
ఉల్లిపాయలు తినొద్దు: సుప్రీంకోర్టు
ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని నియంత్రించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే, నియంత్రణ తమ చేతుల్లో లేదని, అయినా ప్రజల ఆదాయం కూడా పెరిగినందున ఈ ధరలు పెద్ద లెక్కలోనివి కావని సాక్షాత్తు ప్రధానమంత్రే అంటున్నారు. పోనీలే, సుప్రీంకోర్టయినా ప్రజల ప్రయోజనార్థం ఈ విషయంలో కల్పించుకుంటుందని అనుకుంటే అక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురైంది.
ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలను నియంత్రించేలా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు.. ''ఉల్లిపాయలు తినడం మానేయండి, అప్పుడు ధరలు అవే దిగొస్తాయి'' అని జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేస్తూ అనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని కూడా తెలిపింది.