ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అలా అని ఈ సీజన్‌లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..
ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి.
ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి.
వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.
వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి.
ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..)
Comments
Please login to add a commentAdd a comment