vegetable prices
-
వెజి‘ట్రబుల్’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్, సరఫరాలో అంతరం ఏటికేడు పెరుగుతోంది. అవసరమైన కూరగాయల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, మధ్య దళారుల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజావి కాకుండా నిల్వ కూరగాయలే జనానికి అందుతున్నాయి. కూరగాయల సాగులో సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పట్టణ ప్రాంతాలు విస్తరించడం, శివారు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతోపాటు సాగునీటి వసతి పెరిగి రైతులు వరి సాగువైపు దృష్టిపెట్టడం వంటివి కూరగాయల సాగు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పదేళ్లలో 80శాతం తగ్గిపోయి.. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ఈసారి ఖరీఫ్‌లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలే. మిగతా అంతా వరి, పత్తి వంటి పంటలే. ఉద్యాన పంటల్లోనూ పండ్ల తోటలు 4 లక్షల ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల సాగు 3 లక్షల ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2 లక్షల ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ లక్ష ఎకరాల్లో, పూలు, ఇతర వాణిజ్యపర ఉద్యాన పంటలు కలిపి లక్షన్నర ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల జనాభాకు అవసరమైన కూరగాయల సాగు జరుగుతున్నది కేవలం 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే. నిజానికి 2013–14లో తెలంగాణలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. తర్వాతి నుంచి ఏటా తగ్గిపోతూ వచ్చింది. ఈసారి 1.13 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే పదేళ్లలో 4.33 లక్షల ఎకరాల మేర (80శాతం) కూరగాయల సాగు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ కూరగాయలనే జనం వాడాల్సి వస్తోంది. కూరగాయల సాగులో రాష్ట్రం దేశంలో 15 స్థానానికి, ఉత్పత్తిలో 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఏటా 40 లక్షల టన్నులు అవసరం రాష్ట్ర జనాభా వినియోగం కోసం ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. హార్టికల్చర్ విభాగం లెక్కల ప్రకారం 1.13 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు 21 లక్షల టన్నులు మాత్రమే. ఇందులోనూ వంకాయ, టమాటాలను అవసరానికి మించి పండిస్తున్నారు. పచ్చి మిర్చితో పాటు బెండ, దొండ, ఉల్లి, బంగాళాదుంప, చిక్కుడు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్‌తోపాటు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చు కారణంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోత్సాహకాలు, నిల్వ సదుపాయాలు లేక.. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కొరత, పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు కూలీల ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం కూడా కూరగాయల సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గడానికి కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తెలంగాణలో కూరగాయల సాగు తగ్గిపోగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. భూగర్భ జలాలు, సాగునీటి సదుపాయాలు పెరగడం దీనికి కారణం. ఈ ఏడాది వానకాలం సీజన్లో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 44 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. యాసంగిలోనూ 60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీనితోపాటు మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. కూరగాయల సాగు మరింతగా క్షీణిస్తోంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఖమ్మం పరిధిలో సీతారామ ప్రాజెక్టు వంటివి అందుబాటులోకి వచ్చాక... రాష్ట్రంలో వరితో పాటు కూరగాయల సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావించారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. కూరగాయలు ఎక్కువగా పండించే.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా సాగు తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లో తగ్గిన కూరగాయల వినియోగం హైదరాబాద్‌లో కూరగాయల వినియోగంపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున నెలకు ఒక్కొక్కరు 8.08 కిలోల కూరగాయలు(ఉల్లిపాయలతో కలిపి) వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే రోజుకు 269 గ్రాములు అన్నమాట. దేశ సగటు కంటే ఇది 56 గ్రాములు తక్కువ. మన దేశ పరిస్థితుల మేరకు.. ప్రతి ఒక్కరూ రోజుకు 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 2,006 టన్నులు అంటే నెలకు 60,182 టన్నులు, ఏడాదికి 7,22,186 టన్నుల కూరగాయలు అవసరమని అంచనా. కానీ ఏటా హైదరాబాద్‌కు 6 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నట్టు అంచనా. ఇందులోనూ 80శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. సరిపడా కూరగాయలు రాకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు, కూలీల సమస్యతో.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడుల ఖర్చు, ఎక్కువ శ్రమ, పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు నీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వరి పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. – ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తగా సాగు చేసేవారే లేరు పట్టణీకరణతో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కొత్తగా కూరగాయల సాగుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి లభ్యత, మద్దతు ధరతో కొనుగోళ్లతో రైతులంతా వరివైపు చూస్తున్నారు. – కె.వేణుగోపాల్, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబ్‌నగర్ కూరగాయల సాగు ఖర్చులు బాగా పెరిగాయి కూరగాయలకు చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు మందులు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో క్రమంగా కూరగాయల సాగు తగ్గించుకుంటూ వస్తున్నాం. సూపర్ మార్కెట్లు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి టోకుగా తెప్పించుకుంటుండటంతో.. స్థానికంగా మార్కెటింగ్ సమస్య వస్తోంది. – ముత్యంరెడ్డి, రైతు, బుస్సపూర్, బాల్కొండ నియోజకవర్గం దళారీలే బాగుపడుతున్నారు.. మా గ్రామంలో ఇప్పుడు టమాటా పండిస్తున్నారు. నెల కింద టమాటా ఒక్క బాక్స్ (సుమారు 25 కిలోలు) 500 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. టమాటాలను నిల్వ చేసుకునే సదుపాయం లేదు. దళారీలు ఎంతకు అడిగితే అంతకు అమ్మడం తప్ప ఏం చేయలేం. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ నష్టమే. దళారీలు బాగుపడుతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్లో అమ్ముకునేదాకా నష్టం కలుగుతున్నప్పుడు కూరగాయల సాగు నుంచి వేరే పంటల వైపు వెళ్లక ఏం చేస్తాం? – మొగుళ్లపల్లి వెంకటరెడ్డి, ముట్పూర్, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా లాభాలపై గ్యారంటీ లేదు కూరగాయలు పండిస్తే పెట్టిన పెట్టుబడికి అదనంగా వచ్చే లాభాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు. మరోవైపు చీడపీడల బెడద. అన్నీ తట్టుకొని సాగుచేసినా.. మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న కూరగాయలతో పోటీపడలేకపోతున్నాం. మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా, కొత్తిమీర ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – సాతాళే విజయ్‌కుమార్, కూరగాయల రైతు, గుడిహత్నూర్నిలకడైన ధర లేక ఇబ్బంది అవుతోందికూరగాయలకు మార్కెట్లో నిలకడైన ధర లేకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. దగ్గరలో మార్కెట్ అందుబాటు లేక రవాణా, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. హార్టికల్చర్ శాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందడం లేదు. అందుకే ప్రస్తుతం కూరగాయలు సాగు చేయడం లేదు. – లింగారెడ్డి. రైతు, రెంజర్ల -
కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధరలకు రెక్కలు
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు. కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని హోల్‌సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.వంటనూనెలదీ ఇదే దారి... కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
సామాన్యుడి బతుకు.. పెనం నుంచి పొయ్యిలోకి..
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులు, తగ్గిన పంటల దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఏం కొనేటట్టు లేదని.. ఏం తినేటట్టు లేదని వాపోతున్నాడు. దేశవ్యాప్తంగా 14 నెలల గరిష్టానికి నిత్యావసరాల ధరలు చేరుకున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్పష్టం చేసింది. దేశంలో 70 రకాల పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 20 నుంచి 25 రకాల పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నట్లు భారత వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా దేశంలో గత పదేళ్లలో 22 రకాల సరుకుల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం లెక్కలు వేసింది. మొత్తమ్మీద సగటు వినియోగదారుడు వెచ్చాల కోసం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి. కాగా, డిసెంబర్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణంపై సమీక్షించనుందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంతమేర ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. బియ్యం ధరలకు రెక్కలు బాస్మతీయేతర తెల్లబియ్యంపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం రద్దు చేసింది. అలాగే పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఆంక్షలు ఎత్తివేయడంతో దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యం, పారా బాయిల్డ్ రైస్‌లో భారత్ వాటా 45 శాతం కాగా, ఇందులో తెలంగాణ, ఏపీలే కీలకం. రాష్ట్రంలో మేలు రకం బియ్యం ధరలు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7,500కు చేరుకున్నాయి. ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి మేలు రకాల ముడి బియ్యం ధరలు రూ.7వేల పైనే ఉన్నాయి. స్టీమ్డ్ రైస్ క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లభిస్తున్నాయి. మిల్లుల నుంచి కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల ధరలు అటు ఇటుగా ఇలాగే ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండుతున్న నూనె కేంద్ర ప్రభుత్వం ఇటీవలే క్రూడ్ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అలాగే రిఫైన్ చేసిన పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఇప్పటికే ఉన్న 12.5 శాతం సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. దీంతో మార్కెట్లో రూ.90 లోపు లభించే లీటర్ పామాయిల్ రూ.130 వరకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె ధరలు రూ.135 నుంచి రూ.150కి చేరాయి. సుంకం పెంచని వేరుశనగ, రైస్‌బ్రాన్, కుసుమ నూనె ధరలను కూడా ఆయా ఉత్పత్తి సంస్థలు విపరీతంగా పెంచడం గమనార్హం. కూర ‘గాయాలే’..! కూరగాయల ధరల్లో ఈ ఏడాది సగటున 30 శాతం వృద్ధి కనిపించింది. అందరూ రోజూ కూరల్లో తప్పకుండా వినియోగించే టమాట, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ధరలు కొంతకాలంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. నెలరోజుల క్రితం వరకు ఉల్లిగడ్డ, టమాట ధరలు ఏకంగా కిలో రూ.వందకు చేరాయి. ప్రస్తుతం ఉల్లి రూ.60 వరకు ఉండగా, టమాట ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా, ఇప్పటికీ మేలు రకం రూ.50కి తక్కువ లేదు. క్యారట్ కిలో ఏకంగా రూ.120 వరకు ఉండగా, బీట్రూట్ రూ.80, ముల్లంగి రూ. 72, చిక్కుడు రూ.100, వంకాయలు రకాన్ని బట్టి రూ. 70–90 వరకు విక్రయిస్తున్నారు. క్యాప్సికమ్ రూ.90, బెండకాయ రూ.60, బీరకాయ రూ.70, బీన్స్ రూ.70, కాకర రూ.60, దోసకాయ రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లు, రైతుబజార్లలో కొంత మేర తక్కువకు విక్రయించినప్పటికీ, చిల్లర వ్యాపారుల వద్ద ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ములక్కాడలు ఒక్కోటి రూ.20కి విక్రయిస్తుండగా, నిమ్మకాయలు కిలోకు రూ.120–140 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలూ ఆకాశంవైపే చూస్తున్నాయి. కాగా, సబ్బులు, టూత్‌పేస్ట్, షాంపూలు, కాఫీ, టీ పౌడర్, సౌందర్య వస్తువుల ధరలు కూడా మూడు నెలలుగా పెరిగినట్లు తెలుస్తోంది. -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది.వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీసాగు తగ్గడంతో బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమాటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది. ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
పంట లేకే ధరల మంట
టమాటా సెంచరీ దాటి పోయింది.. చిక్కుడు అయితే డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది.. ఐదు రూపాయలకు దొరికే కొత్తిమీర, పుదీనా కట్ట ఇప్పుడు పది, పదిహేను రూపాయలు పెట్టినా రావడం లేదు.. అదీ, ఇదీ అని ఏదీ లేదు. అన్ని కూరగాయల ధరలూ అడ్డగోలుగా పెరిగిపోయాయి.‘జేబులో డబ్బులు తీసుకెళ్లి సంచీలో కూరగాయలు తేవడం కాదు.. సంచీలో డబ్బులు తీసుకెళ్లి జేబులో కూరగాయలు పెట్టుకోవాల్సి వచ్చేట్టుంది’ అని సామాన్యుడు నిట్టూరుస్తున్న పరిస్థితి. సుమారు కోటిన్నరకుపైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరం సమీపంలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. చాలా వరకు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో.. ఏమాత్రం కొరత వచి్చనా, రేట్లు చుక్కలను తాకుతున్నాయని అంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్క్రాప్ మ్యాపింగ్ అంటే..కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు.ఒక్కసారిగా రేట్ల పరుగులుఇటీవలి వరకు కూరగాయల ధరలు కాస్త అటూఇటూగా అయినా అందుబాటులోనే ఉన్నాయి. కానీ వారం, పది రోజుల కింద ఒక్కసారిగా ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా కిలో రూ.100 దాటిపోయాయి. ఏటా ఎండాకాలం సీజన్లో కూరగాయల సాగుపై ప్రభావం ఉంటుందని, కానీ ఈసారి ఉష్ణోగ్రతలు మరీ అధికంగా నమోదవడం, వానలు జాడ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండించే ప్రాంతాల్లో సాగు సరిగా జరగలేదని, దిగుబడులు కూడా తగ్గిపోయాయని అంటున్నాయి.ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి ఎండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ధరలు అడ్డగోలుగా పెరిగాయని పేర్కొంటున్నాయి. ఇక ఎక్కువశాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం.. మన దగ్గర మిగతా సీజన్లలో పండిన కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం సమస్యగా మారిందని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే.. అటు రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ధరల నియంత్రణతో వినియోగదారులకూ లాభం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.బోయిన్పల్లి ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్లు హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. అందులో 15 శాతం వరకే తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, శామీర్‌పేట, ములుగు, గజ్వేల్, భువనగిరి, జహీరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తారు.ఎండల ఎఫెక్ట్‌తో ఏటా ఏప్రిల్, మే నెలల్లో కూరగాయల ధరలు అధికంగా ఉంటాయి. తర్వాత తగ్గుతాయి. కానీ ఈసారి ధరలు తగ్గే పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు దశలో ఉన్న కూరగాయలు ఆగస్టు నాటికి చేతికి అందుతాయని, ధరలు నియంత్రణలోకి వస్తాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు దిగుమతులు తప్పని పరిస్థితిలో ధరలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. క్రాప్ మ్యాపింగ్ చేస్తే మేలు కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు. దిగుబడులపైనే ఆధారం.. ఏటా ఏప్రిల్, మే, జూన్‌లో కూరగాయల కోసం ఎక్కువగా దిగుబడులపైనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని జిల్లాల నుంచి చాలా తక్కువగా కూరగాయలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ ధరలు ఉన్నాయి. ఆగస్టు నాటికి ధరలు తగ్గుముఖం పడతాయి. – ఎం.వెంకన్న, సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, బోయిన్పల్లి ఆకుకూరలు కూడా దొరకట్లేదు ఇప్పుడు ఆకుకూరలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పంటల దిగుబడి తగ్గింది. అందుకే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. హోల్‌సేల్‌లో కొత్తిమీర పెద్దకట్ట రూ.30, పుదీనా రూ.15కుపైగా పలుకుతున్నాయి. – ఆనంద్‌కుమార్, ఆకుకూరల వ్యాపారి, గుడిమల్కాపూర్ -
కొండెక్కిన కూరగాయలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే టమాటా మూడురెట్లు పెరగగా, మిగిలిన వాటి ధరలు 30–50 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం టమాటా కిలో రూ.65కు పైగా పలుకుతుండగా, మిర్చి ధర సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. అలాగే, అల్లం, వెల్లుల్లి డబుల్ సెంచరీ దాటాయి. ఇక అందరూ ఎక్కువగా వినియోగించే వంగ, బెండ, బీర వంటి సాధారణ కూరగాయల ధరలు సైతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.50కు పైగా పలుకుతుండడం ఆందోళన కల్గిస్తోంది. చివరికి ఆకుకూరల ధరలు సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలు వంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి.అనూహ్య పెరుగుదలపై వినియోగదారుల ఆందోళన..నిజానికి.. ఎన్నికలకు ముందు కిలో రూ.16–28 మధ్య దొరికిన టమాటా ప్రస్తుతం రూ.60–80 మధ్య పలుకుతోంది. కిలో రూ.22–30 మధ్య దొరికిన ఉల్లి సైతం నేడు రూ.40–50 మధ్య పలుకుతోంది. మదనపల్లి మార్కెట్లో సోమవారం ఒకటో రకం పది కిలోల టమాటా కనిష్ట ధర రూ.690 ఉండగా గరిష్టం రూ.800లు పలికింది. రెండో రకం కనిష్టం రూ.500 కాగా, గరిష్టం రూ.680లు చొప్పున ధర పలికింది. వచ్చే నాలుగైదు రోజుల్లో కిలో టమాటా సెంచరీ దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విజయవాడ బహిరంగ మార్కెట్లో సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే.. టమాటా రూ.60–70, మిర్చి 70, బంగాళదుంప 40–50, ఉల్లి 50, వంగ 40, బెండ 40, బీర 60–70, కాకర 60–70, క్యారెట్ 60, క్యాబేజి 40, గోరుచిక్కుళ్లు 60, సొర 20, బీట్రూట్ 40, కీరదోస 60, బీన్స్ 160–180, క్యాప్సికం రూ.100 పలుకుతున్నాయి. కానీ, బహిరంగ మార్కెట్లో ఇలా ధరలు పెరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మరోవైపు.. గత ఏడాది ఇదే రోజుల్లో ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ నెలరోజుల వ్యవధిలో ఇలా అనూహ్యంగా పెరుగుతుండడంపట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
అహనా తిండంటా !
-
ఘాటెక్కిన ఉల్లి
సాక్షి, భీమవరం: ఉల్లి ధర ఘాటెక్కింది. రిటైల్ మార్కెట్లో కేజీ ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరొందిన తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్‌నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు జరుగుతుంటాయి.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మార్కెట్లకు సైతం ఇక్కడి నుంచే ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన ధరలు అమాంతం పెరిగాయి. ఆటోలపై ఇళ్లకు వచ్చి నాసిరకం ఉల్లిని మూడు కిలోలు రూ.100కు విక్రయిస్తుండగా.. దుకాణాల వద్ద నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్మకాలు చేస్తున్నారు.రెట్టింపైన కూరగాయల ధరలు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండలు గోదావరి లంకలు, మెట్ట ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయ పంటలకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.20 ఉండే వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి, బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే క్యారెట్, బీట్రూట్, బంగాళా దుంప ధరలు నిలకడగా ఉండగా.. టమాటా రూ.20 నుంచి రూ.50కి పెరిగింది.పాత నిల్వలు వస్తేనే..ప్రస్తుతం ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికమేనని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతులు తగ్గాయని హోల్‌సేల్ వ్యాపారి సర్వేశ్వరరావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర మార్కెట్లోకి పాత నిల్వలు రానున్నట్టు అక్కడి వ్యాపారులు చెబుతున్నారన్నారు. అవి ఇక్కడి మార్కెట్‌కు చేరితే శుక్రవారం నాటికి ధరలు దిగివచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్బీఐ 2-6 శాతం పరిధితో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. -
కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!
సాక్షి, కొత్తగూడెం: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబం ఉపశమనం కలిగించింది. టమాటా ధరచూస్తే నోట మాటరాని పరిస్థితి. పచ్చిమిర్చి ముట్టుకోకుండానే మంటమండుతున్న వేళ ప్రజలెవరూ మార్కెట్ ముఖం చూడకపోవడంతో పలురకాల కూరగాయల ధరలు తగ్గించింది. ఇన్నిరోజులు ధరల దరువుతో వెలవెలబోయిన మార్కెట్లో తాజాగా వినియోగదారుల సందడి నెలకొంది. ఇల్లెందుకు చెందిన కూరగాయల వ్యాపారి యాకూబ్ కుమారులు గౌస్, జానీ, ఖాజా మానవతాదృక్పథంతో ముందుకు వచ్చి ఐదు రకాల కూరగాయల ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కిలో రూ.60 పలుకుతున్న బెండ, దొండ, సొరకాయ, వంకాయ, ఆలుగడ్డను కేవలం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గౌస్, జానీ, ఖాజా మాట్లాడుతూ కూలీలు, చిరుద్యోగులు కూరగాయలు కొనే పరిస్థితి లేకపోవడంతో తమ తండ్రి స్ఫూర్తితో లాభనష్టాలు చూసుకోకుండా ధరలు తగ్గించినట్లు తెలిపారు. -
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే!
కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ప్రధానంగా టమాట సెంచరీ కొట్టగా.. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కింది. గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాట తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ.100 హోల్‌సేల్ మార్కెట్లో కిలో నాణ్యమైన టమాట రూ. 80, రీటైల్ మార్కెట్లో కిలో రూ. 100కు మించి పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో టమాట రూ. 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి 120కి వెళ్లింది. అయితే అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు. వర్షాలతో తగ్గిన దిగుబడి దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక మార్కెట్లలో వారం క్రితం కిలో టమాట రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా..ఇప్పుడు కిలో రూ. 100కి అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ. 80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది. అటు ముంబయిలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. ఇతర కూరగాయలు కూడా టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జేబులకు చిల్లులు: ప్రజలు పెరిగిన ధరలతో కూరగాయాలు కొనలేకపోతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలు వింటేనే భయమేస్తుందని, ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి తక్కువగా చెప్పడం లేదని పేర్కొన్నారు.. పచ్చిమిర్చి, టమాటలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పులే నయం అన్న భావన కలుగుతుందంటున్నారు. రైతుల్లో సంతోషం టమాట ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషిస్తున్నారు. మార్కెట్లో 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు. 15 రోజుల క్రితం రూ.30, రూ.40 15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు. -
అక్కడున్న ధరలను కాస్త దించమని అడిగా..!
అక్కడున్న ధరలను కాస్త దించమని అడిగా..! -
హైదరాబాద్: కూరగాయలపై వర్షాల ఎఫెక్ట్.. రేట్లు మరింత పెరిగే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! రాష్ట్రంలో ఉద్ధృతంగా కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి. పుంజుకోని దిగుమతులు మార్కెట్లకు శుక్రవారం నుంచి కూరగాయల దిగుమతులు రాలేదు. రోజు వంద శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అయితే గత నాలుగైదు రోజుల నుంచి 30–50 శాతం మాత్రమే నగర హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయినట్లు మార్కెటింగ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్‌కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్ 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లిలో మార్కెట్‌కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌కు 10 వేల క్వింటాళ్ల దిగుమతులు అవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
రైతు బజార్ ధరలు
పెందుర్తి: స్థానిక రైతు బజార్లో సోమవారం నాటికి కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. బోర్డులో పెట్టిన ధర కంటే ఎక్కువకు విక్రయాలు జరిపితే వినియోగదారులు 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రకం(కిలో), ధర(రూపాయిల్లో) ఉల్లిపాయలు(పాతవి)మధ్యప్రదేశ్ 20, ఉల్లిపాయలు రైతువారి జంట పాయలు 20, టమాటా దేశవాలి/హైబ్రిడ్ 30, వంకాయలు(తెల్లవి) 28, వంకాయలు(నలుపు) 30, వంకాయలు(పొడవు) 30, వంకాయలు(కలకత్తా)/డిస్కో 26, వంకాయలు(వెల్లంకి),కాశీపట్నం 40, బెండకాయలు 36, పచ్చిమిర్చి(నలుపుసన్నాలు)శ్రీకాకుళం మిర్చి 48/ 40, బజ్జి మిర్చి/పకోడ మిర్చి 50/64, కాకరకాయలు 32, బీరకాయలు 32, ఆనపకాయలు 16, కాలీఫ్లవర్/బ్రకోలి 30/60, క్యాబేజీ(గ్రేడింగ్)/ఊదా రెడ్ క్యాబేజీ 30/32, క్యారెట్(డబల్ వాషింగ్)/వాషింగ్/మట్టి 48/36, దొండకాయలు 20, బంగాళదుంపలు పాతవి/కొత్తవి అరకు 23/25, అరటి కాయలు పెద్ద/చిన్న(ఒకటి) 7/4, మునగకాడలు(కిలో) 44, అల్లం 48, బరబాటి 46, ముల్లంగి 24, నిమ్మకాయలు 50, గోరు చిక్కుడు 36, దోసకాయలు 20, బీట్రూట్ 34, వెల్లుల్లిపాయలు(బాంబ్)/మీడియం 48/30, కొబ్బరికాయ(పెద్దది) 18, బీన్స్ పెన్సిల్/రౌండ్/పిక్కలు 84/60/70, ఆగాకర దేశవాలి/హైబ్రిడ్ 76/50, పొటల్స్ 24, కీరదోస 22, క్యాప్సికం 52, పొట్లకాయ పెద్దవి/చిన్నవి/కిలో 16/12/24, చామదుంపలు మట్టివి/కడిగినవి 38/32, చిలగడ దుంపలు 34, కంద దుంప 34, దేముడు చిక్కుడు 62, బద్ద చిక్కుడు 62, చౌచో(బెంగళూరు వంకాయలు) 20, ఉసిరికాయలు 54, కరివేపాకు 40, కొత్తిమీర 130, పుదీన(కట్ట) 5, చుక్కకూర(కట్ట) 3, పాలకూర(కట్ట) 5, మెంతికూర(కట్ట) 3, తోటకూర(కట్ట) 3, బచ్చలికూర(కట్ట) 3, గోంగూర(కట్ట) 3, తమలపాకులు(100 ఆకులు) 50, నూల్‌కోల్/రాజ్మా పిక్కలు 24/120, మామిడి కాయలు కలెక్టర్/పరియాలు/ కొలనుగోవ/ బారమస 26/ 28/46, స్వీట్ కార్న్/ మొక్కజొన్న 28/ 60/ 80, బూడిద గుమ్మడి/తీపి గుమ్మడి 22/18, కూర పెండలం 18, మామిడి పళ్లు బంగినపల్లి/రసాలు/సువర్ణరేఖ/పరియాలు/పనుకులు/కొత్తపల్లి కొబ్బరి మామిడి రూ.70/70/70/50/130, వేరుశనగ 50, పువ్వులు: చామంతి హైబ్రిడ్/దేశవాలి 400, గులాబీ 300, గులాబీ డజను 20, బంతి దండ పసుపు/ఆరెంజ్/మిక్సిడ్ 25/30, మల్లెపూలు మూర/కిలో 30/500, కనకాంబరాలు మూర/కిలో 35/1600, విరాజాజి మూర/కిలో 25/200, కాగడ మల్లె మూర/లిల్లీ కిలో 30/200, తులసి మాల మూర/నందివర్థనాలు (50పువ్వులు) 20/10, బంతి పువ్వులు కిలో 120, మందార మొగ్గలు (20) 10, పండ్లు: పైనాపిల్ కిలో/చిన్నది/పెద్దది 40/25/30, దానిమ్మ 190, నేరేడు 150, బొప్పాయి 24, ఆపిల్ (మొదటి, రెండో రకం)/రాయల్ ఆపిల్ 150/100/ 190, అరటి పండ్లు(కిలో) 40, కమలాలు క్వీన్/నాగపూర్ 100/80, సపోట 50, జామకాయలు తైవాన్/దేశీ 50/45, ద్రాక్ష సీడ్/సీడ్లెస్90/145, ద్రాక్ష తెలుపు/నలుపు(కిస్మిస్) 80/150, కివి 180, బత్తాయి 60, ఉల్లికాడలు/మోసులు 60, పుచ్చకాయలు దేశి/కిరణ్/పసుపు/కర్బుజా 15/16/24/28, పనసతొనలు కిలో 90, చింతపండు పిక్క తీసింది/పిక్కతో 380/120 , చింతచిగురు/కాయలు 65/40, గుడ్డు(ఒకటి) 5.40. -
చుక్కలనంటుతున్న కూరగాయలు.. కిలో వదిలి.. పావుకిలోతో సరి
సాక్షి, హైదరాబాద్: కూరగాయలు కోయకుండానే.. వండకుండానే కుతకుతమంటున్నాయి. రోజురోజుకూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్న కిలో రూ.50 పైమాటే. కిలో, అరకిలో కొనేవారు ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతంలో సంచితో మార్కెట్‌కు వెళ్తే రూ.100–150కి నిండేదని.. ఇప్పుడు రూ.500 పెట్టినా నిండడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. పచ్చడి.. పులుసుతో సర్దుకుంటున్నామని నిరుపేదలు వాపోతున్నారు. దిగుబడులు లేక.. స్థానికుల అవసరాలతోపాటు హైదరాబాద్ నగరవాసులకు కావాల్సిన కూరగాయలను సైతం జిల్లాలోని రైతులు పండించి రవాణా చేస్తుంటారు. ఈ ఏడాది ఏకధాటిగా కురిసిన వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీశాయి. దిగుబడులు లేక మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులు తక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 20 రోజుల నుంచి అదుపులోకి రావడం లేదు. వారం రోజుల క్రితం కాస్త తగ్గినట్లు తగ్గి మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోంది. మార్కెట్‌కు రూ.500 తీసుకుని వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవని.. ఇప్పుడు ఐదురోజులకు కూడా రావడం లేదని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మెట్రోలో మతిమరుపు రామన్నలు.. పువ్వులో పెట్టి మరీ సాగుపై వర్షాల ప్రభావం జిల్లాలో ఈఏడాది రైతులు 49,768 ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలను సాగు చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో ఎక్కువగా ఆకుకూరలు, టమాట, తీగజాతి కూరగాయలు పండిస్తే.. షాద్‌నగర్ డివిజన్లో టమాట, వంకాయ, మిర్చి, తీగజాతికూరగాయలు.. మహేశ్వరం డివిజన్లో టమాట, ఆకుకూరలు, తీగజాతికూరలు.. చేవెళ్ల డివిజన్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, టమాటను ఎక్కువగా సాగుచేశారు. విడతల వారీగా వేసిన కూరగాయలను వర్షాలు వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. దిగుబడులు వచ్చే సమయంలో.. పూత, కాత దశలో కురిసిన వానలు నిండా ముంచాయి. మరోవైపు మార్కెట్లో కూరగాయల ధరలు రెట్టింపైనప్పటికీ దిగుబడులు లేక రైతులకు నష్టాలే ఎదురయ్యాయి. కొనలేకపోతున్నాం.. కూరగాయల ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. ఏది కొనాలన్నా కిలో 50 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. కూలి పనులు చేసుకునే వారు కొనలేని పరిస్థితి. ధర పెరుగుదలతో వచ్చే కూలి ఏ మాత్రం సరిపోవడం లేదు. భారం మోయలేకపోతున్నాం. – నర్సింలు, వ్యవసాయ కూలీ, ఆలూరు దిగుబడులు తక్కువగా వస్తున్నాయి ప్రస్తుత్తం మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా దిగుబడులు లేవు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదు. ఏదైనా ఒక కూరగాయ పంట తక్కువగా ఉంటే వాటికి మాత్రమే ఎక్కువ ధర ఉండేది. మిగతా వాటికి తక్కువగానే ఉండేవి. ఇప్పుడు ఏ కూరగాయకైనా ఎక్కువ ధరలు ఉన్నాయి. – రాఘవేందర్ గుప్తా, మార్కెట్ ఏజెంట్, చేవెళ్ల మార్కెట్లో కూరగాయల ధరలు కూరగాయ పేరు (కిలోకు రూపాయల్లో..) టమాట 60–70 వంకాయ 50–60 దొండకాయ 60–70 చిక్కుడు 60–65 బెండకాయ 60–70 బీన్స్ 70–80 బీరకాయ 70–80 కాకరకాయ 50–60 పచ్చిమిర్చి 70–80 గోకరకాయ 60–70 క్యాబేజీ 50–60 ఉల్లి 40 -
రికార్డు సృష్టిస్తున్న మునక్కాయ ధరలు.. ఏకంగా..
కూరగాయల రేట్లు జనానికి వణుకు పట్టిస్తున్నాయి. శీతాకాలంలో చలితో పాటు.. ధలు పోటీ పడుతున్నాయి. కొన్నివెజిటేబుల్స్ అయితే.. నాన్ వేజ్‌తో పాటీ పడుతున్నాయి. ఇలా పలు రకాలైన కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సెంచరీ దాటిన టమాటా ధరలు ఇప్పుడిప్పుడే కొద్ది మేర తగ్గుముఖం పడుతుండగా.. తాజాగా మునక్కాయ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: శుభకార్యాల్లో మునక్కాయ చారు లేకుంటే ఏం బాగుంటుంది? అందువల్లే పెళ్లిళ్ల సీజన్ వస్తే మునగ ధర చెట్టెక్కి కూర్చుంటుంది. చిక్కబళ్లాపుర మార్కెట్లో కేజీ మునక్కాయలు రూ. 400 ధర పలుకుతున్నాయి. కానీ కొనుగోళ్లు తగ్గడం లేదు. చలి కాలం కావడం, పెళ్లిళ్లు ప్రారంభం కావడంతో మునగకు డిమాండ్ పెరిగింది. అతివృష్టి వల్ల జిల్లా చుట్టుపక్కల మునగ పంట దెబ్బతినింది. దీంతో వ్యాపారులు పూణె నుంచి తెప్పిస్తున్నారు. ఎంత ధరయినా కొనడం తప్పదని కొందరు అన్నారు. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
అదుపులోకిరాని రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడంలేదు. 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో 7.61 శాతం పెరిగిందన్నమాట. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్‌లో సూచీ 7.27 శాతంగా ఉంది. సూచీలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.68 శాతం ఉంటే, అక్టోబర్‌లో 11.07 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వార్షికంగా చూస్తే, అక్టోబర్‌లో 22.51 శాతం పెరిగాయి. వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే! రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. తగ్గుతుందన్న విశ్వాసం... అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. -
కూరగాయల ధరలు 37% అప్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.32 శాతంగా నమోదయ్యింది. ఏడు నెలల గరిష్టస్థాయి ఇది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాకాల ప్రకారం– సూచీలో దాదాపు 14 శాతం వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర భారీగా పెరిగింది. కూరగాయల ధరలు 37 శాతం పెరిగితే (2019 సెప్టెంబర్ ధరలతో పోల్చి), ఆలూ విషయంలో ద్రవ్యోల్బణం ఏకంగా 108 శాతంగా ఉంది. సూచీలోని 3 ప్రధాన విభాగాలూ ఇలా... ► మొత్తం సూచీలో 20.12%గా ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ (ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌సహా)లో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా నమోదయ్యింది. ఇందులో 14.34 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం 8.17 శాతంగా ఉంది. అయితే 4.26 శాతం వెయిటేజ్ ఉన్న నాన్ ఫుడ్ బాస్కెట్ ధర మాత్రం 0.08 శాతం తగ్గింది. ► ఇక 14.91 శాతం వెయిటేజ్ ఉన్న ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 9.54 శాతం తగ్గింది. ► 64.97 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల్లో ధరలు 1.61 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో 8.17 శాతం పెరిగితే, కూరగాయలు, ఆలూ ధరలు సామాన్యునికి భారంగా మారిన పరిస్థితి నెలకొంది. పప్పుదినుసుల ధరలు 12.53 శాతం ఎగశాయి. కాగా, ఉల్లిపాయలు (31.64%), పండ్లు (3.89%), తృణ ధాన్యాల (3.91%) ధరలు తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34%గా నమోదయ్యింది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. -
దిగుబడులు కిందకు.. ధరలు పైపైకి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వినియోగదారులకు కూరగాయలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా వాటి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ సడలింపులతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెరగడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడం..ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్లు దిగుమతి లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నా యి. వారం పదిరోజుల కిందటి ధరలతో పోల్చినా ఏకంగా రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల కనిపిస్తోంది. అనూహ్యంగా పెరుగుదల... టమాటా ధరల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల కిందటి వరకు సైతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.10 పలుకగా, ప్రస్తుతం రూ.30కి చేరింది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, సిద్దిపేట రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు టమాటా రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో బోర్ల కింద వేసిన సాగు పూర్తవ్వడం, ఇప్పుడు కొత్తగా సాగు జరుగుతున్న నేపథ్యంలో డి మాండ్ మేరకు పంట రావడం లేదని అంటున్నారు. ఇక రాష్ట్రానికి అధికంగా ఏపీలోని మదనపల్లి, కర్ణాటకలోని చిక్మగళూర్ నుంచి రోజుకు 2వేల నుంచి 3వేల క్వింటా ళ్లు దిగుమతి అవుతుండగా ..ఇప్పుడది 1,500 క్వింటాళ్లకు తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లోనే కిలో టమాటా రూ.20 వరకు పలుకుతోంది. రవాణా ఖర్చులు కలుపుకొని అమ్మే సరికి దాని ధర రూ.30–35కి చేరుతోంది. గడిచిన 4 రోజులుగా బోయిన్పల్లి మార్కెట్‌కు వచ్చిన పంటను గమనిస్తే దిగుమతుల తగ్గుదల తెలుస్తోంది. ఈ నెల 15న మార్కెట్‌కు 3,074 క్వింటాళ్లు రాగా, 16న 2,870, 17న 251 క్వింటాళ్లు రాగా 18న గురువారం కేవలం 1,313 క్వింటాళ్లు›మాత్రమే వచ్చింది. దీంతో హోల్‌సేల్ మా ర్కెట్లోనూ కిలో టమాటా 4 రోజుల కిందట రూ.15 ఉండగా, ఆ ధర ప్రస్తుతం రూ.24కు చేరింది.అది రైతుబజార్లలో రూ.25–28 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి దాని ధర రూ.30–35కి చేరింది. ఇతర కూరగాయల ధరలు పైపైకి.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్ మార్కెట్లకు లాక్డౌన్ సమయంలో రోజుకు 30–35 వేల క్వింటాళ్ల మేర అన్ని రకాల కూరగాయలు వచ్చేవి. బోయిన్పల్లి మార్కెట్‌కే 20 వేల క్వింటాళ్లకు పైగా వచ్చిన రోజులున్నాయి. ఈ నెల 15న బోయిన్పల్లి మార్కెట్‌కు అన్ని రకాల కూరగాయలు కలిపి 18,468 క్వింటాళ్ల మేర రాగా, 16న 16,471 క్వింటా ళ్లు, 17న 15,741 క్వింటాళ్లు రాగా, 18న గురువారం 10,937 క్వింటాళ్లే వచ్చింది. పది రోజుల కిందటి ధరలతో పోలిస్తే ప్రతీదానిపై రూ.20–30 వరకు పెరిగాయి. కాకర కిలో రూ.35, వంకాయ రూ.35, క్యాప్సికం రూ.70, బీన్స్ రూ.50, క్యారెట్ (బెంగళూరు) రూ.50, దొండ రూ.32–35, పచ్చిమిర్చి రూ.45, బెండ రూ.30 వరకు ఉండగా, బీరకాయ రూ.60 పలుకుతోంది. ఆలు ధర వారం కింద రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.40కి చేరింది. ఉల్లి ధరలు మాత్రం వినియోగదారులకు అందుబాటు లో ఉన్నాయి. రూ.100కు 6 నుంచి 7 కిలోల వంతున విక్రయిస్తున్నారు. పంటలసాగు మొదలవడంతో మరో 3 నెలల పా టు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. -
కొరత లేకుండా కూరగాయలు
సాక్షి, అమరావతి: కూరగాయల కొరత రాకుండా ఉద్యాన శాఖ.. వేసవి సాగు (ముందస్తు ఖరీఫ్) ప్రణాళికను ఖరారు చేసింది. ఇప్పటి నుంచే కూరగాయల సాగును చేపడితే ఆగస్టు నుంచి ఎటువంటి కొరత ఉండబోదని రైతులకు సూచించింది. ఇదే సమయంలో రైతులకు ఏయే రాయితీలు ఇవ్వచ్చో ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో 2,50,689 హెక్టార్లలో ఏడాది పొడవునా ఆకు కూరలు కాకుండా సుమారు 22 రకాల కూరగాయలు సాగవుతాయి. 77,71,620 టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఈ సీజన్ (మార్చి నుంచి జూలై వరకు)లో 8,21,650 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా కాగా అందులో ఇప్పటికే 3,75,461 టన్నులు అమ్ముడ య్యాయి. జూలై చివరిలోగా మిగతా 4,46,189 టన్నులు వస్తాయి. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే జూలై నుంచి కూరగాయల ధరలు పెరుగు తాయి. ఆగస్టు నుంచి కూరగాయల కొరత లేకుండా చూ డాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టాలి. రైతులకు ఉద్యాన శాఖ సూచనలు ► నీటి వసతి, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఉన్న రైతులు తీగజాతి కూరగా యల సాగును తక్షణమే చేపట్టాలి. ► ప్రస్తుత అంచనా ప్రకారం.. సుమారు 36 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపా రుదల వ్యవస్థ ఉంది. మల్చింగ్ (మొక్కల చుట్టూ ప్లాస్టిక్ లేదా పాలిథీన్ కవర్లతో కప్పిఉంచడాన్ని మల్చింగ్ అంటారు) పద్ధతిన కూరల సాగును చేపడితే మంచి లాభాలూ పొందొచ్చు. ► నీటి వసతి ఉన్న రైతులు తమ పొలాల్లో బెండ, వంగ, దోస జాతి కూరలు, బీర, సొర, చిక్కుడు, కాకర, ఆకుకూరల్ని ప్రణాళికా బద్ధంగా సాగు చేయాలి. ► తాత్కాలిక పందిళ్లతో కూరగాయల్ని సాగు చేసే రైతులు ప్రస్తుతం చిక్కుడు, పొట్ల వేయాలి. ► పర్మినెంట్ పందిళ్లు ఉండే రైతులు దొండ, బీర, కాకర, సొర, ఇతర తీగ జాతి కూరగాయల్ని సాగు చేయాలి. ► కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టారు. ► హైబ్రీడ్ కూరగాయల్ని సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ రాయితీ ఇస్తుంది. ► రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద 50 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తారు. ► పాలీ హౌసులు, షేడ్ నెట్స్ ఉన్న రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తారు. కరోనాతో విపత్కర పరిస్థితులు ఉండటం వల్ల ఉచితంగా మొక్కలు ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ► పర్మినెంట్ పందిళ్లు ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీపై కాకర, బీర, సొర లాంటి కూర జాతి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంది. ► రైతు భరోసా కేంద్రాల వద్ద కూరగాయల విత్తనాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఆర్కేవీవై కింద ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాల్సిందిగా ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి ప్రభుత్వానికి నివేదించారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక ఆదా యం వచ్చే పంటల్ని సాగు చేయించాలి. -
వారం రోజుల్లో సగానికి తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి సిటీబ్యూరో: గతేడాది పోలిస్తే ఈసారి అక్టోబర్ రెండో వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. పోయినసారి ఆన్ సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) నెలలో కూరగాయల ధరలు మండిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరివారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ.40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. శివారు జిల్లాల నుంచే 80 శాతం సాధరణంగా ఆన్ సీజన్లో నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. అన్ సీజన్లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చిడానికి కమిషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై అధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్తో పాటు ఇతర మార్కెట్‌కు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రల నుంచే కూరగాయల దిమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి. నిలకడగా ధరలు ఈ ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచే కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. ఇందుకు కారణం గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు అన్ని రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాల నుంచి రోజూ కూరగాయల దిగుమతులు ఉండేవి కావు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు రాని కూరగాయలను కమిషన్ ఏజెంట్లు దిగుమతి చేసేవారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో ధరలు నిలకడగా ఉండేవి కావని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయి తెలంగాణ వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై నుంచే కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ చివరి వారం నుంచే పంట చేతికొచ్చింది. ఈ కారణంగానే ఈ ఏడాది కూరగాయల ధరలుసెప్టెంబర్ నుంచి తగ్గడం ప్రారంభమయ్యాయి. –కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్ -
కూరకు ధరల దరువు
సాక్షి,సిటీబ్యూరో: మండుతున్న ఎండలతో పాటే కూరగాయల ధరలు సైతం భగ్గుమంటున్నాయిు. నగరంలో మార్కెట్లలో టమాటా కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకింది. బిన్నీస్ కిలో రూ.100 నుంచి రూ.120 మధ్య ఉంది. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. దీంతో నగరవాసులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండడతంతో ప్రజలు బంబేలెత్తి పోతున్నారు. వేసవిలో సాధారణంగా కూరగాయల దిగుబడి తక్కువగా ఉంటుంది. గతంలో తెలంగాణ జిల్లాల్లో ఉత్పత్తి లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి నగర మార్కెట్లకు అవసరమైన సరుకు దిగుమతి చేసుకునేవారు. అయితే, ప్రస్తుత వేసవి సీజన్లో ఆయా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో కూరగాయల సాగు తగ్గిపోయింది. దీంతో ఉన్న సరుకును వ్యాపారులు భారీగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. జంట నగరాలకు ప్రతిరోజుకు 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల డిమాండ్ ఉండగా ప్రస్తుతం 50 శాతం కూడా సరఫరా కావడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ పక్క నీటి కొరత, మరో పక్క ఎండల తీవ్రత పంటపై పడిందని, గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. వర్షాలు కురిస్తే గాని సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం లేదంటున్నారు. నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలతో కళకళలాడే హైదరాబాద్ మార్కెట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు పంటలు వేసే పరిస్థితి లేదు. దీంతో నగర అవసరాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. జూన్ చివరి వరకు ఇదే పరిస్థితి ప్రతి వేసవిలో కొన్నిరకాల కూరగాయల కొరత ఉంటుంది. దీంతో మార్కెట్‌కు వచ్చే అరకొర కూరగాయలకు ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈసారి మాత్రం ఇంత భారీస్థాయిలో కూరగాయల కొరత ఏర్పడుతుందని ఊహించలేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి టమాటా, బిన్నీస్, క్యాప్సికం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం వరకు నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి రోజూ 40 నుంచి 50 లారీల టమాటా దిగుమతి కాగా, ప్రస్తుతం 10 లారీలు మించడం లేదు. దీంతో బెంగళూరు, బెల్గాం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు 30 నుంచి 35 లారీల టమాటా దిగుమతి చేస్తున్నారు. బిన్నీస్ నెల రోజుల క్రితం రోజుకు 2 నుంచి 4 టన్నులు దిగుమతి కాగా, ప్రస్తుతం టన్నుకు మించి రావడం లేదు. దీంతో వీటి ధరలు విపరీతంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. చిక్కుడుకాయ కూడా మార్కెట్లో కనిపించడం లేదు. ప్రస్తుత ఆఫ్ సీజన్లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండవు. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే కొనాల్సి వస్తోంది. సాగు లేకే అధిక ధరలు ఏప్రిల్ నుంచి నగర శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. మే నెలలో డిమాండ్ ఉన్నా సరఫరా 30 శాతం మించదు. సాధారణంగా వేసవిలో ఎండలు కారణంగా తోటలకు నీరు అందదు. దీంతో కూరగాయల సాగు అంతగా ఉండదు. నగర కూరగాయల అవసరాలు తీర్చాడానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తున్నాం. టమాటా ధరలను నియత్రించడానికి ఢిల్లీ నుంచి దిగుమతి చేసేందుకు ప్రణాళిక చేశాం.– కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
సామాన్యులకు ధరాఘాతం
సాక్షి, అమరావతి: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్న వినియోగదారులకు వాటి ధరలు చూసి గుండెల్లో దడ పుడుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కూరగాయల ధరలపై నియంత్రణ కూడా లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడం పరిపాటేనంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే, ఆ మేరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కూరగాయల రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు కలిపి మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నారు. రాయితీ ధరలకు అందించాల్సి ఉన్నా.. సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతుబజార్లలోప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీ ధరలకు అందించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే, విజయవాడ హైస్కూలు రోడ్డులో ఉన్న రైతుబజార్లో పట్టికలో తక్కువ ధర చూపుతూ ఎక్కువ ధర వసూలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్లలో రైతులకు బదులుగా ఎక్కువ మంది వ్యాపారులే తిష్టవేసి ఉంటున్నారు. టమోట, పచ్చి మిర్చి తదితరాలను రైతుబజార్లో విక్రయించకుండా అక్కడే బయట రోడ్డు పక్కన అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. ‘అవసరమైతే తీసుకోండి.. లేకపోతే పోండి’ అంటూ అక్కడి వ్యాపారులు కసిరికొడుతున్నారు. టమోట, పచ్చి మిర్చి, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని కూరగాయలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. 10 రోజుల కిందట విజయవాడ రైతుబజార్లో కిలో రూ.15 ఉన్న టమోట ప్రస్తుతం రూ.32కు, పచ్చి మిర్చి రూ.20 నుంచి రూ.40కు, క్యారెట్ రూ.12 నుంచి రూ.34కు పెరిగింది. ఇలా ఏ కూరగాయలు ముట్టుకున్నా రెట్టింపు ధర పలుకుతూ షాక్ కొడుతున్నాయి. అధికారుల వాదన ఇలా.. అధికారుల వాదన మరోలా ఉంది. స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటం వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రైతుబజార్ ధరల కంటే కనీసంగా కిలోకు రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా బయట మార్కెట్లో, చిల్లర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వన్‌టౌన్ కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు టన్నుల్లో కూరగాయలు తెస్తుంటారు. ఇక్కడ రైతుబజార్ లేదు. దీంతో బహిరంగ మార్కెట్లోని ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేక, పచ్చడి మెతుకులు తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు ఉండే కుటుంబం నాలుగు రకాల కూరగాయలను కొనుగోలు చేయాలంటే వారానికి రూ.300పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దండుకుంటున్న దళారులు, వ్యాపారులు దళారులు, వ్యాపారులు భారీగా దండుకుంటున్నా పండించిన రైతుకు మాత్రం కనీస ధర కూడా లభించడం లేదు. వేసవి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోయినా ఎన్నో తిప్పలు పడి సాగు చేసిన రైతుకు రిక్తహస్తమే ఎదురవుతోంది. అయితే, సాగునీటి సమస్యతో చాలా మంది రైతులు కూరగాయలను సాగు చేయడం లేదని, దీంతో ఏటా వేసవిలో ధరలు పెరుగుతున్నాయని రైతుబజార్‌లోని కయదారులు అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రోజూ కూలికి పోతేగాని పూట గడవనివారు 15 రోజులుగా మార్కెట్‌కు వెళ్లడమే మానేశారని నారాయణమ్మ అనే మహిళ వెల్లడించింది. రైతుబజార్లలో ఉన్న ధరల పట్టికల్లో చూపుతున్న ధరలకు, విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు. -
కొనలేం..తినలేం..
ప్రకాశం, పుల్లలచెరువు: మండే ఎండలకు తోడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఒక్కో కూరగాయల ధర ఒకటికి మూడు రెట్లు పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలను సామాన్యుడి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఏ కూరగాయ కొనాలన్నా కొండెక్కి కూర్చోవడంతో ప్రజలకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేం, తినలేం అంటూ సామాన్య మధ్య తరగతి ప్రజలు నిట్టూరుస్తున్నారు. బీన్స్ రూ.150..మిర్చి రూ.80 కూరగాయల ధరలు మార్కెట్లో చుక్కలనంటుతున్నాయి. గతంలో ఎన్నుడో లేని విధంగా బీన్స్ కిలో రూ.150 పలుకుతోంది. ఊహించని విధంగా ఈ వారంలోనే కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతి సంచి కూరగాయలతో నిండాలంటే రూ.300–400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇంతటి ధరలు ఎప్పుడూ చూడలేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. రైతులకు అందని గిట్టుబాటు ధర మార్కెట్లో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నా తమకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడంం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ల ఖర్చులు పోను మిగిలేది నామమాత్రమే అని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. సామాన్యులు ఎలా బతకాలి ఎండలతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు పెరిగిపోతుంటే సామాన్యులు ఎం కొనాలి. ఈ ధరలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు పచ్చిడి మెతుకులే గతి.లూదియా,గృహణి,పుల్లలచెరువు. -
ఆహార ధరల మంట!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.18 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలో వస్తువుల బాస్కెట్ ధర 2018 మార్చితో పోల్చిచూస్తే, 2019 మార్చి నెలలో టోకున 3.18 శాతం పెరిగిందన్నమాట. ఆహారం, ఇంధన ఉత్పత్తుల ధరల పెరుగుదలే దీనికి కారణం. సోమవారంనాడు కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.75 శాతం అయితే, ఫిబ్రవరిలో 2.93 శాతం. గత ఏడాది మార్చిలో ఈ రేటు 2.74 శాతంగా ఉంది. ►సూచీలో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూస్తే, మార్చిలో ఈ రేటు 5.68 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.28 శాతం. కూరగాయల ధరలు భారీగా 28.13 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు కేవలం 6.82 శాతం కావడం గమనార్హం. ఆలూ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. మార్చిలో ఈ పెరుగుదల శాతం కేవలం 1.3 శాతం మాత్రమే (2018 మార్చితో పోల్చి). అయితే ఫిబ్రవరిలో ఈ పెరుగుదల రేటు భారీగా 23.40 శాతం. పప్పు దినుసుల ధరల స్పీడ్ 10.63 శాతంగా నమోదయ్యింది. గోధుమకు సంబంధించి ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 5.86 శాతంగా ఉంది. ఉల్లి ధరల్లో మాత్రం అసలు పెరుగుదల లేదు. పైగా ధరలు 31.34 శాతం తగ్గాయి. పండ్లకు సంబంధించి కూడా ధరలు 7.62 శాతం తగ్గాయి. ► ఇంధనం, విద్యుత్ విభాగానికి వస్తే, టోకు ద్రవ్యోల్బణం 5.41 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.23 శాతం. డీజిల్ ధరల పెరుగుదల రేటు ఫిబ్రవరిలో 3.72 శాతం ఉంటే, మార్చిలో ఈ రేటు ఏకంగా 7.33 శాతానికి పెరిగింది. పెట్రోల్ ధరలు 1.78 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ధరలు అసలు పెరక్కపోగా 2.93 శాతం తగ్గాయి. -
ఎండలాగే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఎండలతోపాటే రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఎండల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడి కూరగాయల ధర లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్రీయంగా కూరగాయల దిగుబడులు తగ్గడం, బయటి రాష్ట్రాల నుంచి రావాల్సినంతగా దిగుమతి లేకపోవడం ధరలు అమాంతంగా పెరిగేందుకు కారణం. ఎండలు మరింత ముదిరిన పక్షంలో వచ్చే మూడు నెలల్లో ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. అన్నింటి ధరలూ పైపైకే.. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో 3లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగింది. అయితే సాగుకు తగినట్టు నీటి లభ్యత లేదు. ప్రస్తుత సీజన్లో చెరువులతో పాటు భూగర్భ జలాల్లో భారీ క్షీణత కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారానికే భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్ర సగటు భూగర్భ మట్టం మార్చి మొదటి వారానికి గత ఏడాది 11.91 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 12.53 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 1.56 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కూరగాయల సాగు అధికంగా జరిగే మెదక్‌లో 22.28 మీటర్లు, వికారాబాద్ 19.19 మీటర్లు, రంగారెడ్డిలో 17.32 మీటర్లు, సిద్దిపేటలో 18.92 మీటర్లకు నీటి మట్టాలు తగ్గాయి. ఈ ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఈ నేపథ్యంలో కిందటి నెల పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా తాజాగా హోల్‌సేల్ మా ర్కెట్లలోనే వీటి ధర రూ.50కి చేరింది. ఇక రిటైల్ వ్యాపారులు ఏకంగా కిలో రూ.70కి పెంచి అమ్ముతున్నారు. బెండ, దొండకాయల ధరలు గత నెలలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. బీన్స్‌ఏకంగా రూ.70 ఉండగా, చిక్కుడు రూ.60, గోరుచిక్కుడు రూ.45, క్యాప్సికం రూ.60, వంకాయ రూ.40 మేర పలుకుతోంది. క్యాలిఫ్లవర్, క్యాబేజీ ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి రోజూ వచ్చే కూరగాయలతో పోలిస్తే ప్రస్తుత దిగుమతులు సగానికి పడిపోయినట్టు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. నీటి సమస్యే ఇందుకు ప్రధాన కారణమని అంటోంది. నీటి కరువు కారణంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయాయి. ఇవి ప్రధానంగా బెండ, దొండ, క్యారెట్, క్యాబేజీ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. క్యాప్సికం కర్ణాటక, మహారాష్ట్రల నుంచే వస్తుండగా, వీటి దిగుమతులు 500 క్వింటాళ్ల నుంచి 300 క్వింటాళ్లకు తగ్గాయి. వంకాయ సైతం కేవలం 30 క్వింటాళ్ల మేరే దిగుమతి అవుతోంది. ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ లోటు వర్షపాతాలు నమోదు కావడం, అక్కడ కూరగాయల సాగుపై దీని ప్రభావం ఉండే అవకాశాల నేపథ్యంలో నిండు వేసవిలో ధరల పెరుగుదల మరింతగా ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
కూరల ధరలు పైపైకి..!
సాక్షి,సిటీబ్యూరో: నగర మార్కెట్లో గత వారం రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో మొదలయ్యే ఈ ధరాఘాతం ఈసారి ఫిబ్రవరి ప్రారంభం నుంచే మొదలైంది. దీంతో సామన్య ప్రజలు మార్కెట్ పెరు చెబితే జడుసుకుంటున్నారు. చలికాంలో నిలకడగా ఉండే ధరలు అప్పుడే పెరగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమాటాతో పాటు అన్ని రకాల కూరగాయల ధరలు రైతుబజార్లలోనే అధిక ధరలు ఉండగా.. ఇక బహిరంగ మార్కెట్లో రెండింతలకు పెరిగాయి. మార్కెటింగ్ శాఖ ధరల నియత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు కోటి మంది జనాభాకు ప్రతిరోజు సుమారు 3 వేల టన్నుల కూరగాయలు అవసరం. వర్షకాలం, చలికాలంలో స్థానికంగా కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా సహజంగానే తక్కువగా ఉంటాయి. ఇక ఆఫ్ సీజన్ (ఫిబ్రవరి నుంచి జూలై)లో 70 శాతం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం ఆఫ్ సీజన్ మొదలవడంతో కూరగాయలను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది శివారు జిల్లాలైన వికారబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ రైతులు కూరగాయలు పండించడంతో నగరానికి ఎక్కువ దిగుమతయ్యేవి. దీంతో జనవరి వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతులు ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా పెరగలేదు. ఆఫ్ సీజన్ ఏజెంట్లకు పండగ ఫిబ్రవరి– జూలై నెలల మధ్య (ఆఫ్ సీజన్) స్థానికంగా కూరగాయల పంటలు పెద్దగా ఉండవు. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు దిగుమతి చేస్తుంటారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకు కూరగాయలు కొనాల్సిందే. దీంతో ధరలు పెంచి కమీషన్ ఏజెంట్లు భారీగా దండుకుంటారు. ఈ ఏడాది వేసవి కంటే ముందు నుంచే కూరగాయల ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. పది రోజుల నుంచి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు కూరగాయల ధరలు పెరుగరుతాయి. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్ -
టోకు ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో టోకున ధరలు 5.28 శాతం పెరిగాయన్నమాట. టోకు ధరలు ఈ స్థాయిలో నమోదుకావడం వరుసగా ఇది నాల్గవనెల. 2017 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతంకాగా, గత ఏడాది అక్టోబర్‌లో 3.68 శాతంగా ఉంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలను చూస్తే.... ►టోకున ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో అసలు పెరక్కపోగా 1.49 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు 18.65 శాతం తగ్గాయి. సెప్టెంబర్ నెలలో ఈ తగ్గుదల 3.83 శాతం. అయితే ఆలూ ధరలు భారీగా 93.65 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 31.69 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలూ 13.92 శాతం తగ్గాయి. ►ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల పెరుగుదల రేటు 18.44 శాతంగా ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19.85 శాతం, 23.91 శాతం చొప్పున పెరిగాయి. -
విష వలయం
ధరలు పెరిగిపోతున్నాయి. అసలు వస్తువులు, కూరగాయల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి! ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెంపుదలకు కారణాలు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రిచార్డో, జాన్ కినెస్ వంటివారు ఆర్థిక పరిస్థితుల మీద రచించిన గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. రాబడి, పన్నులు, నిరుద్యోగం వంటి వాటి మీద పరిశోధనలు చేసినా ధరల పెరుగుదల రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు! ఇక ఈ విషయమ్మీద విసుగుపుట్టి వదిలివేయాలనుకున్న తరుణంలో పొరుగున ఒక పెద్దావిడ మాటల మధ్యలో సర్ మాంటోతో ‘‘ఈ విషయమ్మీద ఇంత మథనపడటమెందుకు? అసలు ఈ ధరలు పెంచి అమ్ముతున్న వారినే కలిసి అడిగితే సరిపోతుంది కదా!’’ అని ఒక సలహా ఇచ్చింది.సర్ మాంటోకు ఆ సలహా నచ్చింది. తన ప్రశ్నలకు, అనుమానాలకు త్వరలోనే ఊహించిన దానికన్నా మంచి సమాధానం దొరకబోతున్నదని ఆనందపడిపోయాడు.వెంటనే రియో డిజనైరోలో తన వీధి చివరనున్న మార్కెట్‌కు వెళ్లి ఉల్లిపాయలు అమ్మే అతన్ని, ‘‘ఎందుకు ఉల్లిపాయల ధరను పెంచేసి అమ్ముతున్నావు, ఎదుటివాడి ఆర్థిక పరిస్థితి అర్థం చేస్కోవా?’’ అని అడిగాడు. ‘‘అయ్యా! నేను కూడా బతకాలి కదా. ఎక్కువ ధర పెట్టి కొని, మరలా నా లాభం వేసుకుని అమ్మాలి కదా ఆలోచించండి’’ అన్నాడు. ‘‘నీకు ఎక్కువ ధరకు ఎవరు అమ్ముతున్నారు?’’‘‘సెంట్రల్ మార్కెట్లో ఉన్న డీలరు దగ్గర కొంటున్నాను’’ అని చెప్పాడు.వెంటనే సర్ మాంటో సెంట్రల్ మార్కెట్‌కి వెళ్లి, ‘‘ఉల్లిపాయలు ధర పెంచి మార్కెట్ వాళ్లకి ఎందుకు అమ్ముతున్నావు?’’ కర్కశంగా మొహం పెట్టి అడిగాడు.‘‘అయ్యా! నన్ను నమ్మండి. నేను తక్కువ ధరకే అమ్మాలనుకుంటున్నాను. లారీ వాడే ధర పెంచి లారీ లోడు ఉల్లిపాయలు నాకు అమ్మాడు. నేనేం చేసేది?’’ బేలగా చెప్పాడు.రెండోరోజు వేకువజామున మార్కెట్ దగ్గర కాపు కాచి ఉల్లిపాయల లోడుతో వచ్చిన లారీ వాణ్ని పట్టుకొని, ‘‘తెల్లవారి ఎవరూ చూడటం లేదని ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నావా?’’ అడిగాడు. ‘‘అయ్యా! నేనేం చేసేది? ఉల్లిపాయలు పండించే రైతే ధర పెంచి అమ్ముతున్నాడు. దానిమీద కొద్ది లాభంతో సెంట్రల్ మార్కెట్లో డీలర్‌కు అమ్ముకుంటున్నాను’’ చెప్పాడు.వెంటనే బస్సెక్కి సర్ మాంటో ఉల్లిపాయలు పండిచే రైతు వద్దకు వెళ్లి ‘‘నీవే ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నట్టు లారీ డ్రైవర్ చెప్పాడు. నీ విషయం ప్రభుత్వానికి చెప్పి నీ ఆటలు కట్టిస్తాను.’’ కోపంగా చెప్పాడు సర్ మాంటో. ‘‘దీనికంతా కారణం వానలు లేని వాతావరణం. వాన పడినపుడు తగినవిధంగా ఎరువులు వెయ్యాలి కదా! ఎరువులు 85 శాతం పెరిగిపోయాయి. మరి అంత ఖరీదు పెట్టి కొన్న ఎరువులతో పండించిన ఉల్లిపాయలు ధరలు పెంచి అమ్మక ఏం చేస్తాం?’’ బేలగా చెప్పాడు రైతు. సర్ మాంటో ఇక ఆలస్యం చేయకుండా ఎరువులు అమ్మే దుకాణానికి వెళ్లాడు. ఎరువులు అమ్మే దుకాణదారుడిని ఉల్లిపాయల ధరలకి కారణం నీవే అన్నట్టు కోపంగా వాడి కళ్లలో కళ్లు పెట్టి అడిగాడు.‘‘సార్! ధరలు పెంచి అమ్మడం నాకు సరదానా? నేను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పొటాషియం కలిగిన ఎరువును కొద్దిలాభంతో అమ్మి నా కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాను’’ చెప్పాడు ఎరువుల దుకాణదారుడు. సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెరుగుదల విషయం అంతు చూడదలుచుకున్నాడు.రెండో రోజే విమానంలో ఫ్రాన్సుకు వెళ్లి ఎరువుల ఫ్యాక్టరీ సెక్రటరీని కలిసి బ్రెజిల్లో ధర పెరిగిపోతున్న ఉల్లిపాయల్ని గురించి అడిగాడు.‘‘దీనికి కారణం ఎరువుల తయారీకి కావలసిన రసాయనాలు తెచ్చే ఓడలు రవాణా ఖర్చు విపరీతంగా పెంచడమే..’’ చెప్పాడు ఫ్యాక్టరీ సెక్రటరీ. ఆ ఓడల నౌకాశ్రయం జర్మనీలోని హోంబర్గ్లో ఉంది. సర్ మాంటో సరాసరి అక్కడికి వెళ్లి ‘‘ఎందుకు మీరు రవాణా ఖర్చులను పెంచుతున్నారు. మీ వల్ల ఉల్లిపాయలకు బ్రెజిల్లో అధిక ధరలను మేం చెల్లిస్తున్నాం’’ గట్టిగా అడిగాడు.‘‘మేం ఓడలను తయారు చేయడానికి ఇనుముకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసా? గ్రీసు దేశంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలు ఉక్కును అతి ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. అందుకే మేం రవాణా ధరలు పెంచాం.’’ చెప్పాడు.‘‘దీనికంతా కారణం ఉక్కు పరిశ్రమా?’’ అనుకుంటూ మరలా విమానంలో గ్రీసులోని ఏథెన్స్కు వెళ్లాడు. అక్కడి పరిశ్రమలోని పెద్దను కలిసి, ‘‘మీరు ఉక్కు ధరను ఎందుకు పెంచారు? మీ వల్ల ఓడలు తయారుచేయడం ఖరీదు. దాని వల్ల వారు రసాయనాలను ఎక్కువ ధరకు రవాణా చేస్తున్నారు. అందువల్ల ఎరువులు ఖరీదైపోతున్నాయి. రైతులు ఉల్లిపాయల ధరలు పెంచుతున్నారు. అందుకే మా బ్రెజిల్లో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి.ఇది మీకు న్యాయంగా ఉందా?’’ అడిగాడు సర్ మాంటో.‘‘అయ్యా! మీకు ఉక్కు ఏవిధంగా తయారవుతుందో తెలుసా? బొగ్గుతో ఇనుప ఖనిజాన్ని కరిగించి ఇనుముని తయారు చేస్తాం. సౌత్ ఆఫ్రికాలోని బొగ్గు గనులకు వెళ్లండి. బొగ్గుకు ఎంత ధర మేం చెల్లిస్తున్నామో మీకు తెలుస్తుంది’’ నమ్రతగా చెప్పాడు పరిశ్రమ పెద్ద. సర్ మాంటో సౌతాఫ్రికాకు విమానంలో వెళ్లాడు. బొగ్గు గనుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని కలిసి ఉల్లి ధరల గురించి చెప్పాడు. ‘‘బొగ్గు గనులు తవ్వే పరికరాలకు, బొగ్గు రవాణా చేసే రైలుకు మేం కొంత చెల్లించాలి కదా, చెల్లించిన దానిమీద కొంత లాభం వేసుకుని అమ్ముతున్నాము. ఈ పరికరాలు, రైలు పెట్టెలు మాకు జపాన్‌లోని టోక్యో నుండి వస్తాయి. అందుకే బొగ్గును ఎక్కువ ధరకు వారికి అమ్ముతున్నాం’’ తాపీగా చెప్పాడు ఎగ్జిక్యూటివ్. సర్ మాంటో ఇక ఆలోచించలేదు. అందుబాటులో ఉండే విమానంలో వెంటనే టోక్యోకు వెళ్లాడు.ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్ని కలిశాడు.‘‘తమరు బొగ్గు తవ్వే యంత్రాలు, రైలు వ్యాగన్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీని వల్ల మా బ్రెజిల్లో ధరలు పెరిగిపోతున్నాయి’’ చెప్పాడు సర్ మాంటో. చీఫ్ ఇంజనీర్ తొణకకుండా ‘‘దీన్నే ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. మా యంత్ర పరికరాల్ని మీ బ్రెజీలియన్ ఉల్లిపాయలకు బదులుగా వారికి ఇస్తాం. పెరిగిపోయిన ఉల్లిపాయల ధరలతో మా పరికరాలు కూడా ధరలు పెరిగిపోయాయి. తమరు బ్రెజిల్ నుండి వచ్చారుగనక అడుగుతున్నాను – మీ బ్రెజిల్లో ఉల్లిపాయలు ఎందుకు అంత ఖరీదు?’’ చిరునవ్వుతో అడిగాడు చీఫ్ ఇంజనీర్.సర్ మాంటో ఏం చెప్పాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు! పోర్చుగీస్ మూలం : కార్లోస్ ఎడ్యురాడో నోవెస్ అనువాదం: కంచనపల్లి వేంకట కృష్ణారావు -
అన్నదాతల ఆందోళనతో..
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకై అన్నదాతలు ఆందోళన బాట పట్టి వ్యవసాయ ఉత్పుత్తల విక్రయాన్ని నిలిపివేయడంతో ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వ్యవసాయ రుణాల మాఫీ, పంటలకు కనీస మద్దతు ధరల పెంపును కోరుతూ రైతులు ఈనెల 1 నుంచి పదిరోజుల పాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరాలు, పట్టణాలకు పండ్లు, కూరగాయల సరఫరాలను నిలిపివేయడంతో టమోటాలు, బీన్స్ సహా పలు కూరగాయల ధరలు పదిశాతం మేర పెరిగాయి. సరఫరాలు తగ్గడంతో ధరలు పెరిగాయని ముంబయికి చెందిన కూరగాయల విక్రేత మహేష్ గుప్తా వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో హామీ ఇవ్వడంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా తాము కూరగాయలు, పాలు విక్రయించరాదని నిర్ణయించామని పంజాబ్‌కు చెందిన వ్యాపారి రమణ్‌దీప్ సింగ్ మాన్ పేర్కొనడం గమనార్హం. దేశవ్యాప్త నిరసనలో భాగంగా రైతులు ఇటీవల జాతీయ రహదారులను ముట్టడించిన సంగతి తెలిసిందే. పలుచోట్ల రైతులు పాలు, కూరగాయలను కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్లపై పారవేశారు. కాగా, గత ఏడాది ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, దీంతో నిరసనలకు తీవ్రతరం చేయడం మినహా తమకు మరోమార్గం లేదని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలే స్పష్టం చేశారు. -
శాంతించిన టోకు ద్రవ్యోల్బణం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో శాంతించింది. సెప్టెంబర్‌లో 2.60 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 సెప్టెంబర్‌తో పోల్చితే 2017 సెప్టెంబర్‌లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 2.60 శాతమే పెరిగిందన్నమాట. ఆగస్టులో ఈ రేటు 3.24 శాతం ఉండగా, 2016 సెప్టెంబర్‌లో 1.36 శాతం. టోకు ధరలు శాంతించడానికి ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరలు కొంత తగ్గుదల ప్రధాన కారణం. ప్రభుత్వం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సూచీలో మూడు ప్రధాన భాగాలనూ వార్షిక ప్రాతిపదికన ఒకసారి పరిశీలిస్తే... ప్రాథమిక వస్తువులు: ఫుడ్, నాన్‌ఫుడ్ ఆర్టికల్స్ తదితర వస్తువులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.68 శాతం నుంచి – 3.86 శాతం క్షీణతకు పడింది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 7.78 శాతం నుంచి భారీగా క్షీణత (మైనస్) 3.47 శాతానికి క్షీణించింది. ఆగస్టులో ఈ రేటు 5.75 శాతం. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా ఇదే రీతిన 6.15 శాతం నుంచి – 5.15 శాతానికి క్షీణించింది. ఇంధనం విద్యుత్: ఈ రేటు స్వల్పంగా 9.99 శాతం నుంచి 9.01 శాతానికి తగ్గింది. రెండు నెలల నుంచీ ఈ రేటు పెరుగుతోంది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో రేటు –0.27 శాతం నుంచి 2.27 శాతానికి ఎగసింది. ఆగస్టులో ఈ రేటు 2.45 శాతం. నిత్యావసరాల ధరలు చూస్తే... కూరగాయల ధరలు ఆగస్టులో ఏకంగా 44.91 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల 15.48 శాతం. అయితే సెప్టెం బర్లో ఉల్లిపాయల ధరలు మాత్రం 79.78 శాతం పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 5.47 శాతం ఎగశాయి. పప్పు ధరలు 24.26 శాతం, ఆలూ ధరలు 46.52 శాతం, గోధుమల ధరలు 1.71 శాతం తగ్గాయి. -
కూరగాయల ధరలు తగ్గాయి..
సాక్షి, న్యూఢిల్లీ : కూరగాయలు ధరలు పెరగడం తగ్గుముఖం పట్టడంతో టోకు ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. ఆగస్టులో నాలుగు నెలల గరిష్టానికి ఎగిసిన ఈ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో 2.60 శాతంగా నమోదైంది. ప్రభుత్వం నేడు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఆహారోత్పత్తుల ధరలు సెప్టెంబర్ నెలలో 2.04 శాతానికి తగ్గాయి. ఆగస్టులో ఇవి 5.75 శాతంగా ఉన్నాయి. ఆగస్టులో 44.91 శాతంగా ఉన్న కూరగాయల ధరలు 15.48 శాతానికి దిగొచ్చినట్టు ప్రభుత్వ డేటా తెలిపింది. అయితే ఉల్లిధరలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా పెరిగాయి. ఇవి 79.78 శాతంగా నమోదయ్యాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం స్పల్పంగా 2.45 శాతం నుంచి 2.72 శాతం పెరిగింది. ఇంధనం, పవర్ సెగ్మెంట్లో ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. గత రెండు నెలలుగా ఇంధన ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. పప్పులు ధరలు 24.26 శాతం, పొటాటోలు 46.52 శాతం, గోధుమలు 1.71 శాతంగా నమోదయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం అలానే ఉంది. కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఆ ద్రవ్యోల్బణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. -
కిలో టమాటా ధర రూ.100కు పైగా..
- హైదరాబాద్ సహా రాష్ట్రమంతా చుక్కల్లోకి రేటు - వర్షాలతో పంట నష్టం, దిగుబడులు తగ్గడమే కారణం - ప్రధానంగా సరఫరా ఏపీలోని మదనపల్లి నుంచే.. - మరికొంత ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా - భారీ వర్షాలతో కర్ణాటకలో దెబ్బతిన్న పంట - అటు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన దిగుబడులు - సరఫరా తగ్గడంతో పెరిగిపోయిన ధర - ఇతర కూరగాయల ధరలకూ రెక్కలు - మరో రెండు వారాలు ఇదే పరిస్థితి: అధికారులు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో టమాటా ధర కూడా మంటెక్కిస్తోంది.. ఒక్క కిలో టమాటా కొందామన్నా గుండె గుభేలుమంటోంది.. రోజు రోజుకూ ధర పెరుగుతూ ఏకంగా సెంచరీ కొట్టేసింది.. ఆదివారం రాష్ట్రంలో టమాటా ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.100కు పైగా పలికింది. రాష్ట్రంలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్ల టమాటా ధర పెరుగుతోంది. మరో రెండు వారాల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. హోల్‌సేల్‌గానే రూ.72 తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 3 శాతం వరకే ఉంటుంది. దాదాపు 85 శాతం టమాటా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతుంది. ఆ తర్వాత కర్ణాటకలోని కోలారు, చింతమణి ప్రాంతాల నుంచి మరికొంత వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటంతో.. డిమాండ్ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. అంతేకాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోనూ టమాటా దిగుబడులు పడిపోయాయి. దీంతో మదనపల్లి హోల్‌సేల్ మార్కెట్లోనే ధరలు రెండు మూడు రోజుల్లో రెట్టింపయ్యాయి. ఈ నెల 6వ తేదీన మొదటి గ్రేడ్ టమాటా కిలో రూ.41 పలకగా.. ఏడో తేదీన రూ.60కి.. 8వ తేదీన రూ.72కు చేరింది. దీంతో స్థానికంగానే రిటైల్ వ్యాపారులు కిలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతుండటం గమనార్హం. మరింత పంట చేతికొచ్చాక.. ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రస్తుతం టమాటా సాగులో ఉంది. 2 వారాల తర్వాతి నుంచి దిగుబడి ప్రారంభం కానుంది. దీంతో రెండు వారాల తర్వాతే టమాటా ధరలు తిరిగి తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నారు. ఆదివారం బోయినపల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ మార్కెట్లకు 2,270 క్వింటాళ్ల టమాటా వచ్చింది. సాధారణ రోజుల కంటే ఇది పావువంతే కావడం గమనార్హం. రాష్ట్రంలో సాగు తక్కువ రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా సాగవుతుందని తెలిపారు. సీజన్లో ధర రాదు.. రాష్ట్రంలో రైతులు సీజన్లోనే టమాటా సాగు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల నుంచి టమాటా సరఫరా పెరిగి ధర పలకని పరిస్థితి నెలకొంటోంది. కొన్ని సమయాల్లో కిలోకు ఒకటి రెండు రూపాయల ధర కూడా రాక.. రైతులు టమాటాను రోడ్లపై పారబోయడం, పంటను చేలల్లోనే వదిలేయడం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య అనేక మంది రైతులు టమాటా పంటను తెంపకుండానే చేలలో వదిలేశారు కూడా. దళారుల కారణంగా హెచ్చుతగ్గులు మార్కెట్లో దళారీ వ్యవస్థ వల్లే సీజన్లో టమాటా ధర బాగా తగ్గిపోవడం.. అన్‌సీజన్‌లో ధర బాగా పెరిగిపోవడం జరుగుతోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు టమాటా పంట వేసేందుకు సీజన్ కాదని... దాంతో ఏటా జూన్, జూలై నెలల్లో టమాటా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌సీజన్‌లో టమాటా పండించేలా రైతులను సిద్ధం చేయడంలో వ్యవసాయ, ఉద్యానశాఖలు విఫలమవుతున్నాయని.. దానితో ధరలు పెరిగిపోతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై రెండేళ్ల కింద ప్రణాళిక రచించినా.. అది అమల్లోకి రాలేదని మార్కెట్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దళారుల దోపిడీ కారణంగానే రైతులు టమాటా వేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. -
కూరగాయాలే!
అమాంతం పెరిగిన ధరలు ►5 రోజుల్లోనే రెండు రెట్లు.. ►నషాళానికి అంటిన పచ్చిమిర్చి రేటు ►చేదెక్కిన కాకరకాయ ►దిగిరానంటున్న టమాటా ►దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం కూరగాయల ధరలు ఆకాశంలో నక్షత్రాల సరసన చేరాయి. టమాటా ధర వింటేనే మాడు పగులుతోంది. పచ్చిమిర్చి ధర వినగానే ఘాటెక్కుతోంది. గోకర, బీరకాయ, బీన్స్ ఇలా ఏ కూరగాయల ధరలు చూసినా సామాన్యులకు అందేస్థితిలో లేవు. కేవలం 15 రోజుల్లోనే వీటి ధరలు రెండింతలు పెరగడంతో చాలా కుటుంబాల్లో పచ్చడి మెతుకులే గతవుతున్నాయి. చేవెళ్ల / కడ్తాల్ :ప్రస్తుతం పంటలు వేసే సీజన్ కావటంతో కూరగాయల దిగుబడులు తక్కువయ్యాయి. దీంతో మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు అవి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాలోని పరిసర ప్రాంతాలతో పాటు చేవెళ్లలో ఎక్కువ మంది రైతులు కూరగాయలు పండిస్తుంటారు. జిల్లాలో వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేస్తుంటారు. అయితే రబీ సీజన్లో వేసిన పంటల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో ప్రస్తుతం రైతులు పంటలు వేసే పనిలో పడ్డారు. దీంతో దిగుబడులు లేక ఉన్న కూరగాయలకు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 40 రూపాయలకు పైమాటే. ఎక్కువగా మిర్చి ధర ఘాటెక్కిస్తుంది. కూరగాయలన్నింటిలో అధికంగా కిలో రూ.100రూపాయలు వరకు పలుకుతుంది. ఈ ధరలతో కొనకముందే మిర్చి ఘాటేక్కిస్తుందని అంటున్నారు. పదిహేను రోజుల కిత్రం ధరలతో చూస్తే ఇప్పుడు ధరలు రెట్టింపుగా కనిపిస్తున్నాయి. -
వంటిల్లు డీలా!
కొండెక్కిన కూరగాయల ధరలతో జనం సతమతం - ఘాటెక్కిన పచ్చి మిర్చి... భయపెడుతున్న క్యా‘రేట్’ - చుక్కలతో పోటీ పడుతున్న చిక్కుళ్లు.. బియ్యం ధరలకూ రెక్కలు.. ‘మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిజ్ నిండా కూరగాయలుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్న మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే.. తెచ్చుకుందామనుకున్న కూరగాయల్లో సగమంటే సగం కూడా రాలేదు. మాకిష్టమైనవి కాకుండా ఏవి ధర తక్కువో అడిగడిగి కొనాల్సి వచ్చింది. ఈ ధరలు తగ్గేదాకా ఆకుకూరలతో సరిపెట్టుకోక తప్పదనిపిస్తోంది. ఉల్లిపాయలొక్కటే కొండెక్కలేదు. లేకపోతే పచ్చడి మెతుకులూ గగనమయ్యేవి’ అంటూ తిరుపతికి చెందిన స్వరూప వాపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పచ్చి మిర్చి ఘాటెక్కింది. బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్ తదితర కాయగూరలు కందిపప్పు ధరను మించిపోయాయి. కొన్ని కూరగాయలైతే రెండు నెలల కిందటితో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరలను చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. కిలో బీన్స్/ చిక్కుళ్లు / క్యారెట్.. ప్రాంతం, నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో పచ్చి మిర్చి రూ.80 – 85 పలుకుతోంది. కాకర, గోరుచిక్కుడు, బీట్రూట్, కీరదోస, వంగ తదితర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. విజయవాడ బహిరంగ మార్కెట్లో కిలో కంద గడ్డ రూ.70పైగా ఉంది. రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్లో కూడా కిలో కంద రూ.60కి పైగా అమ్మడం గమనార్హం. సాధారణ రోజుల్లో కిలో రూ.15, 20 ఉండే కీరదోస ప్రస్తుతం విజయవాడ రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్లో ఏకంగా రూ.45కి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.12 ఉండగా విజయవాడలో రూ.20 నుంచి 22 వరకూ అమ్ముతుండటం గమనార్హం. విజయవాడ బహిరంగ మార్కెట్లో కిలో టమోటా రూ.30పైగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతితోపాటు చిన్న పట్టణాల్లో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో పొట్ల కాయను దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.20కి అమ్ముతున్నారు. ఎండకు తోటలు ఎండిపోవడం వల్లే.. కరువు వల్ల నీరు లేక కూరగాయల తోటల సాగు తగ్గడం, ఎండలకు తోటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే కూరగాయల ధరలు పెరిగాయని, మరో నెలన్నర పాటు ఈ ధరలు ఇలాగే ఉంటాయంటున్నారు. మూడు నాలుగు నెలలు కష్టపడి కూరగాయలు పండిచిన వారికి వచ్చే మొత్తం కంటే ఒకటి రెండు రోజులు మార్కెట్లో పెట్టి అమ్మేవారు, దళారులే ఎక్కువ డబ్బు పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. ‘మార్కెట్లో కిలో పచ్చి మిర్చి రూ.80కి అమ్ముతున్నారు. మాకు మాత్రం రూ.40 కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంత అన్యాయం చేస్తున్నారు...’ అని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లెకు చెందిన లోకనాథం నాయుడు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ’కిలో చిక్కుడు కాయలు మావద్ద రూ.40కి తీసుకుంటున్నారు. వ్యాపారులేమో మార్కెట్లో రూ.75, 80 అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దుకాణం అద్దె, మనిషికి కూలీ, ఇతర ఖర్చులు అంటారు. మేం అమ్ముకోలేం కాబట్టి వారు చెప్పిన రేటుకు ఇచ్చి వెళ్లక తప్పడంలేదు’ అని వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెందిన రైతు కులశేఖర్ అన్నారు. ధరలు ఇలా మండిపోతుంటే ఏమి తిని బతకాలంటూ పేదలు వాపోతున్నారు. బెంబేలెత్తిస్తున్న బియ్యం ధర మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి మొదటి శ్రేణి కొత్త బియ్యం కిలో రూ.33 ఉండేది. ఇప్పుడు ఇవే బియ్యం ధర రూ.37, 38కి పెరిగాయి. పాత బియ్యమైతే కిలో రూ.44 నుంచి ఏకంగా రూ.50కి పెరిగాయి. మంచి క్వాలిటీ అయితే కిలో రూ.52 – 55 వరకు అమ్ముతున్నారు. వంద కిలోల బస్తా సోనా మసూరి పాత బియ్యం రూ.5000 పలుకుతోంది. నిజామాబాద్ సన్నాలు పేరు చెప్పి రూ.5300 నుంచి రూ.5500 కూడా అమ్ముతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తగ్గడం వల్ల బియ్యం ధరలు పెరిగాయి. కర్నూలు సోనా మసూరి పేరు చెప్పి చాలా ప్రాంతాల్లో కల్తీ బియ్యం అంటగడుతున్నారు. ఎంపీయూ 1060 రకం ధాన్యం సోనా మాసూరి లాగా ఉంటుంది. దీనిని సోనామసూర బియ్యంలో 20 నుంచి 30 శాతం కలిపి అమ్ముతున్నారు. మరికొందరు తగ్గుబియ్యంలో రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి కలిపేస్తున్నారు. పుల్లగూరలే గతి... నెల రోజులుగా ఎండలే అనుకుంటే కూరగాయల ధరలూ మండిపోతున్నాయి. అర కిలో కూరగాయలతో తాళింపు చేసుకునేటోళ్లం పావు కిలోకే పరిమితమయ్యాం. అందరికీ అందుబాటులో ఉండే వంకాయల ధర కూడా పెరిగిపోయింది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటకూర, చిర్రాకు, బచ్చలాకుతో పుల్లగూర చేసుకుని కానిచ్చేస్తున్నాము. – కనకదుర్గ, అజిత్‌సింగ్‌నగర్, విజయవాడ -
ధరల దరువు బతుకు బరువు
♦ భయపెడుతున్ననిత్యావసర వస్తువులు ♦ మండుతోన్న కూరగాయల ధరలు ♦ మార్కెట్లో దళారుల మాయాజాలం ♦ జీవనం కష్టంగా మారిందంటున్న ♦ పేద, మధ్యతరగతి ప్రజలు కేజీబీవీల నిర్వహణ ♦ బహుకష్టంగా మారిన వైనం జేబులో వంద, రెండువందలో డబ్బులు పెట్టుకుని మార్కెట్‌కు వెళితే సరుకులతో సంచి నిండి ఇంటికొచ్చే రోజులుపోయాయి. కనీసం రూ.2000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదీ అరకొరనే. పప్పులు నిప్పులవ్వుతున్నాయ్. నూనెలు సలసల కాగుతున్నాయ్. కూరలు కరుస్తున్నాయ్.. బియ్యం భయపెడుతున్నాయ్.. ఇక మధ్య తరగతి, సామాన్యుల నోటికి మాంసం ముక్క చిక్కడం లేదు. కనీసం కోడి గుడ్డు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. దళారుల మాయాజాలంలో మార్కెట్ నడుస్తోంది. ధరలను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు దడపుట్టిస్తున్నాయి. కూరగాయలు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి జనాల బతుకు భారమైంది. ధరలు చూసి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలీ పనిచేసి జీవించే పేదలకు ఈ ధరలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. నెలరోజుల కిందటికీ ఇప్పటీకీ అటు నిత్యావసర వస్తువులు ఇటు కూరగాయాల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నెలాఖరున మాత్రమే ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు నెలంతా ఇబ్బందిగానే మారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినా సర్కారు నియంత్రించలేకపోతోంది. ధరల మానిటరింగ్ కమిటీ ఉన్నా ఉపయోగంలేదు. సామాన్యుడు సన్న బియ్యం తినలేని పరిస్థితి నెలకొంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కిలో నెల కిందట రూ.40లుండగా, తాజాగా కిలో రూ.48కు చేరింది. నిప్పులు కురిపిస్తున్న పప్పుల ధరలు నిత్యం ఉపయోగించే కందిపప్పుతో పాటు అల్పాహారాలలో వినియోగించే ఉద్దిపప్పు, పెసరపప్పు ధరలు నింగిని తాకుతున్నాయి. వేరుశనగ విత్తనాల ధరలు అదేస్థాయిలో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఆయా పప్పుల ధరలు నిప్పులను కురిపిస్తున్నాయి. దీని ప్రభావం కుటుంబ బడ్జెట్‌పై చూపుతోంది. మంచిరకం కందిపప్పు కిలో నెల కిందటి వరకు రూ.120 ఉండగా నేడు కిలో రూ.180 పలుకుతోంది. మిన పప్పు కిలో రూ.130 ధర ఉండగా ఉన్నట్లుండి కిలో రూ.180లకు చేరుకుంది. కందిపప్పు, మినపప్పు మధ్యలో రూ.200ను కూడా దాటింది. అలాగే పెసరపప్పు కిలో రూ.80ల నుంచి నేడు రూ.120లకు చేరుకుంది. వేరుశనగ పప్పు కూడా రూ.100పైనే ఉంది. పప్పులు కూడా కిలో రూ.65ల నుంచి రూ.100లకు చేరుకున్నాయి. అలాగే ఎండుమిరప, తెల్లగడ్డలు ధరలు ఘాటెక్కుతున్నాయి. ఇవి మొన్నటివరకు కేవలం రూ. 70నుంచి 80లకు మించి పలకలేదు. తాజాగా ఎండుమిరప కిలో రూ.185గాను, తెల్లగడ్డలు కిలో రూ. 200ల ధర పలుకుతున్నాయి. చేతికందని మాంసం ముక్క.. మాంసం పేరెత్తితేనే సామాన్యుడు హడలిపోతున్నాడు. మాంసం ధరలు నొటికందనంత దూరంలో ఉంటున్నాయి. మాంసం కిలో రూ. 450కి చేరుకుంది. అలాగే చికెన్ ధరలు రూ. 170 నుంచి 210 పలుకుతున్నాయి. అదివారం అదనం. అదేవిధంగా చేపలు ఆయా రకాలను బట్టి కిలో రూ.200 నుంచి 450లు, రొయ్యలు రూ.350 నుంచి 520 పలుకుతున్నాయి. ఇక కోడిగుడ్లు చవకగా ఉన్నాయనుకుంటే పొరపాటే. డజను గుడ్లు మార్కెట్లో రూ.55 నుంచి 60 వరకు ధర పలుకుతున్నాయి. బహుకష్టంగా మారిన కేజీబీవీల నిర్వహణ ‘సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి’ అన్నట్లుగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణ బహుకష్టంగా మారింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు రూ.90 చెల్లిస్తుంది. ఒక్కో విద్యార్థికి సరాసరిన నెలకు 6 కిలోలు కూరగాయాలు (ఆకుకూరలతో కలిపి)వాడాల్సి ఉంది. కిలో రూ.15 చొప్పున నెలకు రూ.90 మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆ మొత్తానికి ఒక్క కిలోతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నెల పొడువునా ఒక్కొక్క విద్యార్థికి ఒక కిలో కూరగాయలతో నెట్టుకురావడం అసంభవమని బాధ్యులు వివరిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన భోజనం పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. వాస్తవంలో పప్పుదినుసులు, కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతోన్నాయి. ఈతరుణంలో కేవీజీబీ బాధ్యులకు హాస్టల్ నిర్వహణ బహుకష్టంగా మారింది. ప్రస్తుతం తమ బాధలను చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని, చెప్పుకున్నా పట్టించుకునే నాథుడులేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దళారుల మాయాజాలం... ధరలు అమాంతం పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. మార్కెట్లో స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వినియోగదారులు అన్నిరకాల కూరగాయలను కలిపి 356 మెట్రిక్ టన్నులు వాడుతున్నారని అధికారుల అంచనా. రైతుల వద్ద వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని మార్కెట్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం వల్ల ధరలు అమాంతం పెరుగుతున్నాయని పలువురు వివరిస్తున్నారు. నిత్యావసర వస్తువులు సైతం రైతుల వద్ద దిగుబడి ఉన్నంతవరకూ ధరలు ఉండటం లేదు. తర్వాతే మండిపోతున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. -
ఇంటింటా చిటపట
మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మార్కెట్‌కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం 15% వరకూ పెరిగిన నూనెల ధరలు కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ పచ్చిమిర్చి రూ. 100 పైనే కిలో టమాటా రూ. 90 బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే సాక్షి నెట్వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. కొనాలంటే భయం.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి తదితర హోల్‌సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్‌కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం. ఈ జ్ఞాపకం మధురమే! కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్బుక్లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే! నిత్యావసరాలు భగ్గు కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్‌సేల్ మార్కెట్లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్‌ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మార్కెట్‌కు వెళ్లాలంటే భయమే.. ‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్‌కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’ - బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా ఏం తినేటట్లు లేదు ‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’ - చింతల ఏసమ్మ, హైదరాబాద్ -
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
-
ఈసారి మోతే!
జిల్లాలో భారీగా తగ్గిన కూరగాయల సాగు విస్తీర్ణం వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న తోటలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతున్న అన్నదాతలు ఈఏడాది నగరానికి సరఫరా అంతంత మాత్రమే జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25,000 హెక్టార్లు ఈ ఏడాది సాగు చేసిన మొత్తం 4,600 హెక్టార్లు ఇప్పటికే మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత తగ్గడంతో అవి మరికాస్త పైకి పోనున్నాయి. సమీప రోజుల్లో ఇప్పటి రేట్లకు ధరలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్ మహానగరానికి అధికంగా కూరగాయలను సరఫరా చేస్తున్నది జిల్లా రైతులే. జిల్లా హైదరాబాద్‌కు చుట్టుకొని ఉండడంతో స్థానిక రైతులు మొదటి నుంచీ కూరగాయలను అధికంగా పండించి నగర అవసరాలను తీరుస్తున్నారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగుకు మొగ్గుచూపలేదు. వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండుముఖం పట్టాయి. - చేవెళ్ల రూరల్ చేవెళ్ల రూరల్ : పెరిగిన కూరగాయల ధరలతో సతమతం అవుతున్న ప్రజలు రానున్న రోజుల్లో మరింత భారం మోయక తప్పని పరిస్థితి. ఎందుకంటే యేటా జిల్లాకు కావాల్సిన కూరగాయలను సరఫరా చేస్తూ, నగరానికి కూడా అందిస్తున్న రైతులు ఈ సారి చేతులెత్తేశారు. తీవ్ర వర్షాభావమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లా నగరానికి ఆనుకుని ఉండడంతో రైతులు కూరగాయల సాగుపైనే అధికంగా ఆధారపడ్డారు. అయితే గత మూడేళ్లుగా వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కారణంతో కొందరు కూరగాయల సాగుకు దూరమైతే.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి మరి కొందరు సాగు చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పెరిగిన పెట్టుబడులు, రియల్ వ్యాపారంలో భూములను అమ్ముకోవడం.. తదితర కారణాల వల్ల జిల్లాలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాను కూరగాయల జోన్‌గా అభివృద్ధి చేస్తామన్న సీఎం మాటలు.. మాటలకే పరిమితం అయ్యాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25 వేల హెక్టార్లు. ఈ ఏడాది ప్రస్తుతం ఇప్పటివరకు 4,600 హెక్టార్లలో మాత్రమే సాగు చేపట్టినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికి సరైన వర్షాలు కూడా లేకపోవడంతో కూరగాయల సాగు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ. ముఖ్యంగా అధిక కూరగాయలసాగు చేపట్టే పశ్చిమ రంగారెడ్డి జిల్లా రైతులు ఈ సారి అందుకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహమేదీ..? ఈ ఏడాదికి సబ్సిడీ విత్తనాలకు ప్రభుత్వం జిల్లాకు రూ.83లక్షలు మాత్రమే కేటాయించింది. చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, పూడూరు, షాబాద్ మండలాలకు రూ.18 లక్షలు ఇచ్చారు. అంటే మండలానికి రూ.ఆరు లక్షలు. చేవెళ్ల హెచ్ఓ పరిధిలో ఇచ్చిన రూ.18లక్షల విలువైన సబ్సిడీ విత్తనాలను వచ్చిన రెండు రోజుల్లోనే రైతులందరూ డీడీలు కట్టి తీసుకున్నారు. ఇంకా చాలా మంది రైతులకు ఆ విత్తనాలు అందలేవు. డివిజన్లో బీట్రూట్, క్యాలిఫ్లవర్, టమాటా, క్యాబేజీ, మిర్చి తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చే నాటికి దాదాపు సగం మంది రైతులు విత్తనాలు ప్రైవేటుగానే కొనుగోలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహలేమి కారణంగా కూరగాయల రైతులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగంటేనే భయపడే స్థితిలో ఉన్నారు. ఒక ఎకరంలో కూరగాయల సాగుకు దాదాపు రూ.35 వేల నుంచి రూ. 45 వేలు ఖర్చు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో దళారులు, ధరలలేమీ కారణంగా ఒక్కోసారి అవి కూడా చేతికి రావడం లేదు. జిల్లాలో సాగు, అందిన సబ్సిడీలు.. 2009లో జిల్లాకు రూ.రెండు కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత యేటా తగ్గిస్తూ ఇస్తున్నారు. 2012-13లో కూరగాయల సాగు 24,419 హెక్టార్లు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ. కోటి. ఇది కేవలం 3,342 హెక్టార్లకు సరిపోయింది. 2013-14లో సాగు 28,508 ఉంటే ప్రభుత్వ సబ్సిడీ 1.35 కోట్లు. ఇది 4,530 హెక్టార్లకు వస్తుంది. 2014-15లో 28,264 సాగుకు రూ.1.80కోట్లు ఇచ్చారు. ఇది 5,300 హెక్టార్లకు మించి సరిపోదు. ఈఏడాది జిల్లాకు రూ.83లక్షల కేటాయించారు. ఇప్పటివరకు 4,600ల హెక్టార్ల సాగు మాత్రమే జరిగింది. -
ధర దగా!
- మండుతున్న కూరగాయల ధరలు - రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40-50 - యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ - వినియోగదారులు విలవిల సాక్షి, సిటీబ్యూరో: ఇన్నాళ్లూ ఎండల తీవ్రతకుఅల్లాడిన నగర జనం... ఇప్పుడు కూరగాయల ధరల మంటలతో విలవిలలాడుతున్నారు. రుతు పవనాల రాకతో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినా.... కూరగాయల ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని... నగరానికి సరఫరా తగ్గిందన్న కారణాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు ఒక్కసారిగా కూరగాయల ధరలు పెంచేశారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా రూ.40-50 ధర పలుకుతున్నాయి. నిత్యావసరాల్లో భాగమైన టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంత పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ల ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కిలో రూ.50-80 ఉంటోంది. ఇక పచ్చిమిర్చి, బెండ, గోకర, వంకాయ, చిక్కుళ్లు వంటివి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.40-50 పలుకుతున్నాయి. ఫ్రెంచ్ బీన్స్,క్యాప్సికం, చిక్కుడు ధరలను మినహాయిస్తే.... అన్ని వర్గాల వారు వినియోగించే టమోటా, వంకాయ, కాకర, క్యాబేజీ, బీర, బెండ, దొండ, క్యారెట్, చిక్కుడు, గోకర వంటి ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.20 నుంచి రూ.30 మధ్యలోనే ఉన్నాయి. అవి రిటైల్ వ్యాపారుల చేతిలోకి వచ్చేసరికి అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో మిర్చి ధర కేజీ రూ.30 పలుకగా...బహిరంగ మార్కెట్లో రూ.45- 50కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇలానే ఉన్నాయి. నిజానికి హోల్‌సేల్ మార్కెట్లో కంటే 30 శాతం అదనంగా రైతు బజార్లలో ధరను నిర్ణయిస్తారు. వాటిలో పచ్చిమిర్చి, బెండ, బీర, చిక్కుడు, గోకర, కాకర తదితర కూరగాయల ధరలు రూ.23-33 మధ్యలో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ.40-50 వంతున వసూలు చేస్తున్నారు. తోపుడుబండ్ల వారైతే... ఇంటిముంగిటకే తెచ్చామంటూ మరో రూ.2 అదనంగా వడ్డిస్తున్నారు. వారం క్రితంతో పోలిస్తే ఇప్పుడు ధరలు రూ.2నుంచి రూ.14 వరకు పెరిగాయి. తగ్గిన సరఫరా... నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 30-35 శాతం సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల నియంత్రణకు రైతుబజార్లలో సబ్సిడీపై టమోటా విక్రయాలను ప్రారంభించిన అధికారులు తగినంత సరుకును సేకరించలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం అన్ సీజన్ కావడం వల్ల కొన్ని రకాల కూరగాయలు కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఆగ్రా ప్రాంతాల నుంచే గాక, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో సహజంగానే వాటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయంటున్నారు. వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, వానలు తగ్గితే రెండు రోజుల్లో ధరలు దిగివస్తాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు నమ్మబలుకుతున్నాయి. -
ధరల మంట
కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది కొనాలన్నా 30 రూపాయలకు పైగా వెచ్చించాల్సిందే. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చొన్న బీన్స్ ధర కిందికి దిగిరానంటోంది. మొన్నటిదాకా 30 రూపాయలూ పలకని మునక్కాయ ధర ఇప్పుడు ఏకంగా 70 రూపాయలకు పైగా పలుకుతోంది. పచ్చిమిర్చి మరింత మంటెక్కిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పలమనేరు : కూరగాయల ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మంచి కూర వండుకోవాలంటే గగనంగా మారింది. పలమనేరు పట్టణంలోని హోల్‌సేల్, రీటైల్ మార్కెట్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. కనీసం వారపుసంతలోనైనా కొంత తక్కువ ధరకు దొరుకుతాయేమోనని జనం భావించారు. అయితే పట్టణంలో శుక్రవారం జరిగిన వారపు సంతలోనూ వ్యాపారులంతా ఒక్కటై అన్ని దుకాణాల్లోనూ ఒకే ధర ఉండేలా చూశారు. ఇలా అయితే కూరగాయలు కొనే పరిస్థితి లేదని సంతకొచ్చిన పలువురు బహిరంగంగానే నోరెళ్లబెట్టారు. ధరల క్రమబద్ధీకరణ గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో వ్యాపారులు ఇస్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారని వాపోయారు. -
పప్పుల మంట..కూరగాయలతో తంటా!
-
కొండెక్కిన కూరగాయల ధరలు
-
వెజిట్రబుల్స్
- కొండెక్కిన కూరగాయల ధరలు - ఎండవేడిమికి తగ్గిన దిగుమతులు - వినియోగదారుల అవస్థలు విజయవాడ : కూరగాయల ధరలు కొండెక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు బాగా పెరిగాయి. ఎండవేడిమి, వడగాడ్పులకు జిల్లాలో ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి టమోటా, బెండ, దొండ, వంకాయల ధరలు రోజుకో రేటుతో చుక్కలనంటుతున్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజార్‌కు వారం రోజుల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గాయి. రోజూ ఇక్కడి రైతుబజార్‌కు 2,500 క్వింటాళ్ల కూరగాయలు ఉత్పత్తి అవుతుంటాయి. కొద్దిరోజుల నుంచి 1800 క్వింటాళ్లకు తగ్గాయి. దాదాపు 700 క్వింటాళ్ల కూరల ఉత్పత్తులు ఒక్క స్వరాజ్యమైదానం రైతుబజార్లోనే తగ్గాయి. ఇలాగే జిల్లాలోని 17 రైతుబజార్లలో పరిస్థితి ఉంది. వీటిలో రోజుకు దాదాపు 20వేల క్వింటాళ్ల ఉత్పత్తులు దిగుమతి అవ్వాల్సి ఉండగా, కేవలం 14వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతు బజార్లలో సరైన కూరలు లభ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావంతో ప్రయివేటు మార్కెట్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. -
మార్కెట్లో ‘రిటైల్’ మోసం
- భారీగా పెరిగిన కూరగాయల ధరలు - హోల్‌సేల్ ధరకు రెట్టింపుగా రిటైల్‌లో.. సాక్షి, ముంబై: నగరంలోని కూరగాయల ధరలు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్ రేటుకు రిటైల్ మార్కెట్ రేటుకు చాలా వ్యత్యాసం ఉంటోందని చెబుతున్నారు. ఆదివారం రిటైల్ మార్కెట్లో కిలో మిరప ధర రూ. 100- 120 పలకగా.. హోల్‌సేల్ మార్కెట్లో రూ.70 మాత్రమే ఉంది. బీన్స్ , పచ్చి బఠాణీ ధరలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏపీఎంసీ హోల్‌సేల్ మార్కెట్లో పచ్చి బఠాణీ కి.లో ధర రూ.50 పలకగా, బీన్స్ కి.లో రూ. 60 వరకు ధర పలకగా.. రిటైల్‌లో రూ.100 దాటాయి. అయితే దీనిపై కూరగాయల వ్యాపారులు వేరే విధంగా స్పందిస్తున్నారు. రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరలకు రెట్టింపుగానే ఉంటాయని పేర్కొంటున్నారు. ‘మామూలుగానే రిటైల్ ధరలు హోల్‌సేల్ ధరల కంటే రెట్టింపుగా ఉంటాయి. అకాల వర్షాలు, కూరగాయల సరఫరా తగ్గిపోవడం, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, గుంటూరు, హవేరి నుంచి కూరగాయల సరఫరా గణనీయంగా తగ్గడంతో ముంబై మార్కెట్లో కూరగాయల డిమాండ్ పెరిగింది’ అని హోల్ సేల్ వ్యాపారి బాలాసాహెబ్ బోండ్లే తెలిపారు. ప్రస్తుతం రాయ్‌పూర్ నుంచి వచ్చే పచ్చిమిరప ఎక్కువ ధర పలుకుతోందని, డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. పచ్చిబఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్, వంకాయలకు అన్‌సీజన్ కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారి మోహిత్ యాదవ్ పేర్కొన్నారు. టమోటా, క్యాబేజీ, కీరదోస ధరలు నిలకడగానే ఉన్నాయి. -
రిటైల్ ధరలు 3 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17%గా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌లోని మొత్తం వస్తువులు సంబంధిత విభాగాల ధరలు 2014 మార్చి నెలతో పోల్చితే 2015 మార్చిలో 5.17 శాతం పెరిగాయన్నమాట. ఇంత కనిష్ట పెరుగుదల రేటు నమోదుకావడం మూడు నెలల తరువాత ఇదే తొలిసారి. 2014 డిసెంబర్లో ఈ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 5 శాతం. జనవరిలో 5.19 శాతం కాగా, ఫిబ్రవరిలో 5.37 శాతం. సోమవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. కూరగాయల ధరలు భారమే... వరుసగా రెండు నెలలతో పోల్చితే(2015 ఫిబ్రవరి, మార్చి) ధరల రేటు తగ్గినప్పటికీ, వార్షికంగా చూస్తే, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు-పాల ఉత్పత్తుల ధరలు తీవ్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో కూరగాయల ధరలు (వార్షిక ప్రాతిపదికన) 13.01% పెరిగితే, మార్చి నెలలో ఈ రేటు 11.26%. పప్పు దినుసుల ధర లు మార్చిలో వార్షికంగా 11.48% పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు 10.61%గా ఉంది. పాలు- పాల పదార్థాల విషయంలో ఈ రేటు 9.21% నుంచి 8.35%కి తగ్గింది. కాగా, గ్రామీణ ప్రాం తాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.58%గా, పట్టణ ప్రాంతాల్లో 4.75%గా నమోదైంది. -
ధరలతో సామాన్యులకు దడ
- నషాలాన్ని అంటుతున్న పచ్చిమిరప ఘాటెక్కిన ఉల్లిపాయ - మార్కెట్లో వ్యాపారుల, దళారుల మాయాజాలం - నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్న ధరల మానిటరింగ్ కమిటీ కడప అగ్రికల్చర్ : మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలిజనానికి ఈ ధరలు కలవరం పుట్టిస్తున్నాయి. నెల క్రితం 10-12 రూపాయాల్లోపు ధర ఉన్న కూరగాయలు నేడు రూ.20 నుంచి 60కి చేరుకున్నాయి. ధరలు రెట్టింపు అవుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గడమే కారణం చలిగాలులు పెరగడంతో పురుగులు, తెగుళ్లు విజృంభణ ఎక్కువై కూరగాయల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు అడుగంటిన భూగర్భజలాల వల్ల నీటి తడులు సక్రమంగా అందకపోవడంతో దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. అలాగే కూరగాయల నాణ్యత కూడా సరిగా ఉండటం లేదు. బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గిపోతోందని, ఈనేపథ్యంలో కొత్తగా కూరగాయల సాగు చేపట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. ప్రధానంగా 10 రోజుల కిందట టమాట కిలో రూ.5 నుంచి రూ.10, పచ్చిమిరప రూ.12 ఉండగా నేడు రూ.24 పలుకుతోంది. వంకాయ (నాటు రకం) కిలో రూ.10 ఉండగా నేడు రూ.18, కాకర కిలో రూ.15 నుంచి రూ.20కి చేరుకుంది. చిక్కుడు కిలో 20 రూపాయల నుంచి 35 రూపాయలకు చేరుకుంది. బెండ కిలో రూ.16 నుంచి రూ. 20కు చేరింది. అలాగే క్యాబేజి కిలో రూ.18 నుంచి రూ.24 పలుకుతున్నాయి. అదే విధంగా క్యారెట్ కిలో రూ.20 నుంచి 32కి చేరింది. బంగాళదుంప కిలో రూ.20 ఉండగా నేడు రూ.30, ఉల్లిపాయలు కిలో రూ.15 పలుగా నేడు కిలో. 20-30 మధ్య ధరలున్నాయి. అలాగే బీన్స్ రూ. 20 నుంచి 36, అల్లం రూ. 48 ఉండగా ఇప్పుడు రూ.60 ధర పలుకుతున్నాయి. దళారుల మాయాజాలం.. మార్కెట్‌కు స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 29 లక్షల మంది ప్రజలు ఉండగా రోజుకు వినియోగదారులు అన్ని రకాల కూరగాయలను కలిపి 40 టన్నుల కూరగాయలను వాడుతున్నారని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. చలిగాలుల వల్ల, అడుగంటిన భూగర్భజలాల వల్ల మార్కెట్‌కు కూరగాయలు సరిగా రాలేదని సాకు చూపుతూ ధరలను అమాంతగా పెంచుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూరగాయలు దొరకనందున పొరుగున ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలకు, పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి కూడా కూరగాయలు తెప్పిస్తున్నందున కూరగాయ ధరలు కాస్త పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. రవాణా, కమీషన్లు, ఇతర ఖర్చులు మీద పడతాయని వాటిని ఈ ధరల్లో కలుపుతామని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకాస్తా పెరుగుతాయని అంటున్నారు. -
ఘాటెక్కిన ఉల్లి
* కిలో రూ.15 నుంచి రూ.25కు పెరుగుదల * పెద్దగా మార్పుల్లేని కూరగాయల ధరలు తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. గత వారంతో పోలిస్తే కిలో రిటైల్‌గా రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ. 2,400 పలికింది. నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి అయితే రూ. 1,800 వరకు పలికింది. రిటైల్‌గా నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయించారు. గత వారం నాణ్యత కలిగిన ఉల్లి క్వింటాల్ రూ.2,000 పలకగా నాణ్యత తక్కువగా ఉన్నవి రూ.1,400 చేసి విక్రయించారు. ఆదివారం కేవలం 15 లారీల సరుకు మాత్రమే గూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఉల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెరిగిన బీరకాయల ధర మార్కెట్లో బీర కాయలు ధర ఒక్కసారిగా పెరిగింది. గూడెం హోల్‌సేల్ మార్కెట్లో పది కిలోల ధర రూ.250 పలికింది. గత వారం రూ.110 కావడం గమనార్హం. వంకాయలు తక్కువ ధరకే లభ్యమయ్యాయి. తెల్ల వంకాయలు పది కిలోలు రూ.100 పలకగా రిటైల్ మార్కెట్లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. నల్ల వంకాయలు పది కిలోలు రూ.60 పలికాయి. బెండ, దొండకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. బెండ కాయలు పది కిలోలు రూ.220 పలకగా దొండకాయలు రూ.150 చేసి విక్రయించారు. చిక్కుళ్లు పది కిలోలు రూ.200 లకు విక్రయించగా, పొట్టి చిక్కుళ్లు పది కిలోలు రూ. 400 చేసి విక్రయించారు. క్యారెట్ పది కిలోలు రూ.180, బీట్ రూట్ రూ.250, క్యాప్సికం, బీన్ రూ.450 పలికాయి. క్యాబేజీ పది కిలోలు రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. దోసకాయలు కూడా ఇదే ధర పలికాయి. కంద పది కిలోలు రూ.130 వద్ద స్థిరంగా ఉండగా, పెండ్లం రూ.250 చేసి విక్రయించారు. టమోటాలు చిత్తూరు రకం 25 కిలోల ట్రే రూ.250కి చేసి అమ్మగా నాటు రకం రూ.80 పలికాయి. బంగాళా దుంపలు పది కిలోలు రూ.110 చేసి అమ్మకాలు సాగించారు. -
మండుతున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వివిధ ప్రాంతాల నుంచి రావల్సిన కూర గాయలు 30 శాతం తగ్గిపోవడంతో ముంబైసహా ఠాణే, నవీ ముంబైలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు గృహిణులకు కొంత ఊరట కల్గించిన కూరగాయల ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. నగరంతోపాటు ఠాణే, నవీముంబైకి నిత్యం నాసిక్, గుజరాత్, పుణే, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. గత రెండు వారాలుగా వాటి దిగుమతి 30 శాతం మేర తగ్గిపోవడంతో క్యాబేజీ, ఫ్లవర్ మినహా మిగత కూరగాయల కొరత ఏర్పడింది. ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మాసంలో ఉపవాసాలు కొనసాగుతున్నాయి. ఈ మాసంలో అనేక మంది మాంసాహారాలకు దూరంగా ఉంటారు. ఈ కారణంగా ఒక్కసారిగా కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగి పోయింది. ఇదే సందర్భంలో కూరగాయల కొరత ఏర్పడడం హోల్ సెల్ వ్యాపారులకు కలిసొచ్చింది. రైతులు రూపాయి పెంచితే ఇక్కడ వ్యాపారులు ఏకంగా ఐదు రూపాయలు పెంచేసి అందినంత దండుకుంటున్నారు. సాధారణంగా ఏటా శీతాకాలంలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ప్రాంగణం కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో వాహనాల సందడి అంతగా కనిపించడం లేదని ఏపీఎంసీ మాజీ డెరైక్టర్ శంకర్ పింగళే అన్నారు. సాధారణంగా ఎపీఎంసీలోకి రోజు కూరగాయల లోడుతో సుమారు 450-475 వరకు ట్రక్కులు, టెంపోలు వస్తుంటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 100-150 వరకు తగ్గిపోయింది. ఫలితంగా సరుకు నిల్వలు తగ్గిపోవడంతో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయని వ్యాపారి గోపినాథ్ మాల్సురే అన్నారు. విదర్భ, మరఠ్వాడాలో ఏర్పడిన కరువు ప్రభావం కూడా కూరగాయల దిగుబడులపై చూపుతున్నాయి. అక్కడి నుంచి నగరానికి రావల్సిన సరుకు ఇప్పటికే నిలిచిపోయింది. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కావాల్సిన కూరగాయలు 30 శాతం తగ్గిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీని ప్రభావం గహిణీల ఆర్థిక బడ్జెట్‌పై పడుతోంది. -
కూరగాయలపై కరువు ప్రభావం
మేడ్చల్ రూరల్: తీవ్ర వర్షాభావం కారణంగా కూరగాయల పంట సాగు తగ్గింది. దీంతో వాటి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. ఇటీవల 10 రోజు లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ కూరగాయ చూసినా కిలోకు రూ.40 పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మేడ్చల్ మండల పరిసర ప్రాంతాల్లో వరి పంట సాగు తర్వాత అధికంగా కూరగాయల సాగు రైతులు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో కూరగాయల పంట గణనీయంగా తగ్గింది. చెదురుమదురు వర్షాలకు అక్కడక్కడా వేసిన పంటలతో ఇన్ని రోజులు కూరగాయల దిగుబడి రావడం తో సాధారణ ధరలు పలికినా ప్రస్తుతం వాటి ధరలు పెరుగుతున్నాయి. కరువుతో భూగర్బ జలాలు అడుగంటాయి. బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇప్పటికే వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు విలపిస్తున్నారు. రబీలో వ్యవసాయ సాగు చేయాలంటేనే భయపడుతున్న రైతులు మిన్నకుండిపోవడంతో కూరగాయల సాగు తగ్గింది. ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే వినియోగదారులపై పడుతోంది. రబీ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వర్షపాతం నమోదు గణనీయంగా తగ్గింది. ఈ సంవత్సరం మేడ్చల్ మండంలో జూన్ మాసం నుంచి అక్టోబర్ నెల చివరి వరకు 746.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి బదులుగా కేవలం 425.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. ప్రతి కూరగాయ కిలో రూ. 40పైనే.. మేడ్చల్ మార్కెట్లో ప్రతి కూరగాయ రూ 40పైనే చేరుకున్నాయి. 10 రోజుల క్రితం రూ.20 నుంచి రూ.25 ఉన్న కూరగాయలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వీటి ధర రూ.40 కన్నా తక్కువ లేకుండా ఉండటంతో సామాన్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ మార్కెట్లో చిక్కుడు కిలో రూ.60, బీర, బీర్నిస్ రూ.45, బెండ, గోరుచిక్కుడు, దొండ, వంకాయ, కాకర, పచ్చిమిర్చి రూ.40 ధర పలుకుతున్నాయి. టమాటా మాత్రం 15 ఉండటంతో కాస్త ఊరట కలిగించే అవకాశం. రబీ ప్రారంభంలోనే కూరగాయ ధరలు పెరుగుతుండడంతో భవిష్యత్‌లో వీటి ధరలు ఏ విధంగా ఉంటాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
రెక్కలు తొడిగి...చుక్కల్లోకి...
భారీగా పెరిగిన కూరగాయల ధరలు సాక్షి, సిటీబ్యూరో: సుమారు పక్షం రోజుల క్రితం అల్లకల్లోలం సృష్టించిన తుపాన్ భూతం ధరల రూపంలో భాగ్యనగరంపై పడింది. ఇక్కడ సామాన్యుడి వంటింట్లో ధరల మంటను రాజేసింది. తుపాన్ దెబ్బతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు సగానికి పడిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా క్యాబేజీ, క్యారెట్, దోస వంటి కూరగాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగతా కూరగాయల కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వస్తోంది. అయితే... ఇటీవల తుపాన్‌తో సీమాంధ్రలో కురిసిన వర్షాల వల్ల కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. స్వల్పంగా దక్కిన పంటకు సైతం స్థానికంగా మంచి డిమాండ్ ఉండటంతో నగరానికి దిగుమతి కాని పరిస్థితి ఎదురైంది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం కూరగాయల ధరలపై పడింది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధర చూసినా రూ.20-60 మధ్య పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రైతుబజార్లలో సైతం ధరల పరిస్థితి అదుపు తప్పింది. ఇతర ప్రాంతాలపైనే... సీమాంధ్రలో వర్షాలతో పంటలు దెబ్బతిన గా...ఇక్కడ సకాలంలో వర్షాలు లేక వేసిన పైర్లు ఎండిపోయాయి. బోర్లు, బావుల కింద పంట సాగు కూడా నెల క్రితమే ముగిసింది. ప్రస్తుతం దోస, క్యాబేజీ, క్యారెట్ తప్ప ఇతర కూరగాయలేవీ కానరావడం లేదు. స్థానికంగా దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పచ్చిమిర్చి సరఫరా అయ్యేది. బెండ, దొండ, బీర, టమోటా, చిక్కుడు, గోకర, క్యాప్సికం, ఫ్రెంచిబీన్స్, ఆలు, ఉల్లి వంటివి బెంగళూరు, మదనపల్లి. కర్నూలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొద్దిపాటి పరిమాణంలో వస్తున్నాయి. తుపాన్ తర్వాత కూరగాయల దిగుమతులు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వినియోగదారుని ఆదుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. వర్షాల వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, దిగుమతులు పెరిగితే ధరలు వాటంతట అవే కిందకు దిగి వస్తాయంటూ దాట వేస్తున్నారు. -
తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం కొన్ని కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం అదేవిధంగా ఇతర కారణాల వల్ల గత రెండు నెలలుగా కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ సంతృప్తి కరంగా కురవడంతో గత నెలలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రానికి (ఏపీఎంసీ) కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల కూరగాయలు ఈ మార్కెట్‌కు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. గతంలో రోజుకు కేవలం 350- 400 ట్రక్కుల కూరగాయలు మాత్రమే సరఫరా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు సరఫరా పెరగడంతో టమాటాల ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధర కిలోకు రూ.8 నుంచి 10 వరకు పలుకుతోంది. కాగా, మరికొన్ని వారాల వరకు కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని కూరగాయల వ్యాపారి రామ్‌దాస్ పవాలే తెలిపారు. కాగా, క్యారెట్, క్యాబేజీ, దొండకాయలు, పచ్చి బఠాణీ, పచ్చి మిరప ధరలు కూడా గణనీయంగా తగ్గగా గోరుచిక్కుడు, గోబి పువ్వు, బెండకాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. -
మొర ‘ఆలు’కించదే!
భారీగా పడిపోయిన సరఫరా అమాంతం పెరిగిన బంగాళ దుంపల ధరలు సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో ఆలుగడ్డ ధరదడ పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కిలో రూ.40కి చేరింది. ప్రస్తుతం మిగిలిన కూరగాయల ధరలు కిందికి దిగివస్తుంటే... ఆలు ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు హడలిపోతున్నారు. సగటు జీవికి అందనంత ఎత్తులో బంగాళాదుంప ధర ఉంటోంది. సరఫరా తగ్గడ మే ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. గత ఎనిమిది నెలలుగా నగరానికి ఆలు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ధరలు అస్థిరంగా ఉంటున్నాయి. సంపన్నులు తప్ప సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఆలు సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. ప్రధానంగా మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, పూనే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కర్ణాటకలోని అకోలా నుంచి నగరానికి నిత్యం 500-600 టన్నుల ఆలు దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి అనూహ్యంగా తగ్గిపోయింది. ఫలితంగా మన రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా 7-8 నెలలుగా ఆలు ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఆగ్రా, నాగపూర్‌ల నుంచి రోజుకు 200 టన్నుల ఆలు దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అరకొరగా వచ్చిన సరుకుకు డిమాండ్ బాగా ఉండడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తుస్తున్నారు. రైతుబజార్లో కేజీ రూ.29కు అమ్ముతుండగా రిటైల్ మార్కెట్లో మాత్రం కేజీ రూ.40ల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆలు దిగుమతులపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టకపోవడంతో ధరలు అస్థిరంగా ఉంటూ వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. స్థానికంగా జహీరాబాద్, వికారాబాద్, తూప్రాన్, దౌల్తాబాద్ వంటి ప్రాంతాల్లో సాగవుతున్న ఆలు దిగుబడి వస్తే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. -
సీజన్లోనూ పైపైకి..
తగ్గని కూరగాయల ధరలు ధరలపై నియంత్రణలేని ఫలితం యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ సాక్షి, సిటీబ్యూరో : సీజన్ ప్రారంభమైనా నగర మార్కెట్లో కొన్ని రకాల కూరగాయల ధరలు ఇంకా మండుతూనే ఉన్నాయి. దిగుబడి పెరిగితే ధరలు తగ్గుతాయనుకున్న వినియోగదారులకు నిరాశే మిగిలింది. మొన్నటి వరకు డిమాండ్ సరఫరాల మధ్య అంతరం ఉండడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే... ఇప్పుడు అన్నిరకాల కూరగాయల దిగుబడి పెరిగినా... ధరలు మాత్రం తగ్గకపోవడం ఆందోళ కలిగిస్తోంది. ప్రస్తుతం నగరానికి సీమాంధ్ర నుంచేగాక స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా సమృద్ధిగా సరఫరా అవుతున్నాయి. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం ధరలను తగ్గించేందుకు ఇష్టపడట్లేదు. వీరిపై మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేకపోవడంతో పాత ధరలనే కొనసాగిస్తూ వినియోగదారులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. పచ్చిమిర్చి, బెండ, కాకర, బీర, చిక్కుడు, క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు ఇంకా సామాన్యుడికి అందనంత దూరంలోనే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కె ట్లో వీటి ధరలు కేజీ రూ.20-39ల మధ్యలోనే ఉన్నాయి. రిటైల్‌కు వచ్చేసరికి రూ.8-14లు అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం పచ్చిమిర్చి కేజీ రూ.30లు ధర పలుకగా ఇదే రిటైల్ మార్కెట్లో రూ.44లకు విక్రయిస్తున్నారు. ఇక బెండ, బీర, చిక్కుడు, కాకర, క్యాప్సికం, సొర వంటి వాటికి వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. హోల్‌సేల్‌గా రూ.25లు ధర పలికిన ఉల్లి రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.32లకు చేరింది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని ఫలితంగా ధరలు కిందికి దిగిరావట్లేదని వ్యాపారులు సాకుగా చెబుతుండడం గమనార్హం. -
మళ్లీ కూర‘గాయాలు’..
- నానాటికీ పెరిగిపోతున్న కూరగాయల ధరలు - ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమంటున్న అధికారులు - దీపావళి సమయానికి మరింత మండిపోయే అవకాశం - ఇబ్బందులు పడుతున్న స్థానికులు సాక్షి, ముంబై: కూరగాయల ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా సరుకు కొరత ఏర్పడి ధరలు మండిపోవడం మొదలుపెట్టాయి. ఏపీఎంసీకి యేటా సెప్టెంబర్‌లో దాదాపు 700 వరకు ట్రక్కులు, టెంపోలు కూరగాయల లోడ్లు వస్తాయి. కాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో 350-400 లోపు వస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు జూన్, జూలై ఆఖరు వరకు కురవలేదు. దీంతో కూరగాయల పంటల దిగుబడి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఏపీఎంసీ డెరైక్టర్ శంకర్ పింగలే చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం మాత్రమే కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటి నాణ్యత కూడా సాధారణ స్థాయిలో ఉందని వ్యాపారులు అంటున్నారు. మంచి నాణ్యత ఉన్న కూరగాయలు రావడంలేదని, గత్యంతరం లేక నాణ్యత లోపించిన కూరగాయలనే విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. సరుకు కొరత కారణంగా కూరగాయల ధరలు 25-30 శాతం పెరిగాయి. దీపావళి తర్వాత కొత్త పంటలు చేతికొస్తాయని, ఆ తరువాత కూరగాయల ధరలు వాటంతట అవే దిగివస్తాయని కొందరు హోల్ సెల్ వ్యాపారులు అంటున్నారు. త్వరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సమయంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటారు. దీంతో మాంసం, చేపలకంటే కూరగాయలకే మరింత డిమాండ్ పెరుగుతుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర వ్యాపారులు ధరలు పెంచేసి జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. కూరగాయల నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కొందరు వ్యాపారులు అందినంత దండుకునేందుకు యత్నిస్తారు. చౌకధరల కూరగాయల కేంద్రాలు మాయం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చౌక ధరల కూరగాయల కేంద్రాలు ముంబై, ఠాణే, నవీముంబైలో కనిపించడం లేదు. ఆకస్మాత్తుగా అవి మాయం కావడంతో పేదలు ఇబ్బందుల్లో పడిపోయారు. గత ఏడాదివర్షాలు లేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అందరికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ముంబై, ఠాణే, నవీముంబైలో అక్కడక్కడ 125 చౌక ధరల కూరగాయల కేంద్రాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో కూరగాయల దిగుబడి పెరిగి పరిస్థితులు ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. కాలక్రమేణా అవి మూతపడిపోయాయి. -
భలే ఆప్స్
చదివి వినిపిస్తుంది.... మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఎంచక్కా ఈ బుక్స్ చదువుకోవచ్చునని చాలామంది అంటూంటారు. ఇది నిజమేకానీ... కొన్ని సందర్భాల్లో పుస్తకం చదివే ఓపిక కూడా మనకు ఉండకపోవచ్చు. ఎంచక్కా ఎవరైనా ఈ పుస్తకంలోని కథ మనకు వినిపిస్తే బాగుండునని అనిపిస్తూంటుంది కూడా. అచ్చంగా అలాంటి సందర్భాల కోసమే ఆమెజాన్ కంపెనీ ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆడిబుల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ మీ కోసం పుస్తకాలను చదివి వినిపిస్తుంది. అప్లికేషన్తోపాటే దాదాపు 1,50,000 ఈబుక్స్ కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి... ఇకపై మీకు బోర్ అనిపించే సందర్భాలే ఎదురుకావు. బ్యాక్‌గ్రౌండ్‌లో కథలు వింటూనే, లేదా డౌన్లోడ్ చేసుకుంటూనే ఇతర పనులూ చక్కబెట్టుకునే అవకాశముండటం మరో విశేషం. అంతేకాదు... ఈ ఆడిబుల్ అప్లికేషన్ ద్వారా మీ పుస్తక అభిరుచులను ఇతరులతో పంచుకోవచ్చు కూడా. కూరగాయల ధరలను చెప్పే ‘మన రైతుబజార్’ కూరగాయల ధరల గురించి తెలుసుకోవడానికి మార్కెట్ వరకూనో, షాపింగ్‌మాల్ వరకూనో వెళ్లాల్సిన అవసరం లేకుండా... స్మార్ట్‌ఫోన్ నుంచే ఆ వివరాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది ‘మన రైతుబజార్’ అనే ఈ అప్లికేషన్. సాధారణంగా కూరగాయల ధరలు రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రముఖ నగరాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలను చెబుతుంది ఈ అప్లికేషన్. వాటి మధ్య పోలికను కూడా చూపుతూ అవగాహన నింపుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఫొటో ఎడిటింగ్ కోసం ‘మిక్స్’ గూగుల్ ప్లే స్టోర్‌లో ఫొటో ఎడిటింగ్ కోసం ఇప్పటికే అనేకానేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ‘మిక్స్’ పేరుతో మరో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో అవార్డులు సాధించిన కెమెరా 360, హెలో కెమెరా వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేసిన బృందమే ‘మిక్స్’ను కూడా అభివృద్ధి చేయడం విశేషం.ఈ అప్లికేషన్‌ను వాడటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో తీసే ఫొటోలను కూడా ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరాల స్థాయి నాణ్యత తీసుకురావచ్చు. దాదాపు 115 ఫిల్టర్లు 40 వరకూ ఒరిజినల్ టెక్స్చర్లు, పది వరకూ ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్ టూల్స్ దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు మల్టీ లేయర్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వంటివాటితో కలిసి పనిచేసేందుకు ఇది మెరుగైన అప్లికేషన్ అని కంపెనీ అంటోంది. మీరు ఫొటోలకు చేసే ఎటిటింగ్ను ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుని ఇతర ఫొటోలకు ఫార్ములా మాదిరిగా వాడుకోవడం కూడా ‘మిక్స్’ ఫీచర్లలో ఒకటి కావడం విశేషం. ఆండ్రాయిడ్‌లోనూ వీఎల్సీ.. డెస్క్‌టాప్ కంప్యూటర్లకు చిరపరిచితమైన వీడియో ప్లేయర్ వీఎల్సీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లకూ అందుబాటులోకి వచ్చింది. వీఎల్సీ ఫర్ ఆండ్రాయిడ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ మీడియా ప్లేయర్ ప్రస్తుతం బీటా దశలోనే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఏఆర్ఎం 7 సీపీయూ లేదా ఎక్స్86 ఆర్కిటెక్చర్ సీపీయూలతో మాత్రమే పనిచేస్తుంది. ఆడియో, వీడియోలతోపాటు నెట్వర్క్ స్ట్రీమ్స్‌ను కూడా ప్లే చేయగలదు ఈ మీడియా ప్లేయర్. మీడియా లైబ్రరీని ఏర్పాటు చేసుకోగలగడం, సబ్‌టైటిల్స్‌తో మల్టీట్రాక్ ఆడియోలను వినిపించగలగడం ఈ అప్లికేషన్‌కు ఉన్న ఫీచర్లలో కొన్ని. వీడియో కంట్రోల్ కోసం ప్రత్యేకమైన విడ్జెట్, హెడ్సెట్స్కూ సపోర్ట్ ఉంటుంది. బీటా వెర్షన్ కావడం వల్ల దీంట్లో ఇప్పటికీ చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల స్మార్ట్ఫోన్లతోనే పనిచేస్తుంది. అకస్మాత్తుగా క్రాష్ అవుతూంటుంది. యూఎస్బీలో ఉండే ఆడియో, వీడియో ఫైళ్లను గుర్తించి ప్లే చేయడం లాంటి ఫీచర్లు కూడా దీంట్లోకి ఇంకా చేరాల్సి ఉంది. -
దిగొచ్చిన ధరలు
సాక్షి, ముంబై: వర్షపాతం, సరఫరాలు పెరగడంతో ఆర్థిక రాజధానివ్యాప్తంగా కూరగాయల ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే గురువారం ఒక్క రోజే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్‌కు చేరుకున్నాయి. దీంతో కొన్ని కూరగాయల ధరలు శుక్రవారం నుంచి గణనీయంగా తగ్గిపోయాయి. చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూరగాయల సరఫరాలు గతవారం నుంచి పెరిగాయి. దీంతో కొండెక్కిన కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి. క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ల ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా తగ్గాయని టోకు మార్కెట్ల వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్లోకి నాసిక్, పుణే నుంచి కూరగాయలు గణనీయంగా సరఫరా అయ్యాయి. ఇదిలా ఉండగా ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు కురవడం తగ్గిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా త్వరలోనే కూరగాయల ధరల పెరుగుదలకు అవకాశం ఉంటుందని ఏపీఎంసీ సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు. ముంబైలో మాత్రం ఈ ధోరణి ఉండకపోవచ్చని పలువురు వ్యాపారులు వాదించారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఇదే మాదిరిగా కూరగాయలు రాష్ట్రానికి సరఫరా అయితే వచ్చే వారంలోనూ కూరగాయల ధరలను వాషిలోని ఏపీఎంసీ మార్కెట్ వ్యాపారస్తులు తగ్గించనున్నారు. కూరగాయల వ్యాపారులు అందజేసిన వివరాల మేరకు.. పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ రేట్లు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోయాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ కూరగాయలు గురువారం భారీగా సరఫరా కావడంతోనే వీటి ధరలు తగ్గినట్లు అధికారి ఒకరు తెలిపారు. గతంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో మార్కెట్లో చాలా తక్కువగా కూరగాయలు సరఫరా అయ్యాయి. మరాఠ్వాడా రీజియన్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈసారి అనుకున్నంత మేర వర్షం కురవలేదు. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడిందని ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్లోకి పుణే, నాసిక్ రీజియన్ల నుంచి కూరగాయలు గణనీయంగా దిగుమతి అయ్యాయి. దీంతో కూరగాయల ధరలు కూడా దిగి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు తిరిగి పుంజుకోవడంతో వచ్చే వారంలో కూడా పెరిగిన మరిన్ని కూరగాయల ధరలు కూడా దిగి వస్తాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజు మాత్రమే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్లో దిగుమతి అయ్యాయి. ఉల్లిపాయల ధరలు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయని మరో వ్యాపారి తెలిపారు. టమాటాల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలిపారు. -
రుచి‘కరవై’న భోజనం
కొండెక్కిన కూరగాయల ధరలు.. విద్యార్థులకు అందని పోషకాహారం పాఠశాలల్లో కానరాని కోడిగుడ్డు.. హాస్టళ్లలో మెనూపై తీవ్ర ప్రభావం ధరల పెరుగుదల సాకుతో వార్డెన్ల ఇష్టారాజ్యం సాక్షి, చిత్తూరు: జిల్లాలో 4,927 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. డ్రాపౌట్స్‌ను తగ్గించడం, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘మధ్యాహ్న భోజన పథకాన్ని’ ప్రవేశపెట్టారు. హాస్టళ్లలోని విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడకుండా గత ఏడాది మెనూ మార్చారు. అన్నం, సాంబారు వరకే దీన్ని పరిమితం చేయకుండా ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం కొండెక్కిన కూరగాయల ధరలతో ఇటు మధ్యాహ్న భోజనం, అటు హాస్టళ్లలో ‘మెనూ’ చిక్కిపోయింది. పోషకాహార విలువల సంగతి పక్కనపెడితే పప్పన్నం కూడా సరిగా పెట్టలేని పరిస్థితి. ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 40 రూపాయలకు తక్కువ లేకుండా ఉన్నాయి. దీంతో రుచికరమైన ఆహారం అందించడం ఏజెన్సీలకు, వార్డెన్లకు ఇబ్బందిగా మారింది. ధరల పెరుగుదల సాకుతో ఇంకొంతమంది వార్డెన్లు పూర్తిగా కోడిగుడ్లతో పాటు కాయగూరలలో కూడా కోత పెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి పచ్చడి మెతుకులతోనే సరిపెడుతున్నారు. స్కూళ్లలో వారానికి రెండుకోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటీ ఇవ్వట్లేదు. హాస్టళ్లలోనూ నెలన్నరగా మెనూలో ‘గుడ్డు’ కన్పించడం లేదు. ధరలు తగ్గాలి.. లేదా భత్యం పెంచాలి కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజె న్సీలకు ఇచ్చే భత్యం పెంపుదలతోనే భోజన పథకానికి తంటాలు తప్పుతాయి. గత విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న కురగాయల ధరలకు ఇప్పటికీ పెరుగుదల 70 శాతానికి పైగా ఉంది. గతంలో కందిపప్పు కిలో 53 రూపాయలు ఉంటే ఇప్పుడు 70-80 రూపాయలకు చేరింది. మొన్నటి వరకూ డజన్ కోడిగుడ్లు 34 రూపాయలు ఉంటే ప్రస్తుతం 48 రూపాయలకు చేరాయి. అదే విధంగా టమోటా ధరలు రెండు నెలలుగా ఆకాశం దిగని పరిస్థితి. {పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ల్లో చదివే విద్యార్థులకు రోజుకు 4 రూపాయలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు 4.65 రూపాయల చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిధులతో 100 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూరలను ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు కోడిగుడ్లు, అరటికాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన వంటకా లు అందించాలి. అయితే కోడిగుడ్డు ధర 4 రూపాయలు పైబడి ఉంది. అ డబ్బుతోనే విద్యార్థి రోజుకు అవసరమయ్యే భోజనం అందించాలంటే ఎలా? అని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు బకాయిల బరువు కూడా ఏజెన్సీల నిర్వాహకులను బాధకు గురిచేస్తోంది. భోజన పథకం అమలుకు వంటగ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు. ఉన్న మండలాల్లో స బ్సిడీ సిలిండర్లు ఏడాదికి 11 మాత్రమే ఇస్తారు. సిలిండ రు 15రోజులు కూడా రావడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. దీనికి తోడు వంట సామగ్రి కూడా ఏజెన్సీలు బయట నుంచి అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులుంటారు. వారికి వంట, ఆహారం వడ్డించడానికి ఏజెన్సీల వద్ద సామాన్లు లేవు. ప్రభుత్వమే వాటిని అందించాలని గత కొన్నేళ్లుగా నిర్వాహకులు కోరుతున్నా పట్టించుకోవట్లేదు. హాస్టళ్లలోనూ అదే పరిస్థితి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తగిలింది. జిల్లాలో 216 హాస్టళ్లలో 17,331 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లో గుడ్లు అందించాలి. రోజూ ఆకు, కాయగూరల పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ హాస్టలులో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు. -
చుక్కల్లో కూరగాయల ధరలు
-
ప్రభుత్వం ఉందా?
సాక్షి, కర్నూలు: ‘కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పది రోజుల్లోనే టమాటా ధర కిలోపై రూ. 30 పెరిగింది. కిలో కొనేవాళ్లం అర కిలోతో సర్దుకు పోవాల్సిన పరిస్థితి. ఏ రకం కూరగాయలు కొందామన్నా కిలో రూ. 30 పైనే ధర పలుకుతోంది. పోయిన వారం టమాటా రూ. 30 ఉంటే ఈవారానికి రూ. 60కు చేరింది. పచ్చిమిర్చి ధర రూ. 20 నుంచి రూ. 40కి పెరిగింది. టమాటా, పచ్చిమిర్చికే రూ. 100 అయిపోతే మిగిలిన వాటిని ఎలా కొనాలి. రూ. 200 తీసుకువస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడేమో రైతుబజార్‌కు రావాలంటే రూ. 500 కావాలి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి’.. అంటూ సీ-క్యాంపులోని రైతు బజార్‌ను పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి సునీతను ప్రజలు నిలదీశారు. బుధవారం మంత్రి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సీ-క్యాంపులో ఉన్న రైతు బజార్‌ను పరిశీలించి అక్కడి రైతులతో కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. మహ్మద్ ఫరూక్ అనే వ్యక్తి దోసకాయలు కొనుగోలు చేస్తుండగా మంత్రి సునీత అతనిని పలకరించి.. వాటి ధర ఎంతుంది? అని అడగ్గా.. ‘రైతుబజార్లో ఇప్పుడు అతి తక్కువ ధరకు లభిస్తున్నది దోసకాయలేనని, ఏది కొనాలన్నా కిలో రూ. 30 పైనే ఉన్నాయని, కిలోల స్థానంలో అరకిలోతో సర్దుకుపోవాల్సి వస్తోంద’ని అతను వాపోయాడు. ప్రభుత్వం ఉందా? లేదో? తెలియడం లేదని.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యలు బతికేదెట్లా? ధరలు నియంత్రించండని మంత్రిని కోరారు. వినియోగదారులకు సరిపడా సరుకులు రైతుబజార్‌కు రావడం లేదని, దీంతో సాయంత్రంలోగా కూరగాయలు ఉండట్లేదని కూరగాయలు కొనేందుకు వచ్చిన ఓ జంట మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామంటూ మంత్రి వారికి సమాధానం చెబుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చివరగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను పరిశీలించి.. ఉల్లి, బియ్యం ధరలను ఎంతకు విక్రయిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలుతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. పరిటాల రవిని అభిమానించే వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర..వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించడంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని ఆ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఏటేటా కూరగాయ పంటల విస్తీర్ణం పెరుగుతోందని, కూరగాయల ధరలలో నిలకడ లేకపోవడంతో రైతులు ఏటా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు మార్కెట్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోవడంతో పంట పండించిన రైతుల కంటే దళారులు అధికంగా ఆర్జిస్తున్నారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. -
‘పస్తులే’ ప్రత్యామ్నాయం..!
శంకర్పల్లి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపై సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వీటికి తోడు బియ్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దినసరి కూలీలు కనీసం కూరగాయల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అలుగడ్డ, ఉలిగడ్డ తదితర కూరగాయలను బ్లాక్ చేయడంతో ధరలు మరింత రెట్టింపవుతున్నాయి. పది రోజుల క్రితం పాలకూర, కొత్తిమీర మూడు కట్టలు ఉంటే ఇప్పుడు రూ. 10కి కూడా ఒక కట్ట దొరకని పరిస్థితి. దీంతో కొందరు పచ్చళ్లతో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు కారం మెతకులతోనే కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక కొందరు కూలీలైతే ఈ ధరలకు తాము ఏమీ కొనలేమని, పస్తులుండటమే ప్రత్యామ్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాటెక్కిన పచ్చి మిర్చి అన్ని కూరగాయల్లోకెల్లా పచ్చి మిర్చిధర అమాంతం పెరిగింది. 10 రోజుల క్రితం రూ.30 ఉన్న కిలో పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.80కు అమ్ముతున్నారు. దీంతో మిర్చి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రూ. 300 తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. ధరలు మళ్లీ తగ్గే వరకు కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. -
కొండెక్కిన ధరలు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. తత్ఫలితంగా నగరానికి ప్రతిరోజూ కూరగాయాల లోడుతో రావాల్సిన ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో 20 శాతం మేర ధరలు పెరిగిపోయాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతి రోజూ పుణే, నాసిక్ జిల్లాల పరిసరాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇవి ముంబై, ఠాణే, నవీముంబై ప్రాంతాలకు సరఫరా అవుతాయి. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. దీంతో ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఉల్లిపాయలు గృహిణులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. వారం క్రితమే కూరగాయల ధరలు పెరిగాయి. దీనికితోడు తాజాగా మరో 20 శాతం మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మొన్నటివరకు ప్రతిరోజూ మార్కెట్‌కి 300-350 వరకు కూరగాయలు ట్రక్కులు రాగా , ప్రస్తుతం కేవలం 80-100 లోపే వస్తున్నాయి. ఏపీఎంసీలో ఏదైనా కూరగాయ ధర కేజీకి ఐదు రూపాయలు పెరిగితే అవి కొనుగోలుదార్ల చెంతకు వచ్చేసరికి చిన్న వ్యాపారులు ఏకంగా మూడురెట్లు పెంచేస్తున్నారు. కొన్నిచోట్ల టమాటాలు మొన్నటి వరకు కేజీకి రూ.30 చొప్పున లభించాయి. సరుకు కొరత కారణంగా తాజాగా మరో ఐదు రూపాయల మేర వాటి ధర పెరిగింది. దీన్ని బట్టి కేజీకి రూ.35 చొప్పున విక్రయించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఏకంగా రూ.50 విక్రయించి తమ జేబులను నింపుకుంటున్నారు. ఇవే టమాటాలు రెండు వారాలక్రితం టోకు మార్కెట్లో కేజీకి రూ.12 లభించాయి. వారం క్రితం రూ.22 చేరుకున్నాయి. తాజాగా టోకు మార్కెట్లో కిలో రూ.35 పలుకుతోంది. కూరగాయల ధరల పెరుగుదలతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు కూడా సతమతమతున్నారు. -
కూరగాయల ధరల నియంత్రణకు కృషి
విజయవాడ రూరల్ : జిల్లాలోని రైతుబజార్లలో కూరగాయల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రైతుబజార్స్ ఎంకే సింగ్ అధికారులను ఆదేశించారు. గొల్లపూడి మార్కెట్‌యార్డులో జిల్లాలోని 17 రైతుబజార్ల ఏస్టేట్ అధికారులు ఆర్డీడీ ,డీఈ, ఏఈలు హార్టికల్చర్ ఏఈలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా కూరగాయల ఉత్పత్తి తక్కువగా వుందని వాటి ధరలు అదుపు చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఉల్లిపాయల ధరలు ఎక్కువగా వున్నందున వాటిని వీలయినంత తక్కువ ధరకు రైతు బజార్లలో విక్రయించాలన్నారు. అన్ని రైతుబజార్లలో కంప్యూటర్స్, మైక్, తాగునీటి వసతులు కల్పించాలని చెప్పారు. అసంపూర్తిగాఉన్న నిర్మాణాలను పూర్తి చేసి విద్యుద్దీకరణ చేయిం చాల్సిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు. ఈ పనులకు ఆయా బజార్ల పరిధిలోని మార్కెట్ కమిటీల నిధుల నుంచి కేటాయించాలన్నారు. హార్టికల్చర్ సహాయ సంచాలకులు రైతులకు ఇస్తున్న సబ్సిడీ విత్తనాల గురించి తెలియజేయానికి రైతుబజార్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచిం చారు. డిమాండ్‌కు సరిపడా కూరగాయలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో రైతులను సంఘాలుగా ఏర్పాటుచేసి వాటిద్వారా కూరగాయలు రైతు బజారుకు సరఫరా చేయడానికి క్లస్టర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డెరైక్టర్ దివాకర్, డీఈ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
వండేదెట్టా.. తినేదెట్టా..!
కర్నూలు(కలెక్టరేట్): మిరపకాయ ఘాటెక్కింది.. ఉల్లిగడ్డ కోయకండానే కన్నీరు తెప్పిస్తోంది..చింతపండు పులుపు తగ్గనంటోంది.. సన్న బియ్యం ఉడకనంటోంది..పెసరపప్పు అటకెక్కి దిగిరానంటోంది.. మండే ఎండలు పోయి వర్షాకాలం ప్రారంభమయినా.. కూరగాయల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధర దిగిరానంటున్నాయి. ఫలితంగా జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు పస్తులుండాల్సి వస్తోంది. జూన్ నెల గడిచినా వర్షాల జాడ లేకపోవడం కూరగాయల ధర పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం వంకాయ, బెండ పండుతోంది. టమాట, పచ్చి మిరప, బీర, క్యాబేజి, చిక్కుడు, బీట్రూట్ వంటి కూరగాయలన్నీ బెంగళూరు నుంచి దిగుమతి అవుతున్నాయి. ఆలుగడ్డలు మాత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. గతంలో జిల్లా నుంచి అన్ని రకాల కూరగాయలు దేశం నలుమూలలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా దిగుమతి చేసుకోవాల్సి రావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ఈ ఏడాది కూరగాయల సాగు తగ్గినట్లు విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు కొరత ఏర్పడకుండా ఉద్యాన అధికారులు తగిన చొరవ తీసుకోవాలి. బావులు, బోర్లు, ఇతర నీటి పారుదల కింద కూరగాయల సాగును ప్రోత్సహించాలి. ఇందుకోసం సబ్సిడీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇవేమి చేయకపోవడంతో సాగు తగ్గి.. కూరగాయల కొరత వినియోగదారులను హడలెత్తిస్తోంది. ధరలు పెరుగుతున్న సందర్భంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది. కూరగాయలు బాగా పండే ప్రాంతాల నుంచి తెప్పించి తక్కువ ధరలకు రైతు బజార్ల ద్వారా పంపిణీ చేయించాలి. జిల్లాలో ధరలు పెరిగిపోతున్నా.. వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. -
వెజిట్రబుల్స్
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టులేదు.. అనే పాట పాడుకోవడానికి అసలైన సందర్భం ఇదేనేమో..! ఎందుకంటే చినుకు పడక, మొక్క మొలకెత్తక కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌కు రావాల్సినంత సరుకు రాకపోవడంతో ఉన్న సరుకు ధర అమాంతంగా పెరిగిపోతోంది. దీంతో కిలో కొందామని మార్కెట్‌కు వచ్చి పావుకిలోతో ‘ఆయన’ ఇంటికి వెళ్తుండగా... కొసరు సరుకుతో వంట చేయాల్సిన పరిస్థితి ‘ఆమె’ది. ఇప్పుడే చుక్కలనంటు తున్న కూరగాయల ధరలు మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవకపోతే ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేసే దుస్థితి నెలకొంది. సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో నవీముంబై, వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతీరోజు వందలాదిగా రావాల్సిన కూరగాయల ట్రక్కులు పదుల సంఖ్యలో వస్తున్నాయి. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి సరుకు కొరత తీవ్రమవుతోంది. దీని ప్రభావం సరుకు ధరలపై పడుతోంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో కూరగాయలు సాగు చేయాల్సిన రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇక సాగు చేసినా సరైన దిగుబడి రాని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో కూరగాయల ధరలు 15-20 శాతం పెరిగిపోయాయి. ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో దిగుబడి తగ్గిపోయి ధరలు పెరుగుతాయి. అయితే జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడంతో ధరలు తగ్గుముఖం పడతాయి. కాని ఈ ఏడాది వేసవిలో పెరిగిన ధరల జోరు జూన్ పూర్తయినా కూడా కొనసాగుతోంది. వర్షాలు పత్తా లేకపోవడంతోనే వేసవిలోకంటే కూడా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. గత నెలలో ఏపీఎంసీలోకి ప్రతీరోజు 550 పైగా ట్రక్కులు కూరగాయల లోడ్లతో వచ్చాయి. అయితే జూన్ నెల మొదటి వారంలో ఏరోజూ ట్రక్కుల సంఖ్య 500 దాటలేదు. రెండోవారం వచ్చేసరికి మరింతగా తగ్గింది. నెలాఖరునాటికి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్రక్కులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ మరో వారంరోజుల్లో వర్షాలు కురవకపోతే కూరగాయల ధరలు మరింత మండిపోతాయని ఏపీఎంసీ కి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు. ఇదిలావుండగా కూరగాయల ధరలు పెరిగినప్పటికీ టమాటాలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం టమాటలు ఏపీఎంసీలో హోల్‌సెల్‌గా 10 కేజీలకు రూ.140 చొప్పున ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల చెంతకు వచ్చే సరికి అవి కేజీకీ రూ.20 చొప్పున లభిస్తున్నాయి. మిగతా కూరగయాలతో పోలిస్తే వీటి ధర తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఏపీఎంసీలో ప్రస్తుతం హోల్సెల్లోలభిస్తున్న కూరగాయలు. పెరిగిన కూరగాయల ధరల వివరాలు (10 కేజీలకు) కూరగాయ గతనెలలో ప్రస్తుతం క్యాలీప్లవర్ రూ.140 రూ.200 క్యాబేజీ రూ.100 రూ.140 వంకాయలు రూ.200 రూ.300 పచ్చిబఠానీ రూ.250 రూ.340 సొరకాయ రూ.100 రూ.200 -
‘కూరా’ భారం
భగ్గుమంటున్న కూరగాయల ధరలు కొత్తమీర కట్ట రూ.100...బెండ, మిరప, కాకర కిలో రూ.40 70 శాతం పంట దిగుబడి తమిళనాడు, కర్ణాటకకు ఎగుమతి ధరల పెరుగుదలకు ఇదే అసలు కారణం సొమ్ము చేసుకుంటున్న దళారులు బెంబేలెత్తుతున్న సామాన్యులు చిత్తూరు కలెక్టరేట్లో పనిచేస్తున్న గంగాధర్ కూరగాయలు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ధరలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కొత్తిమీర కట్ట రూ.100, బీన్స్ కిలో రూ.80, బెండ కిలో రూ. 40, కాకర కిలో రూ. 40, క్యారెట్ కిలో రూ.40 ఇలా కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తి పోయాడు. ఇవేం ధరలు బాబోయ్ అంటూ అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసుకుని వెనుదిరిగాడు. మూడు నెలలుగా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు ఏమి కొనాలన్నా.. తినాలన్నా ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వేసవి ప్రారంభం నుంచే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయాలు బోరుబావులపై ఆధారపడి మాత్రమే సాగు చేస్తారు. ఈ సీజన్లో ( 3 నెలలు) జిల్లా వ్యాప్తంగా 24,281 హెక్టార్లలో రైతులు కాయగూరలు సాగుచేశారు.రాయలసీమ జిల్లాలతో పాటు ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పోలిస్తే కూరగాయల దిగుబడిలో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పొరుగు జిల్లాలతో పోలిస్తే జిల్లాలో ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దిగుబడిలో 70 శాతం పంట చెన్నై, బెంగళూరు, వేలూరు, విజయవాడ తదితర ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఎగుమతే కారణం జిల్లాలో దిగుపడి అయ్యే కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంతో ఇక్కడ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పడమటి మండలాల్లో అధిక శాతం మంది రైతులు కూరగాయల సాగును చేస్తున్నారు. ప్రధానంగా పలమనేరు, మదనపల్లి, వి.కోట, కలికిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయల బహిరంగ మార్కెట్‌ను వ్యాపారస్తులు నిర్విహ స్తున్నారు. దీంతో ఇక్కడి మార్కెట్లలో రైతుల నుంచి అయినికాడికి కొనుగోలు చేసే కూరగాయలను వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, విజయవాడ, వేలూరు తదితర ప్రాంతాలకు అధిక ధరలకు తరలించి లాభపడుతున్నారు. రైతులు మాత్రం దళారులు సొమ్ము చేసుకుంటున్న దానిలో మూ డో వంతు ఆదాయాన్ని కూడా పొందడం లేదు. వ్యాపారులు లాభాలకోసం ఇతర ప్రాంతాలకు కూరగాయలను తరలించడం వలన జిల్లావాసులకు అవసరమైన మేరకు కూరగాయలు లభించడంలేదు. దీంతో ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టాలపాలవుతున్నారు. కొనలేని స్థితిలో ప్రజలు సామాన్య ప్రజలు కూరగాయలను కొనలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రెండు కేజీల కూరగాయలు కొనాలన్నా రూ. వందకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో కూరగాయలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొనివుంది. మార్కెట్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కొనలేకపోతున్నాం అధిక ధరల కారణంగా కూరగాయలను కొనలేకపోతున్నాం. రోజుకు కనీసం రూ.50 పెడితే గాని నాణ్యమైన కూరగాయ లు దొరకడం లేదు. రోజంతా కూలి చేసినా రూ.200 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. అందులో రూ.50 కూరగాయలకే ఖర్చు చేస్తే మిగిలిన వస్తువులను ఏవిధంగా కొనాలో అర్థం కావడం లేదు. - కాంచన, గృహిణి, అయ్యప్పగారిపల్లె ప్రభుత్వం పట్టించుకోవాలి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుని కూరగాయల ధరలు తగ్గించాలి. వందలాది రూపాయలు వెచ్చించి కూరగాయలు కొంటున్నా. కనీసం చేతి బ్యాగు కు కూడా రావడం లేదు. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకడం లేదు. - సుమతి, గృహిణి, మురకంబట్టు -
ఈ ‘ధర’ణిలో బతికేదెలా!
- కిలో రూ.30 నుంచి రూ.40కి పెరిగిన సన్నబియ్యం - మండుతున్న కూరగాయల ధరలు - ఒక్కసారిగా రూ.100 పెరిగిన సిమెంట్ - మార్కెట్ అంటే జంకుతున్న సామాన్యులు - ధరల నియంత్రణలో అధికారులు విఫలం ఒంగోలు టూటౌన్: ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. నెల రోజులుగాఅన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని వస్తువుల ధరలు చూస్తే గుండె గుభేల్మంటోంది. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రజలు ఎక్కువగా వాడే సన్నబియ్యం, లావు బియ్యం ధరలు వినియోగదారులకు మార్కెట్లో చుక్కలు చూపిస్తున్నాయి. బియ్యం ధరలు పెరిగిందిలా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సన్నబియ్యం(బీపీటీలు) కిలో రూ.30 నుంచి రూ.35 ఉంటే ఇప్పుడు కిలో రూ.40 పలుకుతోంది. అదే విధంగా లావు బియ్యం 25 కిలోల బ్యాగ్ రూ.1050 పెరిగింది. కిలో రూ.40 పైనే పెరిగింది. బియ్యం వ్యాపారులు అక్రమ నిల్వలు సృష్టించి ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైస్ షాపుల వద్ద 250 క్వింటాళ్ల కంటే అదనంగా బియ్యం నిల్వలు ఉండకూడదు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి అధికంగా కొని అక్రమ నిల్వలకు పాల్పడుతుండటంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సివిల్ సప్లై ఉదాసీనంగా వ్యవహరించడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండుతున్న కూరగాయల ధరలు : కూరగాయల సాగు విస్తీర్ణం రానురానూ తగ్గిపోతుండటంతో కూరగాయల ధరలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అరకొరగా సాగు చేసిన కూరగాయల పంటలకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు కరువై.. చీడపీడల బెడదతో పంటలను అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక వంగతోటలు చీడపీడలకు గురై రైతుకు నష్టాలను మిగిల్చాయి. మార్కెట్లో కూరగాయల ధరలు రెండు నెలలుగా మండుతున్నాయి. గతంలో కేజీ రూ.10 నుంచి రూ.12 వరకు అమ్మిన వంకాయలు ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ.24 వరకు పలుకుతోంది. ఒక దశలో రూ.40 పెరిగింది. అదే విధంగా క్యారెట్ రూ.24 ఉండగా.. కిలో రూ.60 చేరింది. రూ.40 అమ్మిన చిక్కుళ్లు రూ.80 చేరి వామ్మో అనిపిస్తోంది. కాలీఫ్లవర్ పువ్వు ఒకటి రూ.10 నుంచి రూ.15 ఉండగా ఇప్పుడు రూ.25 వరకు అమ్ముతున్నారు. బీర కిలో రూ.20 నుంచి రూ.30, బీట్రూట్ రూ.22 నుంచి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. మిర్చి రూ.14 నుంచి రూ.20 చేరింది. దోసకాయలు రూ.5 నుంచి రూ.10 చేరింది. పెద్దఉల్లి రూ.12 నుంచి రూ.18 పెరిగింది. దొండ కాయలు కిలో రూ.14 నుంచి రూ.20 పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలతోపాటు ఆకుకూరలైన గోంగూర, పెరుగు ఆకు, తోటకూర వంటి వాటికి కూడా ధరలు పెరిగాయి. గతనెలలో కేజీ ఉల్లిపాయల ధర రూ.12 నుంచి రూ15 వరకు ఉండగా ప్రస్తుతం రూ 30 లు పలుకుతోంది. పాలధరలు... పాలధరలు అమాంతంగా పెరిగాయి. లీటర్ రూ.42 నుంచి రూ.46 పెరిగింది. గతంలో లీటరు పాలు కొనే వారు ఇప్పుడు అరలీటరు కొనుక్కొని సర్దుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వినియోగదారులు చాలమంది పాలనే కొనుక్కోవడం మానేయాల్సి వచ్చింది. పెరుగు, వెన్న ధరలు పెంచేశారు. కొండెక్కిన సిమెంట్ ధరలు : సిమెంట్ మంట పుట్టిస్తోంది. బస్తాపై రెండు సార్లు ధర పెరిగింది. గతంలో రూ.200 నుంచి రూ.210 ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.310 పెరిగింది. ధరలు పెరుగుతున్న సంగతి ముందే తెలుసుకొని పాత ధరలకు అధిక మొత్తంలో కొని నిల్వలు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ధరలకు అమ్మి వినియోగదారుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. పెరిగిన ధరల ఫలితంగా జిల్లాలో నెలకు 50 వేల టన్నుల అమ్మకాలు జరిగిన వ్యాపారం ఇప్పుడు 40 వేల టన్నులకు పడిపోయింది. అయినా ఇళ్లు కట్టుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా పరిణమించింది. మార్కెట్లో ధరలు ఒకదాని ప్రభావం ఇంకొక వస్తువు పడి భారంగా పరిణమించాయి. టీ రూ.5 నుంచి రూ.7 పెంచారు. కాఫీ రూ.8 అమ్ముతున్నారు. అల్పాహారాల ధరలూ పెరిగిపోయాయి. ధరల అదుపునకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
టోకు ధరలూ దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా తగ్గింది. ఈ రేటు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో 5.05 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 జనవరితో పోల్చితే 2014 జనవరిలో టోకు ధరలు పెరుగుదల రేటు 5.05 శాతం అన్నమాట. 2013 మేలో 4.58 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం తరువాత దాదాపు ఇదే స్థాయి దరిదాపులకు రావడం ఇదే తొలిసారి. రెండు నెలల నుంచీ క్రమంగా టోకు ధరల సూచీ తగ్గుతూ వస్తోంది. నవంబర్‌లో ఈ రేటు 7.52 శాతంకాగా, డిసెంబర్లో ఈ రేటు 6.16 శాతం. నిత్యావసర ఉత్పత్తుల ధరల వేగం తగ్గుతుండడం దీనికి కారణం. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయిలో 8.79 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక ఉత్పత్తిలో మాత్రం అసలు వృద్ధి లేకపోగా క్షీణత (నవంబర్‌లో -0.6 శాతం)లో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. 3 ప్రధాన విభాగాలు ఇలా... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్(వెయిటేజ్ 21%) విభాగం రేటు జనవరిలో 6.84%గా ఉంది.(డిసెంబర్లో 10.78%) ఇంధనం, విద్యుత్ విభాగం (15 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.03 శాతం (డిసెంబర్లో 10.98 శాతం). మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం (డిసెంబర్లో 2.64 శాతం) విషయానికి వస్తే ఈ రేటు జనవరిలో డిసెంబర్లో రేటుకన్నా స్వల్పంగా పెరిగి 2.76 శాతంగా నమోదయ్యింది. ఆహార ఉత్పత్తుల బాస్కెట్... కాగా మొత్తం ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, జనవరిలో ఈ పెరుగుదల రేటు 8.8%గా ఉంది. డిసెంబర్లో ఈ రేటు 13.68%. కూరగాయల విషయంలో పెరుగుదల రేటు 16.6%గా ఉంది. డిసెంబర్లో ఈ రేటు 57.33%. ఉల్లిపాయల పెరుగుదల రేటు 39.56% నుంచి 6.59%కి తగ్గింది. ఆలూ పెరుగుదల రేటు భారీగా తగ్గి 21.73%గా (డిసెంబర్లో 54.65%) నమోదయ్యింది. పాలు, పాల ఉత్పత్తుల ధరల స్పీడ్ స్వల్పంగా పెరిగి 6.93% నుంచి 7.22%కి చేరాయి. పండ్లు, ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు మాత్రం 2013 జనవరితో పోల్చితే, 2014 జనవరిలో కొంచెం తగ్గాయి. రేట్ల కోతకు సమయం: పరిశ్రమలు ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా వడ్డీరేట్ల కోత అంశాన్ని ఆర్బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో ఉన్నందున దీని పునరుత్తేజానికి రెపో రేటు కోత తప్పదని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. పెట్టుబడులు, డిమాండ్ మెరుగుపడ్డానికి... ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి రేట్ల కోత తప్పదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. తయారీ, చిన్న పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ బిర్లా అన్నారు. -
తగ్గిన రిటైల్ ధరల స్పీడ్
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2013 డిసెంబర్లో 9.87 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 డిసెంబర్ ధరలతో పోల్చితే 2013 డిసెంబర్లో ధరలు 9.87 శాతం అధికంగా ఉన్నాయన్నమాట. 2013 నవంబర్‌లో ఈ రేటు 11.16 శాతం. నెల వ్యవధిలో ధరల స్పీడ్ 11.16 శాతం నుంచి మూడు నెలల కనిష్ట స్థాయి 9.87 శాతానికి తగ్గినా... సామాన్యునికి ఈ మాత్రం పెరుగుదల సైతం భారమేనని విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యాంశాలు... ఆహార, పానీయాల విభాగంలో పెరుగుదల రేటు 12.16% ఇంధనం లైట్ ద్రవ్యోల్బణం రేటు 6.89 శాతం దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల విషయంలో రేటు 9.25 శాతం అన్ని గ్రూపులూ కలిసి మొత్తం సూచీ 9.87 శాతం ఒక్క చక్కెర ధర తగ్గడాన్ని (-5.61శాతం) మినహాయిస్తే- మిగిలిన దాదాపు అన్ని ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలన్నీ డిసెంబర్లో తీవ్రంగానే ఉన్నాయి. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2013 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 10.49 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 11.74 శాతం. ఇక పట్టణ పాంతాల్లో ఈ రేటు 10.5 శాతం నుంచి 9.11 శాతానికి తగ్గింది. మరోవైపు డిసెంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళవారం(14న) వెలువడే అవకాశం ఉంది. -
ఉల్లిపాయలు తినొద్దు: సుప్రీంకోర్టు
ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని నియంత్రించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే, నియంత్రణ తమ చేతుల్లో లేదని, అయినా ప్రజల ఆదాయం కూడా పెరిగినందున ఈ ధరలు పెద్ద లెక్కలోనివి కావని సాక్షాత్తు ప్రధానమంత్రే అంటున్నారు. పోనీలే, సుప్రీంకోర్టయినా ప్రజల ప్రయోజనార్థం ఈ విషయంలో కల్పించుకుంటుందని అనుకుంటే అక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురైంది. ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలను నియంత్రించేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు.. ''ఉల్లిపాయలు తినడం మానేయండి, అప్పుడు ధరలు అవే దిగొస్తాయి'' అని జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేస్తూ అనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని కూడా తెలిపింది. -
కూర‘గారాలు’
=దిగొచ్చిన ధరలు =రా.. రమ్మంటున్న రైతుబజార్లు =ఇబ్బడిముబ్బడిగా కూరగాయల దిగుబడి =రూ.100లకే నిండుతోన్న చేతి సంచి సాక్షి, సిటీబ్యూరో : నగరంలో చాలారోజుల తర్వాత సగటు కుటుంబం తృప్తిగా భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి వరకు ఠారెత్తించిన టమోట , పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు దిగిరావడం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఊరట నిచ్చింది. రూ.100లు వెచ్చిస్తే చేతిసంచి నిండిపోతుండటంతో గృహిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు టమోట అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకొన్న వారు ఇప్పుడు ఏకంగా 4, 5 కిలోలు కొనుగోలు చేస్తున్నారు. గ్రేటర్ చుట్టుపక్క ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో సరకు రైతుబజార్లను ముంచెత్తుతోంది. బహిరంగ మార్కెట్లు సైతం అన్నిరకాల కూరగాయలతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి కొత్త పంట దిగుబడి విపరీతంగా పెరగడంతో టమోట ధర సింగిల్ డిజిట్ కు దిగి వచ్చింది. సీజన్ ఊపందుకోవడంతో చిక్కుడు, వంగ, క్యాబేజీ, కీర, దోస, వంటి కూరగాయల దిగుబడులు అధికమై వాటి ధర సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. సోమవారం హోల్‌సేల్ మార్కెట్లో టమోట ధర కేజీ రూ.4లకు దిగివచ్చింది. దీనికి మరో రూ.2 అదనంగా వేసి రైతుబజార్లలో టమోట ధర కేజీ రూ.6లుగా నిర్ణయించారు. అయితే రైతులు బోర్డుపై రాసిన ధరకంటే ఇంకా తగ్గించి మరీ అమ్ముతున్నారు. టమోట దిగుబడి ఎక్కువకావడంతో ఏరోజు సరుకు ఆరోజే అమ్ముకొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఉదయం ఉన్న ధరను సాయంత్రానికల్లా తగ్గించి 2 కేజీల టమోట కేవలం రూ.10లకే విక్రయించి చేతులు దులుపుకొంటున్నారు. అలాగే వంకాయ, చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస వంటి కూరగాయలు కూడా రైతుబజార్లో బోర్డుపై రాసిన ధరల కంటే రూ.2లు తగ్గించి రైతులు విక్రయిస్తున్నారు. ఆకుకూరల ధరలు కూడా టమోట బాటలోనే కిందికి దిగివచ్చాయి. చిన్న కట్ట రూ.10లు ధర పలికిన కొత్తిమీర, తోటకూర, పాలకూర, గంగవాయల్కూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర వంటివి రూ.10లకే 10-12 కట్టలు లభిస్తున్నాయి. దక్కిన కాడికే...: టమోట నిల్వ ఉంచలేని పరిస్థితిలో చాలామంది రైతులు హోల్‌సేల్ రేట్లకే అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. రైతుబ జార్లో కూరగాయల ధరలు అనూహ్యంగా దిగివస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో చిల్లర వ్యాపారులు కూడా ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, మీరాలంమండీ, మాదన్నపేట్ హోల్‌సేల్ మార్కెట్లకు సోమవారం 324 లారీల టమోట దిగుమతైనట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. నగంలోని రైతుబజార్లు, హోల్‌సేల్ మార్కెట్లు, మాల్స్, రిటైల్ మార్కెట్‌కు అన్నింటికీ కలిపి మొత్తం 40వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు సరఫరా అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
2013లో బెంబేలెత్తించిన ధరలు
కూర‘గాయాలు’ కూరగాయాల ధరలు చుక్కల్ని అంటడంతో ఈ ఏడాది వినియోగదారులు సర్దుకుపోవాల్సి వచ్చింది. కిలో కూరగాయలు కొనే బదులు పావుకిలోతో సరిపెట్టుకున్నారు. ఒక దశలో కూరగాయలకంటే మాంసం తినడమే సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ.15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ.70, వంకా య రూ.15 నుంచి రూ. 40, బెండ రూ.20 నుంచి 40, మిర్చి రూ.20 నుంచి 80, బీర రూ.25 నుంచి రూ. 40, క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, క్యారెట్ రూ.24 నుంచి రూ. 60కి ఎగబాకింది. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంత తగ్గుముఖం పట్టాయి. కన్నీరు పెట్టించిన ఉల్లి ఉల్లి జనాన్ని కంటతడి పెట్టించింది. అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్ర దిగుమతుల పనే ఎక్కువగా ఆధారపడడంతో ఒక్కసారిగా ఉల్లి రేటు పెరిగిపోయింది. మరోవపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడుతుండడంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ. 30 నుంచి ఒక దశలో రూ.70 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది .పెట్రోల్, డీజిల్ దడ జనవరిలో లీటరు డీజిల్ ధర రూ.50.23 ఉండగా ప్రస్తుతం రూ. 57.97 చేరుకుంది. రూ.7.74 అదనంగా పెరగడంతో ట్రాన్స్పోర్ట్ రంగంపై పెనుభారం పడింది. నిత్యావసర సరుకుల రవాణా చార్జీలు పెరిగిపోవడంతో పరోక్షంగా సామాన్యుడిపై భారం పడింది. జిల్లాలో రోజుకు 2.20లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.18లక్షల అదనపు భారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 120 వరకు పెట్రోలియం ఔట్‌లెట్లున్నాయి. జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.72 ఉండగా.. ప్రస్తుతం రూ.78.20కి చేరుకుంది. అంటే లీటరుకు ఏకంగా రూ.6 పెరిగింది. జిల్లాలో రోజుకు 1లక్ష 20 వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. పెరిగిన ధరతో రోజుకు రూ.7లక్షల 20వేల అదనపు భారం ప్రజలు మోయాల్సి వచ్చింది. బస్సు భారం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్ చార్జీలను పెంచేసింది. రెండుసార్లు ఆర్టీసీ అధికారులు చార్జీలను పెంచారు. విద్యార్థుల బస్సు పాస్‌ల చార్జీలు కూడా పెంచడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షల చొప్పున అదనపు భారం మోయాల్సి వచ్చింది. తద్వారా ఏడాదికి కోట్ల భారం ప్రజలపై పడింది. సర్‌చార్జీల పిడుగు సర్‌చార్జీల పేరుతో సర్కారు విద్యుత్ వినియోగదారులపై పెను భారమే మోపింది. బడ్డీ కొట్టు నుంచి మొదలుకుంటే పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ భారం పడింది. స్లాబులు విభజించి సాధారణంగా 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారిని కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా చార్జీలను పెంచేసింది. 2013 సంవత్సరంలో జిల్లా ప్రజలపై అదనంగా సుమారు రూ.200 కోట్ల భారం పడింది. కోతల కారణంగా పరిశ్రమల యజమానులు ఇక్కట్లు పడ్డారు. పీక్ సమయాల్లో ఎవరైనా విద్యుత్ వినియోగానికి పూనుకుంటే వారికి 3 రేట్ల అపరాధ రుసుం విధించారు. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. గ్యాస్ మంటలు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆధార్ తప్పనిసరి చేయడంతో సబ్సిడీ సిలిండర్‌కు మొదట వినియోగదారుడు పూర్తిస్థాయిలో ధర చెల్లించాల్సి వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. ప్రస్తుతం రూ.1,107లకు సబ్సిడీ సిలిండర్ ధర పెరిగింది. రూ.633 సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. కాగా ఆధార్ సీడింగ్ కాని వినియోగదారులకు రూ.419కి సిలిండర్ లభిస్తుంది. ఆధార్ సీడింగ్, సీడింగ్ కాని వినియోగదారులకు మధ్య రూ.60కి పైగా వ్యత్యాసం రావడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షలకు పైగా సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా సబ్సిడీ సిలిండర్లను 9కి మాత్రమే పరిమితం చేయడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్లపై వినియోగదారుడికి పెను భారం పడుతోంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు సుమారు రూ.700 వ్యత్యాసం ఉండటం గమనార్హం. బియ్యం, నూనెలతో కంగారు పేదలకు అందుబాటులో ఉండే పామాయిల్ కూడా కంగారు పెట్టించింది. ప్రస్తుతం కిలో రూ.65కు లభ్యం అవుతున్నా.. నిన్న మొన్నటి దాకా రూ.88 పలకడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ఇక వేరుశెనగ నూనె అయితే ఏకంగా రూ.110 వరకు చేరింది. బియ్యం ధర గుబులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మొదట్లో రూ.3,800 నుంచి క్రమంగా క్వింటాలు బియ్యం ధర రూ.5 వేలకు చేరాయి. పాల ధర కూడా... ఈ ఏడాది లీటరు పాల ధర రెండు రూపాయల చొప్పున పెంచారు. సరాసరిన రోజుకు వేల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విధంగా లక్షల రూపాయల భారం ప్రజలపై పడింది. -
అందుబాటులో ధరలు
=సరసమైన రేట్లకే కూరగాయలు =రైతుబజార్లో టమాటా, మిర్చి కిలో రూ.12 సాక్షి, సిటీబ్యూరో : నగరంలో కూరగాయ ధరల చిటపట బాగా తగ్గిపోయింది. గత నెలతో పోలిస్తే... ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు సరసమైన ధరలకే లభిస్తుండటం వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే టమాటా, మిర్చి దిగుబడి అనూహ్యంగా పెరగడంతో ధరలు కూడా కిందికి దిగివచ్చాయి. గత నెల మొదటి వారంలో రైతుబజార్లో పచ్చిమిర్చి, టమోటా కిలో రూ.32-35లకు విక్రయించగా, రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లు ధర పలికాయి. ఇప్పుడవి రైతుబజార్లో కేజీ రూ.12ల కే లభిస్తున్నాయి. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఈ రేట్లకు మరో రూ.4-8లు అదనంగా వసూలు చేస్తున్నారు. తగ్గిన ధరలు ఒక్క టమాటా, పచ్చిమిర్చికే పరిమితం కాకుండా మిగతా కూరగాయలు కూడా ఇప్పుడు వినియోగదారుడికి అందుబాటులోనే ఉన్నాయి. అలాగే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర కూడా అనూహ్యంగా కిందికి దిగివచ్చింది. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి కేజీ రూ.18-20లకే లభిస్తోంది. సీజన్ ప్రారంభం కావడంతో అన్నిరకాల కూరగాయల దిగుబడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మాదన్నపేట, మీరాలంమండి మార్కెట్లకు రోజుకు 55వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు దిగుమతవుతుండగా, నగరంలోని 9 రైతుబజార్లకు 10వేల క్వింటాళ్ల వరకు కూరగాయలను రైతులు తీసుకువస్తున్నారు. కూరగాయల ధరలు రైతుబజార్లలోనే కాదు బహిరంగ మార్కెట్లలో కూడా కిందికి దిగివచ్చాయి. తీరిన కొరత నగర అవసరాలకు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు వస్తుండటంతో కొరత అనేది ఎక్కడా కన్పించట్లేదు. రోజుకు 55వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉండగా, ఆదివారం 75వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతైనట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో నగరంలోని 9 రైతుబజార్లకు 20 టన్నుల వరకు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండటంతో డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యం ఏర్పడింది. దిగుబడులు అధికం కావడంతో రైతుబజార్లో బోర్డుపై రాసిన ధర కంటే మరీ తగ్గించి రైతులు తమ సరుకు అమ్ముకొంటున్నారు. ఆదివారం కూకట్పల్లి, ఎర్రగడ్డ రైతుబజార్లలో చిక్కుడు కేజీ రూ.22లు ధర బోర్డుపై రాయగా రైతులు మాత్రం కేజీ రూ.16లకే విక్రయించారు. అలాగే రూ.27 ధర ఉన్న క్యారెట్ రూ.20లకు, రూ.12లున్న కాలీఫ్లవర్ రూ.8ల ప్రకారం అమ్మారు. మరో వారం రోజుల్లో టమాటా, మిర్చి, బెండ, దొండ, చిక్కుడు, కాకర, బీర వంటి వాటి ధరలు సింగిల్ డిజిట్లోకి (కేజీ రూ.10లోపు) పడిపోయే అవకాశాలున్నాయి. -
ఆర్థిక వ్వవస్థ అతలాకుతలం...!
న్యూఢిల్లీ: కూరగాయలు... ముఖ్యంగా ఉల్లిపాయలు, టమాటాల ధరల సెగతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా చుక్కలనంటింది. నవంబర్‌లో 11.24 శాతానికి దూసుకెళ్లింది. ఇది తొమ్మిది నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. అక్టోబర్‌లో 10.17% (సవరణ తర్వాత)తో పోలిస్తే రిటైల్ ధరల పెరుగుదల రేటు 1.07% ఎగబాకడం ధరల మంటకు నిదర్శనం. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. రిటైల్ ధరల అనూహ్య పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని, మళ్లీ పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు సమీక్షల్లో కూడా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పావు శాతం చొప్పున కీలక వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ధరల కట్టడే ప్రధాన లక్ష్యమంటూ తాజాగా మరోసారి స్పష్టం చేశారు కూడా. కూర‘గాయాలు’... నవంబర్‌లో కూరగాయల ధరలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 61.6% ప్రియం అయ్యాయి. అక్టోబర్‌లో ఈ పెరుగుదల రేటు 45.67 శాతంగా ఉంది. కాగా, నవంబర్‌లో పండ్ల ధరలు 15%, పప్పుధాన్యాల ధరల 1.2%, తృణధాన్యాల ధరలు 12.07%, పాల ధరలు 9.06% చొప్పున పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపలు కూడా 11.96% ప్రియంగా మారాయి. ఆహార, పానీయాల విభాగం ద్రవ్యోల్బణం 14.72 శాతానికి(అక్టోబర్‌లో 12.56%) ఎగసింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 11.74%, పట్టణ పాంతాల్లో 10.5%గా నమోదైంది. కాగా, నవంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం(16న) వెలువడనున్నాయి. అక్టోబర్‌లో టోకు ధరల పెరుగుదల రేటు 7 శాతానికి(8 నెలల గరిష్టం) ఎగబాకిన సంగతి తెలిసిందే. -
అంతరిక్షానికి ఆకుకూరల రేట్లు
-
ట‘మోత’..
= కేజీ రూ. 50-55 ఉల్లిబాటలోనే =ఇతర కూరగాయలు = వర్షాలతో దెబ్బతిన్న పంటలు =దిగుమతి తగ్గి ధరలపై ప్రభావం = విలవిల్లాడుతున్న వినియోగదారులు సాక్షి, సిటీబ్యూరో: అసలే ఉల్లి ధర కళ్లు బైర్లుకమ్మిస్తోంటే.. తామేమీ తక్కువ కాదంటూ ఇతర రకాల కూరగాయలూ చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో పంట దెబ్బతిని నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. ప్రత్యేకించి టమోట ధర ఠారెత్తిస్తోంది. రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-55 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఏ రకం కొందామన్నా కేజీ రూ.35-60 ధర పలుకుతున్నాయి. వర్షాలకు ముందు ఇవి కేజీ రూ.30కే లభించాయి. మదనపల్లి నుంచి దిగుమతి పడిపోవడంతో టమోట మార్కెట్‌పై ప్రభావం పడింది. అలాగే వర్షాల కారణంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే దిగుమతులూ పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచీ దిగుబడి అంతంతగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి కూరగాయల ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సగానికి పడిపోయిన సరఫరా నగరంలో రోజూవారీ 1.25 లక్షల క్వింటాళ్ల కూరగాయలు అవసరం. ఇప్పుడు సరఫరా అవుతున్న కూరగాయలు ఇందులో సగమే. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మీరాలంమండి, మాదన్నపేట, ఎల్బీనగర్‌లలోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 25 వేల క్వింటాళ్లలోపే కూరగాయలు వస్తున్నాయి. 9 రైతుబజార్లకు 1000 క్వింటాళ్లు, మిగతా ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌కు 20 వేల క్వింటాళ్లు.. మొత్తం 46 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఈ లెక్కన 54 వేల క్వింటాళ్ల కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. ఇక, కేజీ ఉల్లి ప్రస్తుతం కేజీ రూ.60-65కి ఎగబాకింది. ఒక్కోరోజు టోకు మార్కెట్లో ధర తగ్గినా... రిటైల్ వ్యాపారులు అధిక ధరలనే వసూలు చేస్తున్నారు. నగరంలో రోజుకు 1200 టన్నుల ఉల్లి అవసరం ఉండగా అందులో సగమే దిగుమతవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖలో స్పందన కరువైంది. -
తగ్గని కూర‘గాయాలు’
జోగిపేట, న్యూస్‌లైన్: కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ ధరలు ఇప్పుడప్పుడే దిగివచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. పెరిగిన ధరలతో గత రెండు నెలలుగా సామాన్య, మధ్యతరగతి జీవులు అవస్థలు పడుతున్నారు. ఇదివరకు నెల బడ్జెట్లో కూరగాయలకు రూ.450 కేటాయిస్తే సరిపోయేది ఇప్పుడు వెయ్యి రూపాయలు కేటాయించినా సరిపోయే పరిస్థితి లేదు. ధరలు రెట్టింపు కావడంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావు కిలో మేరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదివరకు మూడు పూటలు కూరగాయలతో తినేవారు ఇప్పుడు ఒకేపూటతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆలుగడ్డ, బెండకాయ కిలో ధర రూ.35 చొప్పున, పెద్ద చిక్కుడు, బీర్నిస్, దొండకాయ, మిర్చి రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క టమాటా ధర మాత్రం కాస్త దిగివచ్చింది. కిలో రూ.20 పలుకుతుంది. పాలకూర కట్ట ఒకటి రూ.5, కోతిమీర, కరివేపాకు ఒక కట్ట రూ.5 చొప్పున అమ్ము తున్నారు. ఆదివారం జోగిపేటలో జరిగిన అంగడిలో ఈ ధరలను చూసి సామాన్యులు బిక్కమోహం వేశారు. కూరగాయల ధరలన్నీ ఒకేసారి పెరిగిపోవడంతో ఏ కూరగాయలు కొనుగోలు చేయాలో అర్థం కాని జనం సతమతమవుతున్నారు. ధరలు తగ్గలేదు టమాటా మినహా ఇతర కూరగాయల ధరలు తగ్గలేదు. ఒక్కో కూరగాయ ధర కిలో రూ.40 వరకు ఉంది. ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. ధరలు తక్కువగా ఉంటేనే అన్ని వర్గాల వారు కొనుగోలు చేస్తారు. - రమేశ్, కూరగాయల వ్యాపారి, జోగిపేట