
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్‌లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ నవంబరు నెలలో 3.93 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా డబ్ల్యుపిఐ ఎనిమిదినెలల గరిష్టాన్ని తాకింది. ఈ మేరకు గురువారం వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది.
సవరించిన బేస్ సంవత్సరం 2011-12 తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) 2017 నవంబర్ నెలలో 3.93 శాతంగా నమోదైంది. గత నెలల ఇది 3.59 శాతంగా ఉంది. ఆహారధరల సూచీ ఇయర్ ఆన్ ఇయర్ 4.10 శాతం పెరిగింది. గతనెలలో నెల 3.23 శాతం పెరుగుదలను నమోదుచేసింది.