Tamarind
-
కొండెక్కిన టమాటా : బోలెడన్ని ప్రత్యామ్నాయాలు, ట్రై చేశారా?
మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు. వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్‌తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది. మామిడి కాయ: సీజన్‌ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్ల లభించే క్యాప్సికమ్‌ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు. ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్‌వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.టమాటా ఒరుగులువర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం. -
చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి
చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్‌కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యంకప్పు సన్నగా తరిగిన లేత చిగురు టేబుల్ స్పూన్లు నూనె 3 - 4 పెద్ద పచ్చిమిర్చి 5, 6 ఎండు మిరపకాయలు కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ. -
చింతగింజల మ్యాజిక్ తెలుసా? పురుషులకు మరీ ప్రయోజనం!
చింత గింజలు అంటే చింతపండు వాడుకుని, పులుసు తీసుకున్న తరువాత తీసిపారేసే వేస్ట్ గింజలనుకునేరు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్లోయాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, చికున్ గున్యా కోసం యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి సమర్థ వంతంగా ఉపయోగించవచ్చని నిపుణుల మాట. దీంతో పాటు వివిధ ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాంటే..ఈ కథనాన్ని చదవాల్సిందే..! చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారు. గతంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రూర్కీ ప్రొఫెసర్లు చింతగింజలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఎల్సెవియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి కూడా. దీని ప్రకారం మధుమేహ నిర్వహణలో ఉపయోగ పడతాయి. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం: చింతపండు గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది.చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు. దంతాలకు మేలు చేస్తుంది: చింతపండు గింజల పొడితో చిగుళ్ళు ,దంతాలను తోముకుంటే మంచిది. ఎక్కువగా పొగ త్రాగే వారికి. శీతల పానీయాలు, ధూమపానం వల్ల పళ్లు గారపట్టిపోతాయి. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడంతోపాటు దంతాలపై ఉండే గార, పాచి వదిలిపోతుంది. జీర్ణక్రియ: చింతపండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్‌ను మరింత తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారణలో: యాంటీ బాక్టీరియల్ లక్షణాలుతో చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. గుండెకూ మంచిదే: చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ల నివారణలో: చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు. అలాగే మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధిలో ఆవుపాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా నోట్: చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. నిపుణులతో సంప్రదించి చింతగింజల పొడిని వాడుకోవాలి. దీని ప్రయోజనానలు వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోండి. -
గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!
పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు. నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ (క్లిక్ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
Beauty Tips: చింతపండు సిరప్‌తో మొటిమలు, మచ్చలు మాయం!
Benefits Of Tamarind Syrup: కూరల్లో పులుపు, రుచికోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్స్, ఐరన్, పొటాషియం, ఖనిజపోషకాలు, పీచుపదార్థంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చింతపండు రోగాల నుంచి శరీరాన్ని కాపాడడమేగాక, శరీరానికి తగినంత రక్తాన్ని అందించి చర్మాన్ని మెరిపిస్తుంది. చింతపండులోని విటమిన్ సి ముఖం మీద మొటిమలు తొలగించి అందంగా ఉంచుతుంది. ఇన్ని గుణాలు ఉన్న చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా ఈ గుణాలన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇంకెందుకాలస్యం... చింతపండు సిరప్ తయారీ, వాడకం గురించి తెలుసుకుందాం... ఇలా చేయండి.. ►చింతపండుని నీళ్లలో మరిగించి వడగట్టాలి. ►ఈ నీటిలో కొద్దిగా తేనె లేదా బెల్లం వేసి బాగా కలపాలి. ►దీనిలో నాలుగైదు ఐస్‌ముక్కలు వేస్తే చింతపండు సిరప్ రెడీ! దీనిని నేరుగా తాగేయాలి. మొటిమలు, మచ్చలు మాయం! ►చింతపండు మరిగించిన నీటిలో కొద్దిగా తేనెవేసి ముఖానికి అప్లై చేయాలి. ►ఇరవైనిమిషాలపాటు మర్దనచేసి ఆరాక కడిగేయాలి. ►వారానికి రెండుమూడుసార్లు ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ►సిరప్‌ను తరచూ తాగినా ఆరోగ్యంతోపాటు, చర్మం అందంగా మెరుస్తుంది. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Sonakshi Sinha: అమ్మ చెప్పింది.. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, ట్యాన్ దరిచేరవు! -
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్‌లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్‌గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్‌ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్‌లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్‌గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
Health Tips: తరచూ చింత చిగురును తింటే..
చింతచిగురును తలచుకోగానే నోట్లో నీళ్లు ఊరతాయి. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతచిగురును తీసుకోవడం వల్ల మనకెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం. ► చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. ► ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింతచిగురు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి మంచి కొలెస్టరాల్‌ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ► చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ► కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. ►పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింతచిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో చింత చిగురును భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. -
Beauty Tips: చింతాకు, బొప్పాయి గుజ్జు.. మచ్చలు, ముడతలు మాయం!
Tamarind Leaf And Papaya Pack : కప్పు చింత ఆకుల్లో పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పుల్లటి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చర్ అందుతుంది. ఇందులోని యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ను వేసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ►ఇక బియ్యప్పిండి, బొప్పాయి గుజ్జుని మఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ►అదే విధంగా బొప్పాయిగుజ్జులో పసుపు, పచ్చిపాలు, తేనె, తులసి ఆకుల పొడి కలిపిముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు మాయమవతాయి. ►బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అందుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. ►నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయ వస్తుంది. ►బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. చదవండి: టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే -
‘పట్టు’న్న జిల్లా.. శ్రీసత్యసాయి
హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ఆసియాలోనే పేరు గాంచింది. ఇక్కడి చింతపండు, మిర్చి యార్డ్ నుంచి దేశ విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ రైతులు కూడా హిందూపురం మార్కెట్లకు ఉత్పత్తులు తెచ్చి విక్రయించుకుంటున్నారు. హిందూపురం: పట్టు...చింతపండు విక్రయాలకు హిందూపురం మార్కెట్లు ఆసియాలోనే పేరుగాంచాయి. ఇక్కడి నుంచి పట్టుగూళ్లు, చింతపండు కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మిగతా మార్కెట్లతో పోలిస్తే ధర ఎక్కువగా దక్కడం వల్ల అనంతపురం, కర్నూలు, నంద్యాల, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైతులు ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించుకుంటున్నారు. మార్కెట్ ఫీజుతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతోంది. ‘పట్టు’న్న జిల్లా.. శ్రీసత్యసాయి జిల్లా మల్బరీ సాగులో అగ్రస్థానంలో ఉంది. అలాగే జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్లు పేరుగాంచాయి. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ఆసియాలోనే పేరుగాంచింది. ఇక దేశంలోని పట్టుగూళ్ల మార్కెట్లలో కర్ణాటకలోని రామనగర్ తర్వాత స్థానం హిందూపురం మార్కెట్‌దే. జిల్లాలో ఏడాదికి 30 వేల మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక్క హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్లోనే ఏటా వెయ్యి టన్నుల పట్టుగూళ్ల విక్రయాలు సాగుతాయి. ఈ మార్కెట్లో బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఏడాది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కిలో బైవోల్టిన్ గూళ్లు గరిష్టంగా రూ.1,000పైనే పలికాయి. దేశ విదేశాలకు చింత ఎగుమతి.. హిందూపురం చింతపండు, మిర్చి మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్లలో ఒకటి. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. అందువల్లే ఇక్కడ ఏటా రూ.కోట్లల్లో టర్నోవర్ జరుగుతోంది. అధికారికంగా ఏటా లక్ష క్వింటాళ్ల చింతపండు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అనధికారికంగా మరో 50 వేల క్వింటాళ్ల వ్యాపారం జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి చింతపండును వ్యాపారులు విజయవాడ, తమిళనాడులోని చెన్నై, సేలం, కోయంబత్తూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ కంపెనీలు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తాయి. రైతులకు నమ్మకం హిందూపురం మార్కెట్‌యార్డు చింతపండు, మిర్చి క్రయవిక్రయాలకు పేరుగాంచింది. రైతులకు ఈ మార్కెట్‌పై నమ్మకం ఎక్కువ. గిట్టుబాటు ధర లభించడంతో పాటు లావాదేవీలు కచ్చితంగా ఉంటాయి. అందువల్లే ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడి తీసుకువచ్చి విక్రయించుకుంటారు. ఏడాదిలో ఆరునెలలు చింతపండు మార్కెట్ బాగా ఉంటుంది. మిర్చి మార్కెట్ నిరంతం సాగుతుంది. – నారాయణ మూర్తి, స్పెషల్‌గ్రేడ్ కార్యదర్శి, హిందూపురం మార్కెట్‌యార్డు మోసం ఉండదు హిందూపురం మార్కెట్లో మోసం ఉండదు. అధికారులు, వ్యాపారులు నిక్కచ్చిగా ఉంటారు. అందుకే రైతులు చింతపండును ఎక్కువగా ఈ మార్కెట్‌కే తెస్తారు. ఈసారి ధర బాగానే ఉంది. నాణ్యమైన చింతపండు విదేశాలకు ఎగుమతి అవుతుంది కాబట్టి వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే రైతుకు మంచి ధర లభిస్తోంది. – నాగప్ప, జూలకుంట. గిట్టుబాటు ధర హిందూపురం మార్కెట్‌పై రైతులకు ఎక్కువ గురి ఉంటుంది. మిగతా మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ గిట్టుబాటు ధర దక్కుతుంది. ప్రస్తుతం కిలో బైవోల్టిన్ గూళ్లు రూ.750 నుంచి రూ.900పైగా∙పలుకుతున్నాయి. గతంలో రూ.350 మించి పలికేవి కావు. అందుకే రైతులు హిందూపురం మార్కెట్‌కు వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. – తిమ్మేగౌడ్, బక్తరహళ్లి, మడకశిర. -
పులి లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్!
-
పైన చూస్తే చింతపండు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ–31 గ్రామం వద్ద మల్కన్‌గిరి ఎస్డీపీఓ సువేందుకుమార్ పాత్రొ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. చింతపండు లోడ్‌తో ట్రక్‌ను తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. డ్రైవర్ కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతామ్ పాత్రొను అరెస్ట్ చేశారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్‌పై అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. 63 బస్తాల్లో నింపి, చింతపండు లోడ్ మధ్య తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎస్డీపీఓ గురువారం ప్రకటించారు. నిందితులపై కేసు నమోదు చేసి, మల్కన్‌గిరి కోర్టులో హాజర్ పరిచారు. గంజాయిని మోటు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే.. -
చింతకాయలతో పుల్లటి రుచులు..
చిమడకే చిమడకే ఓ చింత కాయ నీవెంత చిమిడినా నీ పులుపు పోదు పులుపు రుచికి రారాజు చింత.. అనారోగ్యానికి విరుగుడు... నోటికి హితవు.. పాత చింతకాయ పచ్చడే కదా అని తీసిపారేస్తే కుదరదు పథ్యానికి పాత చింత కాయే పరమౌషధం.. చింతకాయలతో పుల్లటి రుచులు ప్రయత్నిద్దాం... చింత కాయ దప్పళం కావలసినవి: చింత కాయలు – పావు కేజీ (పండనివి); కూరగాయ ముక్కలు – పావు కప్పు (బెండకాయ, సొరకాయ వంటివి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు + జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూ ను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: చింత కాయలను శుభ్రం గా కడిగి, స్టౌ మీద ఒక పాత్ర లో చింత కాయలు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, దింపాలి కొద్దిగా చల్లారాక చేతితో మెత్తగా అయ్యేలా మెదిపి వడపోశాక, తగినన్ని నీళ్లు జత చేసి, ఉల్లి తరుగు, కూర ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి పచ్చి మిర్చి + జీలకర్ర ముద్ద జత చేయాలి కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలియబెట్టాలి అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి దప్పళాన్ని మరిగించాలి చిన్న పాత్రలో బియ్యప్పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా ఉండలు లేకుండా కలిపి, ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు కలియబెట్టాలి కొత్తిమీర జత చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక, కరివేపాకు వేసి మరోమారు వేయించి ఈ పోపు ను మరుగుతున్న చింతకాయ దప్పళంలో వేసి కలియబెట్టాలి బాగా పొంగుతుండగా దింపేయాలి. చింత కాయ పప్పు కావలసినవి: వామన చింతకాయలు – ఒక కప్పు; కంది పప్పు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 1; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టేబుల్ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి చింత కాయలను శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దింపి చల్లారాక, నీళ్లు ఒంపేయాలి చల్లారాక చింతకాయల మీద తొక్కు తీసేసి, తగినన్ని నీళ్లు జత చేసి, మెత్తగా పిసికి, నీళ్లు వడకట్టి పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించిన కంది పప్పు, చింతకాయల రసం, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు సేపు ఉడికించి, దింపేయాలి. చింత కాయ–కొబ్బరి పచ్చడి కావలసినవి: చింత కాయలు – 100 గ్రా; కొబ్బరి ముక్కలు – అర కప్పు; పచ్చి మిర్చి – పది పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు – 4; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – తగినంత; కరివేపాకు – ఒక రెమ్మ తయారీ: చింత కాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి మిక్సీలో పోపు వేసి మెత్తగా చేయాలి చింత కాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ తిప్పాలి కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రేకలు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ తిప్పాలి ఒక గిన్నెలోకి తీసుకుని కరివేపాకుతో అలంకరించాలి. పాత చింత కాయ తొక్కు కావలసినవి: పాత చింతకాయ తొక్కు – 1 కప్పు; బెల్లం – అర కప్పు; ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5 (పెద్దవి); ఇంగువ – తగినంత; నువ్వుల నూనె – పావు కప్పు పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; నూనె – 2 టీ స్పూన్లు; ఇంగువ – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 8 తయారీ: స్టౌ మీద పాన్‌లో నూనె వేడయ్యాక, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి దోరగా వేయించి చల్లారానివ్వాలి చింతపండు తొక్కును మిక్సీలో వేసి మెత్తగా చేసి, పసుపు, బెల్లం జత చేసి మరోమారు మెత్తగా నూరి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి వేయించి ఉంచిన పోపును జత చేసి బాగా కలపాలి ఈ పచ్చడి ఈ పచ్చడి పథ్యానికి చాలా మంచిది. చింత కాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు – 10; వేయించిన నువ్వులు – 100 గ్రా; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను ; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను తయారీ: చింత కాయలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదిపి, గుజ్జును వడకట్టాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి చల్లారాక మిక్సీలో వేసి, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మెత్తగా చేయాలి వేయించిన నువ్వులు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి చింత కాయ గుజ్జు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. -
చలికి మిరియాల సెగ పెడదాం
శ్రీ ముఖపుస్తకం గారి వంటలు రుచి చూద్దామా! కావలసినవి: నల్ల మిరియాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 1 టేబుల్ స్పూను; అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – పావు టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీస్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ముందుగా మిక్సీలో నల్ల మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ముప్పావు లీటరు నీళ్లుపోసి మరిగించాక, తయారు చేసి ఉంచుకున్న పొడిని మరుగుతున్న నీళ్లలో వేయాలి ►పసుపు జత చేయాలి ►చింతపండు రసం పోసి కలియబెట్టాలి ►తగినంత ఉప్పు, బెల్లం తరుగు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి మరిగించాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలిపి, మరుగుతున్న మిరియాల చారులో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. shettyskitchen -
చింతపండుపై జీఎస్టీని మినహాయించాం
సాక్షి, ఢిల్లీ: ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించాని విజ్ఞప్తి చేస్తూ జూలై 24న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రత్యుత్తరం పంపారు. సెప్టెంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. -
ఏపీ ఉడుంపట్టుతో ‘చింత’ తీరింది!
సాక్షి, అమరావతి: సామాన్యుడికి భారీ ఊరట కల్పిస్తూ చింతపండుపై పన్నును ఎత్తివేసేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గట్టి వాదనలు వినిపించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఏపీ గళాన్ని సమర్థంగా వినిపించడం ద్వారా చింతపండుపై పన్నును ఎత్తివేసేలా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయం సాధించారు. గోవాలో శుక్రవారం జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తన వాదనతో బుగ్గన దేశం దృష్టిని ఆకర్షించారు. దక్షిణాది ప్రజల వంటకాల్లో కీలకమైన ఎండు చింతపండును పన్ను పరిధిలోకి తేవటాన్ని రాష్ట్రం తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆహార ధాన్యాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించి చింతపండును మాత్రం సుగంధ ద్రవ్యాల విభాగంలో చేర్చి పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత చింతపండుపై 12 శాతం పన్ను విధించగా ఆ తర్వాత 5 శాతానికి తగ్గించారు. అయితే నిత్యం వంటల్లో వినియోగించే చింతపండుపై పన్నును పూర్తిగా తొలగించాలని ఏపీ గట్టిగా పట్టుబట్టింది. స్పైసెస్ ఎలా అవుతుంది? అడవుల్లో గిరిజనులు సేకరించి విక్రయించే చింతపండు సుగంధ ద్రవ్యాల పరిధిలోకి రాదని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన గట్టిగా వాదించారు. ఉత్తరాది రాష్ట్రాలు వ్యతిరేకించినా బుగ్గన వాదనకు దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగించే ఒక రకమైన చనాదాల్ (పచ్చి శనగపప్పు)ను పన్ను నుంచి ఉపసంహరించినప్పుడు చింతపండుపై ఎందుకు తొలగించకూడదని బుగ్గన ప్రశ్నించారు. ఆంగ్లేయులే చింత అవసరాన్ని గుర్తించారు... చింతపండు ఆవశ్యకతను గుర్తించిన ఆంగ్లేయులే చింతచెట్లను వంట చెరుకు కోసం కొట్టివేయకూడదంటూ చట్టం తెచ్చారని బుగ్గన కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై దాదాపు 15 నిమిషాలకుపైగా చర్చ జరగ్గా బుగ్గన వాదనతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి ఏకీభవించారు. దీంతో చింతపండుపై ఉన్న 5 శాతం పన్నును తొలగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని గిరిజనులకు ఊరట లభించనుంది. పట్టుబట్టి మరీ సాధించి... రాష్ట్రంలో 2018–19లో 5,252 హెక్టార్లలో చింత సాగు చేయగా 57,738 టన్నుల చింతపండు ఉత్పత్తి అయినట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లుగా 36 సమావేశాలు నిర్వహించగా మన రాష్ట్రం ఇప్పటిదాకా ఇంత గట్టిగా వాదించిన సందర్భం లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో నాపరాళ్లు, చుట్ట పొగాకు తదితరాలపై పన్ను తొలగింపు డిమాండ్‌ను నెరవేర్చుకోగలమనే నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు. -
‘చింత’.. ఏమిటీ వింత!
అబిడ్స్: నగరంలో చింతకాయల కొరత ఏర్పడింది. ప్రతి ఏటా వినాయక చవితి ముందు మార్కెట్లో చింతకాయలు పుష్కలంగా లభించేవి. ఈసారి చింతకాయలు సకాలంలో పండకపోవడంతో నగరంలో వీటికి కొరత ఏర్పడింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చింతకాయలు కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.400– 600 చొప్పున పెట్టాల్సి వచ్చింది. నగరంలోని గుడిమల్కాపూర్, మోండా మార్కెట్, మాదన్నపేట్లతో పాటు పలు మార్కెట్లలో చింతకాయలు నామమాత్రంగా లభ్యమయ్యాయి. వినాయక చవితి రోజు చింతకాయ, ఆకుకూరల పప్పు, చింతకాయ పచ్చడితో ఉండ్రాళ్లు తినడం ఆనవాయితీ. దీంతో చింతకాయల ధర ఎంత భగ్గుమంటున్నా కొనుగోలుదారులు కొంతమేరకు కొనుగోలు చేశారు. -
పుల్లగా ఉన్నా ఫుల్లుగా నచ్చుతుంది
చిగురుండగా చింత ఏల?చిత్ర చిత్ర చింత వంటలు ఇక వంట గదంతా చింతాకు చితాచితాడైనింగ్ టేబులంతా పుల్లగా ఫుల్లుగా...ఎంజాయ్ చేయండి!!! చింత చిగురు పులిహోర కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింత చిగురు – ఒక కప్పు; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వేయించిన పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – 15; ఎండు మిర్చి – 5; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేప – 2 రెమ్మలు; పచ్చి మిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి) తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి, వేడిగా ఉండగానే ఒక పెద్ద పాత్రలోకి ఆరబోయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, వేయించిన పల్లీలు వేసి వేయించాక, ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ►పొడి చేయాలి చింతచిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి ►చింత చిగురు మిశ్రమం వేసి బాగా కలిపి దింపేయాలి ►అన్నంలో వేసి కలియబెట్టాలి ►ఉప్పు, జీడి పప్పులు జత చేసి మరోమారు కలిపి, గంటసేపటి తరవాత తినాలి. చింత చిగురు చారు కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ►బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వరుసగా వేసి వేయించాలి ►చింత చిగురు ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి చారును మరిగించాలి ►వేడి వేడి అన్నంలో కమ్మని నేయి వేసుకుని, అప్పడంతో నంచుకుని తింటే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. చింత చిగురు పొడి కావలసినవి: చింత చిగురు – 100 గ్రా; పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; ధనియాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి రెబ్బలు – 2; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►చింత చిగురులోని కాడలను తీసేసి, చింత చిగురును శుభ్రంగా కడగాలి ►పొడి వస్త్రం మీద ఆరేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పల్లీలు, ధనియాలు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక చింత చిగురు వేసి బాగా పొడిపొడిగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►పదార్థాలన్నీ చల్లారాక, ముందుగా పల్లీల మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పొడి చేయాలి ►వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా వేయించిన చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►పొడిపొడిలా ఉండేలా జాగ్రత్తపడాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – దోసకాయ కూర కావలసినవి: చింత చిగురు – ఒక కప్పు, దోసకాయలు – పావు కేజీ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – రెండు టీ స్పూన్లు; బెల్లం పొడి – అర టీ స్పూను తయారీ: ►చింతచిగురును శుభ్రంగా కడగాలి ►దోసకాయ తొక్క తీసి సన్నగా ముక్కలు తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ►దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►ముక్కలు బాగా మగ్గిన తరవాత చింత చిగురు, పసుపు జత చేసి కలియబెట్టి మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత కరివేపాకు, బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు పప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు, చింతచిగురు – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చిమిర్చి – 4 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండుమిర్చి – 4; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; వెల్లుల్లి రెబ్బలు – 5 తయారీ: ►కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాక తరవాత దింపేయాలి ►చింత చిగురును శుభ్రంగా కడగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింత చిగురు వేసి పచ్చి వాసన పోయేవరకు దోరగా వేయించాలి ►పసుపు, ఉప్పు జత చేయాలి ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదపాలి ►ఉడుకుతున్న చింత చిగురులో పప్పు వేసి బాగా కలపాలి ►కరివేపాకు, కొత్తిమీర వేసి కలియబెట్టి దింపేయాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. చింత చిగురు – కొబ్బరిపచ్చడి కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత చిగురు – అర కప్పు; పచ్చిమిర్చి – 6; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►చింత చిగురును శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద ఆరబోయాలి ►స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, చింత చిగురు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ►ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి దింపి చల్లార్చాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►చింత చిగురు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చివరగా కొబ్బరి ముక్కలు వేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ మిక్సీ పడితే, పచ్చడి మెత్తగా వచ్చి, రుచిగా ఉంటుంది ►అన్నంలో వేడి వేడి నెయ్యి జత చేసి కలుపుకుంటే రుచిగా ఉంటుంది. చింత చిగురు మాంసం కావలసినవి మటన్ – 500 గ్రాములు (అర కేజీ); కొత్తిమీర – ఒక కట్ట; ధనియాల పొడి – టీ స్పూన్; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కొబ్బరి తురుము – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; పుదీనా ఆకులు – కప్పు; ఆవాలు – టీస్పూన్; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; చింతచిగురు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►వెడల్పాటి బాణలి స్టౌమీద ఉంచి, వేడయ్యాక నూనె వేయాలి ►నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించాలి ►దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక మటన్ వేసి కలపాలి. పైన మూత ఉంచి, ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►తర్వాత దీంట్లో అర కప్పు నీళ్లు, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, కారం వేసి ఉడకనివ్వాలి ►మటన్ ముక్క ఉడికేంత వరకు ఉంచి, చింతచిగురు వేసి కలపాలి ►ఐదు నిమిషాలు వేగనివ్వాలి ►గ్రేవీ లేకుండా ముక్క బాగా వేగినదీ లేనిదీ సరిచూసుకుని కొత్తిమీర చల్లి, దింపేయాలి. చింత చిగురు చికెన్ కావలసినవి: చికెన్ – అర కేజీ; చింతచిగురు – 150 గ్రాములు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; పచ్చి మిర్చి – 3; పసుపు – పావు టీ స్పూన్; కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – రెండు చిన్న ముక్కలు; ఏలకులు – 2 ; లవంగాలు – 3 తయారీ: ►చింత చిగురు కడిగి, నీళ్లన్నీ పోయేవరకు జల్లెడలో వేసి ఉంచాలి ►పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి ►దీంట్లోనే ఉల్లిపాయ తరుగు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి కలపాలి ►ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. చికెన్ వేసి కలిపి మూత ఉంచి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ►తర్వాత మూత తీసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి ►మూత పెట్టి పావు గంట సేపు సన్నని మంట మీద ఉడకనివ్వాలి ►గరం మసాలా, కొబ్బరి తురుము వేసి కలిపి, చివరగా చింత చిగురు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు వేగాక దించాలి. చింత లేనట్లే! చింత చెట్టులో అనేక ఔషధాలు ఉన్నాయి. చింత పండు, చింత చిగురు, చింత బెరడు... అన్ని భాగాలూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సంస్కృతంలో దీనిని చించా అంటారు. ►విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చింతపండు దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా చూస్తుంది. ►రోగనిరోధక శక్తికి సి విటమిన్ అవసరం. ►చింత చిగురు జీర్ణశక్తిని పెంచి, జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ►పులుపు రుచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ►కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ►చింత చిగురుని కుండలో పెట్టి మూత పెట్టేసి, పొయ్యి మీద ఉంచితే, ఆ వేడికి అవి మాడినట్లుగా అవుతాయి. ఆ ఆకులను పొడి చేసి, జల్లెడ పట్టిన మెత్తటి పొడిలో నువ్వుల నూనె కలిపి, కాలిన గాయాల మీద పూసుకుంటే గాయాలు త్వరగా మానతాయి. కొత్త చర్మం త్వరగా వస్తుంది. ►జలుబు చేసినప్పుడు చింతపండు రసంలో చెంచాడు నెయ్యి, అర చెంచాడు మిరియాల పొడి చేర్చి, కాచి వేడివేడిగా తాగితే ముక్కుదిబ్బడ త్వరగా తగ్గుతుంది. ►చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీసి, పల్చగా చేసి, కొద్దిగా మిరియాలు, లవంగాలు, ఏలకులు చేర్చి తాగిస్తే ఆకలి మందగించినవారికి ఆకలి పుడుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ►జ్వరం, జలుబు, అజీర్ణ వ్యాధులను చింతపండు బాగా తగ్గిస్తుంది. ►ఎటువంటి అనారోగ్యం వచ్చినా చింతపండు చారుతో అన్నం తినిపిస్తే అది మంచి పథ్యంగా పనిచేస్తుంది. ►జ్వరం వచ్చినప్పుడు చింతపండు నీళ్లలో లవంగాలు, ఏలకులు, కర్పూరం వేసి కాచి, మూడు చెంచాల చొప్పున ఇస్తుంటే వేడి తగ్గుతుంది. ►క్యాన్సర్ నుంచి రక్షించే పదార్థాల కోసం చేసే పరీక్షల్లో చింతపండుకి క్యాన్సర్ రక్షణ గుణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల నిత్యం చింతపండు వాడటం ఆరోగ్య రక్షణకు అవసరం. ►జీర్ణమండల ఆరోగ్యానికి అవసరమైన పెక్టిన్ అనే పదార్థం చింతపండులో అధికంగా ఉంది. -
కీ ప్యాడ్ పై ఉగాది
ఆ పండగ అలాగే ఉందా? తెల్లవారి వేణ్ణీళ్ల స్నానాలు, కొత్త బట్టలు కట్టుకోవడాలు, పిల్లలు మామిడి పూతకు పరుగులు, వైరు బుట్ట అందుకుని ఇంటి పెద్ద తెచ్చే సరుకులు, వంటగదిలో ఏదో ఒక పిండి వంట, ఇంటిల్లిపాది ముఖాల కళ నిండిన చిరునవ్వు... అవి అలాగే ఉన్నాయా? భౌతికంగా ఉన్నాయా? అభౌతికంగా మారిపోయాయా? ఇవాళ పండుగలన్నీ సెల్‌ఫోన్ నుంచి సెల్‌ఫోన్ వరకే నడుస్తున్నాయా? మొదటి సందడి అక్కడే మొదలవుతుందా? గతంలో కనీసం ఫోన్ చేసి గొంతైనా వినిపించి అభినందనలు చెప్పేవారు. ఇవాళ ఒక వాట్సప్ మెసేజ్‌తో సరి. అదీ సొంతగా టైప్ చేయరు. వేరొకరు పంపిన సందేశాన్ని ఫార్వర్డ్ చేయడమే. అలా చేస్తే ప్రేమ వస్తుందా? బంధం ఏర్పడుతుందా? అభిమానం కొనసాగుతుందా? ఆప్యాయత గాఢమవుతుందా? కాని రోజులు మారాయి. మారిన రోజులతో మనమూ మారాలా... ఇలా మారక తప్పదు అని ఆలోచనలో పడాలా? నిజమైన పండగ ఉదయం సంధ్యతో గృహాప్రవేశం చేస్తుంది. కాని నెట్టింటి వసంతం మాత్రం అర్ధరాత్రి నుంచే బీప్‌బీప్ మని సందడి చేస్తుంది. నిద్ర లేచి వాట్సప్ తెరిస్తే కొత్త చింతపండు, తాజా వేపపువ్వు, బెల్లం, అప్పుడే కోసిన చెరకు, లేత మామిడి, లేలేత కొబ్బరి.. కొత్త మిరియాలు, ఉప్పుతో తయారైన ఉగాది ప్రసాదాన్ని (వాళ్లు పెట్టే మనం తినే వీలులేని) అందమైన ఇమేజ్‌తో సోషల్ మీడియా పంచుతూ ఉంటుంది. ఇక శుభకాంక్షల సందేశాలకైతే చెప్పనవసరమే లేదు. ముఖ పరిచయంలేని వ్యక్తులు కూడా ముఖపుస్తకం సాక్షిగా పండగ సందర్భంగా మన శుభాన్ని కోరుతూ వాల్ నింపేస్తారు. అందరం కలిసి జరుపుకోవాల్సిన పండుగను అందరూ సెల్ఫోన్లు ధరించి, తల అందులో కూరి విడివిడిగా జరుపుకుంటూ ఆ విశేషాలను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంటూ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం! ఓ రోజు ముందు నుంచి మొదలయ్యే పండగ ఏర్పట్లు.. పండగ రోజు ఉత్సాహాన్ని రెండు క్షణాల్లో సెల్ఫీలుగా.. గుల్ఫీలుగా కుదించుకుంటున్నాం! నిజమే. వేగం సమయాన్ని మింగేస్తోంది. ఓపికనూ మిగల్చడం లేదు. ఆర్థికంగా ఎదగాలన్న పోటీ సెలవులనూ ఇవ్వడం లేదు. పిల్లలలకు దొరికినా ఆ హాలిడేను పబ్జీ, జీటీఏవైసీటీ వంటి గేమ్స్‌తో పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ సెలవురోజున పండగ వచ్చినా..అలా ఇంట్లో కన్నా నెట్టింట్లోనే పండగ వాతావరణం కనిపిస్తోంది. మామిడికాయ పప్పు, పులిహోర, పూర్ణం బొబ్బట్లు, పరమాన్నపాయసాల పండగ వంటను స్విగ్గీ వండించి వడ్డిస్తోంది. సమష్టి శ్రమ.. సంతోషాలుఏ పండగైనా సమష్టి శ్రమకు సంకేతం. ఉత్పత్తి రంగంలో ఉన్న వారిని గౌరవించే ప్రక్రియ. ఒకరి మీద ఒకరం ఆధారపడుతూ.. అందరి ప్రాధాన్యంతో సమాజాన్ని సమతౌల్యం చేసే బాధ్యత. అన్నిటికీ మించి పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని అధిగమించకుండా.. దాన్ని అనుసరించే మన గమనం ఉండాలని చేసే సూచన. ప్రకృతితో మమేకమవుతూ అనుభూతి చెందాల్సిన ఈ ప్రాక్టికాలిటీ సాంకేతికత పుణ్యమాని వర్చువల్ ఎక్స్పీరియెన్స్కి పడిపోయింది. అందుకే షడ్రుచుల్లోని ఏ రుచీ మనకు తెలియట్లేదు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోడం రావట్లేదు. పులుపు, కారం, చేదు లాంటి కష్టాలు, సమస్యలు, సంక్షభాలు ఎదురైతే చాలు తల్లడిల్లుతున్నాం.. తలకిందులవుతున్నాం. తీపిని ఎంత ఇష్టంగా తింటామో కంట నీరు రాకుండా కారాన్ని దిగమింగడమూ అంతే అవసరం. ఆ సమన్వయాన్నే నేర్పుతుంది ఉగాది. బోధపడాలంటే సోషల్ మీడియా ఫ్రేమ్‌లోంచి బయటపడాలి. పండగ అంటే షేరింగే.. అందరం కలిసి పంచుకునే సంతోషం. ఎఫ్బీ, ఇన్‌స్టాగ్రామ్స్, వాట్సప్‌లలో షేర్స్ కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చేది. అందరికీ అందరం అనే భరోసానిచ్చేది. సమాజాన్ని మానవహారంగా మలిచేది. -
ఆరంభం అమోఘం
నరికిన చెరకులు కొరికిన తియ్యన. చింత చిగురులు.. నలిపిన పుల్లన. కారము కారము.. మిరపలు కలిపిన. చేదు దిగును చెట్టెక్కి పూత రాల్పిన.వగరు చేరును లేత మామిళ్లు కోసిన.ఉగాది వచ్చును.. ఉప్పొక్కటి వేసిన. మిరియాలఫ్రైడ్ రైస్(కారం) కావలసినవి: బాస్మతి బియ్యం – మూడు కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; నల్ల మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – రుచికి తగినంత. తయారి: ►ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, గంటసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో నూనె లేకుండా మిరియాలు, నువ్వులు, కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►జీలకర్ర జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఉడికించిన అన్నం జత చేసి కలపాలి ►మెత్తగా పొడి చేసిన మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►అప్పడాలతో కలిపి తింటే రుచిగా ఉంటుం. చెరకురసం ఖీర్ (తీపి) కావలసినవి: చెరుకు రసం – 2 కప్పులు; బాస్మతి బియ్యం – ఒక కప్పు (శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి అరగంటసేపు నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; పాలు – 2 కప్పులు; జీడి పప్పులు – 3 టేబుల్‌స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు. తయారి: ►ఒక పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►నానబెట్టిన బియ్యం జత చేసి ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►చెరకురసం జత చేసి సుమారు అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి ►బెల్లం పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పులు జత చేసి కలిపి అందించాలి. వేప పువ్వుముద్ద కూర(చేదు) కావలసినవి: ఎండబెట్టిన వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టీ స్పూను; రసం పొడి – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; బెల్లం పొడి – రెండున్నర టీ స్పూన్లు; సెనగ పప్పు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ►అర గ్లాసు నీళ్లలో చింతపండును సుమారు పది నిమిషాలు నానబెట్టి, చిక్కటి రసం తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ►సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాక, వేప పువ్వు వేసి దోరగా వేయించాలి ►చిక్కగా తీసిన చింతపండు రసం జత చేసి బాగా కలపాలి ►బెల్లం పొడి, రసం పొడి, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలిపి, సుమారు ఏడెనిమిది నిమిషాలు స్టౌ మీద ఉంచి దింపేయాలి ►కరివేపాకుతో అలంకరించాలి ►పొంగల్, రాగి సంగడితో అందిస్తే రుచిగా ఉంటుంది. మామిడికాయడ్రింక్ (వగరు) కావలసినవి: మామిడికాయలు – 2; మిరియాల పొడి – చిటికెడు; నల్ల ఉప్పు – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒక గ్లాసుడు; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; బెల్లం పాకం – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు – కొద్దిగా. తయారి: ►మామిడికాయలను శుభ్రంగా కడగాలి ►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, కడిగిన మామిడికాయలను జతచేసి, కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాగా చల్లారాక, మామిడి కాయల తొక్క వేరు చేసి, మామిడి గుజ్జును చేతితో మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఒక పాత్రలో ముప్పావు కప్పు నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కరిగించి, స్టౌ మీద ఉంచి, ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి ►బ్లెండర్లో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, పావు టీ స్పూను జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పాకం, చిటికెడు మిరియాల పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, ఆరేడు పుదీనా ఆకులు వేసి మిక్సీ పట్టాక, తగినన్ని చల్లని నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి తీసేసి, గ్లాసులలో పోసి అందించాలి. చింతపండు పచ్చి పులుసు (పులుపు) కావలసినవి: చింతపండు రసం – రెండు కప్పులు (కొద్దిగా పల్చగా తీసిన రసం); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట; బెల్లం పొడి – టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత. పోపు కోసం: ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి రేకలు – 4; నూనె – కొద్దిగా. తయారి: ►ఒక బౌల్లో చింతపండు రసం, కరివేపాకు, బెల్లం పొడి, ఉల్లి తరుగు, ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి. (ఉప్పు, తీపి తగ్గినట్టుగా అనిపిస్తే, మరింత జత చేసుకోవచ్చు) ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు జత చేసి బాగా వేగిన తరవాత తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చిపులుసులో వేసి కలపాలి అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – మూడు గ్లాసులు; చింతపండు – పెద్ద నిమ్మకాయ పరిమాణం; చిన్న చిన్న చెరకు ముక్కలు – 20; అరటి పండు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); బెల్లం పొడి – ఒక కప్పుడు; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి) తయారి: ►ముందుగా చింతపండును గ్లాసుడు నీళ్లలో నానబెట్టి, రసం తీసి ఒక గిన్నెలో పోయాలి ►మూడు గ్లాసుల మంచి నీళ్లు జతచేయాలి ►బెల్లం పొడి, ఉప్పు జత చేసి బాగా కలపాలి ►వేప పువ్వు, అరటి పండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసి అందించాలి. -
మెచ్చారు...
చారు అంటే మంచి అని అర్థం. మన చారు తమిళనాట రసమైంది. ఆ రసమే ఊరూరూ తిరిగి మళ్లీ మన దగ్గరకొచ్చింది.షడ్రుచులూ పుణికిపుచ్చుకుంది... నవరసాలూరింది.అందుకే కాబోలు...ఘుమఘుమలాడే చారు వాసన తగిలితే చాలు అన్నం ఆవురావురంటుంది. అన్నట్టు ఈ చలికాలంలో ఎవరైనా అతిథి వస్తే ఏం చేయాలా అని తడుముకోవద్దు. ఇక్కడ మేమిచ్చిన రకరకాల చారుల్లో ఓ చారు కాచండి. ఆ చారుతో కడుపు కాచుకుంటూనే వాళ్లు మిమ్మల్ని మెచ్చుతారు చూడండి... కొబ్బరిపాల చారు కావలసినవి:చింతపండు రసం కోసంచింతపండు – ఒక టేబుల్ స్పూను; వేడి నీళ్లు – అర కప్పుచారు కోసంనీళ్లు – ఒకటిన్నర కప్పులు; పసుపు – పావు టీ స్పూను; చారు పొడి – ఒక టేబుల్ స్పూనుచిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంతపోపు కోసంకొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పైన చల్లడానికి కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు తయారీ:అర కప్పు వేడినీళ్లలో చింతపండును సుమారు అర గంటసేపు నానబెట్టాలి ∙చింతపండును గట్టిగా పిండి తీసేసి, రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి ∙పసుపు, చారు పొడి వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి మరిగించాలి ∙బాగా మరిగిన తరవాత మంట ఆర్పేసి, కొబ్బరి పాలు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడి చేశాక, కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపేయాలి ∙వేయించిన పోపును కొబ్బరి పాల చారులో వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి అన్నంలో వడ్డించాలి. నిమ్మరసం – కొత్తిమీర చారు కావలసినవి:నిమ్మ చెక్కలు – 2; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లుపోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ:కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు, ఉప్పు, ఇంగువ, పసుపు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర ముద్ద వేసి కలియబెట్టాలి ∙బాగా మరిగాక కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. పైనాపిల్ చారు కావలసినవి:కందిపప్పు – పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనాపిల్ రసం కోసంపైనాపిల్ తురుము – ఒక కప్పు; తరిగిన టమాటా – 1; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; చారు పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత పొడి చేయడానికి కావలసినవి: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండుమిర్చి – 3; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను, మిరియాలు – 4, వెల్లుల్లి రేకలు – 2 తయారీ:కందిపప్పును శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక మెత్తగా మెదపాలి ∙జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రేకలను మిక్సీలో వేసి తిప్పాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙పైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఒక కప్పుడు పైనాపిల్ ముక్కలు ఉండాలి) ∙సగం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙అదే మిక్సీ జార్లో ఒక టమాటా వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా తిప్పాలి (చేతితో గట్టిగా చిదిమినా సరిపోతుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర + మిరియాల మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు కలపాలి ∙చిదిమిన టమాటా గుజ్జు జత చేసి రెండు మూడు నిమిషాలు కలపాలి ∙పైనాపిల్ గుజ్జు జత చేసి మరో రెండు నిమిషాలు బాగా కలియబెట్టాక, మెదిపిన పప్పు జత చేసి బాగా కలపాలి ∙పైనాపిల్ ముక్కలు, నీళ్లు జత చేసి మరిగించాలి ∙రెండు టీ స్పూన్ల చారు పొడి వేసి కలియబెట్టాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంలో వడ్డించాలి ∙ఈ చారు బాగా ఆకలి పుట్టిస్తుంది. బీట్రూట్ చారు కావలసినవి:సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు – అర కప్పు; నీళ్లు – తగినన్ని పొడి చేయడానికి:జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి)బీట్రూట్ రసం కోసం...చింతపండు – ఒక టేబుల్ స్పూను; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూనుఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూనుపసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ:కుకర్‌లో బీట్రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి ∙మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి తీసి పక్కన ఉంచాలి ∙అదే జార్లో ఉడికించిన నీళ్లతో కలిపిన బీట్రూట్ను నీళ్లతో మిక్సీ పట్టాలి ∙ చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేగేవరకు మరోమారు కలియబెట్టాలి ∙మసాలా పొడి జతచేసి కలపాలి. బీట్రూట్ + చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి ∙రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙(ఎక్కువ మరిగించకూడదు)వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. మైసూర్ చారు కావలసినవి:చారు పొడి కోసంనెయ్యి – 2 టీ స్పూన్లు; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు ఉడికించడానికికందిపప్పు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులుచింతపండు గుజ్జు కోసంచింతపండు – నిమ్మకాయంత; వేడి నీళ్లు – అర కప్పు (చింతపండు నానబెట్టడానికి)మరిన్ని వస్తువులుపసుపు – పావు టీ స్పూను; టమాటా – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నీళ్లు – 2 కప్పులుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ:ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్ లో ఉంచి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙కొద్దిసేపయ్యాక మూత తీసి, పప్పును మెత్తగా మెదపాలి ∙చింతపండును వేడినీళ్లలో సుమారు అర గంట సేపు నానబెట్టాక, చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి శనగ పప్పు వేసి వేయించాలి ∙ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాక ఇంగువ, కరివేపాకు వేసి పదార్థాలన్నీ దోరగా వేగేవరకు కలపాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు బాగా వేయించి, దింపేయాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి (నీళ్లు కలపకూడదు). ఒక పాత్రలో చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙తరిగిన టమాటాలు జత చేయాలి ∙పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి ∙టమాటాలు బాగా మెత్తపడ్డాక, మైసూర్ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి, మరిగించాలి ∙స్టౌ మీద చిన్న బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి ఇంగువ వేసి దోరగా వేయించి తీసేసి, మరుగుతున్న చారులో వేసి కలియబెట్టి దింపేయాలి ∙చివరగా కొత్తిమీర వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. వెల్లుల్లి చారు కావలసినవి:మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి – మూడు రెబ్బలు; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)చింతపండు గుజ్జు కోసంనీళ్లు – అర కప్పు; చింతపండు – ఒక టేబుల్ స్పూనునువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమినప్పప్పు – అర టీ స్పూనుకరివేపాకు – రెండు రెమ్మలుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)వెల్లుల్లి రెబ్బలు – 10 (చేతితో మెదపాలి)తరిగిన టమాటా – 1పసుపు – పావు టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనునీళ్లు – రెండు కప్పులుఉప్పు – తగినంతకొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు తయారీ:చింతపండును తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి (మరీ మెత్తగా ఉండకూడదు) పక్కన ఉంచాలి ∙10 వెల్లుల్లి రేకలను తొక్క తీయకుండా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా తొక్కిన వెల్లుల్లి వరసగా వేసి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి ∙టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి, టమాటాలు మెత్తగా ఉడికేవరకు కలియబెట్టాలి ∙మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఆరు నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంలో వడ్డించాలి ∙సూప్‌లా కూడా తీసుకోవచ్చు. సేకరణ: వైజయంతి పురాణపండ -
నూనెలు సలసల
సాక్షి, విశాఖపట్నం: నింగిలో విహరిస్తున్న కూరగాయల ధరలకు నూనెలు, చింతపండూ తోడయ్యాయి. ఇవి ఏకమై సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలలుగా కాయగూరలు కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. ఒక్క బంగాళాదుంపలు తప్ప మరే దుంపలూ, కూరగాయలూ కిలో రూ.30 నుంచి 100కు పైగానే ఎగబాకాయి. కార్తీకమాసం, అకాల వర్షాల పేరు చెప్పి వీటి ధరలను అమాంతం పెంచేశారు. కార్తీకమాసం పూర్తయినా వీటి రేట్లు నామమాత్రంగానే దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50కి పైన ఉండగా, క్యారెట్ రూ.70 నుంచి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికీ పలు కూరగాయలు కిలో రూ.30 నుంచి 60 మధ్య పలుకుతున్నాయి. ఈ తరుణంలో వంట నూనెల ధరలు కూడా వాటికి వంత పాడుతున్నాయి. కొన్నాళ్లుగా లీటరు రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్టు రూ.76 నుంచి 78 మధ్య లభించేది. కొద్దిరోజుల క్రితం ఒక్కో ప్యాకెట్టుకు రూ.6–8 వరకు పెంచేశారు. దీంతో అది రూ.84 వరకు పెంచి విక్రయిస్తున్నారు. అలాగే రూ.62 ఉండే లీటరు పామాయిల్ ఇప్పుడు రూ.68–70కి పెరిగింది. హోల్‌సేల్‌లో 15 కేజీల రిఫైన్డ్ ఆయిల్ డబ్బా రూ.1180, పామాయిల్ రూ.980 ఉండేది. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ రూ.1250, పామాయిల్ రూ.1060కు చేరింది. ఇలా లీటరు ప్యాకెట్‌పై సగటున రూ.7, డబ్బాపై రూ.80 వరకు పెరిగింది. పెరిగిన ధరలను వ్యాపారులు వెనువెంటనే అమలులోకి తెచ్చారు. ఇటీవల ప్రభుత్వం నూనెలపై ఎక్సైజ్ డ్యూటీని 7.5 శాతం పెంచింది. ఇదే నూనెల ధరలు పెరుగుదలకు దారితీశాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మలేసియా మార్కెట్ ఆధారంగా నూనెల ధరల పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ఇప్పుడిప్పుడే మలేసియా మార్కెట్లో ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నాలుగైదు రోజుల క్రితం నుంచే వంట నూనెల ధరలు తగ్గుతున్నా, పాత ధరకు కొనుగోలు చేసిన నిల్వలుండడంతో వ్యాపారులు ఆ మేరకు ఇంకా పూర్తి స్థాయిలో ధరలు తగ్గించడం లేదు. చింతపండుదీ అదే దారి.. ఇక చింతపండు కూడా కూరగాయలు, నూనెల ధరతో పోటీ పడుతోంది. నిన్న మొన్నటి దాకా పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.60–70, పిక్క తీసినది రూ.120–130 వరకు లభించేది. ఇప్పుడు ఏకంగా యాభై శాతానికి పైగా పెరిగిపోయింది. అంటే అరకిలో రూ.100, కిలో రూ.190–200కు పెరిగిపోయింది. హోల్‌సేల్ మార్కెట్లో 15 కిలోల పిక్కతీసిన చింతపండు నెల రోజుల క్రితం రూ.1650 ఉండేది. ఇప్పుడది రూ.2400కు ఎగబాకింది. చింతపండు నిల్వలు తగ్గిపోయాయన్న సాకుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా పెరిగిపోతుందన్న ప్రచారాన్ని కూడా విస్తృతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కూరగాయల ధరలతో సతమతమవుతున్న సగటు మధ్య తరగతి వారికి నిత్యావసర సరకులైన వంట నూనెలు, చింతపండు ధరలు కూడా మంట పెట్టిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై తీవ్రంగా మండి పడుతున్నారు. -
ఇంటిప్స్
కిచెన్ టవల్స్ బాగా మురికిగా ఉంటే, వాటిని వేడినీళ్లలో బేకింగ్ పౌడర్, వెనిగర్ కలిపి నానబెట్టి ఆ తర్వాత శుభ్రపరచాలి బ్లీచింగ్, సోడియం బై కార్బోనేట్లో రాత్రంతా నానబెట్టి, తర్వాత శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. వంటగదిలో పట్టిన మొండి మరకలను తొలగించడానికి చింతపండును నానబెట్టి మరకలమీద రుద్దాలి. వెండి వస్తువులను వేడి నీటిలో నానబెట్టి, నిమ్మరసంతో రుద్ది కడిగితే చక్కగా శుభ్రపడతాయి. కిచెన్ సింక్ సరిగ్గా శుభ్రపడకపోతే చింతపండు గుజ్జులో ఉప్పు కలిపి రుద్ది, తర్వాత డిటర్జెంట్ లిక్విడ్‌ను వాడి కడగాలి. చీమలు మరీ బాధిస్తుంటే నిమ్మరసంలో టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి చీమలు ఉన్న ప్రాంతాలలో స్ప్రే చేయాలి. దాల్చినచెక్క పొడి, మిరియాల పొడులను నీళ్లలో కలిపి స్ప్రే చేస్తే చీమల సమస్య ఉండదు. -
దిల్ఫుల్ దావత్
కడుపు నిండా తినాలి అంటే... పెట్టే చెయ్యి ఉండాలి. మనసు నిండా తినాలి అంటే... కొసరి కొసరి పెట్టే చెయ్యి ఉండాలి. తెలంగాణా ఆతిథ్యానికి ‘అదబ్ ఔర్ ఖాతిర్దానీ’ అని పేరుంది. అంటే.. సౌహార్ద్రం, అతిథి మర్యాదల సంస్కారం. తెలుగు రుచుల్లో ఇది తెలంగాణ ప్రత్యేకత. మనసు నిండా తినండి. ఈ... దిల్ఫుల్ దావత్ ఫ్రమ్ తెలంగాణ. సర్వప్ప కావల్సినవి: బియ్యప్పిండి - కప్పు / 165 గ్రాములు తెల్ల నువ్వులు - పావు కప్పు (వేడినీళ్లలో నానబెట్టి, నీళ్లు వడకట్టి, పక్క నుంచాలి); శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి, పొట్టు తీసి, పలుకులు చేయాలి); పచ్చిమిర్చి - 5 (తరగాలి; పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; వెల్లుల్లి - 10 రెబ్బలు(తరగాలి); ఉల్లిపాయ - 1 (తరగాలి); కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉల్లికాడలు (సన్నగా తరగినవి) - పావు కప్పు; కారం - పావు టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు (సన్నగా తరగాలి); ఉప్పు - రుచికి తగినంత ; నీళ్లు - ముప్పావు కప్పు (తగినన్ని); నూనె - 3 టీ స్పూన్లు తయారీ: నువ్వులను, శనగపప్పును విడివిడిగా గంట నానబెట్టి, వడకట్టాలి. ఉల్లి తరుగును కచ్చాపచ్చాగా దంచాలి. పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, నువ్వులు, శనగపప్పు, పల్లీల పలుకులు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు-ముద్ద, కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి, కలిపి గట్టి ముద్ద చేయాలి. మందపాటి గిన్నె (సర్వ) అడుగున నెయ్యి రాసి, పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రొట్టెలా చేత్తో వెడల్పుగా వతి, సన్నని మంట మీద కాల్చాలి. (పిండిని రొట్టెలా చేసి, పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవచ్చు) బగారా రైస్ కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు ఉల్లిపాయలు - 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు - 3పచ్చిమిర్చి - 7 (సన్నగా తరగాలి); కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు - గుప్పెడు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; నెయ్యి / నూనె - అర కప్పు; నీళ్లు - 5 కప్పులు లవంగాలు - 10; యాలకులు - 7; కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి.దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి. నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు. పచ్చి పులుసు కావల్సినవి చింతపండు - నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి)ఉప్పు - తగినంతనీళ్లు - 3 కప్పులు పచ్చిమిర్చి - 4 జీలకర్ర - టీ స్పూన్; కొత్తిమీర - టేబుల్‌స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; ఉల్లిపాయ - 1; ఎండుమిర్చి - 2; వెల్లుల్లి - 4 రెబ్బలు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెమ్మ ధనియాల పొడి - అర టీ స్పూన్ తయారీ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్నవారు టీ స్పూన్ పంచదార/బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి. నాటు కోడి కూర కావల్సినవి: నాటు కోడి ముక్కలు - అరకేజీ; పచ్చిమిర్చి - 4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు) - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు - 2, ఎండుమిర్చి - 2; పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం- వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలి. ఉప్పుడు పిండి కావల్సినవి: బియ్యపు రవ్వ-కప్పు; పెసరపప్పు-టేబుల్ స్పూన్; ఎండుమిర్చి- 2; పల్లీలు - టేబుల్ స్పూన్, కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత; అల్లం - చిన్న ముక్క; జీలకర్ర - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్; నీళ్లు - రెండున్నర కప్పులు; కొత్తిమీర - కొన్ని ఆకులు తయారీ మందపాటి గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. కరివేపాకు, ఎండుమిర్చి, దంచిన అల్లం వేసి కొద్దిగా వేగాక నీళ్లు పోసి, కలిపి మూత పెట్టాలి. ఉప్పు కలిపిన తర్వాత బియ్యపు రవ్వ పోస్తూ కలపాలి.మంట తగ్గించి, ఉడకనివ్వాలి. మాడకుండా జాగ్రత్తపడుతూ ఎక్కువసేపు మగ్గనిస్తే రుచి పెరుగుతుంది. చివరగా కొత్తిమీర చల్లి ఆవకాయ లేదా టొమాటో చెట్నీతో వడ్డించాలి. చేప వేపుడు కావల్సినవి చేప ముక్కలు - 6 కారం - అర టీ స్పూన్మొక్కజొన్న పిండి - టీ స్పూన్ ఉప్పు - తగినంత నిమ్మరసం - అర టీ స్పూన్ గుడ్డు - 1 నూనె - తగినంత ధనియాల పొడి - టీ స్పూన్ గరం మసాలా - అర టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ కొత్తి మీర - టీ స్పూన్ నూనె - 3 టేబుల్ స్పూన్లు (తగినంత) తయారీ గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి.చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి. తలకాయ కూర కావల్సినవి తలకాయ మాంసం - అర కేజీ ఉల్లిపాయలు - 4 టొమాటోలు - 2 పచ్చిమిర్చి 4 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు పసుపు - టీ స్పూన్ కారం -టీ స్పూన్ గరం మసాలా - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి-2 టీ స్పూన్లు, నూనె - తగినంత తయారీ తలకాయ మాంసం శుభ్రం కడిగి, కుకర్‌లో ఉప్పు, పసుపు, కారం వేసి 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసి ముద్ద చేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఉల్లి ముక్కలు, మెత్తగా రుబ్బిన ఉల్లి ముద్ద వేసి వేయించాలి. గరం మసాలా, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి. కుకర్‌లో ఉడికించిన తలకాయ కూర వేసి తగినన్ని నీళ్లు పోసి, కొబ్బరి, ఉప్పు వేసి కలిపి గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించి, దించాలి. పులుసుకైతేచింతపండు గుజ్జు, టీ స్పూన్ బెల్లం కలిపి ఉడికించాలి. నల్లి బొక్క కూర కావల్సినవి: మేక/గొర్రె కాలి ఎముకలు +మటన్ - 750 గ్రా.లు (నల్లి అంటే ఎముకలో ఉండే మూలిగ) ఉల్లిపాయలు - 3 (సన్నగా తరగాలి) వెల్లుల్లి - 10 రెబ్బలు (సన్నగా తరగాలి అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ నూనె - అర కప్పు; బిర్యానీ ఆకులు - 2; యాలకులు - 4లవంగాలు - 6; కారం - అర టీ స్పూన్, ఎండుకొబ్బరి - పావు కప్పు; దాల్చిన చెక్క - చిన్న ముక్క; మిరియాలు - 6 ధనియాల పొడి - టేబుల్ స్పూన్; ఉప్పు - తగినంత టొమాటో గుజ్జు - అర కప్పు; పెరుగు - కప్పు తయారీ మటన్ ముక్కలను కడిగి పక్కనుంచాలి.మందపాటి గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.అల్లం-వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి వేసాక మటన్ వేసి, వేయించాలి. దీంట్లో 2 కప్పుల నీళ్లు, ఉప్పు వేసి 20 నిమిషాలు ఉడికించాలి. ఎముక నుంచి మటన్ ముక్క విడిపడేవరకు ఉడకాలి. దీంట్లో టొమాటో గుజ్జు, పెరుగు, కొబ్బరి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. నోట్: కావల్సితే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఈ కూర రోటీలు, అన్నంలోకి రుచిగా ఉంటుంది. గంగవాయిల్ కూర- మామిడికాయ పప్పు కావల్సినవి: మామిడికాయ - 1 గంగవాయిల్ కూర - 3 కప్పులు కందిపప్పు - కప్పు ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి) ఎండుమిర్చి - 2 కారం - అర టీ స్పూన్పసుపు - పావు టీ స్పూన్ జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ ఉప్పు - తగినంతనూనె - 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి - అర టీ స్పూన్ తయారీ పప్పు కడిగి, ఉడికించాలి. ఆకు కూరను శుభ్రం చేసి పక్కన ఉంచాలి. మామిడికాయ పై తొక్కతీసి ముక్కలు చేయాలి) స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు వేసి వేయించాలి. దీంట్లో మామిడికాయ ముక్కలు, గంగవాయిలు కూర వేసి మగ్గనివ్వాలి. దీంట్లో పప్పు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఉడికనివ్వాలి. మామిడికాయ ముక్క ఉడికాక.. చివరగా కొత్తిమీర వేసి, దించాలి. రోటీ లేదా అన్నంలోకి వడ్డించాలి. కర్టెసీ కె. కుమార్, చెఫ్ ఐశ్వర్యా మల్టీ క్యుజిన్, నిజామాబాద్ -
ఇంటిప్స్
పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. -
జీసీసీకి చింత
శీతల గిడ్డంగిలో నిల్వచేసి పట్టించుకోని అధికారులు ఎందుకూ పనికిరాకుండా పోయిన చింతపండు నిర్లక్ష్యం ఖరీదు రూ. కోటి భారం సేల్స్‌మెన్‌పై మోపేందుకు {పయత్నాలు చింతపల్లి: తప్పు ఒకరు చేసి శిక్ష మరొకరికి వేస్తామన్న చందంగా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఏజెన్సీ 11 మండలాల్లో చింతపండు కొనుగోలుకు సేల్స్‌మెన్‌కు లక్ష్యాలు నిర్దేశించారు. కొనుగోలు చేసిన చింతపండును సకాలంలో అమ్మకుండా కోల్డు స్టోరేజ్‌లో ఉంచారు. ఏడాది తరువాత ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఆ భారం సేల్స్‌మెన్‌పై రుద్దేందుకు తాజాగా రంగం సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఒక్కో సేల్స్మేన్పై రూ.లక్షల్లో భారం పడనుంది. దీంతో బాధిత సేల్స్మెన్లు లబోదిబో మంటున్నారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలో భాగంగా గత ఏడాది కిలో చింతపండు ధర రూ.22 నిర్ణయించారు. ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించి కొనుగోలు బాధ్యతలు శ్యాండిఇన్స్పెక్టర్లు, సేల్స్‌మెన్‌కు అప్పగించారు. జీసీసీ కొనుగోలు చేసిన చింతపండును నాణ్యంగా తయారుచేసి తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవస్థానాలతో పాటు మన్యంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు రూ. 48 లక్షలు విలువ చేసే 250 టన్నుల చింతపండును కొనుగోలు చేశారు. సరుకు రవాణా, కోల్డ్‌స్టోరేజ్ అద్దెలు కలుపుకుని ఏడాదికి దాదాపు రూ.కోటి ఖర్చయినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. కిలో రూ. 22కు కొనుగోలు చేసిన తరువాత భయట మార్కెట్లో ధరలు బాగా పెరిగాయి. వ్యాపారులు రూ.29కి కొనుగోలు చేసేవారు. అప్పట్లో చాలా మంది సేల్స్‌మెన్ బయట మార్కెట్లో అమ్ముదామని అధికారులకు సలహా ఇచ్చినా వారు అంగీకరించ లేదు. మరింత లాభాలు సాధించవచ్చని ఆశించారు. సరుకు నిల్వలో నిర్లక్ష్యం అంతవరకు బాగానే ఉన్నా కొన్న సరుకును భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యం వహించారు. అనకాపల్లిలోని ప్రైవేటు కోల్డు స్టోరేజ్‌లో భద్రపరిచిన అధికారులు ఆ తరువాత దాని బాగోగులు పట్టించుకోలేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చింతపండు నిల్వలకు అవసరమైన ఏసీని అందించలేదు. దీంతో నిల్వచేసిన చింతపండంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. నెలకు సుమారు రూ.60 వేల అద్దె చెల్లించిన అధికారులు నిల్వ చేసిన చింతపండు ఎలా ఉందో నెలకు ఒకసారి కూడా వెళ్లి చూడక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని సేల్స్మెన్లు వాపోతున్నారు. పైగా తాము అప్పగించిన సరుకు బదులు వేరే సరుకు నిల్వ కేంద్రాల్లో ఉందని చెబుతున్నారు. దీనిపై సంబంధిత కోల్డ్‌స్టోరేజ్ సిబ్బందిని ప్రశ్నిస్తే చాలా మంది సరుకులు నిల్వ చేసుకుంటారని, ఎవరి సరుకులు వారు చూసుకోవాలని సమాధానం చెబుతున్నారన్నారు. జరిగిన నష్టం పూడ్చుకునేందుకు జీతల్లో కోత విధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సేల్స్మెన్లు చెబుతున్నారు. అదే జరిగితే తాము కోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పాడైన చింతపండు తీసుకెళ్లి పాడేయాలన్నా మరో ఐదారు లక్షల రూపాయలు ఖర్చవుతుంది.