతో ఇంధన ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. పొటాటో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్ నెలలో 67.94 శాతంగా నమోదైతే, మే నెలలో 81.93 శాతం రికార్డైంది. ఇలా అన్ని ధరలు పెరగడంతో, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి ఎగిసినట్టు తెలిసింది. 2017 మార్చిలో డబ్ల్యూపీఐ 5.11 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. క్రూడ్ దెబ్బతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ముందుగానే ఊహించిన ఆర్బీఐ, ఇటీవల నిర్వహించిన తన పాలసీ సమీక్షలో కీలక రెపో రేటు 0.25 శాతం పెంచింది. ఏప్రిల్ నెలలో బ్యారల్‌కు 66 డాలర్లుగా ఉన్న క్రూడ్, ప్రస్తుతం 74 డాలర్లు పలుకుతోంది. -
డబ్ల్యుపీఐ డేటా: రూపాయి నష్టాల్లోకి
సాక్షి,ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం డేటా నిరాశపర్చడంతో ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. 10 గంటల సమయానికి 67.22 వద్ద కొనసాగినా..మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. 0.02పైసలు క్షీణించి 67.34 వద్ద కొనసాగుతోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 67.21 దగ్గర ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు 67.33తో పోల్చితే 0.06 శాతం బలపడింది. ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం లాంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ బలపడింది. అయితే టోకు ధరల ద్రవ్యో ల్బణం (డబ్ల్యూపీఐ) డేటా 3.18 వద్ద నాలుగునెలల గరిష్టాన్ని నమోదు చేయడంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల పోలింగ్, రేపు (మంగళవారం) కౌంటింగ్ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. -
నాలుగునెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. మార్చి నెల 2.47 శాతంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 3.18శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.6 శాతంగా ఉంది. ఆహార ధరల్లో పెరుగుదలో దీనికి దారి తీసింది. ప్రభుత్వం సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 0.67 శాతంగాఉంది. గత నెలల ఇది -0.07గా ఉండగా. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 0.87 శాతానికి పెరిగింది. గత నెలలో -0.29 శాతానికి పెరిగింది. నుంచి 0.0 శాతానికి పెరిగింది.సహజ వాయువు, ముడి పెట్రోలియం 2.4 శాతం పెరిగింది. గత నెలలో 80.2 శాతం నుంచి 82.1 శాతంగా నమోదైంది. కాగా డబ్ల్యుపీఐ మార్చి నెలలో 2.47 శాతానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎనిమిది నెలల కనిష్ట స్థాయిని తాకింది. -
శాంతించిన టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 మార్చి నెలలో స్వల్పంగా శాంతించింది. డబ్ల్యూపీఐ డేటాను గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. మార్చి నెలలో ఇది 8 నెలల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో 2.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు మార్చిలో స్వల్పంగా తగ్గి 2.47 శాతంగా నమోదైంది. జనవరిలో 2.84 శాతంగా వుండగా, గత ఏడాది మార్చినెలలో ఇది 5.11 శాతంగా ఉంది. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి పప్పుధాన్యాలు, కూరగాయలు ధరలు చల్లబడటంతో టోకుధరల ద్రవ్యోల్బణం కూడా ఆ మేరకు దిగి వచ్చింది. ఏప్రిల్ 16, 2018 న విడుదల చేసిన ప్రభుత్వ డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం గత నెలలోని 0.88 శాతంతో పోలిస్తే మార్చి నెలలో 0.29 శాతానికి దిగివచ్చింది. ప్రైమరీ ఆర్టికల్స్ 0.79 శాతం నుంచి 0.24 శాతానికి, మ్యానుఫ్యాక్చరింగ్ 3.04 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గాయి. కూరగాయల డిఫ్లేషన్ మార్చిలో 2.70 శాతంగా ఉంది. అయితే ఫ్యూయల్ అండ్ పవర్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.70శాతానికి పెరిగింది. పెరిగింది, అంతకు ముందు నెలలో ఇది 3.81 శాతంగా ఉంది. -
మరోసారి దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలో కూడా దేశీయ వార్షిక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార, ఇంధన ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఏ జనవరి నెలలో 2.84 శాతానికి పడిపోయింది. 2017 డిసెంబర్లో ఇది 3.58 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. రాయిటర్స్ పోల్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 3.25 శాతంగా నమోదవుతుందని తెలిసింది. కానీ అంచనాల కంటే తక్కువగానే ద్రవ్యోల్బణం కిందకి దిగి వచ్చింది. ముందటి నెలతో పోలిస్తే హోల్‌సేల్ ఫుడ్ ధరలు జనవరిలో ఏడాది ఏడాదికి కేవలం 1.65 శాతం మాత్రమే పెరిగాయి. అటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా చల్లబడింది. డిసెంబరు నాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరి నెలలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది. అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. -
రిటైల్ పైకి.. టోకు కిందకి
న్యూఢిల్లీ : ఓ వైపు రిటైల్ ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు పెడుతుండగా... మరోవైపు టోకు ధరల ద్రవ్యోల్బణం కాస్త శాంతించింది. డిసెంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.58 శాతానికి తగ్గినట్టు తెలిసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గత నెలలో 3.93 శాతంగా ఉన్న డబ్ల్యూపీఏ, ఈ నెలలో 3.58 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర గణాంకాల కార్యాలయం డేటాలో వెల్లడైంది. కాగ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం ఈ నెలలో ఆర్బీఐ నియంత్రిత లక్ష్యాన్ని దాటేసుకుని ఏకంగా 5.21 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే. నేడు విడుదలైన డేటాలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 4.72 శాతం తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా వార్షికంగా 56.46 శాతానికి పడిపోయింది. ఇది గత నెలలో 59.80 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు ద్రవ్యోల్బణం కూడా 1.67 శాతం క్షీణించింది. కాగ, ఇంధనం, పవర్ సెగ్మెంట్లలో టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 9.16 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.61 శాతంగా ఉంది. -
ఎనిమిది నెలల గరిష్టానికి డబ్ల్యుపిఐ
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్‌లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ నవంబరు నెలలో 3.93 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా డబ్ల్యుపిఐ ఎనిమిదినెలల గరిష్టాన్ని తాకింది. ఈ మేరకు గురువారం వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సవరించిన బేస్ సంవత్సరం 2011-12 తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) 2017 నవంబర్ నెలలో 3.93 శాతంగా నమోదైంది. గత నెలల ఇది 3.59 శాతంగా ఉంది. ఆహారధరల సూచీ ఇయర్ ఆన్ ఇయర్ 4.10 శాతం పెరిగింది. గతనెలలో నెల 3.23 శాతం పెరుగుదలను నమోదుచేసింది. -
6 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్టానికి చేరుకొంది. 2017 అక్టోబరునెలకు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 3.59 శాతంగా నమోదైంది. గత నెలలో ఇది 2.60 శాతంగా ఉంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణం అక్టోబరులో 3.59 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ సంవత్సరంతో సెప్టెంబర్ నెలలో 2.60 శాతం నుంచి 3.59 శాతానికి పెరిగింది. -
కూరగాయల ధరలు తగ్గాయి..
సాక్షి, న్యూఢిల్లీ : కూరగాయలు ధరలు పెరగడం తగ్గుముఖం పట్టడంతో టోకు ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. ఆగస్టులో నాలుగు నెలల గరిష్టానికి ఎగిసిన ఈ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో 2.60 శాతంగా నమోదైంది. ప్రభుత్వం నేడు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఆహారోత్పత్తుల ధరలు సెప్టెంబర్ నెలలో 2.04 శాతానికి తగ్గాయి. ఆగస్టులో ఇవి 5.75 శాతంగా ఉన్నాయి. ఆగస్టులో 44.91 శాతంగా ఉన్న కూరగాయల ధరలు 15.48 శాతానికి దిగొచ్చినట్టు ప్రభుత్వ డేటా తెలిపింది. అయితే ఉల్లిధరలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా పెరిగాయి. ఇవి 79.78 శాతంగా నమోదయ్యాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్పల్పంగా 2.45 శాతం నుంచి 2.72 శాతం పెరిగింది. ఇంధనం, పవర్ సెగ్మెంట్లో ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. గత రెండు నెలలుగా ఇంధన ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. పప్పులు ధరలు 24.26 శాతం, పొటాటోలు 46.52 శాతం, గోధుమలు 1.71 శాతంగా నమోదయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం అలానే ఉంది. కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఆ ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. -
వచ్చే నెలలో మోతెక్కనున్న ధరలు
న్యూఢిల్లీ : ధరలు వచ్చే నెలల్లో మరింత మోతకెక్కనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. జూలై నెలలో ఒక్కసారిగా పైకి ఎగిసిన రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం, వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. ఈ అప్‌ట్రెండ్ ఇలానే కొనసాగనుందని పేర్కొంది. దీంతో గత పాలసీ రివ్యూలో చేపట్టిన ద్రవ్య సడలింపు సన్నగిల్లనుందని చెప్పింది. జూలై నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ పైకి ఎగిసిందని, ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయంటూ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2017 జూన్‌లో 0.90 శాతంగా ఉన్న హోల్ సేల్ ద్రవ్యోల్బణం, ఒక్కసారిగా జూలై నెలలో 1.88 శాతానికి పెరిగింది. ఫుడ్ ఆర్టికల్స్ ముఖ్యంగా కూరగాయలు పెరుగుదల దీనికి దోహదం చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఈ నెలలో 2.36 శాతానికి జంప్ చేసింది. చక్కెర, పాన్, టుబాకో, మత్తుపదార్థాల ధరలు ఎగియడంతో, ఈ ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభమైంది. ఆగస్టు నెలలో సీపీఐ, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు 3.0 శాతం, 2.1 శాతానికి పెరుగుతాయని అంచనావేస్తున్నట్టు, ఆహార ధరలు, గ్లోబల్ కమోడిటీ ధరల్లో ప్రస్తుత ట్రెండ్లతో ఈ పెరుగుదలను చూడొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గిందని కీలక రెపో రేటులో 25 బేసిస్పాయింట్లు కోత పెట్టిన ఆర్బీఐ, మరోసారి రేటు కోతను చేపట్టకపోవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. ఆక్టోబర్ సమావేశంలో రేట్లను యథాతథంగా ఉంచుతూ వెయిట్ అండ్ వాచ్ పాలసీని ఎంపీసీ అవలంభిస్తుందని తెలిపింది. ఒకవేళ రేట్లను తగ్గించాలంటే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు మరింత తగ్గాలని పేర్కొంది. -
14నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : కూరగాయలు, పప్పులు, దుంపలు ధరలు జూన్ నెలలో భారీగా తగ్గాయి. దీంతో టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 14నెలల కనిష్టానికి పడిపోయింది. మే నెలలో 2.17 శాతంగా నమోదైన ఈ ద్రవ్యోల్బణం, జూన్ నెలలో 0.9 శాతానికి ఢమేల్మంది. గతేడాది జూన్‌లో కూడా ఈ ద్రవ్యోల్బణం 0.09 శాతానికి పడిపోయిన విషయం విదితమే. ఆహార ద్రవ్యోల్బణం 3.47 శాతం పడిపోయింది. పప్పులు, కూరగాయలు, దుంపల ధరలు ఎక్కువగా క్షీణించడంతో ఈ ద్రవ్యోల్బణం కిందకి పడిపోవడానికి సహకరించింది. ఇదే సమయంలో గుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 1.92 శాతానికి పెరిగింది. కాగ, మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 1.02 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. మే నెలతో పోలిస్తే, జూన్ నెలలో ఇంధనం, విద్యుత్ ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా 5.28 శాతానికి పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో తయారీ ఉత్పత్తులు 64.23 శాతం వెయిటేజీని కలిగి ఉంటాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రమే కాక, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయింది. దీంతో వచ్చే నెల ప్రారంభంలో జరుగబోయే ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రేట్ల కోతను చేపడతారని ఆశలు పెరుగుతున్నాయి. -
నాలుగు నెలల కనిష్టానికి డబ్ల్యుపీఐ
న్యూడిల్లీ: టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. ఏప్రిల్ నెల డబ్ల్యుపీఐ 3.85 శాతంగా నమోదైంది. పదార్ధాల తయారీ, వస్తువుల ధరల ధరలు చల్లబడడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఏప్రిల్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా నమోదైంది. మార్చ్‌లో ఇది 3.8 శాతంగా ఉంది. 2011-12 బేస్ ఇయర్‌గా టోకు ధరల ద్రవ్యోల్బణ కొత్త సిరీస్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 697 అంశాలను కలిగి ఉండగా, వీటిలో ప్రాథమిక వస్తువులు 117, ఇంధన మరియు శక్తికి 16, తయారీ ఉత్పత్తులు 564 ఉన్నాయి. ప్రభుత్వం నేడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 1.16 శాతంగా నమోదైంది. మార్చిలో 3.82 శాతం కన్నా తక్కువ. సీపీఐ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 0.61 శాతానికి పరిమితం అయింది. గత నెలలో ఇది 1.93 శాతంగా ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్రవ్యోల్బణం 2.54 శాతం నుంచి 1.21 శాతానికి దిగి వచ్చింది. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 15.94 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు మైనస్ 1.24 శాతం నుంచి -8.59 శాతానికి తగ్గాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 18.52 శాతంగా ఉండగా, తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.66 శాతం నమోదైంది. కొత్త సిరీస్ డేటా ప్రకారం ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్ఫ్లేషన్ 5.56 శాతం నుంచి 6.13 శాతానికి పెరిగింది. క్లోతింగ్ అండ్ ఫుట్ వేర్ ద్రవ్యోల్బణం 4.6 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా పరిమితమైంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 3.75 శాతం నుంచి 3.02 శాతానికి దిగి రావడం విశేషం. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ 4.86 శాతానికి చేరుకుంది. ఇక పాన్ అండ్ టుబాకో ఇన్ఫ్లేషన్ 6.23 శాతం నుంచి 6.05 శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో 2.7 శాతానికి తగ్గింది, అంతకు ముందు సంవత్సరం ఇది 5.5 శాతంగా ఉంది. -
5 నెలల కనిష్టానికి డబ్ల్యుపిఐ
ముంబై: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 3.15 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో -2.04శాతంతో పోలిస్తే నవంబర్ నెలలో 3.15వద్ద నిలిచిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అక్టోబర్‌లో ఇది 3.39శాతం గా ఉంది. నవంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' అధికారిక డబ్ల్యుపిఐ 0.1శాతం ఎగిసింది 183.1 (తాత్కాలిక) కు మునుపటి నెలలో 182.9 (తాత్కాలిక) నుండి పెరిగింది. ప్రాథమిక వస్తువుల సూచి 0.9 శాతం తగ్గివంది.మునుపటి నెలలో 261.8 (ప్రొవిజనల్) శాతంతో పోలిస్తే 259.4 శాతానికి తగ్గింది.తయారుచేయబడ్డ ఉత్పత్తుల సూచి నవంబర్‌లో 0.3శాతం పెరిగి157.9 గా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం నవంబరులో రెండేళ్ల కనిష్ఠానికి దిగొచ్చి 3.63 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.20 శాతం ఉంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలతో పాటు పలు ఆహార వస్తువుల ధరలు చౌకగా మారడం ఇందుకు కలిసొచ్చింది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ఠ స్థాయి. 2015 ఆగస్టులో 3.66 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. ఆ తర్వాత మళ్లీ పెరిగింది. 2015 నవంబరులో ఇది 5.41 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. -
‘మైనస్’లోనే టోకు ధరలు
- 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో ధరలు డౌన్ - మైనస్ 2.06 శాతంగా నమోదు - తదుపరి రేట్ల కోతపై పరిశ్రమల ఆశలు న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 ఫిబ్రవరితో పోల్చితే, 2015 ఫిబ్రవరిలో (వార్షికంగా) టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా క్షీణతలోకి జారింది. మైనస్ (-)2.06 శాతంగా నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయిలో ఈ రేటు నమోదుకావడం 40 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా నాలుగు నెలల నుంచీ ఇదే ధోరణి కొనసాగుతున్నట్లయ్యింది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -0.17%. డిసెంబర్లో ఈ రేటు -0.50%. జనవరిలో -0.39%. 2014 ఫిబ్రవరిలో ఈ రేటు 5.03 %. సామాన్యునికి భారమే..: ముఖ్యంగా సామాన్యునికి సంబంధించినంతవరకూ ఆహార ఉత్పత్తుల ధరల బాస్కెట్ వార్షిక సూచీ పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఈ రేటు వార్షికంగా 7.74 శాతంగా ఉంది. ఈ బాస్కెట్లో ప్రధాన ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే... కూరగాయల ధరలు వార్షికంగా 15.54%పెరిగాయి. జనవరిలో ఈ పెరుగుదల రేటు 19.74%. తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు మళ్లీ ఆశగా ఆర్బీఐ వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. కీలక రెపో రేటును మరో దఫా తగ్గించాలని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ధరల వేగం వరుసగా రెండవ నెల జనవరిలో కూడా తగ్గింది. నవంబర్‌లో 11.16 శాతం ఉన్న రేటు- డిసెంబర్లో 9.87 శాతానికి పడగా, తాజాగా జనవరిలో మరింత కిందకు దిగి 8.79 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన ఆయా నెలల్లో ధరల పెరుగుదల రేటు కిందకు తగ్గుతూ వచ్చిందన్నమాట. జనవరి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి. మొత్తంగా చూస్తే- ఆహారం, ఆల్కాహాలేతర పానీయాల ధరలు 9.9 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 6.54 శాతంగా నమోదయ్యింది. దుస్తులు, పాదరక్షలు, బెడ్డింగ్ కేటగిరీలో ఈ పెరుగుదల రేటు 9.18 శాతంగా ఉంది. నిత్యావసర వస్తువుల్లో చమురు, కొవ్వు పదార్థాలు (-0.35 శాతం), చక్కెర (-5.51 శాతం) మినహా దాదాపు అన్ని విభాగాల్లో రేట్లు పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... కాగా జనవరిలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.43 శాతంగా నమోదుకాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 8.09 శాతంగా ఉంది. డిసెంబర్లో ఈ రేట్లు వరుసగా 10.49 శాతం, 9.11 శాతంగా ఉన్నాయి. ఇదిలావుండగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేపు (14వ తేదీ శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. -
ధరల్ని తట్టుకునేదెలా?
శేఖర్‌ది ప్రైయివేటు ఉద్యోగం. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందటైతే 22 వేలు. ఏడాదికి 5-6% చొప్పున మాత్రమే పెరిగింది. కానీ ఖర్చులో..? ఇంటద్దె ఒక్కటే ఈ రెండేళ్లలో రెండువేల వరకూ పెరిగింది. మిగిలిన ఖర్చుల సంగతి చెప్పాల్సిన పనేలేదు. వీటన్నిటినీ తట్టుకోవటానికి శేఖర్ సేవింగ్స్ మొత్తం హారతైపోయాయి. పెరుగుతున్న ఖర్చుల్ని ఎలా తట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. ఒక్క శేఖర్‌దే కాదు. జీతంపై ఆధారపడేవారిలో అత్యధికులది ఇదే పరిస్థితి. పెరుగుతున్న ధరలు... అందరినీ ఇదే పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ధరల పెరుగుదలనే... సాంకేతికంగా ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటం ఎలా? దేన్లో పెట్టుబడులు పెట్టాలి? ఇదే ఈ వారం ప్రాఫిట్ కథనం... ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లు.. ధరల పెరుగుదల ఆధారంగా వీటిపై రాబడులు ఉంటాయి. నిర్దిష్ట కాలంలో నమోదైన ద్రవ్యోల్బణం కన్నా దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువ వడ్డీ వీటిపై లభిస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 10% ఉందనుకుంటే.. మీకు ఏడాదికి 11.5 శాతం మేర వడ్డీ లభిస్తుందన్న మాట. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ నేషనల్ సేవింగ్స్ సెక్యూరిటీస్ (ఐఐఎన్ఎస్ఎస్-సీ) పేరిట వీటిని అందిస్తోంది. వీటిలో పదేళ్ల కాలానికి కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇటీవలే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు గడువును మార్చి నెలాఖరుదాకా ఆర్బీఐ పొడిగించింది. వడ్డీ ఆర్నెల్లకోసారి జమవుతుంది. ఉదాహరణకు.. మీరో లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం 10 శాతంగా, వడ్డీ రేటు దానిపై 1.5% అధికంగా ఉందనుకుంటే.. ఏడాదికి మీకు రూ.11,500 రావాల్సి ఉంటుంది. అయితే, ఆర్నెల్లకోసారి వడ్డీ జమ అవుతుంది కనుక.. ఆ కాలంలో మీకు రూ. 5,750 వడ్డీ వస్తుంది. ఇది అసలుకు జమ అయి.. మొత్తం 1,05,750 అవుతుంది. ఒకవేళ, మిగతా ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం మరో అరశాతం పెరిగి 10.5 శాతానికి చేరిం దంటే.. మీకు 12 శాతం వడ్డీ వస్తుంది. అంటే..ఆ ఆరు నెలల కాలానికి రూ. 1,05,750 పైన సుమారు రూ. 6,345 దాకా లభిస్తుంది. ఈ విధంగా ఏడాది తిరిగేసరికి.. రూ. 1లక్ష ఇన్వెస్ట్మెంట్ కాస్తా రూ.. 1,12,095కి పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి ఉన్న లింకుతో వీటిపై వడ్డీ రేటు కూడా మారుతుంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గితే దానికి అనుగుణంగా వడ్డీ రేటూ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం సున్నా స్థాయి కన్నా కిందికి (డిఫ్లేషన్) పడిపోతే కనీసం 1.5% వడ్డీ లభిస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ బాండ్ల విషయంలో నిర్దిష్ట గడువులోగా వైదొలగాలనుకుంటే కొంత పెనాల్టీ పడుతుంది. ఈ బాండ్లను తనఖా పెట్టి రుణాలూ తీసుకోవచ్చు. ఈ బాండ్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. పన్నుపరమైన ప్రయోజనాలను చూస్తే.. అధికాదాయ వర్గాల కన్నా సాధారణ ఆదాయ వర్గాలకు (10, 20% పన్ను పరిధిలోని వారు) ఇది ఉపయోగకరంగా ఉంటుందని ట్యాక్సేషన్ నిపుణుల మాట. ఇటీవలే ఎల్అండ్టీ వంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లను జారీ చేశాయి. షేర్లు..మ్యూచువల్ ఫండ్లు.. ద్రవ్యోల్బణం బారి నుంచి తప్పించుకునేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం కొంత ఉపకరిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లకు కొలమానమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ గడిచిన పదేళ్లలో సగటున 16 శాతం మేర రాబడులిచ్చింది. ఇక ద్రవ్యోల్బణం ఈ పదేళ్లలో సగటున 7 శాతం మేర పెరిగింది. ఈక్విటీల్లో కనీసం మూడేళ్లు అంతకన్నా ఎక్కువ కాలమే ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే వాటిపై కాస్తో కూస్తో అవగాహన తప్పనిసరి. మార్కెట్లు, ఆయా కంపెనీల పనితీరు, వాటిని ప్రభావితం చేసే అంశాల వంటివి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వద్దని భావించేవారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలోనూ నెలకింత చొప్పున పెట్టేలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ఎంచుకోవచ్చు. ఫండ్స్‌ను ఎంచుకునేటప్పుడు వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ స్కీములను ఎంచుకోవడం మంచిది. ప్రతికూల రిటర్న్‌లు..! బ్యాంకు డిపాజిట్లలో రిస్కనేది ఉండదు. చాలా సేఫ్. కానీ వీటిపై వచ్చే రాబడులు ద్రవ్యోల్బణం బారి నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ గరిష్టంగా 9% దాకా ఉండగా... ద్రవ్యోల్బణం 10 శాతాన్ని దాటుతోంది. మనకు 9 రూపాయలు వడ్డీ వస్తే ఇతరత్రా ధరల పెరుగుదల రూ.10 దాకా ఉందన్న మాట. మరో రూపాయి మన సేవింగ్స్ నుంచి పెట్టాలి. వీటికితోడు వడ్డీపై ఆదాయపు పన్ను కూడా ఉంటుంది. మరో ప్రధాన విషయమేంటంటే ఈ ద్రవ్యోల్బణంలో ఇంటద్దె, స్కూల్ ఫీజు వంటివి ఉండవు. వాటి పెరుగుదల ఈ ద్రవ్యోల్బణానికి రెట్టంపు ఉంటుందనటం అతిశయోక్తి కాదు. అందుకని కాస్తో కూస్తో రిస్కున్నా ఇతర సాధనాల వైపు చూడక తప్పదు. బంగారం.. రియల్టీ పెట్టుబడుల విషయంలో మన దగ్గర బంగారం, రియల్ ఎస్టేట్‌కి ఉన్నంత క్రేజ్ మరో సాధనానికి లేదనడం అతిశయోక్తి లేదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ఇవి కూడా మంచి సాధనాలే. అయితే, ఇతర సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో ఒక్కసారిగా పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో పసిడి, రియల్టీ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో మీ పోర్ట్‌ఫోలియోలో ఈ రెండింటికీ ఒక మోస్తరు నిధులు కేటాయిస్తే మంచిదే. చివరిగా ఒక్క విషయం.. ఏ సాధనంలోనైనా అంతర్గతంగా కొన్ని రిస్కులుంటాయి. ఎందులోనైనా డబ్బు పెడితే ఒకోసారి వంద రెట్లు పైగా లాభాలూ రావొచ్చు.. కొన్ని సార్లు అసలు రాకపోనూవచ్చు. అధిక రాబడులు కోరుకున్న పక్షంలో అధిక రిస్కులూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. -
శాంతించిన టోకు ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్ నెలలో తగ్గింది. 5 నెలల కనిష్ట స్థాయిలో 6.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 డిసెంబర్‌తో పోల్చితే 2013 డిసెంబర్లో టోకు ధరల వేగం 6.16 శాతమన్నమాట. నవంబర్‌లో ఈ రేటు 14 నెలల గరిష్టం 7.52 శాతంగా ఉంది. రేట్ల కోతపై అంచనాలు! డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి (నవంబర్‌లో 11.16%)తగ్గడంతోపాటు, ఇప్పుడు టోకు ద్రవ్యోల్బణం కూడా కొంత తగ్గడంతో జనవరి 28న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయం తీసుకోవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి క్షీణత(ఐఐపీ నవంబర్‌లో మైనస్ 2.1%), అదుపులోకి వచ్చిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) వంటి అంశాలు వడ్డీరేట్ల కోతకు వీలు కల్పిస్తుందనేది వారి వాదన. ప్రస్తుత పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. అయితే ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను తీసుకుంటే ఇప్పటికీ వాటి ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని, ఈ దృష్ట్యా రేట్ల కోత ఉండకపోవచ్చన్నది మరికొందరి నిపుణుల అంచనా. నిత్యావసరాల ధరల తీరు ఇలా... సూచీ మొత్తంలో 14.34 శాతం వాటా కలిగిన నిత్యావసర ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదిక డిసెంబర్లో 13.68 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ శాతం 19.93 శాతం. కూరగాయల ధరల పెరుగుదల రేటు 57.33 శాతం కాగా, నవంబర్‌లో ఈ రేటు 95.25 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు తగ్గడం మొత్తం కూరగాయల విభాగానికి కలసొచ్చిన అంశం. ఉల్లికి సంబంధించి ద్రవ్యోల్బణం 190.34 శాతం నుంచి 39.56 శాతానికి దిగివచ్చింది. అయితే ఆలూ ధర మాత్రం పెరిగింది. నవంబర్‌లో ఈ రేటు 26.71 శాతం కాగా, 54.65 శాతానికి ఎగసింది. పండ్ల ధరలు 9.07 శాతం పెరిగాయి. మొత్తం సూచీలో దాదాపు 64% వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం డిసెంబర్లో 2.64% వద్ద స్థిరంగా(నవంబర్‌లో 2.64%) ఉంది. -
ధరలు దిగొస్తాయ్: మాయారామ్
న్యూఢిల్లీ: వచ్చే కొద్దినెలల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. అయితే, నిత్యావసరాల ధరలకు దీర్ఘకాలంలో కళ్లెంవేయాలంటే డిమాండ్-సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిం చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ద్రవ్యోల్బణం ఇబ్బందికరంగా మారింది. అయితే, సమీప భవిష్యత్తులో ఇది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మరింత తగ్గించాలంటే మాత్రం ఉత్పత్తి పెంపు, కూరగాయలు ఇతరత్రా సరుకుల రవాణాను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాల్సిందే’ అని మాయారామ్ పేర్కొన్నారు. నవంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం రేటు రెండంకెల స్థాయిలోనే కొనసాగుతూ 9 నెలల గరిష్ట స్థాయికి(9.52%) ఎగబాకిన సంగతి తెలిసిందే. క్యాడ్ 50 బిలియన్ డాలర్లలోపే: బంగారం దిగుమతులు భారీగా దిగిరావడం, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 50 బిలియన్ డాలర్లలోపే ఉండొచ్చని మాయారామ్ అంచనావేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం- 88.2 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లడం విదితమే. -
మరో పావుశాతం రెపో పెంపు!
ముంబై: బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పావుశాతం పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ (బీఆఫ్ఏఎంఎల్) అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యే యంగా డిసెంబర్ 18 మధ్యంతర పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంటుందని మిరిల్ లించ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెపోను రెండు దఫాలుగా 0.5% పెంచారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది: కాగా ప్రస్తుతం 7 స్థాయిలో ఉన్న టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2014 ద్వితీయార్థంలో 5 శాతం దిగువకు పడే అవకాశం ఉందని కూడా ఫారిన్ బ్రోకరేజ్ బ్యాంక్ అంచనావేసింది. ఇందుకు సైతం తగిన వర్షపాతం సహకరించాల్సి ఉంటుందని పేర్కొంది. 60-65 శ్రేణిలో రూపాయి: బ్యాంకులు విదేశాల నుంచి నేరుగా డాలర్లను ఆకర్షించడానికి ఉద్దేశించిన స్వాప్ సదుపాయం నేపథ్యంలో భారత కరెన్సీ విలువ అమెరికా డాలర్ మారకంలో 60 నుంచి 65 శ్రేణిలో స్థిరపడుతుందని బ్యాంక్ అంచనావేసింది.