సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్‌లో గోధుమల ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్–డొమెస్టిక్ ద్వారా కేంద్రం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలు) ఈ నెల 11వ తేదీన ఈ–వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు శనివారం ఎఫ్‌సీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గోధుమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే వారు, గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను విక్రయిస్తున్నట్లు తెలిపింది.
కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 100 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులని, ఈ–వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్, జి.ఎస్.టి. / ట్రేడ్ ట్యాక్స్ రిజి్రస్టేషన్, పాన్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో 2వేల మెట్రిక్ టన్నుల విక్రయానికి.. క్వింటా రూ.2150 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ–వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment