ఘట్‌కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.
నాణ్యత లేని సరుకులు..
అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి, వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు.
రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్‌లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్‌లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు.
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!
Published Thu, Aug 21 2014 2:06 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement