Indian exports
-
ఎఫ్ఐఈవో, బిజినెస్ రష్యా ఎంవోయూ
న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో), బిజినెస్ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది. రెడీ టూ ఈట్ మీల్స్, ఫిష్ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్ఐఈవో బోర్డ్ సభ్యుడు ఎన్కే కగ్లివాల్ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్ ఎగుమతులు 750 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. -
ఎగుమతులు.. మూడో నెలా మైనస్
న్యూఢిల్లీ: ప్రపంచ, దేశీయ తాజా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతి, దిగుమతి గణాంకాలు అద్దం పడుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ఎగుమతులు వరుసగా మూడవ నెల ఫిబ్రవరిలోనూ వృద్ధిలేకపోగా క్షీణతనే నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల విలువ 8.8 శాతం పడిపోయి, 33.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల్లోనూ 8.21 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. 2022 ఇదే నెలతో పోల్చితే ఈ విలువ 55.9 బిలియన్ డాలర్ల నుంచి 51.31 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వెరసి అధికారిక గణాంకాల ప్రకారం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య... 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య 11 నెలల్లో వస్తు ఎగుమతులు 7.5% పెరిగి, 406 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే కాలంలో దిగుమతులు 18.82% పెరిగి 653 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 247 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు తాకాయి. 2022-23లో ఈ విలువను అధిగమిస్తున్నామన్న హర్షాతిరేకాలు భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ)సహా సంబంధిత వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ► 11 నెలల్లో పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్, బియ్యం, రెడీ మేడ్ దుస్తుల ఎగుమతులు పెరగ్గా, ఇంజనీరింగ్ గూడ్స్, రత్నాభరణాలు, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, ప్లాసిక్, లినోలియం ఎగుమతులు క్షీణించాయి. ► పసిడి దిగుమతులు ఇదే కాలంలో భారీగా పడిపోయి, 45.12 బిలియన్ డాలర్ల నుంచి 31.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఇక క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్ల నుంచి 193.47 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
రెండోనెలా ఎగుమతులు కిందికే... జనవరిలో 7 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 6.58 శాతం తగ్గి, 32.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి నేపథ్యం. గడచిన 10 నెలలుగా ఇంజనీరింగ్ గూడ్స్, ముడి ఇనుము, ప్లాస్టిక్, రత్నాలు–ఆభరణాల రంగాలు క్షీణ రేటులో ఉన్నాయి. 10 నెలల్లో... ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 21.89 శాతం పెరిగి 602.20 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 233 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లుపైబడగా, 2022–23లో కూడా దాదాపు ఇదే గణాంకాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా సమీక్షా కాలం 10 నెలల్లో క్రూడ్ దిగుమతుల విలువ 53.54 శాతం పెరిగి 178.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులూ క్షీణతే.. దిగుమతులు కూడా జనవరిలో 3.63 శాతం క్షీణించాయి. విలువలో 50.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు ఏప్రిల్–జనవరి మధ్య 11.26% తగ్గి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 12 నెలల కనిష్టం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 12 నెలల కనిష్టంగా 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రష్యా నుంచి 384 శాతం పెరిగిన దిగుమతులు 2022–23 ఏప్రిల్–జనవరి మధ్య రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏకంగా 384 శాతం పెరగడం గమనార్హం. విలువలో ఏకంగా 37.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రూడ్ ఈ విలువలో కీలక వెయిటేజ్ పొందింది. 2021–22లో 9.86 బిలియన్ డాలర్ల దిగుమతులతో రష్యా భారత్‌కు 18వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. తాజా సమీక్షా నెల్లో ఈ అంకె 4కు తగ్గిపోయింది. ఆర్థిక మంత్రి సూచనలు.. అంతర్జాతీయంగా మందగమనం వచ్చే అవకాశాలను, తమ తమ వ్యాపారాలపై దాని ప్రభావాల గురించి ఎగుమతిదారులు ముందస్తుగానే అంచనాలు వేసుకుని సన్నద్ధంగా ఉండాలని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొన్నారు. రూపాయిలో వాణిజ్యానికి ఆసక్తి భారత్‌తో రూపాయిలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు పలు దేశాల్లో ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు వీలుగా పలు బ్యాంకులు ప్రత్యేక వ్యాస్టో అకౌంట్లను ప్రారంభిస్తున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అకౌంట్లు ప్రారంభించిన జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యుకో బ్యాంక్‌సహా 20 బ్యాంకులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రష్యాసహా రూపాయిలో ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్లు కూడా వీటిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలు, దీనితో డాలర్ మారకంలో వాణిజ్యంలో ఇబ్బందులు వంటి పరిణామాలు రూపాయిలో వాణిజ్యానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
మన ఎగుమతులపై అంతర్జాతీయ సవాళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో వాణిజ్యలోటు సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది (2021 జూన్‌లో ఈ విలువ 9.61 బిలియన్ డాలర్లు). దిగుమతుల బిల్లుపై క్రూడ్ ఆయిల్, బంగారం భారం పడుతుండడం గమనార్హం. ఈ పరిమాణం ఫారెక్స్ నిల్వలు తగ్గడంసహా కరెంట్ అకౌంట్ లోటు మరింత తీవ్రతకు (భారత్‌కు వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం), రూపాయి మరింత బలహీనతకు దారితీసే అంశం కావడం గమనార్హం. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తొలి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఎగుమతుల విభాగం ఇలా... ► నెలవారీ, వార్షికంగా చూసినా ఎగుమతుల వృద్ధి స్పీడ్ (17 శాతం) జూన్‌లో తగ్గడం గమనార్హం. 2022 మేలో ఎగుమతుల వృద్ధి 20.55 శాతం. 2021 జూన్‌లో ఈ రేటు ఏకంగా 48.34 శాతం. ► సమీక్షా నెల్లో ఇంజనీరింగ్, ఫార్మా, ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. హై బేస్ కూడా దీనికి కారణమన్నది విశ్లేషణ. ► కాగా పెట్రోలియం ప్రొడక్టుల విలువ 98% ఎగసి 7.82 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.41% ఎగసి 3.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల తీరిది ► క్రూడ్ దిగుమతుల విలువ జూన్‌లో 94 శాతం పెరిగి 20.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► బొగ్గు, కోక్ దిగుమతుల విలువ 1.88 బిలియన్ డాలర్ల నుంచి 6.41 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► పసిడి దిగుమతుల విలువ 169.5 శాతం ఎగసి 2.61 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతుల భారీ పెరుగుదల నేపథ్యంలో కేంద్రం వీటిపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బంగారం దిగుమతుల కట్టడి దీని లక్ష్యం. మొదటి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) ఎగుమతులు 22.22 శాతం పెరిగి 116.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 47 శాతం పెరిగి 187.02 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 70.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 31.42 బిలియన్ డాలర్లు. రెట్టింపు కరెంట్ అకౌంట్ వాణిజ్యలోటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో కరెంట్ అకౌంట్‌లోటు 13 బిలియన్ డాలర్లు. అయితే ఇది జూన్ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. 2022–23లో క్యాడ్ 100 నుంచి 105 బిలియన్ డాలర్లు నమోదుకావచ్చు. 2022లో ప్రతి నెలా 20 డాలర్లపైనే వస్తువులకు సంబంధించి వాణిజ్యలోటు కొనసాగుతుందని భావిస్తున్నాం. అయితే సేవల రంగం నుంచి ఎగుమతుల పురోగమనం కొంత ఊరటనిచ్చే అంశం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఎగుమతుల భారీ వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న పథకం ఇందులో ఒకటని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 419 బిలియన్ డాలర్లు భారత్ ఎగుమతుల లక్ష్యమని తెలిపారు. గడచిన పదేళ్లలో ఎగుమతులు దాదాపు 290 బిలియన్ డాలర్లు– 330 బిలియన్ డాలర్ల మధ్య నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ప్రపంచ దేశాలతో సహకారాన్ని (అనుసంధానం) భారత్ విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది లేకుంటే ప్రపంచంతో విడిపోయినట్టుగానే ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పుకోతగ్గ సాధించిందేమీ లేదంటూ.. అంతర్గత సమస్యల కారణంగా ఇంతకుమించి ఆశించడానికి కూడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకార ఒప్పందాల దిశగా అడుగులు వేసినట్టు చెప్పారు. ‘‘ప్రాంతీయంగా మనకు ఎటువంటి సహకార ఒప్పందాలు లేవు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కోరుకునేట్టు అయితే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కలిగి ఉండాలి’’ అంటూ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం తన అభిప్రాయాలను వెల్లడించారు. భారీ పన్ను వసూళ్ల అంచనా: రెవెన్యూ కార్యదర్శి బజాజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారీ పన్ను వసూళ్లు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శ తరుణ్ బజాజ్ సీఐఐ సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్ రంగం పనితీరు ఊహించినదానికన్నా బాగుండడమే తమ ఈ అంచనాలకు కారణమని వివరించారు. ఆటో రంగంపై అధిక జీఎస్టీ రేట్లు ఉన్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలన జరుగుతుందని, అధికంగా ఉన్న రేట్లను అవసరమైతే తగ్గిస్తుందని తెలిపారు. పన్ను పరిధిని పెంచడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో పన్నుల నిష్పత్తి పెంపునకు మదింపు జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్‌లో పన్ను వసూళ్లు జీడీపీలో దాదాపు 10 శాతంగా ఉంటే, అభివృద్ధి చెందని దేశాల్లో దాదాపు 25 నుంచి 28 శాతం శ్రేణి ఉందని అన్నారు. చదవండి: ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా? -
అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు
న్యూఢిల్లీ: టారిఫ్యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు. ఏ ఒక్కరి విషయంలోనో కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగేలా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలన్నది తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ‘ఏ దేశమైనా మీ ఎగుమతులపై టారిఫ్యేతర ఆంక్షలు విధించడం గానీ.. ఇతరత్రా అవరోధాలు గానీ సృష్టించడం గానీ చేస్తుంటే ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది. ఆయా దేశాలపై అదే తరహా వాణిజ్యపరమైన ఆంక్షలతో తగు చర్యలు తీసుకుంటుంది‘ అని గోయల్ తెలిపారు. వాస్తవ పరిస్థితులు మీరే చెప్పండి .. ‘మా అధికారులు నాకు చెప్పేవన్నీ.. అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగేలా ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే కచ్చితంగా అలా ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా.. సమస్యలేమైనా ఉన్నాయా.. వాస్తవ పరిస్థితులను మీరే ప్రభుత్వానికి తెలియ జేయండి. నేను, మా అధికారులు మీకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాం‘ అని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యలోటును కట్టడి చేయాలి: ఐఎంఎఫ్ ఇదిలావుండగా, భారత్ ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. వ్యయాల హేతుబద్ధీకరణ, ఆదాయం పెంపు మార్గాల ద్వారా ఇది సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఫిక్కీ న్యూఢిల్లీలో నిర్వహించిన 92వ వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు. గడచిన కొద్ది త్రైమాసికాలుగా చూస్తే, ప్రైవేటు రంగం డిమాండ్ మందగమనంలో ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే పెట్టుబడుల్లో బలహీనత కొనసాగితే, దీర్ఘకాలంలో అది వృద్ధితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. బజాజ్ వ్యాఖ్యలకు కౌంటర్! ప్రభుత్వ విధానాలను విమర్శించే దమ్మెవరికీ లేకుండా పోయిందని, భయాందోళనలకు గురి చేసే వాతావరణం నెలకొందని పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తుందని, అందరి అభిప్రాయాలనూ వింటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు, పరిశ్రమవర్గాల నుంచి మరింతగా తెలుసుకోవాలనుకుంటోందని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. -
ట్రంప్ ‘యుద్ధం’తో భారత్‌కే మేలు
దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. వీటి దిగుమతులు కూడా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఫలితంగా వీటి ధరలు మున్నెన్నడూ లేని రీతిలో పడిపోయాయి. ఇవి పండించే రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు తమ దిగుబడులను అమ్ముకోవాల్సి వచ్చిందని అనేక అంచనాలు చెబుతున్నాయి. పప్పుధాన్యాల దిగుమతిపై సుంకాలు పెంచాలన్న నిర్ణయం వాటిని మనకు ఎగుమతి చేసే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్ వంటి దేశాలకు ఆగ్రహం కలిగించింది. కానీ ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధాన్ని ఇండియాలో మళ్లీ వ్యవసాయ పునరుద్ధరణకు ఆయుధంగా, విధానంగా వాడుకోవడం మంచిది. భారతదేశానికి అవసర మైన బాదం పప్పుల్లో సగం అమెరికా నుంచి ఎందుకు మనం దిగుమతి చేసుకుంటున్నామో నాకు అర్థం కావడం లేదు. బాదం దేశంలో దొరకనిది కాదు. బాదం ఉత్పత్తి కొండ ప్రాంతాలున్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌కే పరిమిౖతమెనాగానీ, ఏటా దేశంలో వినియోగించే 97 వేల టన్నుల బాదం పప్పులో అత్యధిక భాగం అమెరికా నుంచే దిగుమతి చేసు కుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోకి దిగుమతయ్యే వివిధ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా వాణిజ్య యుద్ధాలకు తెర తీశారు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో అవసరమైన దిద్దుబాట్లకు ఆయన గొప్ప అవకాశం కల్పించారు. ఉక్కు, అల్యూ మినియంపై దిగుమతి సుంకాలు వేయడానికి ట్రంప్ నిరాకరించడంతో, ఇండియా దానికి ప్రతీ కారంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 29 ఉత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలు పెంచింది. వీటిలో బాదం, బఠాణీ, వాల్నట్, రొయ్యల లాంటి ఆర్టీ మియా వంటివి ఉన్నాయి. దేశీయ ఉత్పత్తి పెంపుదలే భద్రతకు హామీ వ్యవసాయోత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలు పెంచడంతో దేశంలో వాటి ఉత్పత్తి పెంపు దలను ప్రోత్సహించినట్లే అవుతుందని నేను భావి స్తున్నాను. ఇలా దేశీయ ఉత్పత్తి పెరిగితే ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న కోట్లాది మంది రైతుల బతుకులకు భద్రత లభిస్తుంది. ఆహారం దిగుమతి చేసుకోవడం అంటే నిరుద్యోగాన్ని దిగుమతి చేసు కోవడంగా మనం ఎప్పుడూ భావిస్తున్నాం. బాదం పప్పుపై ఇప్పుడున్న నూరు శాతం దిగుమతి సుంకాన్ని 120 శాతానికి పెంచగా, వాల్‌నట్స్‌పై అదనంగా 20 శాతం విధించారు. అలాగే, యాపిల్ పళ్లపై సుంకాన్ని 50 నుంచి 75 శాతానికి పెంచారు. శనగలు, ఎర్ర కందిపప్పుపై సుంకం 30 నుంచి 40 శాతానికి చేరుతుంది. వ్యవసాయోత్పత్తుల దిగుమ తులను సరళతరం చేయడం వల్ల దేశానికి చాలా నష్టం జరిగింది. వీటిపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు బాగా దిగజారడంతో దేశంలోకి 2015–16లో రూ.1,402,680,000,000 విలువైన వ్యవసాయోత్ప త్తుల దిగుమతి జరిగింది. అంటే దిగుమతుల విలువ మన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించే మొత్తానికి మూడు రెట్లయింది. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. వీటి దిగుమతులు కూడా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఫలితంగా వీటి ధరలు మున్నెన్నడూ లేని రీతిలో పడిపోయాయి. ఇవి పండించే రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు తమ దిగుబడులను అమ్ముకోవాల్సి వచ్చిం దని అనేక అంచనాలు చెబుతున్నాయి. 2017–18లో వీటి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 240 లక్షల టన్నులకు పెరిగినాగాని దిగుమతులు వచ్చి పడుతూనే ఉన్నాయి. 2016–17లో 66.08 లక్షల టన్నుల పప్పులు దిగుమతి చేసుకోగా, 2015–16లో 57.97 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. పప్పుధా న్యాల దిగుమతిపై సుంకాలు పెంచాలన్న నిర్ణయం వాటిని మనకు ఎగుమతి చేసే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఐరోపా యూనియన్, జపాన్ వంటి దేశాలకు ఆగ్రహం కలిగించింది. దీంతో భారత్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వివాదాల పరిష్కార సంఘానికి లాగుతామని ఈ దేశాలు హెచ్చరించాయి. అన్ని దిగుమతులపైన సుంకాలు అవశ్యం అయితే, తన ఏకపక్ష వాణిజ్య చర్యలు డబ్ల్యూ టీఓ పరిమితులకు లోబడే ఉన్నాయని ఇండియా వాదించింది. శనగలు, ఎర్ర కందిపప్పుపై ఇండియా దిగుమతి సుంకం పెంచేలా అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. పప్పులపై దిగుమతులపై సుంకాలను ఒక్క అమె రికా విషయంలోనే గాక మొత్తంగా పెంచాలి. మన రైతుల ప్రయోజనాలు కాపాడడమే మౌలిక లక్ష్యం కావాలి. అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రభుత్వాలు భారీగా ఇస్తున్న రాయితీలు స్థానిక రైతులను కాపా డుతున్నాయి. అంతేగాక ఈ సర్కార్ల చర్యల కార ణంగా పప్పుల అంతర్జాతీయ ధరలు తగ్గిపోతు న్నాయి. ఈ దేశాల నుంచి వీటి ఎగుమతులు చౌకగా లభిస్తున్నాయి. అందుకే వర్థమానదేశాలకు చౌక ధర లకు కుప్పలు తెప్పలుగా పప్పుధాన్యాలు వచ్చి పడు తున్నాయి. సబ్సిడీల వల్ల ఇవి పండించే దేశాల రైతులు లబ్ధి పొందుతున్నారు. వాల్నట్ పంటతో జమ్మూకశ్మీర్ యువతకు ఉపాధి వాల్నట్ సాగు ప్రధానంగా జమ్మూకశ్మీర్‌కే పరిమి తమైంది. దేశంలో మొత్తం వాల్నట్ ఉత్పత్తిలో 90.30 శాతం వాటా ఈ రాష్ట్రానిదే. తర్వాతి స్థానాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి పర్యత ప్రాంత రాష్ట్రాలవి. దేశంలో కొన్ని సంవత్సరాలుగా వాల్నట్ సాగు, ఉత్పత్తి తగ్గిపో వడం లేదా పెరగకపోవడం జరుగుతోంది. అయితే, గడచిన కొన్నేళ్లలో అమెరికా నుంచి కాలిఫోర్నియా వాల్నట్ దిగుమతి ఎన్నో రెట్లు పెరిగింది. 2014–15లో వాల్నట్ దిగుమతులు అమెరికా నుంచి 85,500 పౌండ్ల మేరకు జరిగాయి. వాల్నట్ల దిగుమతులు పెరిగేకొద్దీ దేశంలో వాటి ఉత్పత్తికి నష్టం జరిగింది. భారత ప్రభుత్వం వాల్నట్ సాగును ఒక్క జమ్మూకశ్మీర్లోనే జరిగేలా దృష్టి సారించి, శ్రద్ధ పెట్టి ఉంటే లక్షలాది మంది కశ్మీరీ యువతకు ఆర్థిక ప్రోత్సాహం, ఉపాధి లభించి ఉండేవి. అమెరికాలో నాలుగు వేల మంది వాల్నట్ ఉత్పత్తిదారులుండగా, అక్కడి ప్రభుత్వం వారి ప్రయోజనాలు కాపాడడానికి చేయాల్సినదంతా చేస్తోంది. ఇండియా కూడా వాల్ నట్ దిగుమతులపై సుంకాలు పెంచి, సంక్షోభంలో కూరుకుపోయిన కశ్మీర్ లోయలో ఆర్థికాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం మంచిది. వాల్నట్ సాగు పెరిగితే కశ్మీర్ ఆర్థిక స్వరూపం మారి పోతుంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బాదం, వాల్నట్, యాపిల్ మూడు అత్యంత ప్రధానమైన వాణిజ్య పంటలు. అన్ని దేశాల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిం చాలనే వాణిజ్య నిబంధల కారణంగా యాపిల్ పండ్ల దిగుమతులకు అవకాశం ఇవ్వడంతో దేశంలో ఈ పంట పండించే రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోకి 44 దేశాల నుంచి యాపిల్ పండ్లు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పండించే యాపిల్ పండ్లకు డిమాండ్ తగినంత లేకుండా పోతోంది. ప్రస్తుతం యాపిల్ పండ్ల దిగు మతులపై విధిస్తున్న సుంకాన్ని 50 నుంచి నూరు శాతానికి పెంచాలని ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇలా యాపి ల్‌పై దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచితే హిమాచల్ ప్రదేశ్‌లోని రూ.3000 కోట్ల యాపిల్ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడ గలుగుతుంది. ఏదేమైనా, అమెరికా నుంచి చీడపీడలతోనే యాపిల్ పండ్లు దిగుమతి అవుతున్నాయి. నానాటికి వాషింగ్టన్ యాపిల్ పండ్ల దిగుమతులు పెరుగు తూనే ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చే యాపిల్స్ 106 రకాల చీడపీడల బారిన పడినవేనని ఇంగ్లండ్‌కు చెందిన వ్యవసాయ, జీవ శాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంట ర్నేషన్ (కాబి) జరిపిన అధ్యయనంలో తేలింది. అందుకే, నాసిరకం యాపిల్ పండ్ల దిగుమతుల దిగుమతులు తగ్గించడానికి సుంకాలకు సంబంధం లేని ఇతర నిబంధనలు తొలగించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ చేష్టలతో భారత్‌కు ఓ రకంగా మేలే దేశంలో బాదం పప్పులు, వాల్నట్, యాపిల్ పండ్ల సాగు విస్తరించడానికి డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి మంచి అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ట్రంప్ చర్యలను వ్యాపారానికి నష్టం చేసేవిగా పరిగణించ కూడదు. ఇండియాలో వ్యవసాయాన్ని మళ్లీ పున రుద్ధరించడానికి ఆయుధంగా, విధానంగా వాడుకో వడం మంచిది. దేశంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో సాగుతుండగా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను అవసరాలకు అనుగుణంగా మార్చు కుని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిం చాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్‌శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఎగుమతులు రివర్స్‌గేర్
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2017–18 ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో నిరాశపరిచాయి. 2017 మార్చితో పోల్చిచూస్తే, 2018లో మార్చిలో ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా –0.66% క్షీణించి 29.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు మైనస్‌లోకి జారడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి. వాణిజ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. పెట్రోలియం, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల క్షీణత మొత్తం నెలవారీ ఎగుమతులపై ప్రభావం చూపింది. దిగుమతుల్లో 7.15 అప్ ఇక దిగుమతులు మార్చిలో 7.5 శాతం పెరిగి 42.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 13.69 బిలయన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతులు 13.92 శాతం పెరిగి 11.11 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 4.96 శాతం ఎగసి 31.69 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పసిడి దిగుమతులు 40 శాతం డౌన్ మార్చి నెలలో పసిడి దిగుమతులు 40 శాతం తగ్గి 2.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వెండి దిగుమతులు మాత్రం 31 శాతం పెరిగి 267.33 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం పసిడి దిగుమతులపై 10 శాతం సుంకం అమలవుతోంది. వార్షికంగా సానుకూలం... 2017 ఏప్రిల్ – 2018 మార్చి (2017–18) మధ్య 12 నెలల కాలంలో ఎగుమతుల్లో 9.78 శాతం పెరిగాయి. విలువ రూపంలో 302.84 బిలియన్ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతుల 19.59 శాతం పెరిగి 459.67 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్యలోటు 156.83 బిలియన్ డాలర్లు. 2012–13 తరువాత (190.30) అంతస్థాయిలో వాణిజ్యలోటు ఇది. కాగా ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతులు 25.47 శాతం పెరుగుదలతో 109.11 బిలియన్ డాలర్లకు చేరాయి. విశేషం ఏమిటంటే.. ఎగుమతులు మళ్లీ 300 బిలియన్ డాలర్లను అధిగమించడం రెండేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2014–15 ఏడాదిలో 310.30 బిలియన్ డాలర్లను నమోదుచేసుకున్న తరువాత మళ్లీ 300 మార్కును ఎగుమతులు చూడలేదు. ఆందోళనకరం: ఎఫ్ఐఈఓ రత్నాలు, ఆభరణాలు, జౌళి, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత విభాగాల నుంచి ఎగుమతులు ప్రోత్సాహకరంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎగుమతుల సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నిబంధనలు కఠినతరం వల్ల ఆయా రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఈ ప్రకటన వివరించింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధ ఉద్రిక్తతలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. -
రూపాయి ఇంకా బలహీనపడాలి
ఎగుమతులను కాపాడ్డానికి ఇదే మార్గమన్న ఎస్బీఐ చీఫ్ - చైనా నుంచీ చౌక దిగుమతులకు అడ్డుకట్ట అవసరమని సూచన... ముంబై: భారత ఎగుమతులను కాపాడేందుకు రూపాయి మరింత బలహీనపడాల్సిన అవసరం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య సోమవారం అభిప్రాయపడ్డారు. దీనితోపాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చైనా నుంచి భారీ ఎత్తున జరుగుతున్న చౌక దిగుమతులూ ఆగాల్సి ఉంటుందని ఆమె అన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిన నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రూపాయి మరింత బలహీనపడకపోతే భారత్ ఎగుమతులకు కష్టాలు తప్పవని ఆమె ఇక్కడ ఒక వార్తా సంస్థతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. - అమెరికా డాలర్ విలువతో పోల్చితే మాత్రమే రూపాయి విలువ తగ్గింది. పలు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే పటిష్టంగానే ఉంది. పలు పోటీ దేశాల వాస్తవ ప్రభావ మార్పిడి రేటు (ఆర్ఈఈఆర్)తో చూస్తే, రూపాయి ఇప్పటికీ అధికంగానే ట్రేడవుతోంది. - రూపాయి బలహీనతవల్ల స్వల్పకాలిక ఇబ్బం దులు ఉన్నా. ఎగుమతుల వృద్ధికి ఇది తప్పని పరిస్థితి. రూపాయి పటిష్టంగా ఉంటే ఎగుమతులు తగ్గడంతో పాటు చైనా నుంచి దీర్ఘకాలంలో చౌక దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. - ముంబైని అంతర్జాతీయ ఫైనాన్స్ సెంటర్‌గా మార్చే క్రమంలో అక్కడ పలు విభాగాల్లో మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి. - రుణ వృద్ధి జరుగుతోంది. అయితే ఇది చాలా నెమ్మదిగా ఉంది. మనం ఇంకా రెండవ త్రైమాసికంలోనే ఉన్నాం. రుణ వృద్ధి రేటు గురించి పూర్తి పరిస్థితి తెలవడానికి మిగిలిన త్రైమాసికాలూ పూర్తికావాల్సి ఉంటుంది.