చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)
చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.
కావాల్సిన పదార్థాలు
రెండు కప్పులు బియ్యం
కప్పు సన్నగా తరిగిన లేత చిగురు
టేబుల్ స్పూన్లు నూనె
3 - 4 పెద్ద పచ్చిమిర్చి
5, 6 ఎండు మిరపకాయలు
కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ
పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు
తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )
సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ.
Comments
Please login to add a commentAdd a comment