leaf
-
కాసులు కురిపిస్తున్న అలంకరణ ఆకు!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో ‘‘డెకరేషన్ ఆకు’’ ఉండి తీరాల్సిందే! బాపట్ల తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేసే ఈ ప్రత్యేకమైన ఆకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మన రైతులు డెకరేషన్ ఆకు (లైన్ ఆకు)ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఆకర్షణీయంగా, వాడిపోకుండా ఉండే లైన్ ఆకును పూలమాలల్లో కలుపుతారు. ప్రధానంగా శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ డెకరేషన్లో విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్లే దీన్ని ఫంక్షన్ ఆకు, డెకరేషన్ ఆకు అని కూడా వ్యవహరిస్తారు.ఇసుక నేలలు అనుకూలం కావడంతో బాపట్ల పరిసరాల్లోని దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి కొత్తపాలెం, పోతురాజు కొత్తపాలెం, నాగేంద్రపురం, సుబ్బారెడ్డిపాలెం, కుక్కలవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, తులసీనగర్ తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల్లో రైతులు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు. నెల రోజులకు తొలి కోతడెకరేషన్ ఆకును ఒకసారి సాగుచేస్తే రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. తొలి ఏడాది రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. నాటిన నెల రోజులకు కోతకు వస్తుంది. నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరగ్గానే ఆకును కోస్తారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు ఒకసారి కోసి మార్కెట్‌కు తరలిస్తారు. ఆకు పెరిగేందుకు ఎరువుల వాడకంతోపాటు పాచి తెగులు, కుళ్లు తెగుళ్ల నివారణకు ఐదు రోజులకు కొకసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నప్పటికి ఆకుకు ధర ఉంటే మంచి లాభాలే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. లాభదాయకమే..రెండు నెలల క్రితం కిలో రూ.25 పలికిన డెకరేషన్ ఆకు ప్రస్తుతం రూ.20 ఉంది. 70 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఎకరాకు రూ.1.40 లక్షలు రాబడి వస్తుంది. ఏడాదిలో 8 కోతలు ద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తే పెట్టుబడి వ్యయం రూ.3 – 4 లక్షలు పోనూ ఎకరాకు రూ.6 లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. కిలో రూ.5 నుంచి రూ.10 లోపు అమ్మిన సందర్భాల్లో నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. అయితే మిగిలిన పంటలతో పోలిస్తే లైన్ ఆకు సాగు లాభదాయకమేనన్నది రైతుల అభిప్రాయం. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా దిగుబడి వస్తుండడంతో రైతులు ప్రతి 40 రోజులకు కోత కోసి 70 కిలోల చొప్పున బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ మార్కెట్‌కు లారీల్లో తరలిస్తున్నారు. కొందరు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై తదితర మార్కెట్లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా డిమాండ్ నేపథ్యంలో లైన్‌ఆకు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది.ధర ఉంటే మంచి రాబడి20 సెంట్లలో లైన్‌ఆకు సాగు చేశా. తొలుత రూ.40 వేలు పెట్టుబడి పెట్టా. ఒకసారి సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట ఉంటుంది. ప్రతి 40 రోజులకొకసారి ఆకు కోతకోసి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు పంపుతున్నాం. ప్రస్తుతం కిలో ఆకు రూ.20 ఉంది. ఈ మాత్రం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – ఎం.నారాయణరెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంకొమ్మ తెచ్చి నాటాలి70 సెంట్లలో లైన్ ఆకు సాగుచేశా. కొమ్మ తెచ్చి నాటితే మూడు నాలుగేళ్లు ఉంటుంది. కోసిన ఆకును 70 కిలోల బస్తాల్లో నింపి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పంపుతున్నాం. – రామకృష్ణారెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంజాగ్రత్తగా పెంచుకోవాలిఎకరం పొలంలో డెకరేషన్ ఆకు సాగు చేశా. తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఆకు కోసిన ప్రతిసారీ ఎరువులు వేయడంతోపాటు వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా. ఆకును జాగ్రత్తగా పెంచుకోవాలి. నెల క్రితం కిలో రూ.25 చొప్పున ధర ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రేటు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావు.– కుక్కల కోటిరెడ్డి, రైతు, కుక్కలవారిపాలెంఏడాది పొడవునా పంటడెకరేషన్ ఆకు నాటిన నెలకే కోతకు వస్తుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి 40 రోజులకొకసారి కోతకు వస్తుంది. ఏడాది పొడవునా పంట ఉంటుంది. ఒకసారి సాగుచేస్తే మూడు నాలుగేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దరలు బాగున్నాయి. – ఏ.రవణమ్మ, రైతు, దరివాద కొత్తపాలెం -
సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు
ఆకుకూరల్లో చాలారకాలు ఉన్నాయి. కొన్ని ప్రజాదరణ పొందినవి అయితే.. మరికొన్ని చాలామందికి తెలియదు. అలాంటిదే సోయకూర. సోయా ఆకు తినడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. చిన్నగా, సన్నగా పొడవుగా చూడటానికి కొత్తిమీరలా కనిపించే ఆ ఆకు కూరను సోయ, సావా, సోవా లేదా దిల్ లీవ్స్ అని పిలుస్తారు. సోయకూరతో లభించే పోషకాల గురించి తెలుసుకుందాం.సోయా మొక్క కూడా సోంఫ్ మొక్కలాగా కనిపిస్తుంది. సోయా ఆకు, గింజలను సువాసన కోసం ఉపయోగిస్తారు కూడా. ఆయుర్వేదంలో ఒక బలవర్ధకమైన ఆకుగా వాడుకలో ఉంది. విటమిన్ సీ, ఏ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. సోయా ఆకు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిని అదుపు చేస్తుంది. ముఖ్యంగా నెలసరి, ప్రసవ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. విటమిన్ సీ, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని మాంగనీస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.సోయా ఆకుల్లోని యాంటీ ఇన్ల్ఫమేషన్, యాంటీ ఫ్లాట్యులెన్స్ గుణాలు జీర్ణక్రియకు మంచిది. అజీర్తిని దూరం చేసి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను నిరోధిస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అల్సర్, ఇతర పొట్ట సమస్యలను నివారించడంలో దీనికి కీలక పాత్ర. గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. బరువు నియంత్రణలోసోయా ఆకులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కాబట్టి, ఊబకాయాన్ని నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజూ ఉదయం గ్రీన్ టీలాగా లేదా సోయా ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగితే శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది.సోయా ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు. పకోడీ, బజ్జీ, పరాటా తయారీలో వాడుకోవచ్చు. పలావ్లో సోయా ఆకులను వాడితే మంచి సువాసన వస్తుంది. ఇంకా సోయా ఆకును కూరల్లో, పచ్చళ్లలో వేసుకోవచ్చు , పిజ్జా, బర్గర్, సలాడ్స్‌లో కూడా వాడతారు. -
వినాయక పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు..
ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు. ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు. పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు. – ఆచార్య రాఘవేంద్ర వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు -
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
క్యాబేజీ అంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే దీనివాసన చాలామందికి నచ్చదు. అయితే క్యాబేజీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడం నుంచి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే క్యాబేజీ ఆకులతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా?క్యాబేజీ ఆకులను యూరోపియన్ జానపద వైద్యంలో పేదవారి పౌల్టీస్ (పిండికట్టు) అని పిలుస్తారు. వృద్ధులలో అత్యంత సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. అలాంటి వారు క్యాబేజీ ఆకులను పాదాలకు చుట్టి రాత్రంతా ఉంచడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు పెయిన్ కిల్లర్స్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయని, ఈ ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వీటిని కొద్దిగా నూనెతో వేడిచేసి కానీ, ఐస్‌తో కలిపి ఐస్ ప్యాక్‌లాగా గానీ వాడతారు. ఇవి సురక్షితమైనవి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు. ధూమపానం చేసేవారు క్యాబేజీ లేదా బ్రోకలీని తిన్న పది రోజుల తర్వాత వారి సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు 40 శాతం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది.ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 81 మంది వ్యక్తులపై 2016లో ఒక చిన్న అధ్యయనం జరిగింది, అక్కడ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు క్యాబేజీ ఆకు చుట్టడం ద్వారా ఫలితం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే దీని నిర్ధారణకు "మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. 2018లో చేసిన మరొక అధ్యయనంలో పురుషులలో మోకాలికి ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు. నోట్: ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది. -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి
చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యంకప్పు సన్నగా తరిగిన లేత చిగురు టేబుల్ స్పూన్లు నూనె 3 - 4 పెద్ద పచ్చిమిర్చి 5, 6 ఎండు మిరపకాయలు కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ. -
అంజీర్ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంజీర్ ఆకులతో టీ వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి. ఎండబెట్టి పొడి చేసుకుని అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు. అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్‌ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. టీబీ నివారణలో అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు. -
లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!
ఇంటీరియ్లో వుడెన్ వర్క్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్ ఆర్ట్‌గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్‌గా, ఫెదర్స్గా, బెడ్ ల్యాంప్స్‌గా, ఎంబ్రాయిడరీ వర్క్తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి. స్కెలిటన్ లీవ్స్ తయారీకి.. 1. ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 2. ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 3. ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్ బ్రష్‌తో మెల్లగా రబ్ చేస్తూ, పై పొట్టును తీసేయాలి. 4. పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 5. తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్‌తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్ భాగం తయారవుతుంది. 6. ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు. -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా
తమలపాకు గారెలు తయారీకి కావల్సినవి: తమలపాకులు – 10 (కడిగి, కచ్చాబిచ్చాగా తరిగి, కొద్దిగా మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి) మినపగుళ్లు – 1 కప్పు (4 గంటలు నానబెట్టుకోవాలి) పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) అల్లం – చిన్న ముక్క, కరివేపాకు – 1 రెబ్బ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత బేకింగ్ సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ఇలా.. ముందుగా నానబెట్టిన మినపగుళ్లను మిక్సీలో వేసి.. అల్లం ముక్క, కరివేపాకు వేసుకుని గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో బియ్యప్పిండి, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తమలపాకు మిశ్రమాన్ని జోడించి బాగా కలిపి.. గారెల్లా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అంతే క్రిస్పీగా ఉండే తమలపాకు గారెలు రెడీ.. -
అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..
న్యూయార్క్: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జేసన్ కిర్క్ మైక్రోస్కోప్‌తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్ అంటారు. ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్ నిర్వహించే ‘స్మాల్ వరల్డ్ కాంపిటీషన్’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి -
వైరల్: ఆకా లేదంటే పురుగా.. ఆశ్చర్యంగా ఉందే!
‘అరె చూడటానికి అచ్చం ఆకులా ఉందే.. నిజంగా ఆకేనా.. లేదంటే పురుగా’ అని పై ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారా. ఇలాంటి సందేహం కలగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆకృతిలో ఆకును తలపిస్తూ విచిత్రంగా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ పురుగు. ఫిలియం జిగాంటియం అని పిలువబడే ఈ జీవి శరీరం అచ్చం ఆకులా కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు. దీనికి ఉండే రెండు కాళ్లతో ఆకులాగే కనిపిస్తుంది. చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తాజాగా కొన్ని ఆకు పురుగులు కదులుతున్న వీడియోను సైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. దీంతో ఈ ఆకు పురుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కానీ, చ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి మిలియన్ వ్యూస్ రాగా లక్షల్లో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి ఇక. చదవండి: కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి! View this post on Instagram A post shared by Science by Guff 🧬 (@science) -
అది ఆకు కాదు..
-
అయ్యో.. అది ఆకు కాదు.. వీడియో వైరల్
మన చుట్టూ ఉండే ప్రకృతిలో వింత వింత జీవులు సంచరిస్తుంటాయి. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడు కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా ఓ వింత సీతాకొకచిలుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు సీతాకోక చిలుక అంటే రంగురంగులతో చూడముచ్చటగా ఉంటుందనే తెలుసు. కానీ ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంది. రెక్కలు ముడుచుకొని ఉన్నప్పుడు చూస్తే ఎండిపోయిన ఆకు వలె కనిపిస్తుంది. ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగులతో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది. దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. తన ఈ సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) 18 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బటర్‌ఫ్లై కన్జర్వేషన్ ట్విటర్లో షేర్ చేయగా దీనికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘అద్భుతం.. ఇలాంటి సీతాకొకచిలుకను ఎప్పుడు చూడలేదు’, ‘వావ్.. ఇవి ప్రకృతి అద్భుతం’, ‘బ్యూటీపుల్ బటర్‌ఫ్లై.. ఆకర్షనీయంగా ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
పీజియన్ మెష్‌తో లీఫ్ కంపోస్టర్
ఎండాకులను చక్కని ఎరువుగా మార్చేందుకు అతి సులువుగా, అతి తక్కువ ఖర్చుతో, కేవలం పది నిమిషాల్లో మీరే లీఫ్ కంపోస్టర్‌ను తయారు చేసుకోవచ్చు. కావలసిన వస్తువులు: 1. పీజియన్ మెష్. 8 అడుగుల పొడవు “ 3 అడుగుల వెడల్పు ఉండే పిజియన్ మెష్. ఏ హార్డ్‌వేర్ స్టోర్‌లోనైనా దొరుకుతుంది. యువి ట్రీటెడ్ మెష్ కాబట్టి ఎండకు, వానకు తట్టుకొని నిలబడుతుంది. 2. జిప్ టైస్ ప్యాకెట్. ఒక ప్యాకెట్లో 30 జిప్ టైస్ ఉంటాయి. ఏ హార్డ్‌వేర్ స్టోర్‌లోనైనా దొరుకుతాయి. తయారు చేసుకునే పద్ధతి: ► పీజియన్ మెష్‌ను సిలిండర్ మాదిరిగా నిలువుగా, గుండ్రంగా ఉండేలా మడవండి. రెండు కొసలు దాదాపు ఒక అడుగు – అర అడుగు మేరకు ఒకదానిపైకి మరొకటి వచ్చే విధంగా మడిచి పట్టుకొని.. పీజియన్ మెష్ ఊడిపోకుండా జిప్ టైలతో కట్టేయండి. ► ఏదైనా చెట్టు కింద నేల పైన ఈ లీఫ్ కంపోస్టర్‌ను నిలబెట్టండి. దాని చుట్టూతా మట్టిని కొంచెం లోతు తవ్వి.. ఆ మట్టిని కంపోస్టర్ చుట్టూ ఎగదోయండి. లీఫ్ కంపోస్టర్ పడిపోకుండా నిలబడడానికి ఇలా చేయాలి. ► దీనికి మూడు వైపులా వెదరు కర్రలు లేదా తీసేసిన కర్టెన్ రాడ్లను నేలలో పాతి, వాటికి కంపోస్టర్‌ను కట్టేసినా పర్వాలేదు పక్కకు ఒరిగిపోకుండా, పడిపోకుండా ఉంటుంది. ► అంతే.. 7–8 అడుగుల ఎత్తు.. 2.5 – 3 అడుగుల వ్యాసార్థం కలిగిన లీఫ్ కంపోస్టర్ రెడీ అయినట్టే. ► ఇందులో రోజూ / ఎప్పుడు ఉంటే అప్పుడు ఎండాకులు వేయండి. వారానికోసారి కొంచెం మట్టి లేదా పశువుల పేడ లేదా ఎవరినైనా అడిగి తెచ్చిన కంపోస్టు ఎరువును కొంచెం వేయండి. లేదా సూక్ష్మజీవరాశితో కూడిన తోడు (మైక్రోబియల్ కల్చర్) వేసినా కూడా ఆకులు అలములు కొద్ది వారాల్లో కంపోస్టుగా మారతాయి. ► మొక్కలకు నీరు పోసినట్లు రోజూ ఈ కంపోస్టర్లోని ఆకులపైన కూడా నిరు పోయండి. అవి తేమగా ఉండేంతగా నీరు చాలు. ఇది నేలపైనే నిలబడి ఉంటుంది కాబట్టి, నీరు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ► కంపోస్టర్ అడుగు భాగంలో రెండు నెలల్లోనే కంపోస్టు తయారవుతుంది. అప్పుడు ఇక ఎండాకులు వేయడం ఆపేయండి. అయితే, నీరు మాత్రం రోజూ తగుమాత్రంగా పోయటం అవసరం. నీరు చిలకరించడం మానకండి. ► ఇంకో నెల తర్వాత (మొత్తం 3 నెలల్లో) అందులో ఆకులన్నీ కంపోస్టుగా మారతాయి. అప్పుడు పీజియన్ లీఫ్ కంపోస్టర్‌ను ఎత్తివేసి, కంపోస్టును చెట్టు చుట్టూ సర్దేయండి. లేదా కుండీల్లో మొక్కలకు/ఇంటిపంటలకు వేయండి. అంతే.. అద్భుత ప్రకృతి వనరులైన ఎండాకులను తగులబెట్టకుండా, మున్సిపాలిటీకి భారంగా మార్చకుండా.. చక్కని సహజ ఎరువుగా మార్చి నేలతల్లికి చేర్చేశారన్న మాటే! -
నంబర్ ప్లేట్‌కు ఆకు అతికించాడుగా..
పంజగుట్ట: ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నంబర్ ప్లేట్‌కు ఆకు అతికించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అత్తాపూర్‌కు చెందిన నందకిషోర్ విద్యార్థి. అతను తన (ఎపీ28డీఎక్స్ 5079) యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై బుధవారం ఉదయం షాలీమార్ జంక్షన్ నుంచి పంజగుట్ట వైపు వస్తుండగా పంజగుట్ట సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ సిబ్బంది అతడి వాహనం వెనక ఏదో అంటించి ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. దగ్గరికి వెళ్లి చూడగా అతను ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌కు ఆకును అతికించినట్లు గుర్తించారు. అతని వాహనం వివరాలు పరిశీలించగా ఏడు చలాన్లకు గాను రూ.2045 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించగా నందకిషోర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘భయ్యా.. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది’
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మాంసం వ్యాపారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా వదిలేయడమే కాక తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు మాంసాన్ని కవర్ల బదులు ఆకుల్లో ప్యాక్ చేసి ఇస్తూ.. సామాన్యులతో పాటు.. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు దృష్టిని కూడా ఆకర్షించాడు. దాంతో అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు కిరెణ్ రిజిజు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లేపా రాడా జిల్లాకు చెందిన స్థానిక మాంసం దుకాణదారుడు.. తన షాప్‌కు వచ్చి మాంసం తీసుకునే వారికి ప్లాస్టిక్ కవర్లకు బదులు ఆకుల్లో పెట్టి సరఫరా చేస్తున్నాడు. "PM @narendramodi has told us not to use plastics so we are using local leaves because plastics are no more available" A local meat vendor at remote Tirbin, Lepa Rada Dist, Arunachal Pradesh. pic.twitter.com/Z1vuB2K8fK — Kiren Rijiju (@KirenRijiju) October 6, 2019 ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేం ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం లేదు. దాని బదులు స్థానికంగా లభించే ఆకులను ఉపయోగిస్తూ.. పర్యావరణహితంగా మెలుగుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మాంస దుకాణదారునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బాల్యంలో మాంసాన్ని ఇలానే ఆకుల్లో పెట్టి ఇచ్చే వారని గుర్తు చేసుకుంటున్నారు. 2022 నాటికి ఒకసారి మాత్రమే వినియోగించే వీలున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
తాటాకు @ రూపాయి
తాటాకుల నరికివేతతో ఉపాధి ఏటా నాలుగు నెలలు పని ద్వారకాతిరుమల : తాటి ఆకులు సంప్రదాయానికి చిహ్నాలుగా ఉండటంతో పాటు ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. రానున్న వేసవి, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో గ్రామాల్లో తాటి ఆకులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాటి ఆకులు నరికే కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. ఏటా ఈ సీజన్లో తాటి ఆకుల నరికివేతను వృత్తిగా చేసుకుని ఎందరో జీవనాన్ని సాగిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, కోడిగూడెం, పి.కన్నాపురం, గోపాలపురం ప్రాంతాల్లో ఏడాదికి నాలుగు నెలలపాటు తాటి ఆకులు నరకడం ద్వారా వందలాది మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రమాదమని తెలిసినా.. తాటి చెట్లు ఎక్కేటప్పుడు గరికమ్మలు శరీరాన్ని చీల్చుతున్నా, ఆకులు నరికేటప్పుడు ప్రమాదవశాత్తు కత్తి తగిలి రక్తం కారుతున్నా కార్మికులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా ఈ సీజన్లో ఇదొక్కటే ఉపాధి అని వీరు అంటున్నారు. ఈ పనిలేనప్పుడు మేకలు మేపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు. రోజుకు 500 నుంచి వెయ్యి ఆకుల వరకు నరుకుతున్నామని, ఆకుకు రూపాయి చొప్పున తమకు కూలి లభిస్తోందని అంటున్నారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారులకు ఒక్కో ఆకును రూ.5 చొప్పున రైతులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజుకు రూ.500 సంపాదిస్తున్నా.. తాటి ఆకులు నరికే పని ప్రమాదమని తెలుసు. అయినా తప్పడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాటి ఆకులు నరుకుతూ ఉపాధి పొందుతున్నాం. ఒక్కో ఆకును నరికినందుకు రైతు రూపాయి ఇస్తాడు. ఇలా రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. -రాజినాల రామయ్య, ఐఎస్ జగన్నాథపురం నాలుగు నెలలపాటు.. వివాహాది శుభకార్యాలకు తాటి ఆకులను వాడుతున్నారు. చలువ పందిళ్లు నిర్మించడం దగ్గర నుంచి ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో చల్లదనం కోసం తాటి ఆకుల పందిళ్లు వేస్తుంటారు. దీంతో మాకు ఏటా నాలుగు నెలల పాటు చేతినిండా పని దొరుకుతుంది. - సొండు పాపారావు, ఐఎస్ జగన్నాథపురం -
నే పాడితే...లోకమే పాడదా..
తొండగారి పోజు చూశారా...ఆకును గిటార్‌లా చేసుకుని..ఏదో పాట హమ్ చేస్తున్నట్లు..ఇండోనేసియాలోని యోగ్యకర్తాలో ఆదిత్య పెర్మానా అనే ఫోటోగ్రాఫర్ ఈ వినూత్న చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తొండకు సంబంధించి చాలా చిత్రాలు తీసి ఉండటంతో తొలుత దీన్ని అతడు గమనించలేదు. తీరిగ్గా...ఫోటోలన్నిటినీ చూస్తున్నప్పుడు ఈ విచిత్రమైన స్టిల్ బయటపడింది. -
ఆకు పచ్చినిజాలు
ఆవిష్కరణ ఒక ఆకు పూసింది... కొమ్మ లేకుండా! జూలియన్ మెల్కొరి అనే డిజైన్ ఇంజనీరింగ్ విద్యార్థి రూపొందించిన ‘కృత్రిమ-ఆకు’ మొక్క అవసరం లేకుండానే ప్రాణవాయువును వెలువరించడమే కాక స్పేస్ సైన్స్ రూపురేఖల్ని కూడా మార్చబోతోంది. ఒక ఆకు కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయమే! ఈ చర్యకు ముఖ్య కారణం ఆకులోని క్లోరోఫ్లాస్ట్ అనే పదార్థం. అది సూర్యరశ్మిని వాడుకుని కార్బన్ డయాక్సైడ్ని ఆక్సిజన్‌గా మారుస్తుంది. కానీ ఒక చెట్టు ఎదగాలన్నా, మనుగడలో ఉండాలన్నా కావాల్సింది గురుత్వాకర్షణ శక్తి. అది ఔటర్ స్పేస్‌లో ఉండదు కాబట్టి, వ్యోమగాములు, రాకెట్లలో చెట్లని పట్టుకెళ్లలేరు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ సిలండర్స్ని తీసుకెళ్తారు. కానీ జూలియన్ మెల్కొరి కనిపెట్టిన ఈ సింథటిక్ ఆకుతో ఆ ఖర్చుని తగ్గించవచ్చు. చూడటానికి మామూలు ఆకులానే ఉన్నా, దీన్ని సిల్క్ ఫైబర్స్ నుండి సేకరించబడిన ఒక జిగురులాంటి పదార్థంలో, ఆకుల నుండి తీయబడిన క్లోరోప్ల్లాస్ట్ని కలుపుతారు. ఆ జిగురు పదార్థంలో ఉండే కణజాలం, ఒక మేట్రిక్స్లా మారి అందులో క్లోరోఫ్లాస్ట్ని ఇముడ్చుకుని స్థిరంగా ఉంచుతుంది. జీరో గ్రావిటీలో కూడా క్లోరోప్లాస్ట్ని పనిచేసేలా చేస్తుంది. దీనికి సూర్యకాంతి కూడా అవసరం లేదు. ఇంట్లో వాడే బల్బు నుండి వెలువడే కాంతి సరిపోతుంది. అందుకే ఈ సింథటిక్ ఆకు మీద మరికొన్ని పరిశోధనలు చేసి, వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత రాకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాక, ఈ ఆకులని, ఆకాశహర్మ్యాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫ్లోర్లలో వాడుతున్నారు. ఒక బల్బ్ చుట్టూ డెకరేటివ్ కవర్లా పెట్టుకుంటే, ఆక్సిజన్ని అందించడమే కాక అందాన్ని కూడా ఇస్తుంది ఈ సింథటిక్ ఆకు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : ప్రతి రోజు ఆకుకూరలు, కూరగాయలు వంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాయచూరు, బళ్లారి, కొప్పళ పాల సమాఖ్య వ్యవస్థాపక నిర్దేశకులు సురేష్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక డబుల్ రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాబకొ సమాఖ్య నుంచి పౌష్టిక పాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్ననాటి నుంచే నిత్యం ఉదయం గ్లాసు పాలు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఉత్తమ ఆరోగ్యం పొందవచ్చన్నారు. గతంలో పెద్దలు పౌష్టికాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని అన్నారు. ప్రస్తుత సమాజంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో రాబకొ సమాఖ్య మార్కెటింగ్ అధికారులు వెంకటేశ్‌రెడ్డి, ఎర్రిస్వామి, మురళీధర్, నాగరాజ్ శర్మ, మల్లికార్జున, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవితాకుమారి తదితరులు పాల్గొన్నారు.