అక్టోబర్‌లో 17 శాతం పెరుగుదల
39.2 బిలియన్ డాలర్లు
రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరువ
విస్తరించిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనల నడుమ దేశ ఎగుమతులు ప్రోత్సాహకర స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 39.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. చివరిగా 2022 జూన్ నెలలో ఎగుమతుల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసి గణాంకాలను పరిశీలించగా.. అక్టోబర్‌లో దిగుమతులు 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 63.86 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులు 13.34 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 27.14 బిలియన్ డాలర్లకు చేరింది. సెపె్టంబర్ చివరికి ఇది 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలతో పోల్చి చూస్తే వాణిజ్య లోటు 3.29 బిలియన్ డాలర్ల మేర తక్కువగా ఉంది.
చమురు, నూనెల దిగుమతులు అధికం..
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 5.77 శాతం ఎగసి 416.93 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 164.65 మిలియన్ డాలర్లకు ఎగిసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 149.67 బిలియన్ డాలర్లుగా ఉంది.
→ ఏప్రిల్–అక్టోబర్ మధ్య సేవల ఎగుమతులు 216 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 192 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ అక్టోబర్‌లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 40 శాతం పెరిగి 11.25 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 46 శాతం వృద్ధితో 3.43 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
→ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 36 శాతం మేర పెరిగాయి.
→ బంగారం దిగుమతులు సైతం సెపె్టంబర్‌లో ఉన్న 4.39 బిలియన్ డాలర్ల నుంచి అక్టోబర్‌లో 7.13 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో 7.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ ముడి చమురు దిగుమతులు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 18.2 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment