న్యూఢిల్లీ : ఓ వైపు రిటైల్ ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు పెడుతుండగా... మరోవైపు టోకు ధరల ద్రవ్యోల్బణం కాస్త శాంతించింది. డిసెంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.58 శాతానికి తగ్గినట్టు తెలిసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గత నెలలో 3.93 శాతంగా ఉన్న డబ్ల్యూపీఏ, ఈ నెలలో 3.58 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర గణాంకాల కార్యాలయం డేటాలో వెల్లడైంది. కాగ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం ఈ నెలలో ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యాన్ని దాటేసుకుని ఏకంగా 5.21 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే.
నేడు విడుదలైన డేటాలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 4.72 శాతం తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా వార్షికంగా 56.46 శాతానికి పడిపోయింది. ఇది గత నెలలో 59.80 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు ద్రవ్యోల్బణం కూడా 1.67 శాతం క్షీణించింది. కాగ, ఇంధనం, పవర్ సెగ్మెంట్‌లలో టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 9.16 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.61 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment