సాక్షి, న్యూఢిల్లీ : కూరగాయలు ధరలు పెరగడం తగ్గుముఖం పట్టడంతో టోకు ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. ఆగస్టులో నాలుగు నెలల గరిష్టానికి ఎగిసిన ఈ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో 2.60 శాతంగా నమోదైంది. ప్రభుత్వం నేడు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఆహారోత్పత్తుల ధరలు సెప్టెంబర్ నెలలో 2.04 శాతానికి తగ్గాయి. ఆగస్టులో ఇవి 5.75 శాతంగా ఉన్నాయి. ఆగస్టులో 44.91 శాతంగా ఉన్న కూరగాయల ధరలు 15.48 శాతానికి దిగొచ్చినట్టు ప్రభుత్వ డేటా తెలిపింది. అయితే ఉల్లిధరలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా పెరిగాయి. ఇవి 79.78 శాతంగా నమోదయ్యాయి.
తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్పల్పంగా 2.45 శాతం నుంచి 2.72 శాతం పెరిగింది. ఇంధనం, పవర్ సెగ్మెంట్‌లో ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. గత రెండు నెలలుగా ఇంధన ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. పప్పులు ధరలు 24.26 శాతం, పొటాటోలు 46.52 శాతం, గోధుమలు 1.71 శాతంగా నమోదయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం అలానే ఉంది. కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఆ ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment