ఆకుకూరల్లో చాలారకాలు ఉన్నాయి. కొన్ని ప్రజాదరణ పొందినవి అయితే.. మరికొన్ని చాలామందికి తెలియదు. అలాంటిదే సోయకూర. సోయా ఆకు తినడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అందుతాయి. చిన్నగా, సన్నగా పొడవుగా చూడటానికి కొత్తిమీరలా కనిపించే ఆ ఆకు కూరను సోయ, సావా, సోవా లేదా దిల్ లీవ్స్ అని పిలుస్తారు. సోయకూరతో లభించే పోషకాల గురించి తెలుసుకుందాం.
సోయా మొక్క కూడా సోంఫ్ మొక్కలాగా కనిపిస్తుంది. సోయా ఆకు, గింజలను సువాసన కోసం ఉపయోగిస్తారు కూడా. ఆయుర్వేదంలో ఒక బలవర్ధకమైన ఆకుగా వాడుకలో ఉంది. విటమిన్ సీ, ఏ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి.
సోయా ఆకు అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిని అదుపు చేస్తుంది. ముఖ్యంగా నెలసరి, ప్రసవ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. విటమిన్ సీ, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులోని మాంగనీస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
సోయా ఆకుల్లోని యాంటీ ఇన్ల్ఫమేషన్, యాంటీ ఫ్లాట్యులెన్స్ గుణాలు జీర్ణక్రియకు మంచిది. అజీర్తిని దూరం చేసి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను నిరోధిస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అల్సర్, ఇతర పొట్ట సమస్యలను నివారించడంలో దీనికి కీలక పాత్ర. గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది.
బరువు నియంత్రణలో
సోయా ఆకులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కాబట్టి, ఊబకాయాన్ని నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. రోజూ ఉదయం గ్రీన్ టీలాగా లేదా సోయా ఆకులను నీటిలో మరిగించి వడకట్టి తాగితే శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
సోయా ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు. పకోడీ, బజ్జీ, పరాటా తయారీలో వాడుకోవచ్చు. పలావ్‌లో సోయా ఆకులను వాడితే మంచి సువాసన వస్తుంది. ఇంకా సోయా ఆకును కూరల్లో, పచ్చళ్లలో వేసుకోవచ్చు , పిజ్జా, బర్గర్, సలాడ్స్‌లో కూడా వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment