సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం నవంబరు మాసానికి 0.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఆహార ధరలు కొండెక్కడంతో అక్టోబర్‌లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత దిగజారింది. కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది. ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఫ్లాట్‌గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా నష్టాల్లోకి మారింది.
Comments
Please login to add a commentAdd a comment