Wheat
-
ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!
సంప్రదాయ ఖఫ్లీ గోధుమలు గురించి విన్నారా. ఇవి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. తప్పనిసరిగా రోజువారీ ఆహారgలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌కి పేరుగాంచిన ఈ ఖఫ్లీ గోధుమలతో కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మన దేశంలో చాలామంది ప్రజలు రోటీలను ప్రదాన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్, కార్మోహైడ్రేట్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకోసం అనుకుంటే సాధారణ గోధుమలు కంటే ఈ ఖఫ్లీ గోధుమలు మరింత మంచివని చెబుతున్నారు నిపుణులు. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితులలను తట్టుకుని మరి పెరుగే ధాన్యంగా ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలో ఈ రకం గోధుమలను ఎక్కువగా పండిస్తారు. ప్రయోజనాలు..ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి కొన్ని ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి సమతుల్యం చేస్తుంది. ప్రత్యేకించి టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీకి మంచిది. జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఇది. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి..గుండె శ్రేయస్సుకి తోడ్పడతాయి.బరువు నిర్వహణలో సహాయపడుతుంది.దీనిలోని ఫైబర్ కంటెంట్ మంచి పోషకమైన గట్ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
గోధుమ ధరల పెరుగుదలకు చెక్!
న్యూఢిల్లీ: గోధుమల ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ట్రేడర్లు, హోల్‌సేల్ వర్తకులు, బడా రిటైల్ మాల్స్ నిర్వాహకులకు గోధుల నిల్వలపై పరిమితులను కఠినతరం చేసింది. జూన్ 24న విధించిన నిల్వ పరిమితులను సవరించింది. ట్రేడర్లు, టోకు వర్తకులు 2,000 టన్నుల వరకే నిల్వ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఇది 3,000 టన్నులుగా ఉంది.3 బడా రిటైల్ చైన్లు ప్రతి ఔట్లెట్ (స్టోర్)లో 10 మెట్రిక్ టన్నుల వరకే గోధుమల నిల్వలకు పరిమితం కావాల్సి ఉంటుంది. డిపోలో స్టోర్ సంఖ్యకు 10 రెట్లకు మించి ఉండరాదు. గతంలో స్టోర్‌వారీ పరిమితుల్లేవు. అదే గోధుమ ప్రాసెసర్లు అయితే నెలవారీ స్థాపిత సామర్థ్యంలో ఇప్పటి వరకు 70 శాతం వరకు నిల్వలు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటే, దీనిని 60 శాతానికి తగ్గించింది. విడిగా రిటైల్ స్టోర్లు అయితే 10 టన్నుల గోధుమలు నిల్వ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఉల్లిగడ్డలు, బాస్మతీ ఎగుమతులపై ఆంక్షల తొలగింపు ఉల్లిగడ్డలు, బాస్మతీ బియ్యం ఎగుమతులకు సంబంధించి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర రైతులు ఎక్కువగా ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. హర్యానా, పంజాబ్‌లో బాస్మతీ సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. బాస్మరీ బియ్యం ఎగుమతికి టన్నుకు కనీసం 950 డాలర్ల ధర పరిమితిని తొలగించింది. అలాగే, టన్ను ఉల్లిగడ్డలపై 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను కూడా తొలగించినట్టు డైరెక్టరేట్ నరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎగుమతుల వృద్దికి, రైతుల ఆదాయం మెరుగుపడేందుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఇండియన్ ఫుడ్‌కు భారీ డిమాండ్.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
2వేల టన్నుల గోధుమలకు 11న ఈ–వేలం
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్–డొమెస్టిక్ ద్వారా కేంద్రం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలు) ఈ నెల 11వ తేదీన ఈ–వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు శనివారం ఎఫ్‌సీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గోధుమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే వారు, గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను విక్రయిస్తున్నట్లు తెలిపింది. కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 100 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులని, ఈ–వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్, జి.ఎస్.టి. / ట్రేడ్ ట్యాక్స్ రిజి్రస్టేషన్, పాన్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో 2వేల మెట్రిక్ టన్నుల విక్రయానికి.. క్వింటా రూ.2150 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ–వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..
ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంతోమంది ఎన్నో రకాల పర్యావరణ హితకరమైన ప్లేట్లను తీసుకొచ్చారు. చెట్ల నారతో చేసేవి, ఆకులతోటి, లేదా కాగితాలు తదితర విభిన్నమైనవి వచ్చాయి. కానీ ఇక్కడొక వ్యక్తి ప్లేట్లలో తిని పడేయక్కుండే హాయిగా తినేసే ప్లేట్లను తయారు చేశాడు. తినేయొచ్చు లేదా వేరే విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అలా రూపొందించాడు. ఇవి ప్రపంచంలోనే ఏకైక తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేటు కూడా. వివరాల్లోకెళ్తే..కేరళకు చెందిన విజయ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ వినూత్న ప్లేట్లను ఆవిష్కరించాడు. కట్లరీ బ్రాండ్‌తో తూషాన్ అనే కంపెనీని స్థాపించి వీటిని ఉత్పత్తి చేస్తున్నాడు. నిజానికి బాలకృష్ణన్ కుటుంబం మారిషస్‌లో ఉండేది. ఆయన అక్కడ సైన్యం, భీమా, బ్యాకింగ్ తదితర రంగాలలో విజయవంతంగా పని చేసి స్వచ్ఛంద పదవివిరమణ చేసిన 46 ఏళ్ల వ్యక్తి. 2013లో మారిషస్ నుంచి తిరిగి స్వదేశానికి రాగానే ఇల్లు కట్టుకుని స్థిరపడాలని అనుకున్నాడు. అదికూడా వంద శాతం సౌరశక్తితో నిర్మించాడు. అతను ఇల్లుని కూడా పర్యావరణ హితంగానే నిర్మించుకున్నాడు. వారి ఇంట్లో కూడా వ్యర్థపదార్థాల నుంచి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను ఉపయోగిస్తారు. బాలకృష్ణన్ మారిషస్ నుంచి కేరళలోని ఎర్నాకులంకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఈ పర్యావరణపై మరింతగా దృష్టిసారించాడని చెప్పాలి. ఎందుకంటే మారిషస్ చాలా పరిశుభ్రమైన ప్రదేశం. రహదారిపై ఒక్క కాగితం ముక్క, ప్లాస్టిక్ బాటిళ్లు కనుగొనడం అసాధ్యం. అంతలా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రత పట్ల మారిషస్‌లో ఉన్న నిబద్ధత బాలకృష్ణన్ మనుసులో బలంగా నాటుకుపోయింది. అదే ఈ వినూత్న బయోడిగ్రేడబుల్ ప్లేట్లు ఆవిష్కరణకి నాంది పలికేలా చేసింది. ఆయన దుబాయ్‌లో ఓ పార్టీకి హాజరయ్యారు. అక్కడ అతనికి తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణతో ఆశ్చర్యపోయిన ఆయన ఒక పోలిష్ కంపెనీ అలాంటి ప్లేట్లను తయారు చేసినట్లు తెలుసుకున్నాడు. దీన్నే భారతదేశానికి తీసుకురావాలనే కోరికతో పోలిష్ కంపెనీని కూడా సంప్రదించాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. అయినా నిరాశ చెందక బాలకృష్ణనే స్వయంగా వరి ఊక, వరిపొట్టు, మొక్కజొన్న వ్యర్థాలు తదితర వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఈ తపనే కొచ్చిలోని ఒక సైన్సు ఎగ్జిబిషన్‌కు దారితీసింది. ఆ ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాల్లో సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) కొబ్బరిపీచుతో తయారుచేసిన ప్టేట్లను ఉంచడం గమనించాడు. ఇది పరిశోధనా ప్రయోజనాల కోసమే గానీ వాణిజ్యీకరణ కోసం ఉద్దేశించింది కాదని ఆ సీఎస్ఐఆర్ బృందంతో జరిపిన చర్చల్లో తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సీఎస్ఐఆర్ డైరెక్టర్‌ను సంప్రదించి తన ఆసక్తిని వివరించారు. ఆ తర్వాత ఆ సీఎస్ఐఆర్ బృందంతో సమావేశం జరిగింది. అది బాలకృష్ణన్‌కి సహకరించడానికి అంగీకరించింది. ఐతే వారి పరిశోధనలకు నిధుల సమస్య ఎదురైంది. ముందుగా బాలకృష్ణన్ ప్రాజెక్టులో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్లేట్ల తయారీకి యంత్రాలు లేకపోవడంతో అదనంగా మరో పదిలక్షలు పెట్టుబడి పెట్టారు. అంకితభావం, నిబద్ధతలకు ప్రతిఫలంగా సరిగ్గా 2018లో గోధుమ ఊకతో తయారు చేసిన ప్టేట్లు ల్యాబ్‌లో ఆవిర్భవించాయి. దీంతో శాస్త్రవేత్తలు భారీ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు, లైసెన్సులు సంపాదించారు బాలకృష్ణన్. దీంతో 2021లో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. అదే అంగమలీకి చెందిన వీఐఆర్ నేచురల్స్ పుట్టుకకు దారితీసింది. కట్లర్ తూషన్ బ్రాండ్‌తో ఈ ప్లేట్లను ఉత్పత్తి చేశారు. నిజానికి తూషన్ అంటే మళయాళంలో అరటి ఆకు అని అర్థం. ప్రైవేట్ సమావేశాలు, పర్యావరణ స్ప్రుహతో కూడిన వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లను కలిగిన వివిధ రకాల భోజన సెట్టింగ్‌లో ఈ ప్లేట్లో హవా ఊపందుకోవడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ తూషాన్ కంపెనీ రోజూకి వెయ్యి పెద్ద ప్లేట్లు, మూడు వేల చిన్న ప్లేట్లు ఉత్పత్తి చేస్తుంది. తమ ఉత్పత్తికి తగ్గ డిమాండ్ ఉండపోయినా స్టాక్ నిర్వహణకు హామీ ఇచ్చేంత స్థిరంగా ఉందని ధీమాగా చెబుతున్నారు బాలకృష్ణన్. అలాగే కుమరకోమ్‌లో జరిగిన జీ20 ఈవెంట్ వంటి వాటికి ఊహించని రేంజ్లో ఆర్డర్ వచ్చిన సందర్భాల గురించి చెప్పుకొచ్చారు. ఆ ప్రోగామ్ కోసం దాదాపు 3వేల ప్లేట్లను సరఫరా చేసే ఆర్డర్ వచ్చిందని చెప్పారు. తూషన్ కట్లరీ బ్రాండ్ ఉత్పత్తులు జీరో శాతం వ్యర్థాల ఉత్పత్తిగా పేరుగాంచాయి. ఈ ప్లేట్లు ప్రయోజనం.. ఈ ప్లేట్లలో భోజనం చేసి పడేయక్కర్లేదు. మళ్లీ వాడుకోవచ్చు లేదా వాటిని తినొచ్చే లేదా ఆవులు లేదా ఆక్వా ఫుడ్‌గా కూడా పెట్టొచొచ్చు. అలాగే పర్యావరణంలో ఈజీగా డికంపోజ్ అవుతుంది. అన్ని రకాలుగా ఉపయోగపడేలా రూపొందిచిన ప్లేట్లు. View this post on Instagram A post shared by Thooshan (@thooshanediblecutlery_) వరించిన అవార్డులు ఈ ఆవిష్కరణకు గానూ బాలకృష్ణన్ రాఫ్తార్ ఏబీఐ జాతీయ అవార్డు, 2022లో ఎఫ్ఐసీసీఐ అగ్రి స్టార్టప్ సదస్సు స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతిష్టాత్మకమైన క్లైమథాన్ 2022 వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కాయి. ఇక తూషన్ ఉత్పత్తుల్లో పెద్ద ప్లేట్ల ధర ఒక్కొక్కటి రూ. 10, చిన్నవి ఒక్కో ముక్క రూ.5 అదనంగా, బియ్యం పిండితో తయారు చేసిన 100 స్ట్రాస్‌ల సెట్ రూ 150కి అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు బాలకృష్ణన్. అంతేగాదు ప్లాస్టిక్‌లను దశలవారీగా నిర్మూలించి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరీ సామాజిక బాధ్యత అని గ్రహించడం చాలా ముఖ్యం అని అన్నారు. ఇలాంటి వినూత్న ఉత్పత్తులు ప్రజలు స్వీకరించాలే ప్రోత్సహం ఉండాలన్నారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు మంచి బ్రాండ్‌గా ఉనికి చాటుకున్నప్పటికి లాభాలబాట పట్టాల్సి ఉందన్నారు. చాలా ఆటుపోట్ల మధ్య ఈ బ్రాండ్ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. View this post on Instagram A post shared by Thooshan (@thooshanediblecutlery_) ఇంకా ఒకరకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా, కెనడా, హంగేరీ, మెక్సికో వంటి దేశాల్లో ఈ పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు మంచి ప్రజాదరణ ఉండటం విశేషం. కాగా, ఈ ఉత్పత్తుల ఆవిష్కర్త బాలకృష్ణన్ మాట్లాడుతూ..తాను ఇది ప్రారంభించాలనుకున్నప్పుడూ కుటుంబ సభ్యలెవరూ మద్దతివ్వలేదని, ఒక్క తన భార్యే సహకారం అందించారని చెప్పారు. అందరూ రిస్క్ అన్నట్లు పెదవి విరిచారు. ఈ రోజు అందరిచే ప్రసంశలందుకునేలా మంచి పర్యావరణ హిత బ్రాండ్‌ని ఉత్పత్తి చేశాననే ఆనందం దక్కింది. ఇక మరిన్ని లాభాలు అందుకునేలా వ్యాపారాన్నిబాగా ముందకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యం అని బాలకృష్ణన్ సగర్వంగా చెప్పారు. (చదవండి: నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..) -
తెలంగాణ వ్యవసాయ విధానాల్లో స్వామినాథన్ ముద్ర
సాక్షి, హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ తెలంగాణ వ్యవసాయ విధానాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని పలు నిర్ణయాలు చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది స్వామినాథన్ ఆలోచనల్లో ఒకటి. సీఎం కేసీఆర్ రైతుబంధుకు రూపకల్పన చేయడం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యంత కీలకమైంది. రైతుబంధు, రైతుబీమా పథకాలను పలు సందర్భాల్లో స్వామినాథన్ ప్రశంసించారు. అంతేకాదు స్వామినాథన్ కీలక సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతులు పండించే పంటలకు ఎంతెంత ఎంఎస్పీ ఉండాలో స్వామినాథన్ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్రం వివిధ పంటల సాగు ఖర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. ఉదాహరణకు సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ.3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతేడాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాలని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరారు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయితే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఎంఎస్పీ ఖరారు చేయలేదు. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ సాగు ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోధుమలు, బియ్యం ధరల స్థిరీకరణ
సాక్షి, అమరావతి: గోధుమలు, గోధుమ పిండి, బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్ – డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద 25 లక్షల టన్నుల బియ్యం, 50 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద ఆంధ్రప్రదేశ్‌లో 7.61 లక్షల టన్నుల బియ్యం, 10,703 టన్నుల గోధుమలు ఉన్నాయి. వీటికి అదనంగా సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరో 8.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఓఎంఎస్ఎస్ (డీ) పథకం కింద ఎఫ్‌సీఐ ప్రతివారం నిర్వహించే ఈ–వేలంలో భాగంగా అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 23న 5 వేల టన్నుల గోధుమలు, 13,200 టన్నుల బియ్యాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ–వేలంలో పాల్గొనదలి్చన వారు ఈఎండీ మొత్తాన్ని ఎల్రక్టానిక్ మోడ్ ద్వారా జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి పేరిట ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఆసక్తి కలిగిన పిండి మిల్లులు, గోధుమ పిండి ప్రాసెసర్లు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులు ఈ–వేలంలో పాల్గొనేందుకు www. valuejunction.in/ fci లో ఎం.జంక్షన్‌ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. వేలంలో గోధుమలు కొన్న వారు 30 రోజులలోపు ప్రాసెస్ చేసి రిటైల్ మార్కెట్లోకి విడుదల చేయాలి. బియ్యం వేలంలో వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. ఎఫ్ఆర్కే బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,973, ఎఫ్ఆర్కే కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,900గా నిర్ణయించారు. ఆసక్తి గల బిడ్డర్లు, వ్యాపారులు వెబ్సైట్ ద్వారా వారి వివరాలను సమరి్పంచి ఈ వేలంలో పాల్గొనవచ్చని ఎఫ్‌సీఐ ఏపీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
గోధుమ నిల్వలపై పరిమితులు
న్యూఢిల్లీ: పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్) విధానం కింద సెంట్రల్ పూల్ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది. గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
గోధుమల ఎగుమతుల బ్యాన్: ఫుడ్ ఎమర్జెన్సీ నుంచి ఇండియా ఎలా బైటపడిందో తెలుసా?
దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించింది. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్ సేనల కోసం నాటి ఇంగ్లండ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారు. దేశ విభజనతో ఇండియాలో ఆహారధాన్యాల కొరత తీవ్రం 1947 ఆగస్టులో జరిగిన దేశవిభజనతో భారతదేశంలో తిండిగింజల కొరత తీవ్రమైంది. వరి విపరీతంగా పండే తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్), గోధుమల సాగు విస్తారంగా జరుగుతూ, భారీ దిగుబడులకు పేరుగాంచిన పశ్చిమ పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్ లో అంతర్భాగం కావడం వల్ల భారత్ లో ఆహారధాన్యాల కొరత కనీవినీ రీతిలో పెరిగింది. అంతకు ముందు 1937లో ఇండియా నుంచి బర్మాను విడదీసి బ్రిటిష్ వారు దానికి స్వాతంత్య్రం ఇవ్వడంతో దేశంలో పప్పుధాన్యాల కొరత వచ్చింది. ఈ సమస్య నెమ్మది మీద పరిష్కారమైంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాని పండిత నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దేశంలో ఆహారధాన్యాల సాగును అభివృద్ధిచేసే కన్నా తిండి గింజలను దిగుమతి చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించాయి. మొదటి పదేళ్ల కాలంలో పరిశ్రమల స్థాపనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని 1959లో ఢిల్లీ వచ్చిన అమెరికా వ్యవసాయ నిపుణుల బృందం నెహ్రూ సర్కారుకు సలహా ఇచ్చింది. ఆహారధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినాగాని నెహ్రూ కాలం నుంచి 1970 వరకూ ఇండియాలో తిండి గింజల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగింది. 1964-1969 మధ్యకాలంలో అంటే శాస్త్రి, ఇందిరాగాంధీ పాలనలో అమెరికా నుంచి ఇండియాకు పీఎల్-480 అనే పథకం కింద నాసిరకం గోధుమలు ఉచితంగా, రాయితీ ధరలపై సరఫరా అయ్యేవి. అయితే, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి సి.సుబ్రమణ్యం చొరవతో రూపొందించి, ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు–హరిత విప్లవం పేరుతో తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు ఇచ్చాయి. అధిక దిగుబడినిచ్చే గోధుమ (మెక్సికో రకం), వరి వంగడాలు విస్తారంగా రైతులకు అందుబాటులోకి రావడం దేశంలో తిండిగింజల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో అమెరికా నుంచి ఆహారధాన్యాల సాయానికి భారత్ స్వస్తి పలికింది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రీన్ రివల్యూషన్ పద్ధతులు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో, 1968 రబీ సీజన్ లో దేశంలో అంతకు ముందు అత్యధికంగా పండిన పంట కన్నా 30 శాతం ఎక్కువ ఆహారధాన్యాల దిగుబడి సాధించాం. మధ్యలో అనావృష్టి పరిస్థితులు ఎదురైనా..ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో తిండి గింజలు ఎగుమతి చేసే దేశంగా ఇండియా ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
ఎలుక కష్టం ఎవరికి ఎరుక.. కొరికితేనే బతికేది!
సాక్షి, అమరావతి: ఎలుకలు సృష్టించే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. కనిపించిన ప్రతీదీ కొరికేస్తూ.. బోలెడంత నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఈ విధ్వంసం వెనుక ఓ చిన్నపాటి విషాదమూ ఉంది. చిట్టెలుకల్లో ఉండే రెండు కొరుకుడు (ఇన్సైజర్స్) దంతాలు రోజూ 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట. దీని వల్ల ఈ కోరపళ్లను అవి ఎప్పటికప్పుడు అరగదీయాల్సిందే! లేదంటే అవి ఎలుకల దవడలను చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట. దీంతో తిండిలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందట. అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి. అయితే.. దాని వల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం. తినటానికి పనికిరాకున్నా బలమైన విద్యుత్ తీగలు, ప్లాస్టిక్ వస్తువులను సైతం కొరికేస్తాయి. చిట్టెలుకలు తీసుకునే ఆహారం రోజుకు 28 గ్రాములే.. కానీ అవి కలిగించే నష్టం మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఏటా 19 నుంచి 21 బిలియన్ డాలర్ల పంట నష్టం జరుగుతున్నట్లు లెక్కగట్టారు. ఎలుకలు తమ శరీర బరువులో దాదాపు 20 శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ గ్రాంట్ సింగిల్టన్ తెలిపారు. ఒకేసారి కాకుండా రోజుకు 3–4 సార్లు తింటాయి. ఎలుక ఏడాదిలో 10 కేజీల ఆహారం తీసుకుంటే అది కొరికి నాశనం చేసే పంట తినేదానికి పదిరెట్లు అంటే.. దాదాపు 100 కిలోలు ఉంటుందని అంచనా. ♦ దేశంలో వరి, గోధుమ పంటలకు ఎలుకలు ఏటా 5 నుంచి 15% నష్టం కలిగిస్తున్నాయి. ఇతర అన్ని పంట లను కలిపితే నష్టం సుమారు 25%వరకు ఉంటుంది. ♦ ఎలుకల కారణంగా కాలిఫోర్నియాలో 504 మిలియన్ డాలర్ల పంట నష్టం జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్–నేషనల్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెం టర్ అంచనా వేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా 84 రకాల ఎలుకలున్నా 18 రకాల మూషికాలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్లు ఒడిశా స్టేట్ ఎన్విరాన్మెంట్ విభాగంతెలిపింది. ♦ ఒడిశాలోని 4 గ్రామాల్లో ఎలుకలు 3.60 టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్లు తేలింది. దుకాణాల్లోని గోడల్లో ఎలుకలు దాచిన ఆహార పదార్థాలను వెలికితీయగాఒక్కోచోట 16.64 నుంచి 21.5 కిలోలు గుర్తించారు. ♦ సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు 21 రోజుల్లో 10 నుంచి 14 పిల్లలను పెడుతుంది. ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వ దశకు చేరి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఎలుకలు జతకడితే ఏడాదిలో వాటి సంతానం 1,000 దాటిపోతుంది. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభానికి ఇటీవలి వరదలు తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రధానంగా గోధుమ పంట నాశనంకావడంతో, గోదుమ పిండి ధరలు కనీ వినీ స్థాయిలో పెరిగి పోయాయి. గోధుమ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. గోధుమ పిండి కోసం ప్రజలు పాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోధుమల సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గోధుమలు పలు చోట్ల ప్రస్తుతం 10 కిలోల బస్తా రూ.1,500 ఉండగా, 20 కిలోల బస్తా రూ.2,800గా ఉంది. మరోవైపు అనేక ప్రావిన్స్‌లలో, సబ్సిడీపై పిండిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం. దీన్ని కొనుగోలు చేయడానికి వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో ఉన్నారు. ఇది ఘర్షణలు , తొక్కిసలాటలకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ,బలూచిస్థాన్‌లలో తొక్కిసలాట కూడా జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని మీర్పూర్ ఖాస్ నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరిని నియంత్రించడానికి సైన్యాన్ని మోహరించారు. తాము చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ అత్యవసర ప్రాతిపదికన 400,000 బస్తాల గోధుమలు అవసరం అని బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్జాయ్ తెలిపారు. తమ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని ప్రకటించారు. బలూచిస్తాన్‌కు సహాయం చేయాలని ఇతర ప్రావిన్సులను ఆయన కోరారు. లేదంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బలూచిస్థాన్‌లో గోధుమ సంక్షోభానికి ఫెడరల్, సింధ్ , పంజాబ్ ప్రభుత్వాలను నిందించిన మంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి 600,000 బస్తాల గోధుమలను అందిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రష్యా నుండి గోధుమలు దిగుమతి దేశంలో గోధుమల కొరతను తీర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం 75 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు పెద్ద ఎత్తున కరాచీ పోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది అలాగే రష్యా నుంచి అదనంగా 4 లక్షల 50 వేల టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టు ద్వారా పాకిస్థాన్‌కు చేరుకోనున్నాయి. కాగా పాకిస్థాన్‌కు సంబంధించి దాదాపు 70శాతం గోధుమ ఉత్పత్తి పంజాబ్ నుంచే వస్తోంది. గోధుమల దిగుమతికి సంబంధించి ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఇదే గోధుమ పిండి కొరతకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని విమర్శలు చెలరేగాయి. Acute shortage of #wheat flour in #Pakistan - people dying in stampedes. However, Pak set to dispatch around 160 containers with #ammunition for #Ukraine. 'Project Shipping' firm to #ship containers from #Karachi to #Gdansk.#Poland #Russia #Food #War #Economy #Port pic.twitter.com/oTmX2Y9m14 — Nishit Doshi (@NishitDoshi144) January 10, 2023 #PakistanFlourCrisis, Visual from #Sindh Pakistan, people were seen squabbling for flour. It's Painful💔💔#PakistanEconomy #ResilientPakistan pic.twitter.com/7qlSjh3rni — Bakhtawar Shah (@Shah_Bakhtawar1) January 10, 2023 br /> -
భారత గోధుమల ఎగుమతిపై యూఏఈ కీలక నిర్ణయం
గోధుమల ఎగుమతులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక, తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌ను కోరాయి. దీంతో, యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో.. తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మే 13కి ముందు యూఏఈకి తీసుకువచ్చిన భారతీయ గోధుమలను ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. గోధుమల షిప్మెంట్, గోధుమలు ఏ దేశం నుంచి వచ్చాయి, చెల్లింపులు జరిపిన తేదీ తదితర డాక్యుమెంట్లను తనిఖీ కోసం సబ్మిట్ చేయాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన గోధుమలు, గోధుమ పిండిని కంపెనీలు ఎగుమతి చేసుకోవచ్చని యూఏఈ స్పష్టం చేసింది. కానీ, ఇందు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ ఆర్థిక శాఖ ఆదేశించింది. -
గోధుమలపై ఎందుకీ గోల.. సరైన నిర్ణయం తీసుకోలేరా?
గోధుమల ఎగుమతుల విషయంలో కేంద్రం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తగు తీసుకోకుంటే భారీ ఎత్తున గోధుములు పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. గోధుమల ఎగుమతిని కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో భారీగా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన గోధుమలకు పెరిగిన డిమాండ్‌ను ఉపయోగించుకోవాలని అన్నట్టుగా వ్యూహాలు రూపొందించింది. దీంతో ఎడా పెడా గోధుమల ఎగుమతులు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్లో ఎండలు బాగా ఉన్నందున గోధమల దిగుమతి తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో మే 14న అకస్మాత్తుగా గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్రం నిషేధం అమల్లోకి వచ్చే సరికే దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు దేశంలోని ప్రముఖ పోర్టులకు చేరుకుని ఉన్నాయి. వీటిని ఒడల్లోకి ఎక్కించడమే తరువాయి అనే క్రమంలో గోధుమల ఎగుమతికి బ్రేక్ పడింది. తాజాగా కేంద్రం ప్రత్యేక అనుమతుల కింద 4 లక్షల టన్నుల పై చిలుకు గోధుమల ఎగుమతికి తాజాగా అనుమతి ఇచ్చింది. ఐనప్పటికీ ఇంకా 17 లక్షల టన్నుల గోధుమలు ఇంకా పోర్టుల్లోనే ఉండిపోయాయి. త్వరలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. పోర్టుల్లో ఆరుబయట ఉన్న గోధములు ఈ వర్షంలో చిక్కుకుంటే ఇబ్బందులు తప్పవని ట్రేడర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి దేశాల్లో డిమాండ్ ఉన్నందువల్ల పోర్టుల్లో ఉన్న సరుకు ఎగుమతికి ప్రత్యేక అనుమతి కావాలని కోరుతున్నారు. లేదంటే పోర్టుల్లో ఉన్న గోధుమలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐలకు తరలించాలని సూచిస్తున్నారు. లేదంటే ఇటు ఎగుమతి చేయలేక అటు దేశ అవసరాలకు ఉపయోగపడక గోధుమలు పాడైపోయే అవకాశం ఉందంటున్నారు. చదవండి: గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం -
సాక్షి కార్టూన్: 01-06-2022
ఇంకా చాలా వస్తువుల ధరలు తగ్గాలి సార్! మీ ఆస్తులు కూడా అమ్మాలేమో సార్! -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
మరి మన శక్తిని చాటేదెప్పుడు?
కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తప్పుడు సలహాలే అందుతు న్నాయా? లేక ఆహార ద్రవ్యోల్బ ణానికి అసలు కారణాలేమిటన్నది అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా విఫలమైందా? ఇవేవీ కాకుండా, ప్రజలపై సానుకూల ముద్ర పడేలా నాటకీయ ఫక్కీలో ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందా? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి గోధుమల ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించినట్లు? సమస్యపై విపరీతమైన సాను భూతి వ్యక్తం చేసి, ఎన్నికల్లో తమకు లబ్ధి కలిగేలా చూసుకోవడమే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశమా? 2021 –22 సంవత్సరానికి గానూ దేశం మొత్తమ్మీద పండిన పంటలపై ఇటీవలే మూడో ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. తిండిగింజల దిగుబడులు రికార్డు స్థాయిలో 31.45 కోట్ల టన్నులని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.77 మిలియన్ టన్నులు ఎక్కువ. బియ్యం దిగుబడి గత ఏడాది కంటే 52 లక్షల టన్నులు ఎక్కువ కాగా... గోధుమ పంట కూడా సుమారు 31 లక్షల టన్నుల వరకూ ఎక్కువ చేతికొచ్చింది. భారత దేశపు తిండిగింజలు అవసరానికి మించి రిజర్వులో ఉన్నాయి. గోధుమలు దాదాపు కోటీ తొంభై లక్షల టన్నులు నిల్వ ఉండగా, బియ్యం 5.5 కోట్ల టన్నులు గోదాముల్లో ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 74 లక్షల టన్నుల గోధుమలు, కోటీ 35 లక్షల టన్నుల బియ్యం బఫర్ స్టాక్‌గా ఉంటే సరిపోతుంది. గోధుమ ఎగుమతులను పెంచేందుకు పది దేశాలకు వ్యాపార బృందాలను పంపుతున్నట్లు ప్రకటించిన 48 గంటల్లోనే ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించింది? పైగా ఈ ఏడాది కోటి టన్నుల గోధుమలు ఎగుమతి చేస్తామని గొప్పగా ప్రకటించిన తరువాత నిషేధం విధించాల్సిన పరిస్థితులు ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. ఎగుమతుల ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చునన్న రైతుల ఆశలకు గండి పడింది. భారత్‌తో పోలిస్తే బయటి దేశాల్లో గోధుమల ధర ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎగుమతులపై నిషేధం విధించడం వారికి నష్టం చేకూర్చడంతో సమానమని చెప్పాలి. నిషేధం విధించకపోయి ఉంటే, భారత దేశపు గోధుమ వ్యాపారాన్ని తాము కూడా సమర్థంగా నిర్వహిం చగలమని చాటి చెప్పేందుకు వ్యాపారులకూ ఓ మంచి అవకాశం దక్కినట్లు అయ్యేది. భారతదేశం గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కార ణంగా గోధుమల సరఫరాకు సంబంధించి ప్రపంచం చిక్కులు ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్న సమయంలో తగినన్ని అందించడం ద్వారా మనం ఆ పని చేసిన ఘనతను తీసుకునే అవకాశం ఉండేది. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే అవకాశం సరేసరి. ఇప్పటి వరకూ ఎగుమతి చేయని దేశాలు, ప్రాంతాలకు గోధుమ లను పంపడం ద్వారా భవిష్యత్తులో మన సరుకులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చేవి. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతూండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసి ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ అంత గాభరా అవసరం లేదు. వినియోగదారుల ధరల సూచీ తాలూకూ ఆహార ద్రవ్యోల్బణంలో తిండి గింజలు భాగస్వామ్యం పది శాతం కంటే తక్కువ. తయారు చేసిన ఆహార పదార్థాలు, వంట నూనెలు రెండూ దాదాపు 41 శాతం ఉంటాయి. పండ్లు, కాయగూరల భాగం 27.5 శాతం కాగా, ఆహార ద్రవ్యో ల్బణంలో పాలు, మాంసం, చేపల వంటి ఉత్పత్తుల భాగం 17 శాతం ఉంటుంది. అంటే తిండిగింజల ఎగుమ తులపై నిషేధం విధించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో కేవలం పది శాతం మాత్రమే ప్రభావితమవుతుందన్న మాట. ఇప్పుడు చెప్పండి... ఎగుమతుల నిషేధం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? వారి అసలు ఉద్దేశా లేమిటో నాకు అర్థమవుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తోందనీ, చాలా వేగంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకుంటోందనీ ఒక సందేశం పంపడం మాత్రమే బీజేపీ ఏలుబడిలోని ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘చూశారా, మీకు సాయపడేందుకు మేమె ప్పుడూ సిద్ధంగానే ఉంటా’మని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మాట కాకుండా... ‘ఎగుమ తుల గురించి మీరేమీ చింత పడాల్సిన అవసరం లేదు. దేశ అవసరాలకు మించి నిల్వలు ఉన్నాయి మన దగ్గర. అవసరమైనప్పుడు ప్రపంచాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేందుకు ఇదో మంచి అవకాశం’ అని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే... జీ–7 దేశాల వ్యవసాయ మంత్రులు భారత్ నిర్ణయంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జియోర్జివా కూడా భారత్ తన వైఖరిని మార్చుకుని గోధుమ ఎగుమతులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మొత్తమ్మీద చూస్తే... భారతదేశం ప్రపంచంలో ఓ పెద్ద శక్తిగా ఎదగాలన్న కాంక్షనైతే చూపుతోంది గానీ, మనకు అందుబాటులో ఉన్న చిన్న శక్తిని కూడా ఇతరులకు పంచడంలో విఫలమవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచం మన నుంచి ఇలాంటి చిన్న చర్యలను ఆశిస్తున్న సమయం లోనే మనం ఇలాంటి చర్యలకు దిగుతున్నాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం భాగస్వాములు కావచ్చు గాక; అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు గాక; మనల్ని మనం విశ్వ గురువులుగా ప్రకటించుకోనూవచ్చు గాక. కానీ అవసరమైన సందర్భాల్లో మనకు చేతనైన చిన్న పనులు కూడా చేయడంలో మాత్రం విఫలమవుతున్నాం. మరి ప్రపంచం మన సామర్థ్యాన్ని గుర్తించేదెలా? మనకు ఆ గుర్తింపు అవసరం లేదా? లేక ఆ మాత్రం తెలివిడి మనకు లేకుండా పోతోందా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ -
గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్: కేంద్ర మంత్రి
దావోస్: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు. దేశం 2 మిలియన్ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్ టన్నులుగా ఉందని గోయల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సెషన్లో అన్నారు. మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు, బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది. ఉత్పత్తి-గుమతి ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. విదేశాల నుండి భారత్ గోధుమలకు మెరుగైన డిమాండ్ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్ టన్నులు. అయితే 105–106 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్ టన్నులు. India wheat exports are less than 1% of world trade and our export regulation should not affect global markets. We continue to allow exports to vulnerable countries and neighbors. pic.twitter.com/N61929BNt5 — Piyush Goyal (@PiyushGoyal) May 25, 2022 -
భారత్‌ను బతిమాలుతున్నాం: ఐఎంఎఫ్ చీఫ్
దావోస్: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్ అర్థం చేసుకోవాలని కోరారు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్, లెబనాన్ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్. అలాంటప్పుడు భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ దావోస్ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. -
గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం
ముంబై: గోధుమల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం ద్రవ్యోల్బణం నియంత్రణకు కొంత సానుకూలమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రస్తుత అధిక వేడి వాతావరణం గోధుమల దిగుబడికి ఎన్నో సవాళ్లను విసురుతోంది. ప్రభుత్వం అనూహ్యంగా గోధుమల ఎగుమతులను నిషేధించడం దేశీయంగా ధరల ఒత్తిళ్లను కొంత వరకు తగ్గించగలదు’’అని బార్క్లేస్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు 8 శాతం సమీపానికి చేరడం తెలిసిందే. కొద్ది కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ రెపో రేటు పెంపు, గోధుమల ఎగుమతులపై నిషేధం సానుకూలిస్తాయన్న అభిప్రాయాలను బార్క్లేస్ వ్యక్తం చేసింది. గోధుమల ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై 0.27 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించడం, సెర్బియా, కజకిస్థాన్ ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించిన తరహాలోనే భారత్ నిర్ణయం కూడా ఉందని బార్క్లేస్ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు ఇప్పటికే 44 శాతం పెరగ్గగా.. దేశీయంగా మూడు శాతమే పెరగడం గమనార్హం. ఎగుమతులపై నిషేధం విధించకుండా 10 మిలియన్ టన్నుల సమీకరణ లక్ష్యాన్ని ధరలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం సాధించడం కష్టమవుతుందని బార్క్లేస్ నివేదిక పేర్కొంది. -
గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది. దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది. (చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల) -
భారత్‌కు మద్దతుగా నిలిచిన చైనా.. షాక్‌లో ప్రపంచ దేశాలు!
డ్రాగన్ కంట్రీ చైనా అనూహ్యంగా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుదలతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఈ సందర్భంగా ముందస్తు ఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా, భారత్ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది. ఇది కూడా చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
గోధుమల ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది. గోధుమ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి. దీంతో రైతుల దగ్గర నుంచి మంచి ధరకు గోధుమల్ని కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ సమయంలో గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని విధించడమంటే రైతు వ్యతిరేక విధానమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంతర్జాతీయంగా గోధుమలకు గిరాకీ పెరగడంతో రైతులకు మంచి ధర వస్తూ ఉంటే వాటిని ఆపేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం మండిపడ్డారు. మరోవైపు భారత్ కృషిక్ సమాజ్ (బీకేఎస్) కూడా గోధుమల ఎగుమతుల నిలిపివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం అంటే అది పరోక్షంగా రైతులపై పన్ను విధించడమేనని ఆ సంస్థ చైర్మన్ అజయ్ విర్ జాఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గోధుమల నిషేధం చర్యల్ని సమర్థించుకుంది. గోధుమ ధరలు 40% పెరిగిపోవడంతో ధరల్ని కట్టడి చేయడానికే ఎగుమతుల్ని నిలిపివేశామని చెబుతోంది. -
ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు ఆహార కొరత రాకుండా భారత్ అండగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో గోదుమలు ఎగుమతి చేస్తూ యుద్ధ ప్రభావం పలు దేశాలపై తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే గోధుమల దిగుమతిలో రెండో స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. అయితే రష్యా యుద్ధంలో తీరిక లేకుండా ఉండటం, మరోవైపు రష్యా నుంచి దిగుమతుల విషయంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో చాలా దేశాలు గోదుమల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో భారత్ ప్రపంచ దేశాలకు 2.42 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 14 లక్షల టన్నుల గోదుమలను ఎగుమతి చేయగలిగింది. అంతేకాదు మేలో ఏకంగా 15 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేసేందుకు రెడీ అయ్యింది. ఇండియా నుంచి భారీ ఎత్తున గోదుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఈజిప్టు ప్రథమ స్థానంలో ఉండగా ఇజ్రాయిల్, టర్కీ, ఇండోనేషియా వంటి ఏషియా దేశాలు, మొజాంబిక్, టాంజానియా వంటి నార్త్ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి తరఫున కెన్యా, సోమాలియా, జిబోటీ వంటి దేశాలకు సరఫరా చేస్తోంది. గోదుమలతో పాటు ఇతర ఆహారా ధాన్యాలను భారీ ఎత్తున ఇండియా ఎగుమతి చేస్తోంది. చదవండి: బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు -
ఉక్రెయిన్ వార్.. ఈజిప్టులో తిండికి కటకట.. భారత్‌వైపు చూపు!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో మిడిల్ ఈస్ట్‌కి చెందిన ఈజిప్టు కూడా చేరింది. 80 శాతం దిగుమతులే ఈజిప్షియన్ల ప్రధాన ఆహారం గోధుమలు. తమ దేశంలో వినియోగించే గోదుమల్లో దాదాపు 80 శాతాన్ని ఈజిప్టు దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం ఇంత కాలం ఉక్రెయిన్, రష్యా దేశాలపై ఎక్కువగా ఈజిప్టు ఆధారపడింది. అయితే 2021 నవంబరు నుంచి ఉక్రెయిన్ , రష్యాల మధ్య ఉద్రిక్తలు నెలకొని ఉండటంతో గోదుమల దిగుమతి తగ్గిపోయింది. దీని ఎఫెక్ట్ 2022 ఆరంభంలోనే కనిపించింది. పెరిగిన ధరలు ఫిబ్రవరి నెల గణాంకాలను పరిశీలిస్తే గతేడాదితో పోల్చితే ఆహార ధాన్యాల ధరలను 4.6 శాతం పెరిగాయి. ఇక ఫిబ్రవరిలో ఆహార ధాన్యాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 7.2 శాతంగా నమోదు అవగా జనవరిలో అది 6.3 శాతంగా ఉంది. దీంతో ఫిబ్రవరిలోనే ఈజిప్ట్ మార్కెట్లో బ్రెడ్ ధర ఏకంగా 25 శాతం పెరిగింది. తొలగని అనిశ్చితి ఫిబ్రవరిలో ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన యుద్ధం నెలరోజులు గడిచినా కొలిక్కి రాలేదు. ఇంకా ఎంత కాలం యుద్ధం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ యుద్ధం ముగిసినా రష్యా, ఉక్రెయిన్లలో తిండి గింజలను గతంలోలా ఎగుమతి చేస్తారో లేదో తెలియదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఈజిప్టు దృష్టి పెట్టింది. భారత్ సాయం ప్రపంచంలో గోదుమలు అధికంగా పండించే దేశాలలో భారత్ ఒకటి. దీంతో తమ ఆహార ధాన్యాల అవసరాల కోసం ఇండియాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఈజిప్టుకు నెలకొంది. దీంతో ఇటీవల దుబాయ్‌లో జరిగిన సమావేశంలో మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఈజిప్టు ప్లానింగ్ శాఖ మంత్రి హలా ఎల్సైడ్ చర్చించారు. మొదలైన కసరత్తు తమ దేశ అవసరాలకు సరిపడే విధంగా కోటి 20 లక్షల టన్నుల గోదుమలు ఎగుమతి చేయాలంటూ ఈజిప్టు భారత్‌ని కోరింది. భారీ ఎత్తున జరిగే గోదుమల వాణిజ్యానికి తగ్గట్టుగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ వంటి కీలక అంశాలపై ఇరువైపులా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, భారత్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్..ఎంతలా ఉందంటే! -
భారత్ భేష్ అంటున్న తాలిబన్లు
-
పాక్ చెత్త.. భారత్ బంగారం!: తాలిబన్లు
అఫ్గనిస్థాన్ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. అఫ్గన్ పొరుగున ఉన్న పాక్ గోధుమలను అందించగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. అదే సమయంలో భారత్ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్ ప్రతినిధులు పాక్-భారత్ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్ చేశారు. దీనికి అఫ్గన్ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్ అంటూ పలువురు అఫ్గన్ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. #Afghanistan : #Taliban officials allege that wheat sent by @ImranKhanPTI #Pakistan Govt is rotten not fit for consumption while @narendramodi’s Indian Govt’s 50,000 MT of wheat is very good.pic.twitter.com/5NSnQBVEKo — Arun (@arunpudur) March 4, 2022 ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్. ఇదిలా ఉండగా.. అమృత్సర్ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగామ్లో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్మెంట్కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. -
పాక్ మీదుగా అఫ్గనిస్తాన్‌కు గోధుమలను పంపిణి చేసిన భారత్
India despatches wheat for Afghanistan: పాకిస్తాన్ భూ మార్గాల ద్వారా అఫ్గనిస్తాన్ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం మంగళవారం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని వాగ్దానం చేసింది. అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అఫ్గాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్, డబ్ల్యుఎఫ్‌పీ డైరెక్టర్ బిషో పరాజూలీతో కలిసి గోధుమలను తీసుకువెళుతున్న 50 ట్రక్కుల మొదటి కాన్వాయ్‌ను విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి గోధుమలు అఫ్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌కు అత్తారి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా అఫ్గనిస్తాన్‌కు రవాణ చేస్తారు. జలాలాబాద్‌లోని డబ్ల్యుఎఫ్‌పికి ఈ సహాయం బహుళ సరుకులలో పంపిణీ చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గనిస్తాన్కుకు మానవతా సహాయం కోసం ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం గోధుమలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అఫ్గనిస్తాన్‌లో 50 వేల టన్నుల గోధుమల పంపిణీ చేస్తానని డబ్ల్యూఎఫ్‌పీతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్గాన్ ప్రజలకు సహాయం చేయడానికి రాబోయే రెండు మూడు నెలల్లో పంపబడే అనేక వాటిలో మంగళవారం సరుకు మొదటిదని ష్రింగ్లా చెప్పారు. మముంద్‌జాయ్ భారత ప్రభుత్వ చొరవను ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా ఏ దేశం చేసిన అతిపెద్ద ఆహార విరాళాలలో అది ఒకటిగా ఉంటుందన్నారు. అయితే అక్టోబర్ 7న పాకిస్తాన్ భూ మార్గాల ద్వారా 50 వేల టన్నుల గోధుమలను పంపే ప్రతిపాదనను భారత్ మొదట చేసింది కానీ అమలు చేయడానికి పాకిస్తాన్‌తో చర్చల కారణంగా నాలుగు నెలలకు పైగా వాయిదా పడింది. ఆ తర్వాత అఫ్గాన్ ట్రక్కులలో మాత్రమే గోధుమలను తమ భూభాగం గుండా తరలించాలనే షరతుపై పాకిస్తాన్ ఆ సమస్యను క్లియర్ చేసింది. భారతదేశం శనివారం ఆఫ్ఘనిస్తాన్‌కు 2.5 టన్నుల వైద్య సహాయం శీతాకాలపు దుస్తులను పంపిన మూడు రోజుల తర్వాత గోధుమల రవాణా ప్రారంభమైంది. ఇరాన్‌లోని చబహార్ ఓడరేవు ద్వారా అఫ్గనిస్తాన్కుకు మరిన్ని గోధుమలు ఇతర వస్తువులను పంపించే విషయంపై కూడా భారతదేశం దృష్టి సారిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ అఫ్గనిస్తాన్‌కు మానవతా సహాయాన్ని రవాణా చేయడంలో న్యూ ఢిల్లీకి టెహ్రాన్ సహకరిస్తుందని చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్ అఫ్గనిస్తాన్ ప్రజలతో తన ప్రత్యేక సంబంధానికి కట్టుబడి ఉందని పేర్కొంది. levels of food insecurity in more than 3 decades. I also thank WFP and our mission in India for their contribution to make this “worthy cause” possible under challenging circumstances. I hope there would be no more barriers to humanitarian aid today, tomorrow and forever. 2/2 pic.twitter.com/w6pnGsIF0F — Farid Mamundzay फरीद मामुन्दजई فرید ماموندزی (@FMamundzay) February 22, 2022 (చదవండి: మోదీతో టీవీలో చర్చలు జరపడం ఇష్టం: ఇమ్రాన్ ఖాన్) -
రైతుల నిరసన: కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తక్షణమే ఈ కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం అనగా 40 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఈ ఏడాది క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. అలానే బార్లీపై 35 రూపాయల ధర పెంచుతూ.. క్వింటాల్ బార్లీ మద్దతు ధర 1,635 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే చెరుకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో ఐదేళ్లలో 10,683 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తూ.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాదికి గాను పలు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్! ) అలానే ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి.. క్వింటాల్ ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించే ధర. ప్రస్తుతానికి ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: రైతుకు మద్దతు ధర అసాధ్యమా? -
గ్లూటెన్ సుష్టుగా తింటే సిలియాక్ వ్యాధి ఖాయం
ఇది డైట్ల కాలం. ‘ఈ తిండి తింటే ఆ వ్యాధి దూరం.. ఈ ఆహారం అన్నిటికంటే శ్రేష్టం’ అంటూ కొత్త కొత్త డైట్ విధానాలు తామరతంపరగా ఇప్పటికే ఎన్నో పుట్టుకొచ్చాయి/పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి తాజాగా చేరిందే గ్లుటెన్ ఫ్రీ డైట్. గ్లుటెన్ అంటే.. సాధారణంగా గోధుమల్లో బంకగా ఉండే పదార్ధాన్ని గ్లుటెన్ అంటారు. గోధుమలు/మైదాతో తయారుచేసిన ఏ ఆహార పదార్థంలోనైనా గ్లుటెన్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని ఉపయోగించి తయారుచేసే పిజ్జాలు, పేస్ట్రీలు, కేకులు, స్వీట్సు, కొన్ని రకాల బ్రెడ్లలో అధికంగా ఉంటుంది. ఈ పదార్థాలు ఎక్కువగా తినడం సిలియాక్ వ్యాధికి కారణమని, దీని నుంచి బయటపడాలంటే గ్లుటెన్ రహిత ఆహారం తీసుకోవాలన్నదే గ్లూటెన్ ఫ్రీడైట్ కాన్సెప్ట్. సిలియాక్ వ్యాధి అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, నీరసం, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, ఎముకల బలహీనత లక్షణాలను సిలియాక్ వ్యాధిగా పేర్కొంటారు. గోధుమలు, బార్లీ, మైదాతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వల్ల అందులోని గ్లుటెన్ జీర్ణశక్తి ప్రక్రియపై దుష్ప్రభావం చూపుతుందని, ఫలితంగా పైన చెప్పిన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. ఒక వైద్య సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు ఒకశాతం జనాభా సిలియాక్ వ్యాధితో బాధపడుతున్నారు. నివారించాలంటే.. గ్లుటెన్ ఫ్రీ (గ్లుటెన్ రహిత ఆహారం) డైట్ అనుసరించడం ద్వారా సిలియాక్ వ్యాధికి చెక్ పెట్టొచ్చనేది ఈ డైట్‌ను ఫాలో అవుతున్న వారి మాట. అమెరికాలో కన్జూమర్ రిపోర్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్(సీఆర్ఎన్ఆర్సీ) వెలువరించిన నివేదిక ప్రకారం సుమారు 63శాతం మంది అమెరికన్లు గ్లుటెన్ ఫ్రీ డైట్ ను నమ్ముతున్నట్లు తేలింది. ఈ డైట్‌ను అనుసరించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చని వారు భావిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గ్లుటెన్ కారణంగా వచ్చే సిలియాక్ వ్యాధినీ అడ్డుకోవచ్చని నమ్ముతున్నట్లు తేల్చారు. ఎందుకింత ఆదరణ? వివిధ రకాల కారణాల వల్ల గ్లుటెన్ ఫ్రీ డైట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ డైట్‌ను ఒకసారి ప్రయత్నించి చూద్దామనే సహజమైన ఉత్సుకత, సిలియాక్ వ్యాధిగ్రస్థులకు గ్లుటెన్ ప్రమాదకరమైతే నాకు కూడా ప్రమాదమేమో అనే ఆలోచన, ఈ డైట్‌ను క్యాష్ చేసుకోవాలనుకునే కొందరి మార్కెటింగ్ నైపుణ్యం తదితర కారణాలు కావచ్చు. నష్టాలు లేవా? నిజానికి ఏ డైట్లోనైనా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇదీ అందుకు అతీతం కాదు. ముఖ్యంగా ఈ డైట్ అందరికీ మేలు చేయకపోవచ్చు. కొత్త అనారోగ్య సమస్యలూ తీసుకురావచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఒక సర్వే ప్రకారం గ్లుటెన్ ఫ్రీ డైట్ అనుసరించేవాళ్లు చెబుతున్నదేంటంటే సాధారణ ఆహారం కంటే గ్లుటెన్ లేని పదార్థాల్లో ఎక్కువ న్యూట్రిషన్స్, అధిక మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. కానీ, నిజానికి సాధారణ ఆహార పదార్థాల కంటే గ్లుటెన్ ఫ్రీ పదార్థాల్లో తక్కువ ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ఇతర న్యూట్రిషన్స్ ఉన్నాయి. అలాగే గ్లుటెన్ రహిత ఆహార పదార్థాల్లో తక్కువ ఫైబర్, అధిక చక్కెర, కొవ్వు ఉన్నాయి. ఈ డైట్ అనుసరించే వారిలో అధికశాతం మంది బరువు పెరగడం, స్థూలకాయంతో బాధపడుతుండడాన్ని కొన్ని అధ్యయనాలు కనుగొనడం దీనికి బలం చేకూరుస్తోంది. ఎవరు అనుసరించాలి? ఎలాంటి అజీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి ఆలోచించకపోవడం అత్యుత్తమం. అయితే గ్లుటెన్ సంబంధ అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని వైద్య పరీక్షల ఆధారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దేనికి దూరంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒక్కోసారి సిలియాక్ వ్యాధి లక్షణాలకు లాక్టోజ్(చక్కెర, పాలు) కారణం కావొచ్చు. చివరగా చెప్పేదేంటంటే మంచికో చెడుకో ప్రస్తుతం గ్లుటెన్ గురించి అవగాహన చాలా పెరిగింది. ఒకవేళ సిలియాక్ వ్యాధి ఉంటే వారు కచ్చితంగా గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించాల్సి వస్తే అందుకు తగిన ఆహార పదార్థాలు కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల్లాగానో, సినిమా నటుల్లాగానో గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించడం మాత్రం చేయొద్దు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన డాక్టర్ చేతుల్లో ఉంది. ఎవరో ఏదో చెప్పారని, ఇంకెవరో ఏదో పాటిస్తున్నారని మాత్రం అనుసరించొద్దు. వాస్తవాలేంటి? నిజానికి గ్లుటెన్ ఫ్రీ డైట్ శాస్త్రీయమేనా? అంటే ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే, ఇందులో ఒక నిజం ఉంది. అదేంటంటే గ్లుటెన్ ప్రమాదకరం. పైన చెప్పినట్లు సిలియాక్ వ్యాధి ఉన్న వారు గ్లుటెన్ ఫ్రీ డైట్ పాటించడం ద్వారా కొంతమేర స్వస్థత పొందవచ్చు. అయితే, మరికొందరికి సిలియాక్ వ్యాధి లేనప్పటికీ గ్లుటెన్ ఆహారం తీసుకున్నప్పుడు ఉబ్బరం, అతిసారం, పొత్తి కడుపు నొప్పి లాంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం వారి శరీర తత్వానికి గోధుమలు పడకపోవడమని కొందరిలో తేలింది. అయితే, వీరిలో చాలా మందిలో సిలియాక్ వ్యాధి లక్షణాలకు సరైన కారణం గుర్తించలేకపోయారు. అలాగే సిలియాక్ వ్యాధి లేనివారు గ్లుటెన్ పదార్థాలను నిశ్చింతంగా తినొచ్చు. చదవండి: పెద్దవయసు పిల్లలూ చొల్లు కార్చుకుంటున్నారా? -
బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్!
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పలు సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్‌ను ఏదో ఒక ‘వంగడం’లోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసలకోర్చి ‘జన్యుమార్పిడి’ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా, జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే.. మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని (ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు. వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ ‘డి’ని రాబట్టానని ఆయన ప్రకటించారు. తన పొలంలో నుంచే పై మట్టిని, (4–6 అడుగుల) లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి.. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకటరెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలు, టీవీ ఛానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులక్కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంట ను ఆశించకుండా చేయడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు. ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఆవిష్కరణల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తున్న చింతల వెంకటరెడ్డి వ్యవసాయోత్పత్తుల్లో విటమిన్ ఎ., సి.లతో పాటు ‘డి’ రాబట్టుకునే సాగు పద్ధతులపై అనేక ఏళ్ల పాటు విస్తృత ప్రయోగాలు చేసి నిర్థారణకు వచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలను క్రమపద్ధతిలో రాసి పేటెంట్ కోసం ధరఖాస్తు పంపారు. పేటెంట్ పొందటానికి దీర్ఘకాలం పడుతుంది. మొదట మన దేశంలో పేటెంట్ కోసం 2019 ఆగస్టు 02న ధరఖాస్తు పంపారు (దీనిపై ఇంకా పేటెంట్ మంజూరు కాలేదు). ఆ తర్వాత, 2020 ఆగస్టు 1న ‘అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ.– వైపో)కు ధరఖాస్తు పంపారు. ఈ ధరఖాస్తుపై స్పందించిన వైపో ఈ నెల 11న చింతల వెంకటరెడ్డి ‘మొక్కల్లో పోషక విలువలను పెంపొందించే మిశ్రమం’ గురించి తన వెబ్సైట్లో పబ్లికేషన్ విడుదల చేసింది (ఇంటర్నేషనల్ పబ్లికేషన్ నంబర్: డబ్ల్యూ.ఓ. 2021/024143 ఎ1). ‘వైపో’ ఇచ్చిన పబ్లికేషన్ పేటెంట్ కాదు. అయితే, చింతల వెంకటరెడ్డి మాదిరిగా రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి చేయకుండా ఒక సేంద్రియ మిశ్రమం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో డి విటమిన్ తదితర విటమిన్లను పొందటానికి ఉపయోగడపడే మిశ్రమం గురించి గతంలో ఏ దేశంలోనూ ఎవరికీ మేధో హక్కులు ఇవ్వలేదని వైపో పేర్కొంది. 130 దేశాల్లోని జాతీయ స్థాయి పేటెంట్ కార్యాలయాలకు ధరఖాస్తు చేసుకొని పేటెంట్ హక్కులు పొందవచ్చిన వైపో పబ్లికేషన్ మార్గాన్ని సుగమం చేసింది. కాల్షియంను దేహం గ్రహించాలన్నా, ఎముక పుష్టి కలగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా డి విటమిన్ ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలకు రోజుకు 1,000 ఇంటర్నేషనల్ యూనిట్(ఐ.యు.)లు, పిల్లలకు 400 ఐ.యు.లు అవసరం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారికి ఇంకా ఎక్కువ మోతాదులో డి విటమిన్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. ఎండలో తిరగని వారు పుట్టగొడుగులు (ఎండబెట్టినవి) తిని విటమిన్ డి కొరతను తగ్గించుకోవచ్చు. అయితే, అదేదో రోజువారీగా తినే ఆహార ధాన్యాల్లోనే వుంటే మరింత మేలు కదా! ఏ పంట అయినా సరే.. ఏ పంట దిగుబడులోనైనా డి., ఎ., సి. విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైంది. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చు. జన్యుమార్పిడి అవసరం లేదు. ప్రత్యేక రసాయనాలు వాడనకవసరం లేదు. ప్రకృతిలో అందరికీ ఎక్కడపడితే అక్కడ దొరికే ఆహారోత్పత్తులనే వాడి కావల్సిన విటమిన్లను పంట దిగుబడుల్లో వచ్చేలా చేయవచ్చు. ఈ ఆవిష్కరణకు ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వెలువడటం సంతోషదాయకం. భారత పేటెంట్ కోసం వేచి చూస్తున్నాను. క్యారట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలను వాడి రైతులు ఎవరైనా తమ పంట ఉత్పత్తుల్లో విటమిన్ డి రాబట్టుకోవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించి, తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ టెక్నిక్‌తో పండించిన ఆహారోత్పత్తులను దేశవిదేశాల్లో వాణిజ్య పరంగా విక్రయించాలనుకునే వ్యక్తులు/సంస్థలు మాత్రం ముందుగా నాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. – పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్ మిశ్రమ ద్రావణం ఎంత మోతాదులో వెయ్యాలి? ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారట్లు, చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి, ఒక లీటరు నీరు కలిపి మిక్సీలో వేసి.. ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4–5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే, పూత, పిందె దశలో 4–5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు అని వెంకటరెడ్డి తెలిపారు. ఎ, సి విటమిన్ల కోసం ఏం చేయాలి? ‘ఎ’ విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలకడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. ‘సి’ విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మ కాయలను 2 కిలోలు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకటరెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 అడుగుల ఎత్తున ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన ‘రెయిన్ డ్రిప్’ ప్లాస్టిక్ ట్యూబ్‌లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్‌తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు. క్యారెట్, చిలగడ దుంప,మొక్కజొన్న పిండితో మిశ్రమం.. ‘డి’ విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నిక్‌ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, దుంప పంటలు, ఆకుకూరలు, క్యాబే జీ వంటి పూల జాతి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నల మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ‘రెయిన్ డ్రిప్’ ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్పప్పుడు నెల రోజుల్లో 4–5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితోపాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరొటినాయిడ్స్‌ను పంట మొక్కలు గ్రహించడం ద్వారా విటమిన్ ‘డి’ ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు. వరి, గోధుమల్లో విటమిన్ డి తెప్పించడం కోసం 2011 నుంచి ప్రయోగాలు చేస్తున్నానని, 2018లో సక్సెస్ అయ్యానని, తదుపరి కూడా అనేక పంటలు పండించి నిర్థారణకు వచ్చానని చింతల వెంకటరెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వల్లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను డి విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5–6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు. డి విటమిన్ బియ్యం, గోధుమలను చూపుతున్న వెంకటరెడ్డి ఏ పంటలో ‘డి’ విటమిన్ ఎంత? క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడదుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకటరెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో(దిగుబడి హెక్టారుకు 4.68 టన్నులు) 100 గ్రాములకు 1,606 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.లు) డి విటమిన్ ఉండగా, 2020 ఖరీఫ్‌లో పండించిన పంటలో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు డి విటమిన్ ఉన్నట్లు విమ్తా లాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేలిందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 రబీలో పండించిన వరి బియ్యంలో 100 గ్రాములకు 136 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీఫ్‌లో పండించిన వరి బియ్యం (దిగుబడి హెక్టారుకు 9.68 టన్నులు)లో 100 గ్రాములకు 102.70 ఐ.యు.ల మేరకు విటమిన్ డి వచ్చిందని ఆయన వివరించారు. -
డీ విటమిన్ బియ్యానికి పేటెంట్
సాక్షి, హైదరాబాద్: మట్టి సేద్యంతో ప్రసిద్ధి పొంది గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు. సాధారణంగా బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ అంతగా ఉండదు. అయితే వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం రూపొందించిన ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ గణనీయమైన మోతాదులో వస్తుందని ఆయన చెబుతున్నారు. తన ఫార్ములాపై అంతర్జాతీయంగా పేటెంట్ కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా, తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. ఆ యన గతంలో ఆవిష్కరించిన ‘మట్టి సేద్యం’ఫార్ములాను దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా, పంటనాణ్యతను పెంచేవిధంగా వాడుకోవటం ఎలాగో కనుగొన్నారు. దానికి చాలా ఏళ్ల క్రితమే 130 దేశాల్లో పేటెంట్ హక్కులు పొందారు. రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి వంటి ఖరీదైన సాంకేతికతలు వాడనవసరం లేకుండానే ధాన్యం, గోధుమ పంటల్లో ఎక్కువ మోతాదులో విటమిన్ డి వచ్చేలా వెంకటరెడ్డి విజయం సాధించారు. బియ్యంలో విటమిన్ డీ సాధించిన ఫార్ములాకు పేటెంట్ హక్కు పొందడానికి అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ(డబ్లు్యఐపీవో) తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్ హక్కులు పొందడానికి అవకాశం ఏర్పడింది. రైతులకు అవగాహన కల్పిస్తా... వరి సాగు సందర్భంగా ‘విటమిన్ ఏ’ను కలపడం, తద్వారా సూర్యరశ్మి దానికి తోడవడంతో ‘విటమిన్న్డీ’తో కూడిన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని చింతల వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సీ విటమిన్¯తో కూడిన వరి, గోధుమలను ఉత్పత్తి చేయాలన్నా తన వద్ద అందుకు సంబంధించిన ఫార్ములా ఉందన్నారు. పోషకాలు, విటమిన్లు కలిగిన వరి, గోధుమలను పండించే ఫార్ములా తన వద్ద ఉందని, రైతులు వ్యక్తిగత అవసరాల కోసం కోరితే ఎలా పండించాలో చెప్తానని, వ్యాపార అవసరాల కోసమైతే తన వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు పండించిన డీ విటమిన్ బియ్యాన్ని అనేకమంది తీసుకెళ్లారని, కరోనా కాలంలో ఈ బియ్యానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. సూర్యరశ్మి అందక పట్టణ, నగరవాసులు విటమిన్ డీ లోపానికి గురవుతున్నారు. దీంతో అనేకమంది జబ్బుల బారిన పడుతున్నారని, డీ విటమిన్ లోపం తెలుసుకొని కొందరు మాత్రలు వాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కోరితే ఇస్తా ‘కేంద్ర ప్రభుత్వం దీన్ని రైతులకు ఇవ్వాలనుకుంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అని వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే, బహుళజాతి కంపెనీలకు ఇస్తానని చెప్పారు. వెంకటరెడ్డి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగించరు. సేంద్రియ వ్యవసాయం పద్ధతులు పాటించినందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రంలో అనేకసార్లు మోడల్ రైతుగా అవార్డు పొందారు. 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, 2006లో జార్జ్బుష్లు హైదరాబాద్ సందర్శించినప్పుడు తన వ్యవసాయ పద్ధతులను వారి ముందు ప్రదర్శించారు. విత్తనరహిత ద్రాక్షలను ఆ ఇద్దరికీ బహుమతిగా ఇచ్చారు. 2003లో అతను వరి, గోధుమలపై ప్రత్యేక సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. సాధారణ పంట దిగుబడిని రెట్టింపు చేశారు. అతను సేంద్రియ ద్రాక్ష రకాన్ని బ్లాక్ బ్యూటీ సీడ్లెస్ ద్రాక్ష అని పిలుస్తారు. అల్వాల్‌లోని అతని ఐదు ఎకరాల ద్రాక్ష తోటలో 20 నుండి 25 టన్నుల దిగుబడి తీసుకొచ్చారు. -
గోధుమ అవతారాలు
ఆయుర్వేదం ఆహారధాన్యాలను ఐదు రకాలుగా విభజించింది. శాలి, పష్టిక (వ్రీహి), శూక, శింబీ, తృణ. రంగు, రూపం, పరిమాణం, ఎంతకాలం లో పంట పండుతుంది వంటి అంశాలను బట్టి వీటికి నామకరణం చేసి, గుణధర్మాలను వివరించారు. యవలు, గోధుమలను శూక ధాన్యాలుగా వర్ణించారు. ఈ గింజలకు ఒక వైపు చిన్న ముక్కు ఆకారంలో సూదిగా ఉంటుంది. గోధుమలు: పరిమాణంలో కొంచెం పెద్దగా ఉన్నవాటిని మహా గోధుమలనీ, చిన్నగా ఉన్నవాటిని మథూలీ గోధుమలనీ, శూకము లేకుండా పొడవుగా ఉన్నవాటిని దీర్ఘ గోధుమలనీ అన్నా రు. వీటినే నందీముఖ గోధుమలని కూడా అంటారు. గుణాలు: (భావప్రకాశ): గోధూమో మధురః శీతో వాతపిత్తహరో – గురుః జీవనోబృంహణో, వర్ణ్యః, వ్రణరోపకః, రుచ్యః స్థిరకృత్’ – రుచికి తియ్యగా ఉంటాయి. కొంచెం జిగురుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతాయి. బరువు ఆహారం, బలకరం, శుక్రకరం, ధాతు పుష్టికరం, జీవనీయం, చర్మకాంతిని పెంపొందిస్తుంది. గాయాలను మాన్చటానికి ఉపయోగపడుతుంది. కొత్తగా పండిన గోధుమలు కఫాన్ని కలిగిస్తాయి, బరువైన ఆహారం. పాతబడిన గోధుమలు తేలికగా జీర్ణమై, శరీరంలోని కొవ్వుని కరిగించి, బరువుని తగ్గిస్తుంది. మెదడుకి మంచిది (మేధ్యము). నీరసాన్ని పోగొడుతుంది. శుక్రకరం కూడా. అడవి గోధుమల్ని ఆయుర్వేదం గవేధుకా అంది. ఇవి తీపితో పాటు కొంచెం కారంగా ఉంటాయి. కొవ్వుని, కఫాన్ని హరించి, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: గోధుమ పైపొరను బ్రాన్ అంటారు. లోపల జెర్మ్, ఎండోస్పెర్మ్ అనే పదార్థాలుంటాయి. గ్లూటెన్ అనే అంశ వలన గోధుమపిండి జిగురుగా ఉంటుంది. అన్నిటికంటె జెర్మ్‌లో ప్రొటీన్లు, కొవ్వు, పీచు, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భాగాలతో కూడిన గోధుమల్ని ఆహారంగా సేవించడం శ్రేష్ఠం. బ్రాన్‌లో పీచు అధికంగా ఉంటుంది. జెర్మ్ నుంచి మొలకలు తయారవుతాయి. గోధుమగింజలో ఎండోస్పెర్మ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ (శర్కర) మాత్రమే ఉంటుంది. ఇతర పోషకాలేవీ ఉండవు. 100 గ్రా. సంపూర్ణ గోధుమలో 346 కేలరీలు ఉంటాయి. బొంబాయి రవ్వ: ఇది మనం చేసుకునే ఉప్మాకు ప్రసిద్ధి. దీనిని సంపూర్ణ గోధుమను కొంచెం సంస్కరించి తయారుచేస్తారు కనుక పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. మైదా: ఇది అతి తెల్లని, అతి మెత్తని పిండి. దీనిని గోధుమలోని ఎండోస్పెర్మ్‌ని బ్లీచింగ్ చేయటం ద్వారా తయారుచేస్తారు. బ్రాన్, జెర్మ్‌లను సంపూర్ణంగా తొలగిస్తారు. కనుక మైదాలో ఎక్కువ సాంద్రతలో స్టార్చ్/శర్కర మాత్రమే ఉండటం వలన గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కనుక మధుమేహరోగులకు మంచిది కాదు. పీచు ఉండకపోవటం వలన మల బంధకం కలుగుతుంది. శరీర బరువును పెంచుతుంది. బ్లీచింగ్ చేయటం కోసం కలిపే కెమికల్స్ క్లోరిన్ బెంజాయిక్, కాల్షియం పెరాక్సైడ్, ఎంజోడై కార్బనమైడ్ ప్రధానమైనవి. ఎండోస్పెర్మ్ తో జరిపే రసాయనిక చర్య వలన ఎలోగ్సిన్ అనే మరో కెమికల్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేసి డయాబెటిస్‌ను కలిగిస్తాయి. పూరీలు, నిమ్‌కీన్స్, పునుగులు, చల్ల బూరెలు, బొబ్బట్లు, బ్రెడ్, రకరకాల కేకులు, సమోసాలు, పేస్ట్రీలు మొదలైనవి మైదా వంటకాలలో ప్రధానమైనవి. పాలకోవా, బర్ఫీలలో వ్యాపారార్థమై మైదాను కలిపేస్తారు. జాగ్రత్త: పై విషయాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవటం అవసరం. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
డయాబెటిస్ కారణంగా వరికి బదులు గోధుమలు తింటున్నారా?
ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్స్ తప్పక ఉంటున్నారు. వీళ్లలో చాలామంది తమ రాత్రి భోజనంలో వరి అన్నం తినే బదులు గోధుమ రొట్టెలను తింటుండటం చాలా ఇళ్లలో చూస్తున్నాం.ఒక పిండి పదార్ధాన్ని (కార్బోహైడ్రేట్స్‌ను) తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర, దాని వల్ల శరీరానికి సమకూరే శక్తిని గ్లైసీమిక్ ఇండెక్స్ అనే కొలతలో చెబుతారు. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె... ఈ రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. అంటే వరిలోనూ, గోధుమలోనూ ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి వెలువడే చక్కెరపాళ్లు దాదాపుగా ఒకటే. అంటే నిజానికి ఏది తిన్నా పర్లేదన్నమాట.కానీ ఇక్కడో తిరకాసు ఉంది. మనం అన్నం తినే సమయంలో కూర చాలా రుచిగా ఉంటే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. కానీ రొట్టెలు తింటున్నామనుకోండి. ఎన్ని తింటున్నామంటూ మనకో కొలత తెలుస్తుంది. అందుకే మనం తినే ఆహారం పరిమితి మించదు. దాంతో రక్తంలో గ్లూకోజ్ పెరగదు. అంతేగానీ... రాత్రివేళ పరిమితిగా అన్నం తిన్నా, లేక రొట్టె తిన్నా ఒక్కటే.మళ్లీ ఇక్కడ ఒక మెలిక ఉంది... పైన చెప్పిన ప్రకారం గోధుమలు తినడం వల్ల డయాబెటిస్ వారికి ఏలాంటి అదనపు ప్రయోజనమూ చేకూరదని చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే... అరకప్పు తెల్లగోధుమలో 1.3 గ్రాముల పీచు ఉంటుంది. అదే అరకప్పు పొట్టుతీయని గోధుమలో 6.4 గ్రాముల పీచు ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పొట్టుతీయని గోధుమ తింటే... రక్తంలోకి గ్లూకోజ్ ఇంకిపోవడం అన్నది చాలా చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే పొట్టు తీయని గోధుమ వల్ల రెండు రకాల ప్రయోజనాలన్నమాట. మొదటిది రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల కావడం, రెండోది జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు మలబద్ధకం నివారితం కావడం. ఈ రెండు కారణాలను పరిగణనలోకి తీసుకుంటే వరితో పోలిస్తే గోధుమ ఒకింత మంచిదనే చెప్పుకోవచ్చు. గోధుమలో వివిధ అంశాల తీరుతెన్నులివి... ►ఒక కప్పు గోధుమల్లో ►క్యాలరీలు... 407 ►కొవ్వులు 2.24 గ్రా. ►కార్బోహైడ్రేట్లు 87.08 గ్రా. ►ప్రోటీన్లు 16.44 గ్రా. గోధుమలో పోషకాలివి : ఇక గోధుమలలో మంచి చెప్పుకున్నట్లుగా కార్బోహైడ్రేట్లతో (పిండిపదార్థాలతో) పాటు ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనం చాలా సందర్భాల్లో గోధుమ మీద పైపొరను తొలగించి వాడుతుంటారు. దాన్నే వైట్ వీట్గా పేర్కొంటారు. అదే పొట్టు తొలగించని గోధుమను హోల్‌వీట్ అంటారు. హోల్వీట్లోనే పీచు పదార్థాలు ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరమైన ప్రయోజనాలివి : పొట్టు తీయని గోధుమల్లో పీచు (డయటరీ ఫైబర్) ఎక్కువ కాబట్టి జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. దీనికి తోడు పొట్టు తీయని గోధుమలతో రొట్టెలు తినేవారిలో విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నివారితమవుతుంది. పీచు తీయని గోధుమ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు నివారితమవుతాయి. దాంతో స్థూలకాయం కూడా తగ్గుతుంది. ఈ విషయం కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల్లో అధికారికంగా నిరూపితమైంది. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక పూట గోధుమలు తినడం మంచిదే. అలాగని గోధుమలు ఇష్టం లేనివారు వరి అన్నమే తినదలచుకుంటే మాత్రం కూర రుచిగా ఉన్నా లేకున్నా తమ రాత్రి భోజనం పరిమితికి మించకుండా చూసుకోవాలనే జాగ్రత్త తీసుకోవాల్సిందే. -
సిగనిగలు
వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు. అయితే ఈ సమస్యను నేచురల్ పద్ధతిలో శాశ్వతంగా నివారించుకోవచ్చట. అది కూడా మన వంటగదిలో చౌకగా లభించే వస్తువులతోనే. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయితే సరి... గోధుమలు: తెల్లజుట్టును నివారించడంలో గోధుమలు బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె కలిపి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పని చేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. మెంతులు: తెల్లజుట్టును నివారించే మరో సహజమైన ఇంటి చిట్కా – మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. -
గోధుమ మర కాంట్రాక్ట్‌లో గోల్మాల్!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసే గోధుమలను మర ఆడి, గోధుమ పిండి (ఆటా)గా తయారుచేసి తిరిగి కార్పొరేషన్‌కు సరఫరా చేసే కాంట్రాక్ట్ కేటాయింపులో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. చినబాబు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రోలర్ ఫ్లోర్‌మిల్‌కు కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలను చివరి నిమిషంలో అధికారులు మార్చారు. కేవలం ఒక రోలర్ ఫ్లోర్‌మిల్‌కే కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలు మార్చడంపై ఇతర కాంట్రాక్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత నిబంధనలివే.. పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెలా 1839.970 మెట్రిక్ టన్నుల గోధుమలు తీసుకుని వాటిని ఆటాగా మార్చి తిరిగి ఒక కిలో ప్యాకెట్లుగా తయారుచేసి, వాటిని 50 కిలోల సంచుల్లో నింపి రాష్ట్రంలోని పౌరసరఫరాల గోదాములకు సరఫరా చేయడం కోసం ఈ– టెండర్లు పిలిచారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఒకటో జోన్‌గాను, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను రెండో జోన్గానూ, కర్నూలు, అనంతపురం జిల్లాలను మూడో జోన్ కింద పెట్టారు. ఏ జోన్లో మిల్లర్లు ఆ జోన్లోనే టెండర్లు దాఖలు చేయాలి. టెండర్ల ప్రకారం రోజుకు 100 మెట్రిక్ టన్నుల గోధుమలు మరపట్టే సామర్థ్యం ఉండాలి. ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్ చేసి ఉండాలి. టెండర్‌ను సోమవారం (ఏప్రిల్ 23) సాయంత్రంలోగా దాఖలు చేయాలని, 24న టెండర్లు తెరిచి తక్కువ కొటేషన్ ఉన్నవారికి టెండర్లు ఇస్తామని పేర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రం టెండర్ నిబంధనలను మార్చుతూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం గత ఆర్థిక ఏడాదిలో 3వేల మెట్రిక్ టన్నుల ఆటాను ప్రభుత్వ సంస్థకు సరఫరా చేసి ఉండాలనే కొత్త నిబంధన విధించారు. కొత్త నిబంధనలకు అనుకూలంగా టెండర్‌ను ఈ నెల 26 వరకు దాఖలు చేయొచ్చని, 27న టెండర్లు వేలం నిర్వహిస్తామని ప్రకటించారు. చినబాబు సన్నిహితుడికి కట్టబెట్టేందుకే.. చినబాబు సహకారంతో చిత్తూరులోని జయరామ్ చౌదరికి చెందిన సుద్దలగుంట ఫ్లోర్‌మిల్ గతేడాది ఆటా సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రన్న కానుకతో సహా నెలవారీ ఇచ్చే ఆటా టెండర్లూ ఆ మిల్కే దక్కాయి. కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది కూడా అదే మిల్కు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ టెండర్ విలువ రూ.35 కోట్ల వరకు ఉంటుందని, కనీసం 2 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాయలసీమనే కాకుండా రాష్ట్రమంతా ఈ మిల్కే వచ్చినా ఆశ్చర్యం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా సుద్దలగుంట ఫ్లోర్‌మిల్‌పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ మిల్ సరఫరా చేసే గోధుమపిండిలో నాణ్యత లేదనే విమర్శలున్నాయి. -
కొత్తగా పీచు గోధుమ!
మనం సాధారణంగా వాడే వరి, గోధుమల్లో పీచు తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన కొత్త వంగడాన్ని సృష్టించారు. ఇది సాధారణ గోధుమ కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ పీచుపదార్థం కలిగి ఉంటుంది. ఫ్రెంచ్ కంపెనీ లిమాగ్రెయిన్ క్రాలేస్ ఇన్‌గ్రేడియంట్స్‌తో కలిసి 2006లో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ ఈ మధ్యే విజయవంతంగా పూర్తయింది. గోధుమలోని రెండు ఎంజైమ్‌ల మోతాదు తగ్గిస్తే అమైలోజ్ అనే పాలీశాకరైడ్ ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతుల ద్వారా దీన్ని సాధించారు. మొదట్లో అమైలోజ్ మోతాదు 25 నుంచి 30 శాతం మాత్రమే పెరిగినా, తరువాతి పంటల్లో మాత్రం ఇది రికార్డు స్థాయిలో 85 శాతం ఎక్కువైంది. ఫలితంగా గోధుమలోని ఒక రకమైన పీచు పదార్థం 20 శాతానికి చేరుకుంది. సాధారణ గోధుమలో ఇది ఒక శాతం మాత్రమే ఉంటుంది. ఈ కొత్త గోధుమ వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మే స్టేట్ మిల్లింగ్ కంపెనీ సాగుకు సిద్ధం చేసింది. ఇడాహో, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోనూ, ఆస్ట్రేలియాలోనూ దీన్ని సాగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
గోధుమ, పప్పుధాన్యాల మద్దతు ధర పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు స్వల్ప ఊరట కల్పించింది.ధరల పెంపును అరికట్టి దిగుబడులను ప్రోత్సహించేందుకు గోధుమ, పప్పుధాన్యాల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు కనీసమద్ధతు ధరను క్వింటాల్‌కు రూ 110 చొప్పున రూ 1735 రూపాయలకు పెంచింది. పప్పుధాన్యాల ధరలను క్వింటాల్‌కు రూ 200 మేర పెంచింది.ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధరలను ఆమోదించింది. ఇక పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ 4150 నుంచి రూ 4200కు పెంచారు. ఆయిల్‌సీడ్స్, ఇతర విత్తనోత్పత్తుల మద్దతు ధరలను కూడా పెంచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం కనీస మద్దతు ధరలను పెంచిందని తెలిపాయి. దేశంలో ఈ నెలలో సాగయ్యే ప్రధాన రబీ పంట గోధుమ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్‌కు వస్తుంది. -
రేషన్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే "ప్రజాపంపిణీ వ్యవస్థ’’ (పీడీఎస్) ధరలను పెంచబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆహార ధాన్యాల ధరల పెంపు మరో ఏడాది పాటు ఉండదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఆహార శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు ఇతర తృణధాన్యాల విక్రయ ధరలను ఒక సంవత్సరం వరకు పెంచమని రాం విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తద్వారా ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2013 లో ఆమోదం పొందిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద మూడు సంవత్సరాలకు ఆహారధాన్యాల ధరలను సమీక్షిస్తారు. PM Sh. Narendra Modi Ji has taken a historic decision to not to increase the issue prices of food-grains under NFSA for one more year. — Ram Vilas Paswan (@irvpaswan) June 28, 2017 -
బలవర్ధకమైన ఆహార ధాన్యం
తిండి గోల భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో గోధుమలు ఒకటి. భారతదేశంతోబాటు చైనా, అమెరికా, రష్యాలలో కూడా గోధుమలను విస్తారంగా పండిస్తారు. గోధుమలను, గోధుమపిండిని ప్రపంచ వ్యాప్తంగా వాడతారు. కొన్ని దేశాలలో అయితే గోధుమలే వారి ప్రధాన ఆహారం. మనదేశంలో దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. పండిన దానిలో వారే ఎక్కువగా వినియోగిస్తారు. కారణం గోధుమ పిండితో చేసిన రొట్టెలు వారి ప్రధాన ఆహారం. గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడతారు. ఇళ్ల పైకప్పుగా వాడతారు. గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు. లడ్డూలు కూడా చేస్తారు. బ్రెడ్ తయారీకి కూడా గోధుమలే వాడతారు. అంతేకాదు, అత్యంత బలవర్ధకమైన ఆహారం గోధుమలు. ఎదిగే పిల్లలకు గోధుమలు ఎంతో ఉపయోగపడతాయి. ఎముకల పెరుగుదలకు, రక్తహీనతకు, మలబద్ధకానికి ఆయుర్వేదంలో గోధుమలను ఉపయోగించి రకరకాల ఔషధాలను తయారు చేస్తారు. గోధుమలలో బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉంటాయి. గోధుమ లడ్డూలు ఎంతో రుచికరమైన చిరుతిండి. భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ బరువు తగ్గాలనుకునేవారు ఒకపూట అన్నం తినడం మాని గోధుమ రొట్టెలను తినడం మనకు అనుభవంలో ఉన్నదే. గోధుమలను నూనె లేదా నీరు లేకుండా ఒక మూకుడులో వేసి మాడ్చి చూర్ణం చేసి పూటకు పదిగ్రాముల చొప్పున రోజూ రెండుపూటలా తేనెతో కలిపి తింటూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయని ఆయుర్వేద వైద్యచిట్కా. -
గోధుమ, కందిపప్పు దిగుమతిపై 10% పన్ను
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమ, కందిపప్పులపై 10 శాతం పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఈ రెండు పంటల దిగుబడి ఈ ఏడాది భారీగా ఉండనుం దనే అంచనాల నడుమ..ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో చెప్పారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అంగీకరించే విధంగా దివ్యాంగుల కోసం ఓ ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకొస్తామని సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ లోక్‌సభకు తెలిపారు. ఒకే గుర్తింపు కార్డుతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ వారికోసం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. ► దేశంలోని మొత్తం శత్రు ఆస్తుల విలువ రూ.1.04 లక్షల కోట్లని హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ లోక్‌సభలో వెల్లడించారు. అలాగే మరో ప్రశ్న కు బదులిస్తూ ఢిల్లీలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లలో గత మూడేళ్లలో 73 చోరీ కేసులు నమోదయ్యాయని హన్స్‌రాజ్ తెలిపారు. కాషాయం దుస్తుల్లో స్పీకర్ గుడీ పడ్వా పర్వదినం సందర్భంగా స్పీకర్ సుమిత్ర మహాజన్ మంగళవారం లోక్‌సభకు కాషాయ దుస్తుల్లో హాజరవడంతో ఓ మహారాష్ట్ర ఎంపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మేడమ్, నా సొంత రాష్ట్రంలో పండుగను జరుపుకోలేక పోతున్నందుకు నేను కాస్త అసంతృప్తితో ఉన్నాను. పండుగ రోజున కాషాయం రంగు దుస్తులు ధరించినందుకు మీకు ధన్యవాదాలు’అని ముంబై–ఉత్తర నియోజకవర్గ ఎంపీ గోపాల్ చినయ్య శెట్టి అన్నారు. దీంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి. -
భారీగా ఆహార ధాన్యాల దిగుబడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదుకావడంతో ఆహార ధాన్యాలు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 271.98 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి రానున్నాయి. ఇందులో వరి, గోధుమ, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు సైతం గత ఏడాది దిగుబడికంటే అధికంగానే చేతికి రానున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 251.57 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2013–14 ఏడాదిలో 265.04 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2016–17 ఏడాదికి గాను 108.86 మిలియన్‌టన్నుల వరి దిగుబడి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత ఏడాది జూలై నాటికి 104.41 మిలియన్ టన్నులు వరి ఉత్పత్తి కాగా, 2013–14 ఏడాదికి గాను రికార్డు స్థాయిలో 106.65 మిలియన్ టన్నుల వరి దిగుబడి నమోదైనట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇక గోధుమ విషయానికొస్తే ఈ ఏడాది 96.64 మిలియన్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది. 2015–16 ఏడాదిలో 92.29 మిలియన్ టన్నుల దిగుబడి లభించింది. -
గోధుమలపై దిగుమతి సుంకం రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమ దిగుబడి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం గోధుమలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దేశీయ లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకే గోధుమలపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ అంశం లోక్‌సభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిశీలనలోకి వచ్చింది. గోధుమలపై దిగుమతి సుంకాన్ని నిరవధికంగా రద్దు చేస్తున్నామని, తక్షణం ఇది అమల్లోకి వస్తుందని జైట్లీ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల నిర్ణయం తీసుకోవడమేంటని ప్రధాని మోదీపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. -
గోధుమ, పప్పులకు ‘మద్దతు’
► కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం ► గోధుమలకు రూ.100, పప్పుధాన్యాలకు రూ.550 వరకు న్యూఢిల్లీ: రబీ సాగు పెంపు,, ధరల నియంత్రణకు కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు క్వింటాల్‌కు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 వరకు పెంచింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం సమావేశమై 2016-17 రబీ పంటలపై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది. శనగలకు మద్దతు ధరను బోనస్‌తో కలిపి రూ.500 పెంచి రూ.4 వేలు చేశారు. గతంలో ఇది రూ.3,500గా ఉంది. ఆవాలకు ప్రస్తుతం రూ.3,350 ఉన్న ఎంఎస్పీని రూ.350 పెంచి రూ.3,700 చేశారు. ఆవాలకు రూ.400 పెంచడంతో మద్దతు ధర రూ.3,700కి చేరింది. బార్లీ గింజల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచడంతో అది రూ.1,325కు చేరింది. కుసుమలకు మద్దతు ధరను రూ.400 పెంచడంతో అది రూ.3,700కు చేరింది. ఎర్ర కందిపప్పుకు రూ.550 పెంచి రూ. 3,950 చేశారు. గత ఏడాది ఈ ధర రూ.3,400గా ఉంది. శనగలు, ఎర్ర కందిపప్పుకు మద్దతు ధరను రూ.4వేలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇలాచేస్తే రబీ సాగు పెరగడంతోపాటు ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది. గోధుమలకు 6.6 శాతం పెంచామని, అయితే ఇది బోనస్‌తో కలిపి 8.2 శాతం అవుతుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శనగలకు 14.3 శాతం, ఎర్ర కందిపప్పుకు 16.2, ఆవాలకు 10.4, కుసుమలకు 12.1 శాతం పెంచారన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున 20.75 మిలియన్ టన్నులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేబినెట్ నిర్ణయాలు: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవ్యతిరేక సంస్థగాప్రకటించాలని కేబినెట్ నిర్ణయి0ది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నదుల అనుసంధాన స్పెషల్ కమిటీకి చట్టబద్దత కల్పించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
గోధుమ ఊక.. కొబ్బరి పాలు..
బ్యూటిప్స్ అర కప్పు గోధుమ ఊకలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, వేళ్లతో సున్నితంగా, వలయాకారంగా ఐదు నిముషాల సేపు రుద్దుతూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి, వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంత వరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. -
ఘనంగా తీజ్ సంబురం
-
పెరిగిన సబ్సిడీ గోధుమల ధర
రూ.2 నుంచి రూ.7కుపెంపు పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే గోధుమల ధరను పెంచింది. నాలుగు మాసాలుగా రూ.2లకే కిలో ఇచ్చిన గోధుమల ధరను ఇపుడు రూ.7కు పెంచింది. గోధుమల «దరను పెంచిన విషయమై రేషన్ డీలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వక పోవడం విశేషం. వచ్చే నెల కోటా పొందేందుకు మీసేవా కేంద్రాల్లో కిలోకు రూ.1.80 చొప్పున డబ్బులు చెల్లించగా వారు చెల్లించిన సొమ్మును రూ.6.80తో తీసుకుని కోటా తగ్గించి రశీదు రావడంతో డీలర్లు అవాక్కయ్యారు. ఇప్పటిదాక రూ.2కే కిలో ఇచ్చి వచ్చే నెల నుంచి రూ.7చెల్లించాలని కోరితే లబ్దిదారుల నుంచి ఇబ్బందులు తప్పవని డీలర్లు వాపోతున్నారు. ధర పెరిగిన విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణమని డీలర్లు పేర్కొన్నారు. -
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం
గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజు ద్వారా సరఫరా అయ్యి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి.యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పళ్లు, కూరగాయల వల్ల జ్ఞానం వృద్ధి చెంది పిల్లల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.పెరుగులోని మాంసకృత్తులు, మేలు చేసే కొవ్వు, విటమిన్-బి మెదడుకు గ్రాహ్యశక్తిని పెంచుతాయి. చేపలలోని ఒమేగా, విటమిన్-డి మతిమరుపును తగ్గించి గ్రాహ్య శక్తిని పెంచుతుంది. నట్ బటర్ (వెన్న) ఒమెగ-3 ఫ్యాట్స్ మెదడు సరిగా పనిచేయుటకు తోడ్పడును. ఆకుకూరలు పాలకూరలోని విటమిన్స్ మతిమరుపును తగ్గిస్తాయి. ఓట్‌మీల్‌లోని మాంసకృత్తులు, పీచు పదార్థాలు మెదడులోని ధమనులను సరిగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.మంచి నీరు సరిగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు లోనై చదివినవి గుర్తు ఉండక పరీక్షల్లో సరిగ్గా రాణించలేరు.గుమ్మడి గింజలలో ఉన్న జింక్ మెదడుకు పదును పెడుతుంది. ఆపిల్స్ మరియు బాదంలోని కొన్ని పదార్థాలు మెదడులోని నరాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. -
అఫ్ఘాన్‌పై పాక్ పెద్ద మనసు
ఇస్లామాబాద్: తాలిబన్ల బారిన పడిన అఫ్ఘానిస్థాన్‌కు సహాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకొచ్చింది. పది రోజుల కిందట జరిగిన భారీ యుద్ధంలో నష్టపోయిన ఖుందుజ్ ప్రాంత ప్రజలకు ఆహార పదార్థాలను వెంటనే పంపించే ఏర్పాట్లు చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. వెంటనే గోధుమలను పంపించే పనులుప్రారంభించాలని కోరారు. అఫ్ఘానిస్థాన్లోని ఖుందుజ్ ప్రాంతంలో పది రోజుల కిందట తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు మధ్య ఘోర యుద్ధం చోటుచేసుకుంది. అక్కడి ప్రజలంతా భయకంపితులయ్యారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. చివరికి ప్రభుత్వ బలగాల ఆధీనంలోకే ఖుందుజ్ ప్రాంతం వచ్చినా పరిస్థితి బాగాలేదు. దీంతో ఆహార ధాన్యాలు పంపించేందుకు పాక్ ముందుకొచ్చింది. -
పేదల నోట్లో మట్టి !
అందని అమ్మహస్తం పామోలిన్, గోధుమల నిలిపివేత మార్కెట్లో నింగినంటిన ధరలు వినియోగదారులపై నెలకు *12.54 కోట్ల భారం చిత్తూరు: అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారులకు పామోలిన్, గోధుమలు,కందిపప్పు తదితర వస్తువులను నిలిపేసింది. పేద ప్రజలు బయట దుకాణాల్లో సరుకులు కొనాల్సివస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఇది పేదలకు భారంగా మారింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న అరకొర సరుకుల్లో కూడా అధిక భాగం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు జిల్లాలో 10 లక్షల 37 వేల రేషన్ కార్డులు ఉండగా, ఆధార్ సీడింగ్ అంటూ కోతలు పెట్టి 9.65 లక్షల కార్డులను తేల్చారు. 72 వేల కార్డులను తొలగించారు. అర్హులైన పేదలు సైతం కార్డులు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్న కార్డులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పేరుతో బియ్యం, చక్కెర, పామోలిన్, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు, చింతపండు అంటూ 9 రకాల వస్తువుల పేర్లు చెప్పి తొలుత ఆర్భాటం చేసినా ఆ తరువాత కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వస్తువులను కూడా పంపిణీ చేయడంలేదు. బియ్యం,కిరోసిన్, ఒక్కో కార్డుకు అర కిలో చక్కెర మాత్రమే అందిస్తోంది. గోధుమలు,పామోలిన్, కందిపప్పు, చింతపండు పంపిణీ నిలిపేసింది. కందిపప్పు, పామోలిన్‌ను ప్రతి కుటుంబం తప్పనిసరిగా వినియోగించేది, వీటి ధరలు మార్కెట్లో ఆకాశాన్నంటాయి. పేదలు కొనలేని పరిస్థితి. మార్కెట్లో కిలో చక్కెర *34 ఉండగా,కందిపప్పు * 80,గోధుమలు *36,పామోలిన్ కిలో పాకెట్ ధర * 54 ఉంది. ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంటే పేదలకు కొంతైనా ఉపశమనం ఉంటుంది. గతంలో ఇస్తున్న మేర అయినా సరుకులు పంపిణీచేస్తే వినియోగదారులపైన కోట్లాది రూపాయల భారం తగ్గేది. పౌరసరఫరాల శాఖ గణాంకాల మేరకు 9.65 లక్షల కార్డుదారులు నెలకు కిలో గోధుమలు బయట మార్కెట్లో కొనడంవల్ల జిల్లా వ్యాప్తంగా * 3,47,40,000 భారం పడుతుంది. ఇక పామోలిన్ పాకెట్‌పై *5,21,10,000 భారం పడుతుండగా, అర కిలో కందిపప్పు బయట మార్కెట్లో కొనడం వల్ల *3,86,00.000 భారం పడుతోంది. ఈ లెక్కన చూసినా నెలకు * 12 కోట్ల, 54 లక్షల, 50 వేలు వినియోగ దారులపై భారం పడుతోంది. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సరుకులు సక్రమంగా వినియోగదారులకు అందడంలేదు. రేషన్‌షాపుల డీలర్లు, అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కందిపప్పు,గోధుమలు,పామోలిన్‌తో పాటు మరిన్ని సరుకులు పంపిణీచేసి పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. -
గోధుమ ‘మద్దతు’ పెంపు
క్వింటాల్‌కు 50 పెరిగిన ధర న్యూఢిల్లీ: గోధుమల కనీస మద్దతు ధర స్వల్పంగా పెరిగింది. గోధుమల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో మద్దతు ధర రూ. 1,450లకు చేరుకుంటుందని, రబీసీజన్ సాగులో రైతులకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సలహా సంఘం (సీఏసీపీ) సిఫార్సులమేరకు రబీ సీజన్లో పంటల మద్దతు ధ రను రూ. 50నుంచి రూ. 125ల వరకూ హెచ్చిస్తూ, సీసీఈఏ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. రబీ సీజన్‌కు సంబంధించి బార్లీ, పప్పులు, ఆవాలు వంటి పంటల మద్దతు ధరను పెంచారు. పప్పుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 125 పెరిగి రూ. 3,075కు చేరింది. ఆవాలు, సన్‌ఫ్లవర్ గింజల మద్దతు ధర రూ. 50ల చొప్పున పెరిగింది. ఆవాల మద్దతు ధర క్వింటాల్ రూ. 3,175కు, సన్‌ఫ్లవర్ ధర క్వింటాల్ రూ. 3,050కి చేరింది. బార్లీ కనీస వుద్దతు ధర రూ. 50 పెరిగి, క్వింటాల్ మద్దతు ధర రూ. 1,150కి చేరింది.వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో పరిశోధనలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సంబంధించి విదేశాలతో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. -
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!
ఘట్కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. నాణ్యత లేని సరుకులు.. అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి, వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు. -
ఆదర్శ రైతు... రామ్‌శరణ్
స్ఫూర్తి అందరూ చేసేది అనుసరించేయడంలో గొప్పేమీ లేదు. కానీ అందరూ చేసేదాన్ని కొత్తగా చేయాలనుకోవడమే గొప్ప. అలా చేశాడు కాబట్టే రామ్‌శరణ్ వర్మ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలోని దౌలత్‌పూర్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు రామ్‌శరణ్. చదువులో పెద్దగా రాణించలేకపోవడంతో ఎనిమిదో తరగతితోనే బడికి బైబై చెప్పేశాడు. తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. తండ్రి మరణించిన తరువాత ఆరు ఎకరాల పొలంలో తనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది రామ్శరణ్కి. వ్యవసాయం పట్ల ప్రత్యేక ఆసక్తి లేదు. అలాగని అనాసక్తీ లేదు. కానీ తండ్రి పొలం ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో అప్పట్నుంచీ పంటల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. వరి, గోధుమ, బంగాళదుంపలను పండించడం మొదలు పెట్టారు. దిగుబడి బాగుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. దాంతో వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్నారు. రకరకాల పంటల గురించి, వాటి సాగు గురించి పరిశోధ నలు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం గురించి వెలువడే ప్రతి పత్రికా చదివారు. ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసు కున్నారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా పంటలు పండించడం మొదలుపెట్టారు. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ ఆకర్షించింది. ఆయన దగ్గరకు వచ్చి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడమెలాగో నేర్పమని అడిగారు. అలా అలా రామ్‌శరణ్ పేరు పాకిపోయింది. కొన్ని వందల గ్రామాల రైతులకు ఆయన వ్యవసాయ గురువుగా మారిపోయారు. పదిహేనేళ్లలో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల వ్యవసాయ రూపురేఖల్ని మార్చేశారాయన. దాదాపు ఎనభై అయిదు ఎకరాల్లో రామ్‌శరణ్ పండించే టొమాటో, అరటి, బంగాళాదుంపలు, వరి వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి! -
రేషన్..పరేషాన్
మోర్తాడ్, న్యూస్‌లైన్: రేషన్ వినియోగదారులకు రెండు నెలలుగా పామోలిన్, గోధుమలు సరఫరా కాక పోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 రకాల సరుకులను సబ్సిడీ ధరపై ప్రభుత్వం సరఫరా చేసేది. తెల్ల రంగు కార్డుల వినియోగదారులకు సబ్సిడీ ధరపై పామోలిన్, పంచదార, గోధుమ పిండి, గోధుమలు, పసుపు, మిరప్పొడి, చింతపండు, ఉప్పు, కందిపప్పులను 185కు విక్రయించేవారు. అమ్మహస్తం పథకం సరుకులతో పాటు రూపాయికి కిలో బియ్యం, కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. తొమ్మిది రకాల సరుకులను సరఫరా చేయాల్సి ఉండగా, పామోలిన్, గోధుమలను మాత్రం అందివ్వడం లేదు. గోధుమలు మార్కెట్లో కిలోకు 14 ధర ఉండగా రేషన్ దుకాణంలో మాత్రం కిలో ఏడు రూపాయలకు లభిస్తాయి. పామోలిన్ లీటర్ ప్యాకెట్ ధర మార్కెట్లో 60 ఉండగా అమ్మహస్తం పథకం ద్వారా 40 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. పామోలిన్, గోధుమలకు డిమాండ్ ఉండగా ఆ సరుకులు మాత్రం సరఫరా కావడం లేదు. చింత పండు, పసుపు, కందిపప్పు, గోధుమ పిండి నాసిరకంగా ఉండటంతో వాటిని తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. పౌర సరఫరాల శాఖ గోదాంలలో గోధుమలు, పామోలిన్ నిలువలు తగ్గిపోవడంతో జిల్లాకు రావాల్సిన 70 టన్నుల గోధుమలు సరఫరా కాలేదు. అలాగే ఏడు లక్షల పామోలిన్ ప్యాకెట్లు కూడా సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల తెలుపు రంగు కార్డుల వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెల అన్ని రకాల సరుకులు సరఫరా అయితేనే వినియోగదారులకు అధికారులు డీలర్ల ద్వారా అమ్మహస్తం పథకం ద్వారా సరుకులను అందిస్తారు. ఎన్నికల బిజీలో ఉన్న అధికారులు సరుకులు సరఫరా కాక పోవడంపై శ్రద్ధ చూపక పోవడంతో రేషన్ వినియోగదారులకు అవసరం ఉన్న పామోలిన్, గోధుమలు సరఫరా కావడం లేదు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి గోధుమలు, పామోలిన్ సరఫరా అయ్యేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఇదీ మట్టిని ఎరువుగా వాడే తీరు!
రెండో పద్ధతి: పొలం మొత్తంలో అడుగు లోతు మట్టిని రెండు దఫాలుగా సేకరించి ఎండబెట్టి, దశల వారీగా ఎరువుగా వాడుకోవాలి. ఈ పద్ధతిలో కందకం తవ్వే శ్రమ, ఖర్చు ఉండదు. విటమిన్ ఏ, సీ ఉండే బియ్యం, గోధుమలు పండిస్తున్నది ఈ పద్ధతిలోనే. పంట కోసిన తర్వాత తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. పంట కోసిన వెంటనే నేలలో పదును ఆరిపోక ముందే.. మోళ్లతో పాటు లేచి వచ్చేలా 4-6 అంగుళాల లోతున పొలం మొత్తాన్నీ దున్నాలి. ఈ పైపొర మట్టిని డోజర్ ట్రాక్టర్‌తో పక్కకు తీసి ఒక కట్టగా/కుప్పగా వేసి ఉంచాలి (గత పంట కాలంలో పోషకాలను కోల్పోయిన ఈ మట్టిని మోళ్లతో పాటు రెండు నెలలు కుళ్లబెడితే తిరిగి సారవంతమవుతుంది). అదే పొలాన్ని.. మరోసారి 6 అంగుళాల లోతున దున్ని, ఆ మట్టినీ పక్కకు తీసి మరో కట్టగా వేసుకోవాలి (ఇది లోపలి పొరలోని మట్ట్టి -సబ్ సాయిల్- కాబట్టి, సహజంగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి). 60 రోజులు ఎండాకాలంలో ఎండిన తర్వాత వర్షాకాలం ముందు కట్టగా పోయాలి. లోపలి మట్టి పైకి తీసిన తర్వాత కనీసం 1, 2 సంవత్సరాలు ఎండకు ఎండి, వర్షానికి తడిస్తే.. ఆ మట్టిలోని పోషక విలువలు ఇంకా వృద్ధి చెందుతాయి. ఎండు మట్టి గాలిలోని నత్రజనితోపాటు ఇతర పోషకాలను స్థిరీకరించుకొని మొక్కలకు అందిస్తుంది. పంటలకు వాడేటప్పుడు మాత్రం మట్టి పొడిగా ఉండాలి. ఇలా పొలంలోని మోళ్లతోపాటు సేకరించిన పైమట్టిని, లోపలి మట్టిని వేర్వేరుగా సేకరించి పెట్టుకున్నాక.. తిరిగి నాట్లు వేసుకున్న తర్వాత సాగు నీటిలో మట్టిని కలుపుతూ ఒండ్రు నీటిని పారించేందుకు వాడుకోవాలి. మొదట సేకరించి ఎండబెట్టిన పైమట్టిని పంట పూత దశకు ముందు వాడాలి. తర్వాత సేకరించి ఎండబెట్టిన మట్టిని పంట పూత దశకు వచ్చిన తర్వాత నీటి తడుల్లో వాడాలి. వరి సాగు పద్ధతి: దమ్ము చేసి నాట్లు వేసిన తర్వాత నుంచి పది రోజులకోసారి మట్టి కలిపిన నీటి తడులు ఇవ్వాలి. మధ్యలో అవసరమైతే మామూలు తడులు ఇచ్చుకోవచ్చు. ప్రతిసారీ ఎకరానికి 2 టన్నుల (2 ఎడ్ల బండ్లు) చొప్పున ఎండిన మట్టిని బోరు/ కాలువ నీటిని కలుపుతూ పొలానికి పారించాలి. పూతకు వచ్చేవరకు పొలంలో అంగుళం ఎత్తున నీటిని నిల్వగట్టాలి. పూతకు వచ్చిన తర్వాత నుంచి నీటిని నిల్వగట్టక్కర్లేదు. ఆరుతడులు ఇస్తే చాలు. తడి పెట్టిన ఒకటి, రెండు గంటల్లో నీళ్లు ఇంకిపోయేలా పెడితే చాలు. పంట పూతకొచ్చిన తర్వాత ఇచ్చే 3 నీటితడులు పోషకాలను సంతరించుకోవడంలో చాలా కీలకమైనవి. రెండో విడత సేకరించి ఎండబెట్టి ఉంచుకున్న మట్టిని ఈ దశలో తడుల్లో ఎకరానికి 2 టన్నుల చొప్పున వాడాలి. కాలువలో నీరు పారుతున్నప్పుడు ఈ పొడి మట్టిని కలుపుతూ మట్టి కలిపిన ఒండ్రు నీటిని పొలానికి పారించాలి. అయినా, పంట చిరుపొట్ట లేదా ఈనే దశలో నత్రజని లోపం కనిపిస్తే.. ఎకరానికి 500 కిలోల వర్మీ కంపోస్టు లేదా 200 కిలోల ఆముదం పిండి లేదా 200 కిలోల వేపపిండిని వేసుకోవాలి. ఇలా పండించిన బియ్యం, గోధుమల్లోనే విటమిన్ ఏ, సీ భారీగా ఉన్నట్లు తేలింది. ఇంకా మనకు తెలియని ఏ యే పోషకాలు ఉన్నదీ లోతైన అధ్యయనాలు చేస్తేగానీ తెలియదు. గోధుమ సాగు: గోధుమ సాగుకు నీటిని అసలు నిల్వగట్టాల్సిన పని లేదు. 10-15 ఆరుతడులు ఇస్తే చాలు. కూరగాయలు, పూలమొక్కల సాగు: డ్రిప్ కింద సాగు చేస్తుంటే.. ప్రతి మొక్కకు పది రోజులకోసారి 200 గ్రాముల చొప్పున ఎండిన మట్టిని ఎరువుగా వేసుకోవచ్చు. నీటిని పారగట్టే పద్ధతిలో పైన పంటల మాదిరిగానే చేయవచ్చు. బిందు సేద్యం ద్వారా సాగు చేసే ద్రాక్ష తదితర పంటలకు డ్రిప్ పాయింట్ వద్ద కిలో ఎండిన మట్టిని పది రోజులకోసారి వేసుకోవాలి. పంట వరుసల మధ్యలో ఎండిన మట్టిని తీసి ఒకసారి, లోపలి మట్టిని ఒకసారి మార్చి మార్చి వేసుకోవాలి. లోపలి మట్టిని నీటిలో కలిపి కూడా పిచికారీ చేయవచ్చు. మొదటి పద్ధతి: కందకం లోతుగా తవ్వి లోపలి మట్టిని తీసి.. పొలం అంతా పరిచి పంటలు పండించడం: పొలంలో ఒక వైపు కందకం తవ్వి తీసిన లోపలి మట్టి(సబ్సాయిల్- సారవంతమైన మట్టి)ని పొలం అంతటా పరవాలి. కొత్త, పాత మట్టిని కలియదున్నాలి. సేంద్రియ ఎరువులు (వర్మీ కంపోస్టు, ఆముదం/వేప పిండి) వేసి.. వరి నాట్లు వేసుకొని మామూలుగానే అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. అయితే, పైరు పూత దశకు ఎదిగిన తర్వాత.. గింజ కట్టే దశ వరకు.. 2, 3 తడుల్లో.. ముందుగా సేకరించి పెట్టుకున్న ఎండిన మట్టిని సాగు నీటితోపాటు కాలువలో కలుపుతూ బురద నీటిని పారించాలి. మొదట్లో కందకం తవ్వినప్పుడే సేకరించి, ఎండబెట్టి, నిల్వ చేసుకున్న మట్టిని ఈ విధంగా వినియోగించాలి. ఎకరానికి ఒక ట్రాక్టర్ మట్టి సరిపోతుంది. -
ఆదుకోని రబీ
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలతో రబీ పంటల భవితవ్యం దినదినగండంగా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. పంటలు కోల్పోయి అన్నదాతలు దుఃఖంలో మునిగిపోయారు. గత నెల 27 నుంచి జిల్లా అంతటా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పంటలతో పాటు కూరగాయలు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా జిల్లాలో పంట నష్టం 3,632 హెక్టార్లకు ఎగబాకింది. దీంతో దిగుబడి రూపంలో రైతులు రూ.11.71 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి తుది అంచనా నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా..ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి రాయితీని విడుదల చేసి ఆదుకోవాలని బాధిత రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. రబీపై ‘అకాల’ దెబ్బ రబీ సాధారణ విస్తీర్ణం 1.56 లక్షల హెక్టార్లని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఏకంగా 1.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో రబీ సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నెల రోజులు గడిస్తే పంటలు చేతికందనుండగా అకాల వర్షాలు అనూహ్యంగా దెబ్బతీశాయి. వరి సాధారణ సాగు 44,407 హెక్టార్లయితే రైతులు 65,263 హెక్టార్లలో పంట వేశారు. అదే విధంగా 20,029 హెక్టార్లలో చెరకు సాగైంది. నెల రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో పంటలు క్రమంగా క్షీణిస్తున్న దశలో వర్షాలు ఆదుకుని కొంత వరకు ప్రాణం పోశాయి. అయితే, వడగళ్ల బీభత్సవానికి వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు సైతం ధ్వంసమయ్యాయి. 26,975 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న, 10,149 హెక్టార్లలో సాగు చేసిన పొద్దుతిరుగుడు పంటలపై మాత్రం అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న పంట కంకు, పొద్దుతిరుగుడు పంటలు పువ్వూ ఏర్పడే దశలో ఉన్నాయి. పది రోజులుగా కురుస్తున్న వార్షిలకు వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న తెగుళ్లు ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదముంది. గాలిలో తేమతో పాటు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలకు చీడపీడలు ఆశించే అవకాశాలున్నాయి. చేలల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండనీయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెగుళ్ల నివారణ కోసం ఈ రసాయన మందులను నీటిలో కలిపి పిచికారి చేయాలని పలు రకాల మందులను సిఫారసు చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు ఆకుమచ్చ, తలకుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశముంది. ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో జినెట్ 2 గ్రాములు లేదా మంకోజిట్ 3 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా తలకుళ్లు తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో సెంథియాన్ ఒక మిల్లీలీటర్ లేదా నీటిలో కరిగే గందకం 3 గ్రామాలు కలిపి పిచికారి చేయాలి. జొన్న పంటకు సోకే తేనె బంక తెగుళ్లు నివారణకోసం లీటర్ నీటిలో గ్రాము భావిష్టిన్ లేదా 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ప్రకృతి ప్రకోపం..
నిర్మల్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు.. అన్నదాతలకు తప్పని కష్టాలు అన్నట్లుగా తయారైంది ఏటా రైతుల పరిస్థితి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందం గా పంటలు చేతికొస్తున్న క్రమంలో.. తోటలు ఆశాజనకంగా ఉన్న సమయంలో కురిసిన అకాల వర్షం వారిని నట్టేట ముంచింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వరుణుడు కరుణించడంతో జలాశయాలు నిండి రైతులు సంబరపడ్డారు. తర్వాత కురిసిన ఎడతెరపి లేని వర్షాలతో పంటల కు తెగుళ్లు సోకి అవస్థలు పడ్డారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా కళ్లాల్లో ఉన్న పసుపు, మిర్చి పంటలు తడిసి నాణ్యత దెబ్బతిన్నాయి. ఎదుగుదలకు వచ్చిన మొక్కజొన్న, గోధుమ, శనగ, పెసరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రకోపంతో రైతన్న నష్టాలు, కష్టాల ఊబిలో పడిపోయాడు. అకాల వర్షం.. రైతన్నకు నష్టం.. జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో వర్షం కురిసింది. సగటున 1.97 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కాగా అత్యధికంగా తలమడుగు మండలంలో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 5,600 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఇప్పుడిప్పుడే ఎదుగుదలకు చేరుకొని మరో పక్షం, నెలరోజుల వ్యవధిలో చేతికొస్తుందనుకుంటున్న మొక్కజొన్న పంట దాదాపు 2 వేల ఎకరాల్లో, గోధుమ, శనగ తదితర పంట లు దాదాపు 1,500 ఎకరాల్లో, పసుపు, మిర్చి తదితర పం టలు 2,100 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దీంతో రైతన్న తీవ్ర స్థాయిలో నష్టాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పసుపు, మిర్చి ధర ప్రభావం... జిల్లాలో ఈసారి దాదాపు 13 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. దాదాపు ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా రు. అధిక వర్షాలతో దుంపకుళ్లు తెగుళ్లు సోకాయి. అదనం గా ఎకరానికి మరో రూ.10 వేల చొప్పున భారం మోశారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో కళ్లాల్లో ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపు పూర్తిగా నాశనమైంది. దీంతో పంట రం గు మారి ధరపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఈసారి జిల్లాలో సుమారు 6,500 ఎకరాల్లో మిర్చి సాగైంది. ఎకరానికి రూ.60వేల నుం చి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టారు. అకాల వర్షాలతో కళ్లాల్లో ఎండబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిసింది. దీంతో రంగు మారి ధర పడిపోయే ప్రమాదం ఏర్పడింది. -
ఎన్నికల ముంగిటప్రజాకర్షక బడ్జెట్
రూ.5,417కోట్ల లోటు ఆహారధాన్యాలపై కొనసాగనున్న పన్ను మినహాయింపు గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ చార్జీల్లో 20 శాతం సబ్సిడీ ఓట్ ఆన్ అకౌంట్ ప్రతిపాదించిన అజిత్‌పవార్ ముంబై : లోక్‌సభ ఎన్నికల ముంగిట మహారాష్ట్ర సర్కారు ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, పిండి, బెల్లం, పసుపు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులపై పన్ను మినహాయింపును కొనసాగించడంతో పాటు నివాస, వ్యవసాయ, వాణిజ్య వినియోగదారులు, పారిశ్రామికవేత్తలకు విద్యుత్ చార్జీల్లో 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన అజిత్‌పవార్ మంగళవారం నాడు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.5,417 కోట్ల లోటు బడ్జెట్‌ను ఆయన ప్రతిపాదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1,69,907.55 కోట్లుగా, వ్యయం రూ.1,75,324.83 కోట్లుగా పేర్కొన్నారు. నిత్యావసరమైన ఆహార ధాన్యాలతో పాటు ధనియాలు, మెంతులు, మిరపకాయలు, కొబ్బరి, పాపడ్, షోలాపూర్ దుప్పట్లు, టవళ్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పన్ను మినహాయింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు ఆదాయాన్ని ఆశించామని పేర్కొన్నారు. అయితే ఆదాయపు లక్ష్యాలను చేరుకున్నప్పటికీ ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన వారికి పునరావాసం కల్పిం చడం, విద్యుత్ సబ్సిడీలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫలితంగా రూ.3,017.23 కోట్ల లోటును ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీ కారణంగా వచ్చే ఏడాది కూడా వ్యయం భారీగా పెరగనుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రణాళిక సంఘంతో చర్చించలేదని పవార్ తెలిపారు. అయినప్పటికీ రూ.51,222.54 కోట్లతో ప్రణాళికను ప్రతిపాదించినట్లు చెప్పారు. వచ్చే నాలుగు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నానని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం అదనపు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తానని తెలిపారు. ఈ మధ్యంతర బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీ కోసం రూ.9వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నివాస గృహాలకు, వ్యవసాయం, వాణిజ్య వినియోగం, పరిశ్రమలు, మహావితరణ్ నుంచి విద్యుత్‌ను పొందే పవర్లూమ్ వినియోగదారులకు 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు అజిత్‌పవార్ చెప్పారు. రాష్ట్రంలో తలసరి వార్షిక ఆదాయం రూ.1,05,493కి వృద్ధి చెందినట్లు తెలిపారు. అక్షరాస్యత శాతం 82.9కి చేరుకుందని చెప్పారు. జాతీయ ఆహార భద్రత పథకాన్ని ఈ నెలారంభం నుంచి అమలుచేస్తున్నామని, మొత్తం 8.77 కోట్ల మంది లబ్ధిదారులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1.77 కోట్ల మంది లబ్ధి పొందుతారని తెలిపారు. వీరికి సబ్సిడీ రేట్లకు ఆహారధాన్యాలు సరఫరా చేస్తామన్నారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకాన్ని రూ.698 కోట్లతో రాష్ట్రం మొత్తానికి వర్తింప చేస్తున్నామని చెప్పారు. త్రైయంబకేశ్వర్లో 2015-16లో నాసిక్‌లో జరగనున్న సింహస్థ కుంభమేళా కోసం అభివృద్ధి పనులకు రూ.2,378 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.2,356 కోట్ల వ్యయంతో ప్రారంభించిన వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ప్రాజెక్టు దాదాపు పూర్తి కానుందని, దాని ద్వారా ప్రతి రోజు ఆరు లక్షల మంది ప్రయాణికులు లబ్ధిపొందుతారని పవార్ చెప్పారు. -
ఈసారి రికార్డే
నాగపూర్: ఈ ఏడాది 263.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే అధికమని అన్నారు. నగరంలో కృషి వసంత్-2014 జాతీయ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే ఈసారి నాలుగు మిలియన్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల గతేడాది 255.36 మిలియన్ టన్నులకు మాత్రమే ఆహార ధాన్య ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈసారి ఆశించినమేర కన్నా అధికంగ వర్షాలు కురవడంతో పాటు ఖరీఫ్, రబీ పంట సేద్యం పెరిగిందని పవార్ అన్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ తొలిస్థానంలో ఉంద ని, గోధుమ, పత్తిలో రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. పాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉందని తెలి పారు. 92 మంది విజయవంతమైన రైతులు ప్రదర్శనను మెచ్చిన పవార్, వీరితో మిగతా రైతు లు కూడా పంటల ఉత్పత్తిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్‌వో) ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముందస్తు అంచనాల ప్క్రారం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. ఐదు రోజుల పాటు ప్రదర్శన పారిశ్రామిక విభాగం సీఐఐ సహకారంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కృషి వసంత్ జాతీయ వ్యవసాయ ప్రదర్శనను ఆదివారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహిస్తోంది. గత వందేళ్లలో ఐసీఏఆర్ సాధించిన విజయాలతో పాటు వ్యవసాయ పరిశోధన చరిత్ర ను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు సుమారు ఐదు లక్షల మంది రైతులు సందర్శించే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్రి వెబ్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. శిక్షణకు రాని రైతు లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
గోధుమలు గోవిందా..!
జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వచేసిన గోధుమలు పెద్ద ఎత్తున మాయమయ్యా యి. విత్తు తరుగుపోకుండా కాపాడాల్సిన మేనేజరే ఏంచక్కా స్వాహా చేశాడు! ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 620 క్వింటాళ్లు తినేశాడు! ప్రస్తుతం ఈయన రిటైర్ అయ్యారు. ఓపెన్యార్డులోని గోధుమలు దొంగలపాలవుతున్నాయని, ఈ సందుచూసి ఇంటిదొంగలు సైతం మింగుతున్నారని ‘సాక్షి’ గతంలోనే హెచ్చరిం చింది. ఉన్నతాధికారులు తేరుకోకపోవడంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున గోధుమలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే గోధుమలు పోయాయని చెప్పిన చోట ఆ బస్తాల ఆనవాళ్లు మచ్చుకైనా కానరాకపోగా.. బండరాళ్లు అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. 2011-12లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 5,23,836 బస్తాల గోధుమలు జమ్మికుంటలో దిగుమతి కాగా, ఎఫ్‌సీఐలో ఓపెన్‌యార్డులో నిల్వ చేశారు. ఒక్కో బస్తా 50 కిలోలు ఉంటుంది. వీటిలోంచి కొన్ని బస్తాలు మళ్లీ పంజాబ్ పంపించగా... ఇప్పటికీ ఇక్కడ 2,600 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి. భద్రత లేకుండా నిల్వలు చేయడంతో ఓపెన్యార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గోధుమ బస్తాలను ప్రహరీపైనుంచి ఎత్తుకెళ్లారు. ఓరోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు రెండు క్వింటాళ్ల గోధుమలు దొంగిలిస్తుండగా ధర్మారం గ్రామస్తులు వెంబడించారు. దీంతో సదరు వ్యక్తుల సైకిళ్లు విడిచిపెట్టి పరారయ్యారు. గ్రామస్తులు గోధుమ బస్తాలను గ్రామపంచాయతీలో భద్రపరిచారు. ఈ వైనంపై ‘గోదాములు దాటుతున్న గోధుమలు’ శీర్షికన ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ అధికారులు జమ్మికుంటలో నిల్వ ఉన్న గోధుమలు పరిశీలించారు. మూడు రోజులపాటు ఓపెన్‌యార్డుల్లో ఉన్న బస్తాలన్నింటినీ లారీల్లో వేబ్రిడ్జి తూకాలు వేశారు. నిల్వల్లో భారీగా తేడాలున్నట్లు నాడు వెల్లడించారు. నివేదిక ఉన్నాధికారులకు సమర్పిస్తున్నట్లు అప్పుడు చెప్పారు. తాజాగా మే నెలలో తొమ్మిది వేల టన్నుల గోధుమలు రాగా, ఓపెన్‌యార్డుల్లో 76 చోట్ల స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచారు. జూన్‌లో ఎఫ్‌సీఐ డిపో మేనేజర్‌గా చిన్న నారాయణ బాధ్యతలు స్వీకరించే సమయంలో గోదాముల్లోని నిల్వలన్నింటినీ పరిశీలించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్(ఆర్వీఎస్) అధికారులు ఈ నెల 12, 13 తేదీల్లో గోధుమలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల అధారంగా 5/9,5/10 ప్లీంత్ల్లో 1240 గోధుమ బస్తాలు మాయం అయినట్లు నిర్ధరించారు. నిల్వలకు, రికార్డులకు మధ్య ఈమేరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని వెల్లడించారు. విషయాన్ని ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్‌కు తెలుపగా, ఆయన స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. జూన్‌లో డిపో మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సంజీవరావు ఈ గోధుమలు మాయం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగుమతి, దిగుమతి రిజిస్టర్లు సొంతంగా నిర్వహించి, అక్రమాలకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో సంజీవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ భూమయ్య వెల్లడించారు. దీంతో అసలు ఎఫ్‌సీఐలో ఏం జరుగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు ‘సాక్షి’లో కథనం ప్రచురించి అప్రమత్తం చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ అక్రమాల దందా ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.