Prices of food products
-
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్‌లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్‌కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్‌కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ! దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 7.41శాతానికి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7శాతం క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1శాతం. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9 శాతం క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16 శాతం నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20శాతం నుంచి 5శాతానికి పడిపోయింది. -
టోకు ధరల ఊరట...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో ఊరట కలిగించింది. కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఆగస్టుతో పోల్చితే 2014 ఆగస్టులో టోకు ధరలు కేవలం 3.74 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో వార్షిక ద్రవ్యోల్బణం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. (2009 అక్టోబర్‌లో ఈ సూచీ 1.8 శాతంగా నమోదయ్యింది) 2014 జూలై నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.19 శాతం. 2013 ఆగస్టు నెలలో ఈ రేటు 6.99 శాతంగా ఉంది. ఆహార ధరలు తగ్గడమే కారణం! ఆగస్టు నెలలో ఉల్లి, కూరగాయలుసహా ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గడమే మొత్తం ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణం. టోకు ధరల సూచీలోని మొత్తం మూడు విభాగాల్లో ఒక సబ్- కేటగిరీగా ఉన్న ఆహార ఉత్పత్తుల సూచీ అతి తక్కువగా నమోదయ్యింది. జూలైలో ఈ రేటు 8.43 శాతం ఉంటే, ఇది ఆగస్టులో భారీగా 3.28 శాతం పడిపోయి 5.15 శాతానికి చేరింది. వేర్వేరుగా చూస్తే కూరగాయలు (4.88 శాతం), ఉల్లిపాయలు(44.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల(5.87 శాతం) ధరలు గత యేడాది ఆగస్టులో పోల్చిచూస్తే 2014 ఆగస్టులో పెరగకపోగా తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే భారీగా పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో ఆలూ (61.61%), పండ్లు (20.31%), పాలు (12.18%) ఉన్నాయి. పప్పు దినుసులు (7.81%), బియ్యం (5.44%) ఉన్నాయి. కాగా తాజా గణాంకాల నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించాలని పారిశ్రామిక ప్రతినిధులు కొందరు డిమాండ్ చేస్తున్నారు. 3 ప్రధాన విభాగాల తీరు... మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 3.89 శాతంగా ఉంది. ఇందులో ఒక సబ్-కేటగిరీగా ఉన్న నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 4.19 శాతంగా ఉంది. మరో సబ్ కేటగిరీ పైన పేర్కొన్న ఆహార ఉత్పత్తులకు (ద్రవ్యోల్బణం 5.15%) సంబంధించింది. ఇంధన-విద్యుత్ కేటగిరీలో ద్రవ్యోల్బణం 4.54%. మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల విభాగం వాటా 3.45 శాతం. -
అక్రమ నిల్వదారులపై కేంద్రం కొరడా
* ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెటింగ్ కారణమంటున్న సర్కార్ * బ్లాక్ మార్కెటింగ్ నాన్ బెయిలబుల్ నేరంగా చట్టంలో మార్పు * రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి: పాశ్వాన్ న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులను అక్రమంగా నిల్వ చేసేవారిపై కొరడా ఝుళిపించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలే కారణమని భావిస్తున్న కేంద్రం.. నిత్యావసర వస్తువుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. అంతేగాక ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ధరలు అదుపు చేయడంలో రాష్ట్రాలు జోక్యం చేసుకునేలా చర్యలు చేపట్టనుంది. వర్షాభావ పరిస్థితులను ముందస్తుగా ఊహించి వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంవల్లే ఉల్లి, ఆలూ ధరలు అమాంతం పెరిగాయని తలపోస్తున్న కేంద్రం.. అలాంటి అక్రమ నిల్వలను ఛేదించాలని రాష్ట్రాలనుకోరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సమావేశంలో వినియోగదారుల చట్టాన్ని మార్చాలనే ఏకాభిప్రాయానికివచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెట్ కారణమన్నారు. అది జాతి వ్యతిరేక పని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించి ధరలను అదుపులో ఉంచాలని రాష్ట్రాలను పాశ్వాన్ కోరారు. చట్టంలో మార్పులు తేవడానికి వారం రోజుల్లోనే కేబినెట్లో చర్చిస్తామన్నారు. వచ్చే మూడు నెలల్లోనే నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు అంగీకరించాయని, అయితే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు ఆరు నెలల సమయాన్ని కోరాయని పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. స్థిరీకరణ నిధిపై ఆయన స్పష్టతనివ్వలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ధరలపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ.. ఏ ఆహార వస్తువులకు కొరత లేదని, అక్రమ నిల్వదారులవల్లే ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు కారణమని ప్రభుత్వం చెప్పడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ విషయం బోధపడిందా అంటూ కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ‘మోడీ సర్కార్ ధరల పెరుగుదలతో హాహాకారాలు పెట్టిస్తోంది’ అనే స్లోగన్‌ను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుకోవాలని ఆయన సూచించారు.