- కొండెక్కిన కూరగాయల ధరలు
- ఎండవేడిమికి తగ్గిన దిగుమతులు
- వినియోగదారుల అవస్థలు
విజయవాడ : కూరగాయల ధరలు కొండెక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు బాగా పెరిగాయి. ఎండవేడిమి, వడగాడ్పులకు జిల్లాలో ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి టమోటా, బెండ, దొండ, వంకాయల ధరలు రోజుకో రేటుతో చుక్కలనంటుతున్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజార్‌కు వారం రోజుల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గాయి.
రోజూ ఇక్కడి రైతుబజార్‌కు 2,500 క్వింటాళ్ల కూరగాయలు ఉత్పత్తి అవుతుంటాయి. కొద్దిరోజుల నుంచి 1800 క్వింటాళ్లకు తగ్గాయి. దాదాపు 700 క్వింటాళ్ల కూరల ఉత్పత్తులు ఒక్క స్వరాజ్యమైదానం రైతుబజార్‌లోనే తగ్గాయి. ఇలాగే జిల్లాలోని 17 రైతుబజార్లలో పరిస్థితి ఉంది. వీటిలో రోజుకు దాదాపు 20వేల క్వింటాళ్ల ఉత్పత్తులు దిగుమతి అవ్వాల్సి ఉండగా, కేవలం 14వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతు బజార్లలో సరైన కూరలు లభ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావంతో ప్రయివేటు మార్కెట్‌లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
వెజిట్రబుల్స్
Published Thu, May 28 2015 4:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement