
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి నెలలో స్వల్పంగా క్షీణించింది. 2024 డిసెంబర్ నెలలో 3.7 శాతంగా ఉండగా, అక్కడి నుంచి 2.31 శాతానికి దిగొచ్చింది. ఆహారోత్పత్తులు, ముఖ్యంగా కూరగాయల ధరలు శాంతించడం సానుకూలించింది. 2024 జనవరి నెలకు ఇది 0.33 శాతంగా ఉండడం గమనార్హం.
విభాగాల వారీగా..
గత డిసెంబర్‌లో ఆహార వస్తువల ద్రవ్యోల్బణం 8.47 శాతం స్థాయిలో ఉంటే, జనవరిలో 5.88 శాతానికి శాతించింది.
కూరగాయల ద్రవ్యోల్బణం 28.65 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. ఈ విభాగంలో టమాటాల ధరలు 18.9 శాతం తగ్గాయి.
ఆలుగడ్డల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో 74.28 శాతంగా ఉంది. ఉల్లిగడ్డల ఆధారిత ద్రవ్యోల్బణం 28.33 శాతానికి పెరిగింది.
గుడ్లు, మాంసం, చేపల విభాగంలోనూ 5.43 శాతం నుంచి 3.56 శాతానికి దిగొచ్చింది.
ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 3.79 శాతం నుంచి 2.78 శాతానికి చల్లబడింది.
తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2.14 శాతం నుంచి 2.51 శాతానికి పెరిగింది.
పెరిగే రిస్క్..
‘‘టోకు ద్రవ్యోల్బణం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సగటున 2.4 శాతంగా ఉండొచ్చు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఇది 3 శాతానికి పెరగొచ్చు’’అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment