అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు.
అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్‌గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అంజీర్ ఆకులతో టీ
వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి.
ఎండబెట్టి పొడి చేసుకుని
అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు.
అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్‌ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
టీబీ నివారణలో
అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment